...
...
Next Story

Brahmamudi April 14th Episode: బ్రహ్మముడి.. రాజును చీపురుతో బాదిన ఇందు.. రేఖకు కోటి డిమాండ్.. భ్రమరాంబతో ఆడుకున్న నందు

Brahmamudi April 14th Episode: బ్రహ్మముడి సీరియల్ ఏప్రిల్ 14 ఎపిసోడ్ లో ఇందుని కిడ్నాప్ చేసిన విషయం రేఖకు ఫోన్ చేసి చెప్పి రూ.కోటి డిమాండ్ చేస్తాడు రాజు. అది విని స్వాతి అయోమయంలో పడగా.. ఐశ్వర్యలో టెన్షన్ మొదలవుతుంది.

Published on: Apr 14, 2026, 08:39:09 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahmamudi April 14th Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఇందు కిడ్నాప్ కేసులో నందు విచారణ మొదలుపెడుతుంది. దుగ్గిరాల ఇంటికి వచ్చి అక్కడే కిడ్నాపర్లను పట్టుకోవడానికి కావాల్సిన సెటప్ ఏర్పాటు చేస్తుంది. పనిలో పనిగా భ్రమరాంబతో ఆడుకుంటుంది. అటు ఇందుని కిడ్నాప్ చేసిన రాజు.. రేఖకు ఫోన్ చేసి కోటి డిమాండ్ చేస్తాడు.

ఇందు కిడ్నాప్‌పై విచారణ మొదలు పెట్టిన నందు

Brahmamudi April 14th Episode: బ్రహ్మముడి.. రాజును చీపురుతో బాదిన ఇందు.. రేఖకు కోటి డిమాండ్.. భ్రమరాంబతో ఆడుకున్న నందు
Brahmamudi April 14th Episode: బ్రహ్మముడి.. రాజును చీపురుతో బాదిన ఇందు.. రేఖకు కోటి డిమాండ్.. భ్రమరాంబతో ఆడుకున్న నందు

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (ఏప్రిల్ 14) ఎపిసోడ్ ఇందు కిడ్నాప్ కేసులో విచారణ మొదలుపెట్టడానికి నందు దుగ్గిరాల ఇంట్లో అడుగుపెట్టే సీన్ తో మొదలవుతుంది. వచ్చీ రాగానే ఆమె రేఖతోపాటు భ్రమరాంబతో దురుసుగా మాట్లాడుతుంది. వాళ్లపైనే అనుమానం ఉన్నట్లుగా వ్యవహరిస్తుంది. ఇందు కిడ్నాప్ కేసును ఛేదించడానికి వచ్చామని, తనకు ఓ పూర్తి సెటప్ కావాలంటూ అన్ని ఏర్పాట్లు చేయాలని డిమాండ్ చేస్తుంది.

ఇందు బయట ఉంటే ఇంటికి ఎందుకు వచ్చారని అడిగిన భ్రమరాంబతో నందు ఆడుకుంటుంది. తనను, అక్కను, నాన్నమ్మ, తాతలను వేధిస్తున్న ఆమెతో నానా చాకిరీ చేయించుకోవాలని డిసైడై.. కేసు కొలిక్కి వచ్చే వరకు ఇక్కడే ఉంటానని, తనకు కావాల్సినవన్నీ నువ్వే చేయాలని భ్రమరాంబను డిమాండ్ చేస్తుంది. ఆమె ఎదురు తిరిగితే రేఖ కంట్రోల్ చేస్తుంది. దీంతో చేసేది లేక నందు అడిగనవన్నీ ఇస్తుంది.

తన పేరు అప్పు అని చెప్పిన నందు

తన ఇంటికి తిరిగి రావడంతో నందు మొత్తం తిరిగి చూడాలనుకుంటుంది. పైకి వెళ్లడానికి ప్రయత్నించగా.. ఏదో నీ పుట్టింటికి వచ్చినట్లు ఎక్కడికి పడితే అక్కడికి వెళ్తున్నావేంటని భ్రమరాంబ అంటుంది. ఇంతకీ నీ పేరేంటని అడుగుతుంది. ఆమె నందు అని చెప్పకుండా తన తల్లి పేరు అయిన అప్పు అని చెబుతుంది. అది విని అపర్ణ, సుభాష్ ఎమోషనల్ అవుతారు. చనిపోయిన తమ చిన్న కోడలిని గుర్తుకు తెచ్చుకుంటారు.

ఇందుకి రాజు భోజనం.. ముఖాలు చూసేసిన ఇందు

ఎలాగూ చూసేసింది కదా అని రాజు కూడా ముసుగు తీస్తాడు. మీరే ఈ పని చేశారని అనుకున్నాను అని అంటుంది. డబ్బు కోసమే ఈ పని చేశాం.. అది రాగానే నిన్ను పంపించేస్తాంలే అని చెప్పి రాజు వెళ్లిపోతాడు. అయినా ఇది కూడా తన మంచికే జరిగిందని, ఆస్తి పత్రాలపై సంతకం చేయడం తప్పిందని ఇందు మనసులో అనుకుంటుంది. అయితే తనను ఎవరు కిడ్నాప్ చేయించారో ఆమెకు అర్థం కాదు.

రేఖకు ఫోన్ చేసిన రాజు.. రూ.కోటి డిమాండ్

ఆ తర్వాత రేఖకు రాజు ఫోన్ చేస్తాడు. వెంటనే ఆ కాల్ ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి నందుకు దగ్గరికి ఆమె పరిగెడుతుంది. ఆమె ముందే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతుంది. ఇంట్లో వ్యక్తి కిడ్నాప్ అయితే పట్టించుకోరా.. వెంటనే రూ.కోటి ఇచ్చి అమ్మాయిని తీసుకుపోండని రాజు అంటాడు. ఇంకాసేపు మాట్లాడాలని, అలా అయితే వాళ్లు ఎక్కడున్నారో తెలుసుకోవచ్చని నందుకు అంటుంది. కానీ అప్పుడే రాజు కాల్ కట్ చేస్తాడు.

ఐశ్వర్యలో టెన్షన్.. స్వాతి అయోమయం

అయితే రాజు తనకు చెప్పకుండా నేరుగా కాల్ చేసి డబ్బు డిమాండ్ చేయడంతో ఐశ్వర్యలో టెన్షన్ మొదలవుతుంది. ప్రస్తుతానికి వాళ్ల లొకేషన్ తెలియకపోవడంతో ఊపిరి పీల్చుకుంటుంది. కాల్ ట్రేస్ చేస్తున్నారన్న విషయం చెప్పడానికి రాజుకు ఫోన్ చేస్తే అతడు లిఫ్ట్ చేయడు. దీంతో ఆమె మరింత టెన్షన్ పడుతుంది. ఇటు ఏం జరుగుతుందో అర్థం కాక స్వాతి అయోమయంలో పడుతుంది.

రాజుని చీపురుతో బాదిన ఇందు

అటు ఇందును పడేయడానికి రాజు సెంటిమెంట్ డైలాగులు కొడతాడు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాం.. కానీ ఇంట్లో పెళ్లి కాని చెల్లి, అప్పులు అంటూ సినిమా డైలాగులు కొడతాడు. అది విని ఇందు శాంతిస్తుందేమో అనుకుంటే ఆమె మాత్రం చీపురుతో రాజు, లక్కీలను చితకబాదుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks