Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రేపు ఇంట్లో వరలక్ష్మీ వ్రతం, పూజ ఉంది. ఏ పని పెట్టుకోకుండా ఇంట్లో ఉండాలని ఇందు చెబుతుంది. ఏ పూజలో కూర్చోనని రాజ్ అంటే.. కూర్చోవాల్సిన అవసరం లేదు. నేను చేస్తాను. వెనకాల నిలబడితే చాలు. నేను కోరుకున్నవాడు నా భర్తగా రావాలని చేస్తున్నా. ఇంట్లోవాళ్లు నీకోసం చేస్తున్నా అనుకుంటున్నారు అని ఇందు చెబుతుంది.
వెంకీ గాడి కోసం అడుగుదామనుకుంటే

అంతా కన్‌ఫ్యూజ్‌గా ఉందని రాజు అంటే.. చేయాలి. ఐషు బుక్ చేసింది కదా. నువ్వు ఊరికే చేయాల్సిన అవసరం లేదు. ఎక్స్‌ట్రా పేమెంట్ కూడా ఇస్తాను అని ఇందు అంటుంది. నేనే వెంకీ గాడి కోసం అడుగుదామనుకున్నా అని రాజు సంతోషిస్తాడు. పైకి మాత్రం డబ్బు కాదు నా క్యారెక్టర్ మారుతుందేమో అని రాజు అంటాడు. పెద్దగా ఏం పడిపోదులే అని ఇందు అంటుంది.
రాజు సరేనని ఒప్పుకుని వెళ్లిపోతాడు. హమ్మయ్యా.. వ్రతం వరకు చెప్పాను. అక్షింతల సంగతి రేపు చూసుకుందామని ఇందు అంటుంది. మరుసటి రోజు ఉదయం వరలక్ష్మీ వ్రతం ఏర్పాట్లు జరుగుతాయి. ఇందు వచ్చి వ్రతం చేయలేనంటుంది చూడండని ఐశ్వర్య అంటుంది. కానీ, పట్టుబట్టలతో ఇందు, రాజు రావడం చూసి షాక్ అవుతుంది.
ఏదోటి చెప్పి తప్పించుకుంటారు
వాళ్లు పూజలో కూర్చున్నా అక్షింతలు వేసి ఆశీర్వదించడు. ఏదోటి చెప్పి తప్పించుకుంటారు చూడండి అని రేఖ వాళ్లతో ఐశ్వర్య అంటుంది. పూజ మధ్యలో ఎవరు లేవకూడదని పంతులు అంటాడు. ఐశ్వర్యను కూడా పూజలో కూర్చోమంటుంది అపర్ణ. కానీ, ఐషు ఒప్పుకోదు. సరే కూర్చోకు. నువ్వు వ్రతం చేస్తే నువ్వు కోరుకున్నట్లుగా కోటీశ్వరుడు మొగుడుగా వస్తాడని కోరుకుందామనుకున్నా అని ఇందు ఫిటింగ్ పెడుతుంది.
దాంతో కోటీశ్వరుడైనా మొగుడి కోసం వ్రతంలో ఐశ్వర్య కూర్చుంటుంది. అంతా వరలక్ష్మీ వ్రతంలో కూర్చుంటారు. రాజు తన భర్త కావాలని ఇందు, కంపెనీ పెట్టి ఇందు పొగరు అణచాలని ఐశ్వర్య, ఆస్తి మొత్తం తన వశం కావాలని రేఖ, ఇందుకు అంతా మంచి జరగలాని అపర్ణ కోరుకుంటారు. వరలక్ష్మీ వ్రతం కథ చెబుతాడు పంతులు. అమ్మవారికి హారతి పడతారు.
భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి
{{/usCountry}}దాంతో కోటీశ్వరుడైనా మొగుడి కోసం వ్రతంలో ఐశ్వర్య కూర్చుంటుంది. అంతా వరలక్ష్మీ వ్రతంలో కూర్చుంటారు. రాజు తన భర్త కావాలని ఇందు, కంపెనీ పెట్టి ఇందు పొగరు అణచాలని ఐశ్వర్య, ఆస్తి మొత్తం తన వశం కావాలని రేఖ, ఇందుకు అంతా మంచి జరగలాని అపర్ణ కోరుకుంటారు. వరలక్ష్మీ వ్రతం కథ చెబుతాడు పంతులు. అమ్మవారికి హారతి పడతారు.
భర్తల దగ్గర ఆశీర్వాదం తీసుకోండి
{{/usCountry}}ఇందు అందరికి హారతి ఇస్తుంది. వ్రతం పూర్తి అయింది. అమ్మవారి సాక్షిగా తమరంతా తమ భర్తల దగ్గర అక్షింతలతో ఆశీర్వాదం తీసుకోండని పంతులు చెబుతాడు. దాంతో రాజు తెగ షాక్ అవుతాడు. వీడెప్పుడు ఎలా వేస్తాడని లక్కీ అనుకుంటాడు. శేషు పొగరు చూపిస్తాడు. ఇవాళ నీ రోజు అని శేషు కాళ్లపై పడుతుంది భ్రమరాంబ. శేషు ఆశీర్వదీస్తాడు.
ఇందు తమరు ఆశీర్వాదం తీసుకోవట్లేదేంటీ, ఏంటీ రాజు అంత కోపంగా చూస్తున్నావ్ అని ఐశ్వర్య కూడా ఫిట్టింగ్ పెడుతుంది. రాజును ఆశీర్వదించమని అపర్ణ, భ్రమరాంబ అంటారు. ఇప్పుడు కాదు తర్వాత వేస్తానంటాడు రాజు. మీకు పెళ్లి అయిందని మేమంతా నమ్ముతున్నాం. ఈ ఐషు మాత్రం తప్పా. ఇప్పుడు నువ్వు అక్షింతలు వేయాలి. లేకుంటే ఐషు చెప్పిందే నిజమవుతుందని శేషు అంటాడు.
తల్లిదండ్రులనే మోసం చేసిన వరెస్ట్ క్యారెక్టర్ నీది
దాంతో రాజు అక్షింతలు ఇవ్వమని తీసుకుంటాడు. ఇందును వచ్చి కాళ్లపై పడమంటాడు. నా పెళ్లిపై ఇన్ని కుట్రలు ఏంటో అని రాజు అంటాడు. రాజు కాళ్లపై ఇందు పడుతుంది. రాజు అక్షింతలు వేయబోతుంటాడు. మరోవైపు హాస్పిటల్‌లో రాజు ట్రీట్‌మెంటి ఇప్పిస్తున్న పేషంట్‌కు స్పృహ వస్తుంది. అది రాజుకు కాల్ చేసి చెబుతుంది నర్స్.
దాంతో అక్షింతలు కిందపడేసి ఇప్పుడే వస్తున్నానని రాజు వెళ్లిపోతాడు. నేను చెప్పిందే నిజమైంది. వాళ్లిద్దరికి పెళ్లి కాలేదు అని ఐశ్వర్య అంటుంది. అలా ఐశ్వర్య ప్లాన్ సక్సెస్ అవుతుంది. తర్వాత రాజును నువ్వు ఒక దొంగవి, తల్లిదండ్రులనే మోసం చేసిన వరస్ట్ క్యారెక్టర్ నీది అని రేఖ అంటుంది. దాంతో కన్నకొడుకునే పొత్తిళ్లలో ఉన్నప్పుడే విసిరేసినదానివి నువ్వు నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నావా అని రాజు అనేస్తాడు.
రేఖ పిన్ని కొడుకే లక్కీ
అంతా ఉలిక్కిపడతారు. ఏంటీ అని భ్రమరాంబ అడుగుతుంది. లక్కీ ఎవరో కాదు రేఖ పిన్ని రక్తంపంచుకుని పుట్టిన బిడ్డ అని రాజు నిజం చెబుతాడు. రేఖ బండారం అందరిముందు బయటపెడతాడు. తండ్రికొడుకులు భూషణ్, మదన్ షాక్ అవుతారు. రాజును కించపరిచిన రేఖకు తనమీదకే తెచ్చుకున్నట్లవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.