...
...
Next Story

Brahmamudi Promo: బ్రహ్మముడి- రేఖకు మరో పెద్ద షాక్- ఇందు సంతకం చెల్లదన్న లాయర్- బతికే ఉన్న రాజు తల్లి- వారసుడిగా ఎంట్రీ!

Brahmamudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ సీరియల్ ఎపిసోడ్‌ ప్రోమో అదిరిపోయింది. ఆస్తి పేపర్స్‌పై ఇందుతో వేలిముద్రలు వేయించుకుంటుంది రేఖ. అపర్ణ వారించిన ఇందు వేస్తుంది. కానీ, మరో లాయర్‌కు ఆ పేపర్స్ చూపించిన రేఖకు పెద్ద షాక్ తగులుతుంది. మరోవైపు రాజు తల్లి రేవతి బతికే ఉంటుంది.

Published on: May 3, 2026, 09:23:06 IST
Advertisement

Brahma Mudi Serial Latest Episode Promo: బ్రహ్మముడి సీరియల్ తాజా ఎపిసోడ్ ప్రోమోలో హాస్పిటల్‌లో రాజును చూసిన ఒకప్పుడు రాజ్, కావ్యల దగ్గర పనిచేసిన శ్రుతి చూస్తుంది. రాజ్ సర్‌లా ఉన్నాడని ఫాలో అవుతూ ఇంటిదాకా వెళ్తుంది. రాజ్‌తో మాట్లాడుతుంది శ్రుతి. కానీ, రాజ్ అదంతా పట్టించుకోకుండా ఇంట్లో తన తండ్రి ఉంటాడు, మాట్లాడమని వెళ్లిపోతాడు.

దుగ్గిరాల వారసుడు

బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో

ఇంట్లోకి వెళ్లిన శ్రుతి చలపతి, లక్ష్మీలను రాజ్ గురించి అడిగితే.. తమ కొడుకుని చెబుతారు. మీరు అబద్ధం చెపుతున్నారు అని శ్రుతి నిలదీయడంతో కొడుకు గతం గురించి ఏమైనా తెలుస్తుందన్న నమ్మకంతో నిజం చెబుతారు. రాజ్ శ్రీశైలంలో దొరికాడని చలపతి, లక్ష్మీ చెబుతారు. దాంతో నేను అనుకున్నది నిజమే, రాజ్ ఆ ఇంటి రక్తమే, దుగ్గిరాల ఇంటి వారసుడు అని శ్రుతి చెబుతుంది.

దాంతో షాక్ అయిన చలపతి, లక్ష్మీ తాము ఇన్నాళ్లు పెంచింది అంత గొప్పింటి బిడ్డనా అని ఆశ్చర్యపోతారు. దుగ్గిరాల కుటుంబం గురించి తెలియని వారు లేరని, వారికి ఎన్నో ఆస్తులు ఉన్నాయని, శ్రీశైలంలో జరిగిన ప్రమాదంలో రాజ్, కావ్య చనిపోయారని, అప్పటి నుంచి రేఖ ఆస్తినంతా తన గుప్పిట్లో పెట్టుకుని ఆడిస్తుందని శ్రుతి చెబుతుంది.

రాజ్‌కు ఒక్క అక్క, అపర్ణ కూతురు రేవతి ఉండేదని, తనకు పుట్టిన కొడుకు పేరు స్వరాజ్ అని శ్రుతి చెబుతుంది. అచ్చం మేనమామ పోలికలతో రాజు పుట్టాడని శ్రుతి చెబుతుంది. దుగ్గిరాల ఇంట్లో అంతా అమ్మాయిలే అని, ఆ ఆస్తికంతా వారసుడు మేనల్లుడు రాజు అని శ్రుతి చెబుతుంది. తర్వాత రాజు దుగ్గిరాల ఇంటికి వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడని తెలుస్తోంది.

వేలిముద్ర వేసిన ఇందు

నాకు ఆస్తి కన్నా నువ్వు, సుబ్బు ప్రాణాలతో ఉండటం ముఖ్యమని ఇందు అంటుంది. ఆ మాత్రం భయం ఉండాలని రేఖ అంటుంది. ఇందు వేళ్లి ఆస్తి పేపర్స్‌పై వేలి ముద్రలు వేస్తుంది. దాంతో భ్రమరాంబ, రేఖ, భూషణ్ అంతా ఆస్తి తమకు వచ్చినట్లే అని సంతోషిస్తారు. ఇక తమ అప్పులన్నీ తీరిపోతాయని, ఆ చక్రి అంతు చూడాలని మురిసిపోతారు.

ఇన్నాళ్లు ఎదురుచూసినందుకు, మన నగలు పోయినందుకు చివరికి మంచి ఫలితమే దక్కిందని భ్రమరాంబ సంబరపడుతుంది. ఇదంతా నిజం కాదేమే భ్రమనేమో భ్రమరా అని శేషు అంటాడు. ఎప్పుడు అపశకునపు మాటలే మాట్లాడతవా, మంచి మాటలు మాట్లాడవా, ఇందు సంతకం పెట్టాకా ఇంకేం సమస్యలు ఉంటాయని భర్త శేషుపై అరుస్తుంది భ్రమరాంబ.

ఇందు సంతకం చెల్లదు

తర్వాత ఇందును నీకు అసలు బుద్ధి ఉందా. నువ్వు ఏం చేశావో నీకు అర్థం అవుతుందా. సంతకం ఎందుకు పెట్టావని అపర్ణ నిలదీస్తుంది. మీరేం టెన్షన్ పడకండి. నేను పెట్టిన సంతకం చెల్లదు కదా అని ఇందు అంటుంది. అది ఎలా అని అపర్ణ, సుభాష్, స్వాతి షాక్ అవుతారు.

ఇందు వేసిన వేలిముద్రలు ఉన్న పేపర్స్‌తో మరో లాయర్‌ దగ్గరికి వెళ్తారు రేఖ, భూషణ్. అవి చూపించి ఆస్తి ఇక మాకు దక్కినట్లేగా అని రేఖ అంటుంది. అవి చూసిన లాయర్ నో.. నో.. ఆస్తి మీ పేరు మీద రాదు అని అంటాడు. దాంతో ఎందుకు రాదు అని రేఖ, భూషణ్ షాక్ అవుతూ అడుగుతారు. ఇందు వేసిన వేలిముద్ర సంతకం చెల్లదని లాయర్ అంటాడు. దాంతో మరింత షాక్ అవుతారు రేఖ, భూషణ్.

అలా రేఖకు మరోసారి పెద్ద షాక్ తగులుతుంది. మరోవైపు హాస్పిటల్‌లో రాజు ట్రీట్‌మెంట్ చేయిస్తున్న తన తల్లి రేవతికి అని తెలుస్తుంది. అంటే, రాజు తల్లి బతికే ఉందని తెలుస్తుంది. రేవతి ద్వారానే దుగ్గిరాల ఇంటికి రాజు వారసుడిగా ఎంట్రీ ఇవ్వనున్నాడని అర్థం అవుతోంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks