...
...
Next Story

బ్రహ్మముడి డిసెంబర్ 6 ఎపిసోడ్: కావ్యకు పనిష్‌మెంట్- స్వప్నను ఏమార్చిన రాహుల్- రాజ్ దగ్గరికి డేనియల్ అన్న సామ్యూల్!

బ్రహ్మముడి సీరియల్ డిసెంబర్ 6 ఎపిసోడ్‌లో అప్పు తాను ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేస్తున్నానో లేదో అని డౌట్ పడుతుంటే కల్యాణ్ సపోర్టింగ్‌గా మాట్లాడుతాడు. కావ్య నిద్ర లేవకుండా ఉంటే రాజ్ లేపుతాడు. మరోవైపు స్వప్నను ఆఫీస్‌కు వచ్చేలా చేసి తాను సొంతంగా డిజైన్స్ వేస్తున్నట్లుగా ఏమారుస్తాడు. అది స్వప్న నమ్ముతుంది.

Published on: Dec 6, 2025, 07:02:29 IST
Advertisement

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో అప్పు ఆలోచిస్తుంటే కల్యాణ్ వచ్చి అడుగుతాడు. రేణుక చెప్పిన విషయాలు చెబుతుంటే ఆశ్చర్యంగా ఉందని, చుట్టు ఉన్నవాళ్లు మాత్రం ఆమెది భ్రమ అని అంటున్నారు, ఏది తేల్చుకోలేకపోతున్నాను, ఎమోషనల్‌గా తీసుకుని తప్పుడు కేసు గురించి ప్రయత్నిస్తున్నానా అని అప్పు అంటుంది.

కల్యాణ్ సపోర్ట్

బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 6 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ డిసెంబర్ 6 ఎపిసోడ్

డాక్టర్‌ను అడిగితే తను నార్మల్‌గానే ఉందని చెబుతున్నారని అప్పు అంటుంది. అలా అయితే కేసు ఇన్వెస్టిగేట్ చేయి, నీకు క్లారిటీ వచ్చాకే వదిలేయు, ఒకవేళ నువ్వు అనుకుంది తప్పు అయితే టైమ్ వేస్ట్ అవుతుంది, కానీ, ఇన్వెస్టిగేట్ చేయందే తెలియదుగా అని కల్యాణ్ సపోర్ట్ చేస్తాడు. నేను ముందడుగు వేస్తాను. ఈ కేసు వదిలిపెట్టను అని అప్పు అంటుంది.

మరోవైపు కావ్య నిద్రలేకుండా అలాగే ముసుగుతన్ని పడుకుంటుంది. రాజ్ లేపేందుకు ట్రై చేస్తాడు. వాగి వాగి బెడ్ షీట్ తీస్తాడు రాజ్. కావ్య ఫ్రెష్ అయి రెండు గంటలు అయిందని, అలా వచ్చి రాజ్ పక్కన పడుకున్నట్లుగా చెబుతుంది కావ్య. నన్ను ఆటపట్టించినందుకు పనిష్‌మెంట్ ఇస్తాను అని రాజ్ అంటాడు. పక్కనున్న సాయి బాబా గుడికి తీసుకెళ్లమని కావ్య అడిగితే రాజ్ సరే అంటాడు.

దేవుడు మోసం

మరోవైపు కావ్య డిజైన్స్‌ను అచ్చం అలాగే కాపీ కొట్టిస్తాడు రాహుల్. ఏ ఒక్క చిన్న డీటేయిల్ కూడా మిస్ కాకూడదని డిజైనర్‌కు చెబుతాడు. తర్వాత స్వప్నకు కాల్ చేసి లంచ్‌కి రావట్లేదని, వర్క్ చాలా ఉందని డ్రామా చేస్తాడు రాహుల్. దాంతో తాను క్యారేజ్ తీసుకొస్తానని స్వప్న అంటుంది. రాజ్, కావ్య గుడికి వెళ్లి మొక్కుకుంటారు.

అసలు డానియల్ తెలియదు, ఏం ఇవ్వలేదు, చెప్పలేదని రాజ్ చెబుతాడు. ఎంత చెప్పిన సామ్యూల్ వినకపోయేసరికి రాజ్ కోప్పడుతాడు. డేనియల్‌ అన్నతో రాజ్, కావ్య మాట్లాడటం చోటు, మోటు చూస్తారు. దాంతో రాజ్, కావ్య మీద మోటుకు మరింత డౌట్ వస్తుంది. ఆ డేనియల్ గాడు వాళ్లిద్దరికి ఇచ్చిన పెన్‌డ్రైవ్ సామ్యూల్ గాడికి ఇచ్చినట్లున్నారు అని అనుకుంటారు.

సామ్యూల్ గాడిని పెన్‌డ్రైవ్ అడిగేందుకు వెళ్తారు. అంతలోనే సామ్యూల్ వెళ్లిపోతాడు. ఆ పెన్‌డ్రైవ్ రాజ్, కావ్య వాళ్ల దగ్గరే ఉంటుందని వాళ్ల దగ్గరికి వెళ్దామని చోటు, మోటు అనుకుంటారు. మరోవైపు కావ్య వేసినట్లుగా డిజైన్ వేయలేకపోతాడు డిజైనర్. ఇంతలో స్వప్న రావడంతో డిజైన్స్ కోసం చాలా కష్టపడుతున్నట్లుగా బిల్డప్ ఇస్తాడు రాహుల్.

స్వప్నను ఏమార్చిన రాహుల్

మోడ్రన్, ట్రెడిషనల్‌గా ఉండాలని రాజ్ చెప్పినట్లుగా డిజైనర్‌కు రాహుల్ చెబుతాడు. ఇంతలో స్వప్న వచ్చింది చూసి మరింత డ్రామా చేస్తాడు రాహుల్. ఆ డిజైన్స్ తానే వేసినట్లుగా స్వప్నను నమ్మించి ఏమారుస్తాడు. అందరిని లంచ్ చేయమని స్వప్న పంపిస్తుంది.

50 శాతం స్వప్నను నమ్మించాను. ఇక తానే చూసుకుంటుంది అని రాహుల్ అనుకుంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe