బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నా కొడుకు భవిష్యత్తుకు సమస్య రాకూడదంటే ఈ ట్రస్ట్ పెట్టకూడదు. ఆస్తి నుంచి చిల్లి గవ్వ బయటకు పోకూడదు అని రచ్చ చేస్తుంది ధాన్యలక్ష్మీ. రాజ్, కావ్య నచ్చ జెప్పాలని వినిపించుకోదు ధాన్యలక్ష్మీ.
నాకు నచ్చలేదు

మీరు చేసేది తప్పు. నాకు నచ్చలేదు. అంతగా సమాజ సేవ చేయాలనుకుంటే మాకు రావాల్సిన ఆస్తి మాకు రాసిచ్చి మిగతాదాంతో ఏమైనా చేసుకోండి అని ధాన్యలక్ష్మీ అంటుంది. అంటే కలిసి ఉన్నవాళ్లను ముక్కలు చేయమంటావా అని సీతారామయ్య అంటాడు. ఆస్తిని పంచడం అంటే విడిపోవడం పిన్ని ఆలోచించు అని రాజ్ అంటాడు.
ఆస్తులు పంచరు కానీ తేరగా దానం చేస్తానంటే ఎలా అని నోరు జారుతుంది ధాన్యలక్ష్మీ. ఆస్తిని పంచుతారో లేదా ట్రస్ట్‌ను ఆపుతారో తేల్చుకోండి అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతుంది ధాన్యలక్ష్మీ. తర్వాత సీతారామయ్య బాధగా ఉంటాడు. ఇందిరాదేవితో ధాన్యలక్ష్మీ గురించి మాట్లాడుకుంటారు.
నేను ఇదివరకు ట్రస్ట్ పెట్టాలనుకున్నాను. కానీ, బతుకు పోరాటంలో పెట్టలేకపోయాను. నా మనవడి వల్ల నా ఆశయం నెరవేరుతుందనుకున్నా. కానీ, అయిన వాళ్లే అడ్డు పడతారనుకోలేదు అని సీతారామయ్య అంటాడు. రాజ్ ఎలాగైనా నీ కల నెరవేర్చుతాడు, ధాన్యలక్ష్మీని ఎలాగైనా ఒప్పుస్తాడు అని ఇందిరాదేవి అంటుంది.
ధాన్యలక్ష్మీ రచ్చ
ఇంతలో ఇంటికి అప్పు, కల్యాణ్ వస్తారు. మనం ఎంక్వైరీలు మొదలుపెట్టామని తెలిస్తే అంతా తిడతారు. జాగ్రత్తగా ఉండండి అని అప్పుతో కల్యాణ్ అంటాడు. ఇంతలో ప్రకాశం డల్‌గా ఉండటంతో కల్యాణ్, అప్పు అడుగుతారు. దాంతో రాజ్, కావ్య ట్రస్ట్ గురించి, ధాన్యలక్ష్మీ ఆస్తి కోసం చేసిన రచ్చ గురించి చెబుతాడు ప్రకాశం.
ఇంతలో ధాన్యలక్ష్మీ వస్తే కల్యాణ్ రివర్స్ అవుతు ఫైర్ అవుతాడు. ట్రస్ట్ అంటే నమ్మకం అమ్మా. అది స్వార్థం కాదు. అన్నయ్య, వదిన చేసేది మన కోసమే. మనం పోయినా మన గురించి పది మంది గుర్తుంచుకోడానికే అని కల్యాణ్ అంటాడు. దీనికి డబ్బు పిచ్చి పట్టిందని ప్రకాశం అంటాడు. భవిష్యత్ కోరుకోవడం తప్పు కాదు మంచి పనికి అడ్డు చెప్పడం తప్పు అని కల్యాణ్ అంటాడు.
{{/usCountry}}ఇంతలో ధాన్యలక్ష్మీ వస్తే కల్యాణ్ రివర్స్ అవుతు ఫైర్ అవుతాడు. ట్రస్ట్ అంటే నమ్మకం అమ్మా. అది స్వార్థం కాదు. అన్నయ్య, వదిన చేసేది మన కోసమే. మనం పోయినా మన గురించి పది మంది గుర్తుంచుకోడానికే అని కల్యాణ్ అంటాడు. దీనికి డబ్బు పిచ్చి పట్టిందని ప్రకాశం అంటాడు. భవిష్యత్ కోరుకోవడం తప్పు కాదు మంచి పనికి అడ్డు చెప్పడం తప్పు అని కల్యాణ్ అంటాడు.
