Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వెంకట్‌తో కలిసి రాజ్ కిడ్నాప్ చేసిన ఇంటికి వెళ్లి డోర్ కొడుతుంది నందు. లక్కీ తెగ భయపడిపోతాడు. తమ్ముడు చూస్తే బుక్ అయిపోతామనుకుంటారు. ముందు డోర్ తీద్దామని రాజ్ అంటాడు. ఇంతలో వెంకట్‌కు ఫోన్ రావడంతో వెళ్లిపోతాడు.
ఇందు ఫొటో చూపించి

ఇందును ఓవైపు దాచి డోర్ తీస్తారు రాజ్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు ఉందని నందు అడిగితే.. నగల షాపులో గొడవ అయిందని గుర్తు చేస్తాడు లక్కీ. తర్వాత ఇందు ఫొటో చూపించి ఈ అమ్మాయి కిడ్నాప్ అయిందని చెబుతారు. తనెవరో తెలియదని రాజ్ వాళ్లు అంటే.. అదేంటీ మీతో చాలా గొడవ అయిందని చెప్పింది. అప్పుడే మర్చిపోయారు అని నందు అంటుంది. దాంతో గుర్తు వచ్చిందని చెబుతారు.
కిడ్నాప్ గురించి ఏం తెలియదని, అమ్మాయి కనిపిస్తే చెబుతామని రాజ్, లక్కీ అంటారు. దాంతో నందు వెళ్లిపోతుంది. హమ్మయ్య ఇది పడుకుంది. బతికిపోయామని రాజ్ అనుకుంటాడు. ఇంతలో నందు దగ్గరికి వెంకట్ తన గర్ల్‌ఫ్రెండ్ ఎక్కడ ఉందో తెలిసిందని, అక్కడికి వెళ్దామని వెంకట్ అంటాడు. దాంతో నందు సరేనంటుంది. అదే ఇంట్లో పక్కన ఇందు బట్టలు ఆరేసి ఉండటం నందు గమనించదు.
రెస్టారెంట్‌కు వెంకట్, నందు వెళ్తారు. అక్కడ వెంకట్ గర్ల్‌ఫ్రెండ్ మరొక అబ్బాయితో చాలా క్లోజ్‌గా ఉంటుంది. నందు అదే అడిగితే.. వాళ్లు ఫ్రెండ్స్ అయింటారని పాజిటివ్‌గా ఆలోచిస్తాడు వెంకట్. ముందు వాళ్లు ఏం మాట్లాడుకుంటున్నారో విందామని నందు అంటుంది. దాంతో వాళ్ల పక్క టేబుల్‌లో కూర్చొంటారు. ముందు బిజినెస్ గురించి మాట్లాడిన వెంకట్ గర్ల్‌ఫ్రెండ్ తన ఎదురుగా ఉన్న జగన్‌తో తనను పెళ్లి చేసుకుని లైఫ్ పార్టనర్‌ని చేసుకుంటే అన్ని రకాలుగా లాభం అని చెబుతుంది.
వెంకీ గుండె ముక్కలు
ఆ మాట విని వెంకీ గుండె ముక్కలవుతుంది. గుండె పట్టేసుకుంటాడు. ఏంటీ గుండె ముక్కలైందా అని నందు అంటుంది. నీ వెంట ఎవడో తిరుగుతున్నాడన్నావ్, వాడి సంగతి ఏంటీ అని జగన్ అడిగితే.. ఎవడు ఆ వెంకీ గాడా, వాడూ క్రింజ్ గాడు. కొద్దిరోజులు తిప్పుకుని వాడుకుని వదిలేద్దామనుకున్నాను అని రోజా అంటుంది. అది విన్న వెంకీ కోపంతో రోజాను తిడతాడు.
{{/usCountry}}ఆ మాట విని వెంకీ గుండె ముక్కలవుతుంది. గుండె పట్టేసుకుంటాడు. ఏంటీ గుండె ముక్కలైందా అని నందు అంటుంది. నీ వెంట ఎవడో తిరుగుతున్నాడన్నావ్, వాడి సంగతి ఏంటీ అని జగన్ అడిగితే.. ఎవడు ఆ వెంకీ గాడా, వాడూ క్రింజ్ గాడు. కొద్దిరోజులు తిప్పుకుని వాడుకుని వదిలేద్దామనుకున్నాను అని రోజా అంటుంది. అది విన్న వెంకీ కోపంతో రోజాను తిడతాడు.
{{/usCountry}}నీ క్యారెక్టర్ కరెక్ట్ కాదని నందు ముందు నుంచి చెప్పిన నేనే వినలేదని, ఇలా మోసం చేయడానికి సిగ్గు లేదా అని తిడతాడు వెంకీ. ఇది నా లైఫ్ నా ఇష్టం. నేను చాలా మందితో తిరిగా. వాళ్లందరిని పెళ్లి చేసుకుంటానా. నువ్ పెళ్లాంతో సేవలు చేయించుకునే పరోటా గాడివి, అరిగిపోయిన టేప్ రికార్డ్‌వి. ఇంకోసారి నా వెంట పడితే పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని రివర్స్‌లో రోజానే వెంకీకి వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది.
దానికి నందు నవ్వుతుంది. నేను ఇక ఎవరి మాట వినను. జీవితంలో ఏ అమ్మాయిని చూడను అనేసి వెళ్లిపోతాడు వెంకీ. రెస్టారెంట్‌లో వెంకీకి రోజాతో బ్రేకప్ అవుతుంది. ఇలాంటి బ్రేకప్‌లు బాబుకు కొత్తగా. కాస్తా టైమ్ పడుతుంది అని వెంకీ ప్రేమ గోవిందా అనుకుంటుంది నందు. మరోవైపు స్వాతి, నానమ్మ కంగారుపడుతుంటారని ఇందు ఆలోచిస్తుంది. రాజ్, లక్కీ చెస్ ఆడుకుంటారు. ఇందు పక్కన ఫోన్ ఛార్జింగ్ పెట్టి ఉంటుంది. అది మెల్లిగా తీసుకుంటుంది ఇందు.
ఇంటికి ఇందు ఫోన్
రాజ్ ఫోన్ తీసుకుని ఇందు ఇంటికి ఫోన్ చేస్తుంది. ఇంతలోనే లక్కీ ఫోన్ తీసుకో కాల్ చేద్దామని రాజ్ అంటాడు. చార్జింగ్ పెట్టావు కదా అని లక్కీ వచ్చి చూస్తే అక్కడ ఫోన్ ఉండదు. ఇందు ఫోన్ మాట్లాడటం లక్కీ చూస్తాడు. దాంతో లాక్ తీసి ఇందు నుంచి ఫోన్ లాక్కుంటాడు రాజ్. ఒకసారి తన చెల్లితో మాట్లాడి సేఫ్‌గా ఉన్నానని, నా సిచ్చువేషన్ నీకు తెలియదు ఇందు చెబుతుంది.
నా సిచ్చువేషన్ గురించి తెలియదు. నాకు డబ్బు చాలా అవసరం అని రాజ్ అంటాడు. ఇలా సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం నిలవదని ఇందు అంటుంది. డబ్బులో పుట్టినదానివి నీకెం తెలుసు. అంతా డబ్బుతోనే నడుస్తుంది. నువ్ మాత్రం కిడ్నాప్ ప్లాన్ చేయలేదా. అప్పుడు నీవాళ్లు నీకు గుర్తుకు రాలేదా అని రాజ్ అంటాడు. నా పర్సనల్స్‌కి వెళ్లకు అని ఇందు కోపంగా అంటుంది.
నువ్వు మాత్రం నా పర్సనల్ విషయాలను గెలికేయొచ్చా.. ఇంకోసారి ఇలా చేస్తే కట్టేసి నోటికి ప్లాస్టర్ వేసి పెడతా. అన్నం కూడా పెట్టం అని వార్నింగ్ ఇచ్చి కోపంగా వెళ్లిపోతాడు రాజ్. మరోవైపు ఇదంతా తన వల్లే జరిగిందని, ట్రస్ట్, ఆఫీస్ వ్యవరాలు చెప్పడంతోనే ఇందుకు ఇలా అయిందని అపర్ణ ఏడుస్తుంటుంది. స్వాతి ఓదారుస్తుంటుంది. అక్కని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారని స్వాతి అనుమానిస్తుంది.
అక్కకు ఏం కానివ్వను
ఎవరో బాగా కావాల్సినవాళ్లే ఇది చేసి ఉంటారని అపర్ణ అంటుంది. అక్కకు ఏం కానివ్వను అని నందు అంటుంది. కిడ్నాపర్స్‌కు డబ్బులు మాత్రమే కావాలి. అప్పటివరకు అక్కకు ఏం కాదని ఓదారుస్తుంది నందు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.