దేశభక్తి భావంతో గూస్ బంప్స్ తెప్పించే మూవీ.. మన భారత త్రివిధ దళాల సత్తాను చాటే సినిమా.. మొత్తంగా బ్రిలియంట్ ఫిల్మ్.. ఇదీ బోర్డర్ 2 మూవీపై నెటిజన్ల ట్విటర్ రివ్యూ. సన్నీ డియోల్ హీరోగా నటించిన ఈ వార్ యాక్షన్ డ్రామా అదిరిపోయిందనే కామెంట్లు వస్తున్నాయి. మూవీ సూపర్ అంటూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
బోర్డర్ 2 ట్విటర్ రివ్యూ

మోస్ట్ అవైటెడ్ సినిమాల్లో బోర్డర్ 2 కూడా ఒకటి. ఇది ఇండియన్ రిపబ్లిక్ డే కానుకగా జనవరి 23, 2026న థియేటర్లలో రిలీజైంది. ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది ఈ మూవీ. ట్విటర్ రివ్యూల్లో నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. అద్భుతమైన సినిమా అని పేర్కొంటున్నారు.
కంప్లీట్ ఫిల్మ్
సన్నీ డియోల్ హీరోగా నటించిన ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మల్టీ-స్టారర్ వార్ మూవీ ‘బార్డర్ 2’ ఇవాళ థియేటర్లకు వచ్చేసింది. ఇది 'బ్రిలియంట్ మూవీ' అంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. 'భావోద్వేగాలు, యాక్షన్, దేశభక్తి కలగలిసిన కంప్లీట్ మూవీ’ అని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు. 'బార్డర్ 2 స్వచ్ఛమైన భావోద్వేగం' అని సోషల్ మీడియా యూజర్లు పేర్కొన్నారు.
బ్రిలియంట్ సినిమా
‘‘వాట్ ఏ మూవీ!!! ఏం బ్రిలియంట్ సినిమా. ఇప్పుడే బోర్డర్ 2 చూసి బయటికి వచ్చా. సన్నీ పాజీ ఆరా వెనక్కి వచ్చింది అని మాత్రం చెప్పగలను. నేను 5కి 5 స్టార్స్ ఇస్తాను. బోర్డర్ 1 నా గుండెకు దగ్గరగా ఉంది. బోర్డర్ 2 నుంచి కూడా అదే ఆశించా. నమ్మండి, ఇది మిమ్మల్ని నిరాశపరచదు’’ అని ఒక యూజర్ రాసుకొచ్చాడు.
గూస్ బంప్స్
‘‘యాక్షన్, ఎమోషన్, దేశభక్తి, అనేక గూస్‌బంప్స్ ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. నటన విషయానికి వస్తే సన్నీ డియోల్ ఈ చిత్రానికి ఆత్మ. అతను తెరపై అద్భుతాన్ని తెచ్చాడు’’ అని మరో నెటిజన్ తన రివ్యూ పంచుకున్నాడు.
వరల్డ్ క్లాస్
{{/usCountry}}‘‘యాక్షన్, ఎమోషన్, దేశభక్తి, అనేక గూస్‌బంప్స్ ఇచ్చే మూమెంట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇంటర్వెల్, క్లైమాక్స మిమ్మల్ని నిజంగా ఆశ్చర్యపరుస్తాయి. నటన విషయానికి వస్తే సన్నీ డియోల్ ఈ చిత్రానికి ఆత్మ. అతను తెరపై అద్భుతాన్ని తెచ్చాడు’’ అని మరో నెటిజన్ తన రివ్యూ పంచుకున్నాడు.
వరల్డ్ క్లాస్
{{/usCountry}}‘‘బార్డర్ 2 ఒక వరల్డ్ క్లాస్ వార్ యాక్షన్ ఎంటర్టైనర్ !! భారత సైన్య అచంచలమైన ధైర్యం & త్యాగాలకు అద్భుతమైన ట్రిబ్యూట్. స్క్రిప్ట్ దేశభక్తి, సారాంశం & భావోద్వేగాలతో పవర్ ప్యాక్డ్ గా ఉంది. సూపర్ స్టార్ సన్నీ డియోల్ నటన బ్రిలియంట్’’ అని ఓ యూజర్ ఎక్స్ లో పోస్టు చేశాడు.
‘‘మాస్ కోసం ఒక పర్ఫెక్ట్ బిగ్-స్క్రీన్ ఎక్స్పీరియన్స్. ప్రామిస్ చేసినట్లుగా ఇది దేశభక్తి - భావోద్వేగం - యాక్షన్ - గూస్‌బంప్స్ ను సరిగ్గా అందిస్తుంది. శక్తివంతమైన డైలాగ్స్ & విజిల్ కొట్టే క్షణాలతో బోర్డర్ 2 వారసత్వాన్ని సజీవంగా ఉంచుతుంది’’ అని ఒక నెటిజెన్ అన్నారు.
వార్ సీక్వెన్స్
‘‘సన్నీ డియోల్ ప్యూర్ ఫైర్, స్క్రీన్ ప్రెజెన్స్, ఇంటెన్సిటీ & నాస్టాల్జియా హార్డ్ గా కొడుతుంది. వరుణ్ ధావన్ సర్ప్రైజ్ ప్యాకేజ్. అహాన్ శెట్టి & దిల్జిత్ దోసంజ్ బాగా చేశారు’’ అని ఓ నెటిజెన్ పేర్కొన్నారు. ‘‘వార్ సీక్వెన్సులు ఆకట్టుకుంటాయి. భావోద్వేగాలు పర్ఫెక్ట్ గా ఉన్నాయి. మాస్, దేశభక్తి, బిగ్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్. అంతటా బ్లాక్ బస్టర్ వైబ్స్’’ అని రివ్యూలో పేర్కొన్నారు.
బోర్డర్ 2 గురించి
అనురాగ్ సింగ్ రచించి, దర్శకత్వం వహించిన ‘బార్డర్ 2’ మూవీ 1971 నాటి ఇండో-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా భారత సాయుధ దళాలైన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీల ఉమ్మడి ఆపరేషన్లను మూవీ చూపిస్తుంది. ఇందులో సన్నీ డియోల్, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్, అహాన్ శెట్టి, మోనా సింగ్, సోనమ్ బజ్వా, ఆన్య సింగ్, మేధా రానా తదితరులు నటించారు.
1997లో వచ్చిన బోర్డర్ సినిమాకు సీక్వెల్ గా ఇప్పుడు బోర్డర్ 2 రిలీజైంది. అప్పుడు జేపీ దత్తా డైరెక్షన్ లో వచ్చిన వార్ డ్రామా మూవీ బోర్డర్ మూవీ ఇండియన్ మూవీ ఇండస్ట్రీలో ఐకానికి చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.