...
...
Next Story

Brahmamudi August 24 Episode: బ్రహ్మముడి.. ఇందుని ఇరికించిన ఐశ్వర్య.. పెళ్లి కాలేదని నిరూపిస్తానని.. రేఖకు టెన్షన్

Brahmamudi Serial August 24th Episode: బ్రహ్మముడి సీరియల్ ఆగస్ట్ 24 ఎపిసోడ్ లో ఐశ్వర్యకు ఇందు ఓపెన్ ఛాలెంజ్ విసరగా.. ఆ ఛాలెంజ్ కు ఓకే చెప్పిన ఐషూ.. ఆ తర్వాత ఇందునే ఇరికిస్తుంది. అయితే అక్కచెల్లెళ్ల మధ్య రేఖలో టెన్షన్ మొదలైంది.

Published on: Aug 24, 2026, 08:37:21 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. అక్కాచెల్లెళ్ల సవాళ్లు, ప్రతి సవాళ్లతో రక్తి కట్టించింది. అయితే తాను ఏదో అనుకుంటే మరేదో అయిందని రేఖలో కొత్త టెన్షన్ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూద్దాం.

ఇందుకి బుద్ధి చెప్పడానికే పార్టీ అన్న ఐశ్వర్య

Brahmamudi August 24 Episode: బ్రహ్మముడి.. ఇందుని ఇరికించిన ఐశ్వర్య.. పెళ్లి కాలేదని నిరూపిస్తానని.. రేఖకు టెన్షన్
Brahmamudi August 24 Episode: బ్రహ్మముడి.. ఇందుని ఇరికించిన ఐశ్వర్య.. పెళ్లి కాలేదని నిరూపిస్తానని.. రేఖకు టెన్షన్

ఇంట్లో పార్టీ ఎందుకు అని ఐశ్వర్యను రేఖ నిలదీసే సీన్ తో సీరియల్ సోమవారం (ఆగస్ట్ 24) ఎపిసోడ్ మొదలైంది. ఇందుని డబ్బులు అడిగినా, వాటా అడిగినా ఇవ్వడం లేదని, ఈరోజు తన స్థాయి ఏంటో ఇందుకి నిరూపించడానికే పార్టీ చేస్తున్నానని ఐశ్వర్య అంటుంది. ఈ విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దని స్పష్టం చేస్తుంది.

రాజుకు థ్యాంక్స్ చెప్పి ఇందు ఎమోషనల్

ఇటు హాస్పిటల్లో డాక్టర్ ను కలిసి వచ్చిన తర్వాత ఇందు ఎమోషనల్ అవుతుంది. రాజుకు థ్యాంక్స్ చెబుతుంది. తాతయ్యకు సర్జరీ జరగబోతుండటానికి కారణం నువ్వే అని రాజుతో అంటుంది. చాలా ఎమోషనల్ అవుతుంది. తాతయ్య ఇంట్లో లేచి నడుస్తుంటే చూడాలని ఎప్పటి నుంచో అనుకున్నానని ఆమె అంటుంది. ఒకప్పుడు ఎంతో గొప్పగా బతికిన వ్యక్తి చక్రాల కుర్చీకి అంకితం కావడం చూడలేకపోతున్నానని చెబుతుంది. మొత్తానికి ఆయన మళ్లీ నడవబోతున్నారని అంటేనే చాలా సంతోషంగా ఉందని అంటుంది.

ఇంట్లో ఐశ్వర్య పార్టీ స్టార్ట్

మరోవైపు ఇంట్లో ఐశ్వర్య పార్టీ మొదలు పెడుతుంది. పెద్దగా సౌండ్ పెట్టి ఐషూ, శశి వాళ్ల ఫ్రెండ్స్ డ్యాన్స్ చేస్తూ ఉంటారు. పైనుంచి రేఖ, భ్రమరాంబ ఇది చూసి ఎంజాయ్ చేస్తుంటారు. ఇప్పుడు ఇందు రావాలి.. ఆ తర్వాత పెద్ద గొడవ జరగాలి అని రేఖ అంటుంది. కానీ తనకెందుకో సీన్ రివర్స్ అవుతుందేమో అనిపిస్తుందని శేషు అంటాడు.

అప్పుడే ఇందు, రాజు వస్తారు. పార్టీ చూసి షాకవుతారు. ఐషూని గట్టిగా పిలిచినా పట్టించుకోదు. దీంతో ఇందు వెళ్లి స్పీకర్ ఆఫ్ చేస్తుంది. అది పైనుంచి చూసిన రేఖ.. ఇక యుద్ధం మొదలవుతుంది వెళ్దామంటూ కిందికి వస్తుంది. ఏం చేస్తున్నావంటూ ఐశ్వర్యను ఇందు నిలదీస్తుంది. కనిపించడం లేదా పార్టీ అని అంటుంది. ఇది ఇల్లు.. పబ్బు కాదు అని ఇందు అంటుంది.

