...
...
Next Story

బ్రహ్మముడి డిసెంబర్ 18 ఎపిసోడ్: రాహుల్ రెండో విజయం- గాడిదపై రాజ్- మోడల్‌గా కావ్యతో నగల షూటింగ్- దొంగ చేతికే తాళాలు!

బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 18 ఎపిసోడ్‌లో నగల డిజైన్స్ వేసి మోడల్‌తో షూటింగ్ ఏర్పాటు చేస్తాడు రాజ్. కానీ, మోడల్ షూట్‌కు వెళ్లకుండా పది లక్షలు ఇచ్చి ఆపేస్తాడు రాహుల్. ఈ రెండు రోజులు నిన్ను అడ్డుకుంటే రెండో విజయం కూడా నాదే అంటాడు. గాడిదపై రాజ్ ఉన్న ఫొటోను చూపిస్తుంది కావ్య.

Published on: Dec 18, 2025, 07:24:04 IST
Advertisement

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాజ్ ఆఫీస్‌లో రాహుల్‌కు అమ్ముడుపోయిన వ్యక్తిని రాజ్, కావ్య పట్టుకుంటారు. నిన్ను పట్టుకోవాలనే డిజైన్స్ వేసినట్లు అబద్ధం చెప్పాను. చాలా నిరాశపడినట్లున్నావ్ అని కావ్య అంటుంది. అతన్ని రాజ్ కొట్టి పోలీసులకు అప్పజెబుతాడు. తర్వాత కొద్దిసేపు సస్పెన్స్‌లో పెట్టిన దొంగను పట్టుకోవడంలో నన్ను మించిపోయావ్ అని రాజ్ అంటాడు.

మీ పాప బతికే ఉంది

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 18 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 18 ఎపిసోడ్

మరోవైపు పోలీస్ స్టేషన్‌కు రేణుక భర్త అశోక్ వెళ్తే అప్పు మీకు గుడ్ న్యూస్ అంటుంది. కేసు క్లోజ్ చేస్తున్నారా అని అశోక్ అడిగితే.. కాదు మీ పాప బతికే ఉందని అప్పు చెబుతుంది. దానికి అశోక్ షాక్ అవుతాడు. పోస్ట్‌మార్టమ్‌తో మిమ్మల్ని తప్పుదోవ పట్టించారు. మీకు దొరికిన డెడ్ బాడీ మీ పాపకు కాదు అని అప్పు చెప్పేసరికి అశోక్ తెగ కంగారుపడిపోతాడు.

చాలా సంతోషంగా, ఆనందంగా ఉందని అతి కష్టంగా అంటాడు. నేరం చేసినవాళ్లు ఏదో ఒక తప్పు చేసి దొరికిపోతారు. వాళ్లను మేము పట్టుకుంటాం. మీ పాప బతికే ఉందని మీ భార్యకు చెప్పండి అని అప్పు చెబుతుంది. అశోక్ వెళ్లిపోతాడు. అశోక్ తేడాగా ఉన్నాడని అప్పు, కానిస్టేబుల్ మాట్లాడుకుంటారు. అశోక్‌ను ఫాలో అవ్వమని కానిస్టేబుల్‌కు చెబుతుంది అప్పు.

మరోవైపు రాత్రి ఇంటి బయట కావ్య డిజైన్స్ వేస్తుంది. రాజ్ కాఫీ తీసుకొచ్చి ఇస్తాడు. కావ్య వేసిన డిజైన్స్ యావరేజ్‌గా ఉందంటాడు, దీనికంటే శ్రుతి డిజైన్సే బెట్ అని రాజ్. దాంతో కావ్య అలిగి వెళ్లిపోతుంది. తర్వాత కావ్యను రాజ్ బతిమిలాడుతాడు. అయినా కావ్య వినకపోవడంతో గిలిగింతలు పెడతాడు రాజ్. దాంతో శ్రుతికి కాల్ చేసి నీ డిజైన్స్ దరిద్రంగా ఉన్నాయి, మా భార్య వేసిన డిజైన్స్ బాగున్నాయని చెప్పాలని కావ్య అంటుంది.

మోడల్‌తో షూటింగ్

ఆ మాటలు రాహుల్ వింటాడు. అది అస్సలు జరగనివ్వను కదా. ఈ రెండు రోజులు నిన్ను అడ్డుకుంటే చాలు రెండో విజయం కూడా నాదే. ఈ రాహుల్ ఏం చేస్తాడో చూడు అని రాహుల్ వెళ్లిపోతాడు. తర్వాత కావ్య వేసిన డిజైన్స్ అద్భుతంగా ఉన్నాయంటాడు రాజ్. మరుసటి రోజు ఉదయం జ్యూవెల్లరీ షూటింగ్ జరుగుతుంటుంది. బాగా రావాలని, యాడ్ బాగుండాలని డైరెక్టర్‌తో చెబుతాడు రాజ్.