{{/usCountry}}కావాలంటే రాజ్ వాళ్ల ఆస్తిని ఇచ్చుకోమనండి అని ధాన్యం అంటుంది. అసలు మన భాగం ఎక్కడిదమ్మా. తాతయ్య సంపాదించాడు కాబట్టి మన ఆస్తి అంటున్నాం. కానీ, పెరిగిన ఆస్తిలో మన శ్రమ ఏమైనా ఉందా. నేను ఏమైనా సంపాదించానా. అన్నయ్య మాత్రం రాత్రి పగలు కష్టపడ్డారు అని ధాన్యంపై కోప్పడుతాడు కల్యాణ్. నేను వాస్తవం మాట్లాడుతున్నాను అని తన మాట మీద నిలబడుతుంది ధాన్యం.
కఠినంగా కనిపించే అమాయకురాలు
ఎవరు చెప్పిన వినను అని వెళ్లిపోతుంది. మరోవైపు ధాన్యలక్ష్మీ గురించి కావ్య ఆలోచిస్తుంది. చిన్నత్తయ్య కఠినంగా కనిపించే అమాయకురాలు. ట్రస్ట్‌కి వాళ్ల ఆస్తి పోతుందనేగా చిన్నత్తయ్య భయం. సగం ఆస్తి ట్రస్ట్‌కు కేటాయించి మిగిలిన సగ భాగంలో మన వాట ఏదో కల్యాణ్ పేరు మీద రాసేస్తే. అప్పుడు చిన్నత్తయ్య భయపడదు కదా అని కావ్య అంటుంది.
మరి మన పరిస్థితి అని రాజ్ అంటాడు. మనకు వ్యాపారం ఉంది. టాలెంట్‌తో సంపాదించుకుందామని. ఎన్ని అడ్డంకులు వచ్చిన ట్రస్ట్ ఆగకూడదు అని కావ్య అంటుంది. డబ్బు కోసం గొడవ పడే ఆడవాళ్లు ఉన్నారు. కానీ నువ్వు చాలా గొప్పదానివి అని కావ్యను మెచ్చుకుంటాడు రాజ్.
మరోవైపు శంకర్‌కు కాల్ చేసిన అప్పు హాస్పిటల్‌లో కావ్య పాపపై అటాక్ జరిగింది తెలుసుకోమని, అది మంత్రి గారు కాదు వేరే వాళ్లు చేయించారని నా డౌట్, ఆ మనిషి ఎవరో నేను తెలుసుకోవాలి, సీసీ కెమెరాలో రౌడీలను గుర్తించి పట్టుకోవాలి, వాళ్ల ద్వారా అది చేయించిన వాళ్లను తెలుసుకోవాలి, అఫిషియల్‌గా కాకుండా టాస్క్ ఫోర్స్ వాళ్లతో సీక్రెట్‌గా చేయించండి అని అప్పు చెబుతుంది.
అప్పు సీక్రెట్ ప్లాన్
వాళ్లు దొరికాక పోలీస్ స్టేషన్‌కి కాకుండా సీక్రెట్‌గా ఇంట్రాగేట్ చేస్తుంటాం కదా. అక్కడ పెట్టి నిజం రాబట్టాలని అప్పు అంటుంది. దానికి శంకర్ సరే అంటాడు. అదంతా విన్న కల్యాణ్ వచ్చి మళ్లీ ఇదంతా ఏంటని అడుగుతాడు. అప్పు చెప్పేది వినడు. మినిస్టర్ ఇంట్లో రుద్రాణి ఆంటీ ఉంది. మన మాటలు వింది. మనం బయటకు వెళ్లగానే వెళ్లిపోయింది అని అప్పు అంటుంది.
ఒకవేళ మినిస్టర్‌కు బిడ్డలను మార్చే ఐడియా రుద్రాణి ఇచ్చే ఉంటుంది. మన ఇంట్లో మనిషే మన శత్రువు అయితే ఏం జరుగుతుందో ఊహించలేం. నేను ఎక్కడికి వెళ్లట్లేదు. ఇంట్లో నుంచే చేస్తున్నా అని అప్పు అంటుంది. మరుసటి రోజు ఉదయం కల్యాణ్ పేరు మీద సగం ఆస్తి రాశామని రాజ్ చెబుతాడు.
కానీ, కల్యాణ్, అప్పు కిడ్నాప్ అయ్యారు. ఆస్తి పంచి ఇవ్వాల్సి వస్తుందనే రాజ్ కిడ్నాప్ చేయించాడు అని నిందలు వేస్తుంది ధాన్యలక్ష్మీ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.