పబ్బుకు వెళ్లడానికి నువ్వు డబ్బులు ఇవ్వడం లేదు.. ఆస్తి నా వాటా ఇవ్వడం లేదు.. అందుకే ఇంట్లోనే పార్టీ ఏర్పాటు చేశాను.. నువ్వు డబ్బు ఇవ్వకపోయినా.. నా బాయ్‌ఫ్రెండ్ శశి ఎలా ఏర్పాటు చేశాడో చూశావా అని ఇందుతో ఐశ్వర్య అంటుంది. అంటే ఇప్పుడు నువ్వు అతన్ని అడుక్కుంటున్నావా.. ఎవరి ముందూ తల వంచను.. సెల్ఫ్ రెస్పెక్ట్ అదీఇదీ అన్నావ్.. ఇప్పుడేమైంది అని ఇందు అనడంతో ఐశ్వర్య షాక్ తింటుంది.

ఐశ్వర్యకు ఇందు ఓపెన్ ఛాలెంజ్

అప్పుడే రాజు కూడా జోక్యం చేసుకొని నీ చెల్లి అయిన ఇందు ఈ కంపెనీని లాభాల్లోకి తీసుకెళ్తే.. నువ్వు మాత్రం డిగ్రీ కూడా పూర్తి చేయకుండా ఇలా పార్టీలంటూ తిరుగుతున్నావని అంటాడు. అటు శేషు కూడా మాట్లాడుతూ.. అక్షరం ముక్క రాని ఇందు ఇంత చేస్తుంటే ఇంత చదువు చదివి ఏం లాభం అంటాడు. డిగ్రీ పూర్తి చేసినా ఏం లాభం.. ఆస్తిలో, కంపెనీలో వాటా ఇస్తుందా అని ఐశ్వర్య అంటుంది. అప్పుడు ఇందు జోక్యం చేసుకుంటూ ఇస్తాను అంటుంది.

వాటా కాదు.. నువ్వు డిగ్రీ పాసైతే నీకు సొంత కంపెనీ పెట్టిస్తాను.. నాతో సమాన హోదా ఇస్తాను.. డిగ్రీ పాసయ్యి చూపించు అని ఓపెన్ ఛాలెంజ్ విసురుతుంది. దీంతో అందరూ షాక్ తింటారు. ఐషూని ఇందూ ట్రాప్ చేస్తుందనుకున్న రేఖ వద్దని వారిస్తున్నా వినకుండా ఛాలెంజ్ కు ఓకే చెబుతుంది. ఒకవేళ డిగ్రీ పాస్ కాకపోతే నేను చెప్పినట్లే వినాలని కూడా ఇందు అంటుంది. దానికీ ఐషూ సరే అంటుంది.

ఐశ్వర్యను నిలదీసిన రేఖ.. వెనక్కి తగ్గని ఐషూ

తాను అనుకున్నది ఒకటి.. అక్కడి జరగింది మరొకటి కావడంతో రేఖ కంగు తింటుంది. వెంటనే ఐశ్వర్య గదిలోకి వెళ్లి ఆమెను నిలదీస్తుంది. నేను చెప్పిందేంటి.. నువ్వు చేస్తుందేంటి అని తిడుతుంది. ఇప్పటికీ ఆలస్యం కాలేదు.. ఏదో తాగిన మత్తులో అలా మాట్లాడాను.. మాట వెనక్కి తీసుకుంటున్నానని ఇందుతో చెప్పమని అంటుంది.

దీంతో ఐషూ సీరియస్ అవుతుంది. ఇచ్చిన మాట వెనక్కి తీసుకోవడమేంటని అంటుంది. డిగ్రీ పాసవ్వడం నీవల్ల కాదు.. ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవడమంటే.. పార్టీలకు ప్రిపేరైనట్లు కాదని అంటుంది. కానీ ఐశ్వర్య మాత్రం తాను డిగ్రీ పాసై చూపిస్తానని శపథం చేసి వెళ్లిపోతుంది.

ఐశ్వర్య చెప్పింది చేస్తుందన్న ఇందు

అటు రాజు కూడా గదిలోకి వెళ్లి అసలు ఇందు ఏం చేసిందని ఆలోచిస్తుంటాడు. అప్పుడే ఇందు వస్తుంది. నీ ప్లాన్ బాగుంది.. ఆ ఐశ్వర్య ఎలాగూ పాసవదు.. మనం చెప్పినట్లు పడుంటుంది అని రాజు అంటాడు. లేదు నా అక్క గురించి బాగా తెలుసు.. ఏదైనా అనుకుంటే కచ్చితంగా చేసి తీరుతుంది.. డిగ్రీ పాసవుతుందని అంటుంది. మరి డిగ్రీ పాసైతే కంపెనీ పెట్టిస్తావా అని రాజు అడిగితే పెట్టిస్తానని అంటుంది. దీంతో రాజు షాక్ తింటాడు.

ఇందుని ఇరికించిన ఐశ్వర్య

అటు వరలక్ష్మీ వ్రతానికి ఇంట్లో ఏర్పాట్లు చేస్తుంటారు. ఇందు కూడా రాజుతో కలిసి కూర్చోవాలి కదా అని ఐశ్వర్య అంటుంది. అందరి ముందే రేపు వరలక్ష్మీ వ్రతం చేయాలని ఇందుతో రేఖ చెబుతుంది. ఆమె చేస్తానని అనడంతో అపర్ణ కూడా షాక్ తింటుంది. వాళ్లకు పెళ్లి జరగలేదని చెబితే నమ్మలేదు కదా.. రేపు చూడండి మీకే తెలుస్తుంది అని ఐశ్వర్య అంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks