Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంట్లో ఉన్న వంట సామాన్లతో ఫంక్షన్ అడ్జస్ట్ చేద్దామంటుంది ఇందు. కప్పుల్లో చికెన్ వేద్దామని ఇందు అంటే.. నేను ఒక్కన్నే పావుకిలో చికెన్ తింటానంటాడు రాజ్. అందరూ నీలా తినడం కోసమే ఫంక్షన్‌కి రారు. ఒక చికెన్ ముక్క వేసి మొత్తం సూప్ వేద్దామంటుంది ఇందు.
నిమ్మకాయతో జ్యూస్

అలా అయితే వాళ్లు కాదు నేను ఫీల్ అవుతానంటాడు రాజ్. సరే తినడానికి ముందు అందరికి నిమ్మకాయ షరబత్ ఇద్దాం. అది లెమెన్ జ్యూస్ అని చెప్పకుండా ఫ్రూట్ పంచ్ అని పేరు పెట్టి ఇద్దాం. అది తాగాక అంతా తక్కువ తింటారు. నిమ్మకాయలు ఎక్కడి నుంచి తేవాలనకు. మీ ఇంట్లో చెట్టు ఉంది. దానికి చాలా కాయలు ఉన్నాయని ఇందు అంటుంది. ఐడియా సూపర్‌గా ఉందని వెంకీ, నందు అంటారు.
తర్వాత రాజ్, ఇందు చుట్టుపక్కల వాళ్లను ఫంక్షన్‌కు పిలిచేందుకు వెళ్తారు. రాజ్‌ను పిలవమంటుంది ఇందు. తాను పిలవనంటాడు. నువ్వు ఉండగా నేను పిలిస్తే బాగుండదు. పిలవకుంటే నువ్వు నన్ను కిడ్నాప్ చేసిన విషయం మీ అమ్మనాన్నకు చెబుతాను అని బ్లాక్ మెయిల్ చేస్తుంది ఇందు. ఇలా ఆడుకుంటున్నావేంటే అని తిట్టుకున్న పక్కింటివాళ్లను రాజ్ పిలుస్తాడు. బయటకొచ్చిన అతను ముందు రాజ్, ఇందుకు పెళ్లయిందని అనుకుంటాడు.
రాజ్ చెప్పడంతో చలపతి, లక్ష్మీల పెళ్లిరోజుకు వస్తానంటాడు. మరి భోజనాలు ఉన్నాయా. చికెనా, మటనా, ఫ్రాన్సా అని అతను అడుగితే.. రాజ్ చికెన్ అని చెబుతాడు. మరోవైపు ఇందుతో వెంకీని చూసి పక్కింటి ఆవిడ తిడుతుంది. అన్నకు కాకుండా నువ్వెందుకు పెళ్లి చేసుకున్నావురా అని అంటుంది. దాంతో పెళ్లి కాలేదు. తల్లిదండ్రుల ఫంక్షన్ ఉందని చెబుతాడు వెంకీ. అలా నందు-వెంకీ, ఇందు-రాజ్ అందరిని ఫంక్షన్‌కు పిలుస్తాడు.
పీకల్లోతు కష్టాల్లో రేఖ
మరోవైపు చక్రి డబ్బులు ఇవ్వలేదని, జమ చేసుకోమన్నాడని భ్రమరాంబకు చెబుతాడు భూషణ్. దాంతో భ్రమరాంబ గోల చేస్తుంది. ఇప్పుడు ఇందును తీసుకురాలేమని రేఖ అంటుంది. ఆ మాటలు విన్న అపర్ణ ఎందుకు తీసుకురాలేరు. నేను స్వయంగా వెళ్లి పోలీస్ కంప్లైంట్ చేస్తానంటుంది అపర్ణ. ఇన్నాళ్లు ఆఫీస్ నుంచి వచ్చే డబ్బు నొక్కేశారుగా. దాంతో తీసుకురండి. మీకు రెండు రోజులు గడువు ఇస్తాను. ఆలోపు నా మనవరాలిని తీసుకురండి. లేదంటే ఏం చేయాలో అది చేస్తానని బెదిరిస్తుంది అపర్ణ.
{{/usCountry}}మరోవైపు చక్రి డబ్బులు ఇవ్వలేదని, జమ చేసుకోమన్నాడని భ్రమరాంబకు చెబుతాడు భూషణ్. దాంతో భ్రమరాంబ గోల చేస్తుంది. ఇప్పుడు ఇందును తీసుకురాలేమని రేఖ అంటుంది. ఆ మాటలు విన్న అపర్ణ ఎందుకు తీసుకురాలేరు. నేను స్వయంగా వెళ్లి పోలీస్ కంప్లైంట్ చేస్తానంటుంది అపర్ణ. ఇన్నాళ్లు ఆఫీస్ నుంచి వచ్చే డబ్బు నొక్కేశారుగా. దాంతో తీసుకురండి. మీకు రెండు రోజులు గడువు ఇస్తాను. ఆలోపు నా మనవరాలిని తీసుకురండి. లేదంటే ఏం చేయాలో అది చేస్తానని బెదిరిస్తుంది అపర్ణ.
{{/usCountry}}ఏం చేస్తావని భ్రమరాంబ అంటే.. చెప్పను, డైరెక్ట్ చేసి చూపిస్తాను అని అపర్ణ వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది. దాంతో ఇది నిజంగా ఏదో ప్లాన్‌లో ఉంది. మనం పూర్తిగా ఊబిలో కూరుకుపోయామని భ్రమరాంబ భయపడుతుంది. ఊబిలో కూరుకుపోయినట్లుగా రేఖ ఆలోచనలో పడిపోతుంది. పీకల్లోతు కష్టాల్లో పడుతుంది రేఖ. మరోవైపు రాజ్ ఇంట్లో పూజు సిద్ధం చేస్తుంది ఇందు. రాజ్ తల్లి లక్ష్మీ పూజ చేసి హారతి ఇస్తుంది. అందరూ హారతి తీసుకుంటారు.
పెద్దోడు ఏదో బిజినెస్ అంటూ తిరుగుతున్నాడు. అది సక్సెస్ అయ్యేలా చూడమని తల్లి లక్ష్మీ కోరుకుంటుంది. అంటే రాజ్ చేసిన కిడ్నాప్ సక్సెస్ కావాలని ఇన్‌డైరెక్ట్‌గా తల్లి లక్ష్మీ కోరుకుంటుంది. అమ్మనాన్నల దగ్గర ఆశీర్వాదం తీసుకోమ్మని రాజ్, వెంకీలకు చెబుతుంది ఇందు. వాళ్లు అలాగే తీసుకుంటారు. త్వరలో ఇంటికి కోడళ్లను తీసుకు రండని ఆశీర్వదిస్తారు. వంట సామాను అంతా వచ్చేసినట్లేగా అని ఇందు అంటే.. వెంకీ అవును అంటాడు.
కొడుకులాగే తండ్రి
నలుగురి కోసం ఇదంతా ఎందుకమ్మా. కేవలం చికెన్ వండుకుని తినేయడమే కదా అని చలపతి అంటాడు. కొడుకే అనుకున్నా తండ్రి కూడా అంతేనా. ఫ్యామిలీ మొత్తం చికెన్ తినేసి బతికేస్తున్నారన్నమాట అని రాజ్‌తో అంటుంది ఇందు. ఈసారి మనం కొంచెం గ్రాండ్‌గానే ప్లాన్ చేశామని వెంకీ అంటాడు. చుట్టు పక్కల వాళ్లను 20 మందిని పిలిచామని వెంకీ అంటాడు. హమ్మా.. అని గుండె పట్టుకుంటాడు రాచ్ తండ్రి చలపతి.
ఏమైంది గుండెనొప్పా అని వెంకీ అంటే.. వచ్చేలా ఉందని. అందరూ వస్తా అన్నారా. మరి బడ్జెట్ ఎలారా అని చలపతి అంటే.. అంతా జీరో బడ్జెట్ అని ఇందు అంటుంది. మనకు ఒక్క రూపాయి కూడా ఖర్చు రాదని వెంకీ అంటాడు. ఇంట్లో వాటితోనే ఇందు అంతా ప్లాన్ చేసిందని రాజ్ చెబుతాడు. తర్వాత అంతా వంట ఏర్పాట్లు చేస్తారు. ఈ అమ్మాయి ఎవరో చాలా తెలివైందని ఇందును మెచ్చుకుంటారు చలపతి, లక్ష్మీ.
ఇంతలో లక్కీ వచ్చి నందును చూసి షాక్ అవుతాడు. ఈ పోలీస్‌ను పక్కన పెట్టుకుని వీడు ఎలా ఉన్నాడని సైలెంట్‌గా రాజ్‌ను పిలుస్తాడు లక్కీ. రాళ్లు విసురుతాడు. రాజ్‌కు తప్ప అందరికి తగులుతుంది. ఇంతలో లక్కీని నందు చూస్తుంది. ఆ ఎధవ పిలుస్తుందని రాజ్‌కు చెబుతుంది నందు. దాంతో రాజ్ వెళ్లి లక్కీతో మాట్లాడుతాడు. ఇందు చేసేదంతా చెబుతాడు. ఇప్పుడు ఆ పోలీస్ పిల్లకు మనమే కిడ్నాప్ చేసినట్లు తెలిస్తే మన బతుకు జైలే అని నందును చూసి భయపడిపోతాడు లక్కీ.
రాజ్, ఇందుకు బ్రహ్మముడి
రాజ్ ఏదోటి చెబుతాడు. తర్వాత రాజ్ కంట్లో ఏదో పడితే ఇందు ప్రేమగా చూస్తుంది. అదంతా చూసిన రాజ్ తల్లిదండ్రులు ఈ అమ్మాయి కోడలిగా వస్తే బాగుంటుంది కదా అనుకుంటారు. మీరన్నట్లు ఆ దేవుడు రాజ్, ఇందుకు బ్రహ్మముడి వేస్తే బాగుంటుందని అమ్మ లక్ష్మీ, నాన్న చలపతి కోరుకుంటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.