Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో చలపతి, లక్ష్మీ పెళ్లిరోజుకి రాజ్, లక్కీ చదివింపులు తీసుకుంటారు. ఒకరితో డబ్బులు తీసుకుంటుండగా.. ఇందు వచ్చి అడ్డుకుంటుంది. వద్దని చెప్పి అతన్ని పంపిస్తుంది. లక్కీని తెగ తిడుతుంది. మనం చేసింది పెళ్లి కాదు, పెళ్లి రోజు అని అంటుంది.
ప్లేట్ తిప్పేసిన రాజ్

దాంతో రాజ్ ప్లేట్ తిప్పేసి తను కూడా చదివింపులు వద్దన్నానని, లక్కీ గాడు అస్సలు వినలేదని ఫ్రెండ్‌పై తప్పు నెట్టేస్తాడు. అబ్బా ప్లేట్ భలే తిప్పేశావురా అని లక్కీ అనుకుంటాడు. ఇదంతా నీ ఐడియా అని నాకు తెలుసు. ఓవరాక్షన్ చేయకు, ఇంకోసారి ఇలాంటివి చేయకు అని రాజ్‌ని కూడా తిడుతుంది ఇందు. తర్వాత ఇంట్లో అంతా కూర్చొంటారు. ఇందును ఫంక్షన్ బాగా చేసిందని చలపతి బాగా పొగుడుతాడు.
ఇంతలో ఒక్కటి తగ్గిందంటూ సాహు వస్తాడు. సాహు ఎంట్రీతో రాజ్ వణికిపోతాడు. టీ కావాలా మీకు అని వెంకీ అంటాడు. కాదు, కేక్ తగ్గిందని, ఇంత సెలబ్రేషన్ చేసుకుని కేక్ కట్ చేయకుంటే ఎలా అంకుల్ అని సాహు అంటాడు. రేయ్ అంకుల్ ఏంట్రా.. నువ్వే నాకు తమ్ముడిలా ఉన్నావని లక్ష్మీ అంటుంది. అలాగే అక్కయ్య. ఓకేనా బావగారు. అరేయ్ కేక్ అక్కడ పెట్టండి, అక్కా బావ కేక్ కట్ చేస్తారని సాహు అంటాడు.
అలా రాజ్‌తోపాటు తల్లిదండ్రులతో సాహు కొత్త బంధం ఏర్పరుచుకుంటాడు. చలపతి, లక్ష్మీ కేక్ కట్ చేస్తారు. రాజ్‌ను క్లాప్స్ కొట్టమని, జోష్‌తో కొట్టమని సాహు అంటాడు. లక్ష్మీకి చలపతి కేక్ తినిపిస్తుంటే రాజ్ వద్దని అంటాడు. కేక్‌లో విషం ఉందని రాజ్ భయపడుతాడు. అందులో విషం ఏం పెట్టలేదు అని రాజ్‌తో సాహు అని.. బావగారు ఊరికే అలా షాక్ ఇచ్చాడు. మీరు పెట్టండి అని అంటాడు.
రాజుకు సాహు వార్నింగ్
దాంతో లక్ష్మీకి సాహు కేక్ తినిపిస్తాడు. తర్వాత రాజ్‌ను బయటకు తీసుకెళ్లి సాహు మాట్లాడుతాడు. అంత బాగా ఫంక్షన్ చేసి నాకు డబ్బులు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. నిన్ను ఎలా నమ్మాలి. నాకోసం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు అంటాడు సాహు. దాంతో రాజ్, లక్కీ షాక్ అవుతారు. సాహుకు ఇందు కిడ్నాప్ గురించి తెలిసి వార్నింగ్ ఇస్తాడు. 24 గంటల్లో తన రూ. 10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే అందమైన ఫ్యామిలీలోని చిరునవ్వు ఉండదని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు సాహు.
{{/usCountry}}దాంతో లక్ష్మీకి సాహు కేక్ తినిపిస్తాడు. తర్వాత రాజ్‌ను బయటకు తీసుకెళ్లి సాహు మాట్లాడుతాడు. అంత బాగా ఫంక్షన్ చేసి నాకు డబ్బులు ఇవ్వకపోవడం కరెక్ట్ కాదు. నిన్ను ఎలా నమ్మాలి. నాకోసం ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఎంత కష్టపడుతున్నావో నాకు తెలుసు అంటాడు సాహు. దాంతో రాజ్, లక్కీ షాక్ అవుతారు. సాహుకు ఇందు కిడ్నాప్ గురించి తెలిసి వార్నింగ్ ఇస్తాడు. 24 గంటల్లో తన రూ. 10 లక్షలు ఇవ్వాలని, లేకుంటే అందమైన ఫ్యామిలీలోని చిరునవ్వు ఉండదని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు సాహు.