మోడల్ గురించి డైరెక్టర్ అడుగితే శ్రుతిని అడుగుతాడు రాజ్. మోడల్ లాస్య మేనేజర్‌కు కాల్ చేస్తే మేడమ్ కనిపించట్లేదని చెబుతాడు. అదే విషయం రాజ్‌కు శ్రుతికి చెబుతుంది. ఎలాగైన మోడల్‌ను పట్టుకుని ఇవాళ షూటింగ్ చేయాలంటాడు రాజ్. మరోవైపు మోడల్ లాస్యతో నవ్వుతుంటాడు రాహుల్. యాడ్ ఎగ్గొట్టినందుకు లాస్యకు పది లక్షల క్యాష్ ఇస్తాడు రాహుల్.

వెళ్లిపోయిన డైరెక్టర్

షూటింగ్ చేస్తే లక్ష, ఎగ్గొడితే పది లక్షలు. ఇదేదో బాగుందే. ఇలాంటివి ఇంకా ఉంటే చెప్పు అని లాస్య అంటే సేరనంటాడు రాహుల్. వేరే మోడల్స్‌కు కాల్ చేసి రాజ్ ట్రై చేస్తాడు. కానీ, ఎవరు వర్కౌట్ కారు. ఎవరినో ఒకరిని అరెంజ్ చేస్తాను. రేపు షూటింగ్ పెట్టుకుందామని రాజ్ అంటే రేపు అందుబాటులో ఉండను అని డైరెక్టర్ అంటాడు. కావాలంటే రేపు వేరే డైరెక్టర్‌ను పంపిస్తానంటాడు దర్శకుడు.

డైరెక్టర్ వెళ్లిపోతాడు. రెండు రోజుల్లో మార్కెట్‌లోకి డిజైన్స్ పంపించాలి. ఏదో ఒకటి చేయాలని రాజ్ ఆలోచిస్తాడు. మరోవైపు పాప మిస్ అయిన రోజు సీసీ కెమెరా టీవీ చూస్తుంది అప్పు. ఎప్పుడు ఐదు నిమిషాల్లో ముందుడే రేణుక ఆరోజు లేట్ అయింది అన్ని చాలా ప్రశ్నలు వేసుకుంటూ అనుమానిస్తుంది అప్పు. ఇంతలో అంజలి ఫాదర్ రిపోర్ట్స్ అని కానిస్టేబుల్ తీసుకొస్తాడు.

ఆ రిపోర్ట్స్ చూసిన అప్పు ఏంటిది రాజన్న అని అంటుంది. నిజంగానే ఆ అశోక్ తేడా మనిషి. ఆ రేణుక, అశోక్ ఇద్దరు మనల్ని మోసం చేశారు అని కానిస్టేబుల్ రాజన్న అంటాడు. అవును, వెంటనే అశోక్, రేణకును నా ముందు ఉంచు అని అప్పు అంటుంది. మరోవైపు మోడల్స్ కోసం రాజ్ ట్రై చేస్త ఫ్రస్టేట్ అవుతాడు. కావ్య వచ్చి రాత్రి డిన్నర్‌కు ఏం చేయాలని అడుగుతుంది.

గాడిదపై రాజ్

రాజ్ ఇరిటేట్ అవుతాడు. ఇలా మిమ్మల్ని చూస్తుంటే ఎలా కనిపిస్తున్నారో తెలుసా అని ఫొటో చూపిస్తుంది కావ్య. అందులో గుర్రంపై రాజ్ కూర్చుని ఉంటాడు. ఏంటే రాజ్ గుర్రంపై కోపంగా ఉన్నాడని చూపిస్తున్నావా అని అంటాడు. తర్వాత కావ్య స్కర్ట్, స్లీవ్‌లెస్ డ్రెస్సులో ఉన్న గ్లామర్ ఫొటోను చూపిస్తాడు రాజ్. అది చూసి కావ్య షాక్ అవుతుంది.

నేను మోడ్రన్ డ్రెస్ వేసుకోవడం ఏంటీ, మార్చండి అని కావ్య అంటుంది. అయితే, దీన్ని నా డీపీగా పెట్టుకుంటాను అని రాజ్ అంటాడు. తర్వాత డిన్నర్‌లో షూటింగ్ గురించి రాహుల్ అడిగితే.. మోడల్ హ్యాండ్ ఇచ్చిందని చెబుతాడు. మరి మోడల్ ఎలా లేకపోతే ఎలా అని రాహుల్ అంటే మోడల్ ఉంది.

కావ్యే మోడల్ అని రాజ్ చెబుతాడు. దొంగ చేతికి తాళాలు ఇచ్చినట్లు రాహుల్‌కే కావ్య మోడల్ అని చెబుతాడు రాజ్. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe