Brahmamudi April 22nd Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజుని బ్లాక్‌మెయిల్ చేసిన తనకు నచ్చిన పనులు చేయించుకుంటుంది ఇందు. అంతేకాదు అతన్ని హగ్ కూడా చేసుకుంటుంది. దీంతో రాజు కూడా మెల్లగా ఇందు ప్రేమలో పడిపోతుంటాడు. అటు వెంకీ మరో ప్రేమ కోసం నందుని వాడుకోవాలని డిసైడవుతాడు.
ఓనర్‌ను బోల్తా కొట్టించిన లక్కీ, రాజు.. లాగి పెట్టి కొట్టిన ఇందు

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (ఏప్రిల్ 22) ఎపిసోడ్ ఇంటి ఓనర్ ను రాజు, ఇందు, లక్కీ బోల్తా కొట్టించే సీన్ తో మొదలువుతుంది. ఇందుని చూసి ఆమె ఎవరు అని అడుగుతాడు ఓనర్. కానీ అక్కడ అమ్మాయి లేదని, అది తానే అని లక్కీ అంటాడు. బాగా తాగి ఉండటంతో ఓనర్ కళ్లు మసకగా మారతాయి. ఇంతకుముందు ఎవరితో మాట్లాడారు అని అడిగితే తన భార్యతో అని అతడు అంటాడు.
అందుకే అలా కనిపిస్తున్నానని లక్కీ అంటాడు. నా భార్య చెండాలంగా ఉంటుంది.. కానీ ఈ అమ్మాయి కత్తిలా ఉంది అని ఓనర్ అంటాడు. దీంతో ఇందు అతన్ని లాగిపెట్టి కొడుతుంది. అతడు కింద పడతాడు. ఆలోపు ఇందు బయటకు వెళ్లిపోగా.. లక్కీ చీర కట్టుకొని వస్తాడు. అలా ముగ్గురూ కలిసి ఓనర్ ను బోల్తా కొట్టిస్తారు.
ఇందుకి గోలీ సోడా తెచ్చిన రాజు
ఇటు ఇందు తనకు గోలీ సోడా తెచ్చావా అని రాజుని అడుగుతుంది. తీసుకురాలేదని అతడు అనడంతో నానా మాటలు అంటుంది. తనతో వంట చేయించుకొని మోసం చేస్తావా అని తిడుతుంది. ఇంతలో తన వెనుక నుంచి రెండు గోలీ సోడాలు తీసి ఇందు చేతుల్లో పెడతాడు రాజు.
అది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. గోలీ కొట్టి సోడా తాగుతుంది. అది తాగుతూ ఎంతో హ్యాపీగా ఫీలవుతుంది. అది చూసి రాజు ఆశ్చర్యపోతాడు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలా ఉంది.. నువ్వేంటి ఇలా ఉన్నావు.. అసలు నీ స్టోరీ ఏంటని అడుగుతాడు. గోలీ సోడా ఇచ్చి స్టోరీ తెలుసుకుందామని అనుకుంటున్నావా అస్సలు చెప్పను అని ఇందు అంటుంది.
బయటకు తీసుకెళ్లాలని రాజుని బ్లాక్‌మెయిల్ చేసిన ఇందు
{{/usCountry}}అది చూసి ఆమె ఆశ్చర్యపోతుంది. గోలీ కొట్టి సోడా తాగుతుంది. అది తాగుతూ ఎంతో హ్యాపీగా ఫీలవుతుంది. అది చూసి రాజు ఆశ్చర్యపోతాడు. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అలా ఉంది.. నువ్వేంటి ఇలా ఉన్నావు.. అసలు నీ స్టోరీ ఏంటని అడుగుతాడు. గోలీ సోడా ఇచ్చి స్టోరీ తెలుసుకుందామని అనుకుంటున్నావా అస్సలు చెప్పను అని ఇందు అంటుంది.
బయటకు తీసుకెళ్లాలని రాజుని బ్లాక్‌మెయిల్ చేసిన ఇందు
{{/usCountry}}సరే కానీ.. నాకో సాయం చేయాలి.. పొద్దున కూడా ఆ డల్లాస్ గాడికి బ్రేక్ ఫాస్ట్ చేయాలని ఇందుని రాజు అడుగుతాడు. మొదట్లో ఒప్పుకోని ఇందు.. తర్వాత సరే అంటుంది. అయితే తనను బయటకు తీసుకెళ్లాలని అడుగుతుంది. రాజు ఒప్పుకోడు. దీంతో అతన్ని బ్లాక్ మెయిల్ చేస్తుంది. ఓనర్ కు చెప్పేస్తా అంటూ అరుస్తుంది. దీంతో రాజు ఆమె నోటిని మూస్తూ.. సరే తీసుకెళ్తాను అరవకు అని అంటాడు.
వెంకీ కోసం రాజు ఇంటికి నందు
మరోవైపు వెంకీని వెతుకుతూ రాజు ఇంటికి వస్తుంది నందు. ఆమెను చూసి చలపతి, లక్ష్మీ షాకవుతారు. వెంకీ ఉన్నాడా.. మొన్న నన్ను కలిసినప్పుడు మొబైల్ వదిలేసి వెళ్లాడు అని అంటుంది. పైన ఉన్నాడని చెప్పడంతో మొబైల్ ఇచ్చి అతన్ని కలవడానికి వెళ్తుంది నందు. ఆమె వెళ్లగానే వెంకీతో ఏమైనా ప్రేమలో ఉందా అని మాట్లాడుకుంటారు. ఆమె తిరిగి వచ్చి తాను కేవలం ఫ్రెండ్ అని, అంత సీన్ లేదని అంటుంది. తర్వాత వెంకీ దగ్గరికి వెళ్తే అతడు మేడ మీద దేవదాసు టైపులో బాధతో కూర్చొంటాడు. రోజా హ్యాండివ్వడంతో ఇక కొత్త ప్రేమ కోసం చూస్తున్నానని, సాయం కావాలని అడుగుతాడు. నీ ప్రేమ నా చావుకు వచ్చింది అని నందు అనుకుంటుంది.
రాజును హగ్ చేసుకున్న ఇందు
ఇటు ఇందుని బైకుపై బయటకు తీసుకెళ్తాడు రాజు. రోడ్డుపై ఐస్ క్రీమ్ చూసి తనకు కావాలని అంటుంది. సరే అని రాజు కొనడానికి వెళ్తుంటే దొంగతనం చేయాలని ఉందని ఇందు అంటుంది. రాజు వద్దని వారిస్తున్నా ఆమె వినదు. ఐస్ క్రీమ్ తోపాటు బెలూన్లు కూడా ఆమె దొంగతనం చేస్తుంది.
తొలిసారి తనకు దొరికిన ఈ స్వేచ్ఛను ఆమె బాగా ఎంజాయ్ చేస్తుంది. తనకు ఈ ఫ్రీడమ్ వచ్చేందుకు కారణమైన రాజుని ఆమె హగ్ చేసుకుంటుంది. దీంతో అతడు మొదట షాక్ తింటాడు. ఆ తర్వాత తాను కూడా ఆమె ప్రేమలో పడుతున్నట్లుగా మెల్లగా ఇందుని హగ్ చేసుకుంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.