{{/usCountry}}దాంతో కోపంగా రేఖకు కాల్ చేసి డబ్బుల గురించి నిలదీస్తాడు రాజ్. రేపటిలోపు డబ్బులు ఇవ్వాలి. లేకుంటే మీ అమ్మాయిని మట్టిలో కలిపేస్తాను అని రాజ్ గట్టిగా వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు. రేఖ ఎంత చెప్పిన వినడు. నా కుటుంబానికి ఏ సమస్య రావద్దని, అందుకే రేఖతో అలా అన్నానని లక్కీతో చెబుతాడు రాజ్. మరోవైపు రేఖ ఏం చేయాలో తెలియక తల పట్టుకుని కూర్చుంటుంది. ఇంతలో మేనేజర్ వచ్చి కంపెనీలోని ఎంప్లాయిస్ అందరికి సాలరీ పంపించాలని, అందుకు అప్రూవల్ కావాలని రేఖను అడుగుతుంది.
కంపెనీ ఉద్యోగుల సాలరీ డబ్బులతో
ఈ ఎంప్లాయిల సాలరీ ఎంత ఉంటుందని రేఖ అడిగితే.. రూ. 20 లక్షలు ఉంటుందని ఆమె చెబుతుంది. ఈ డబ్బు తీసుకుని తర్వాత మ్యానేజ్ చేయొచ్చు అని రేఖ అనుకుంటుంది. ఆ డబ్బంతా తన పర్సనల్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయమని, ఈ నెల పేమెంట్ కొంచెం లేట్ అవుతుందని చెప్పమని చెబుతుంది రేఖ. దాంతో మేనేజర్ షాక్ అయి ఎంప్లాయిస్ ఇబ్బందిపడతారని అంటే.. కానీ, చచ్చిపోరుగా, ఉచిత సలహాలు ఇవ్వకు, నోర్మూసుకుని నేను చెప్పింది చేయమని బెదిరిస్తుంది రేఖ. అంటే కంపెనీ ఉద్యోగుల జీతం డబ్బు 20 లక్షలు లాగేసుకున్న రేఖ రాజ్‌కు ఇవ్వాలనుకుంటుంది.
దాంతో మేనేజర్ సైలెంట్‌గా వెళ్లిపోతుంది. గతంలో రాజ్, కావ్య ఉన్నప్పుడు కంపెనీ ఎలా ఉండేదే వాళ్ల ఫొటో చూస్తూ గుర్తు చేసుకుంటుంది మేనేజర్. రాజ్, కావ్య ఉన్నప్పుడు ఫస్ట్ డేట్ హాలీడే అయితే దానికి ముందురోజే ఉద్యోగులందరికి సాలరీ వేసేవాళ్లని మేనేజర్ అనుకుంటుంది. ఇక్కడ మా బాధలను ఎవరు పట్టించుకుకోవట్లేదని, కనీసం మీ ఫొటోని గోడ మీద కూడా పెట్టనివ్వట్లేదు రేఖ, ఆ రేఖ నుంచి ఎప్పుడు బయటపడతామో, మళ్లీ ఆఫీస్‍కు మంచి రోజులు ఎప్పుడు వస్తాయో అని బాధపడుతుంది మేనేజర్.
మరోవైపు రేఖ డబ్బు ఇస్తుందా లేదా అని రాజ్ తెగ టెన్షన్ పడతుంటాడు. ఇంతలో ఇందు వచ్చి ఏమైందని అడుగుతుంది. డబ్బుల విషయంలో టెన్షన్ పడుతున్నావని నాకు తెలుసు అని, డబ్బు చేతికి వచ్చాక ఏం చేయాలో చాలా కష్టం అని మాట్లాడుతుంది ఇందు. ఇంట్లోవాళ్లు వింటారు మెల్లిగా మాట్లాడమని రాజ్ అంటాడు. ఇలాంటి డబ్బుతో సంతోషం ఉండదు. చిన్న ఉద్యోగం చేసి సంపాదించే డబ్బు మంచిదని ఇందు అంటుంది.
గుడిలో ఇందు ప్రదక్షిణలు
దానికి నవ్విని రాజ్ నువ్వు డబ్బులో పుట్టావ్, కానీ, ఫ్రీడమ్ లేదు. మా ఫ్రీడమ్ చూసి చాలా బెటర్ అనుకుంటున్నావ్. కానీ, డబ్బు లేకుంటే ఎలా ఉంటుందో నాలాంటి మధ్య తరగతి వాడికే తెలుసు అని డబ్బు వల్ల పడే ఇబ్బందులను రాజ్ చెబుతాడు. దాంతో ఇందు కూడా జాలిగా చూస్తుంది. తర్వాత డబ్బులు రెడీ అయినట్లు రాజ్‌కు రేఖ చెబుతుంది. రేపు పొద్దున్నే ఇందును మీకు అప్పజెపుతాను అని రాజ్ అంటాడు.
మరుసటి రోజు ఉదయం గుడిలో నీకు జీవితాంతం రుణపడి ఉంటాను. నువ్వు నాకు చాలా మంచే చేశావని రాజుతో అంటుంది ఇందు. ఇందును ప్రదక్షిణలు చేయమని రాజ్ అంటాడు. మరి ఒంటరిగా నేను ప్రదక్షిణలు చేస్తే పారిపోతే ఎలా అని ఇందు అంటే.. నువ్వు పారిపోవు అని రాజ్ అంటాడు. మరి నిన్ను నేను నమ్మొచ్చా అని ఇందు అడిగితే.. రాజ్ షాక్ అయి చూస్తాడు. మరోవైపు రేఖ వాళ్లు వస్తారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.