బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అప్పుకు ఎస్సై ధనుంజయ్ కాల్ చేసి హాస్పిటల్‌లో అటాక్ చేసిన రౌడీలను ఏం చేద్దాం, అందులో ఒకడు నోరు జారి ఓ లేడి అన్నాడు, కానీ, ఆమె పేరు తెలియదంటున్నాడు అని చెబుతాడు. సరేనని అదంతా విన్న కల్యాణ్‌తో అప్పు కూచీ.. అని సాగదీస్తుంది.
మినిస్టర్ ఫంక్షన్‌కు

అంత సాగదీయకు అర్థమైంది. కానీ, ముందు మినిస్టర్ ఇంటికి వెళ్లి ఫంక్షన్‌కి వెళ్లి తర్వాత అక్కడికి వెళ్దామని కల్యాణ్ అంటే.. లేదని చాలా లేట్ అవుతుందని, రౌడీల విషయం సీఐకి తెలిస్తే సమస్య అవుతుందని అప్పు అంటుంది. దాంతో సరేనని కల్యాణ్ ఒప్పుకుంటాడు.
మరోవైపు అంతా మినిస్టర్ ఇంటికి బారసాలకు వెళ్లేందుకు రెడీ అవుతారు. కావ్య పాపకు ఏ పేరు పెడదామని ఇందిరాదేవి అడుగుతుంది. హాలీవుడ్ హీరోయిన్ పెడదామని ప్రకాశం అంటే.. ఏ హుడ్డు లేదు.. చక్కగా సాంప్రదాయంగా ఉండాలని ఇందిరాదేవి అంటే.. అలా ఉండాలంటే ఒకే పేరు ఉంది. ఇందిరాదేవి. నీ పేరే చక్కగా ఉందిగా అని రాజ్ అంటాడు.
నాకు నచ్చట్లేదురా ఆ పేరు. ఇది పెద్దయ్యాకా ముసలిదాని పేరు పెట్టారని నన్ను, నిన్ను తిట్టుకుంటుందని ఇందిరాదేవి అంటుంది. ఇందిరాదేవిని షార్ట్ కట్ చేసి ఇందుగా పెడదామని రాజ్ అంటాడు. ఇంతలో కల్యాణ్, అప్పు వచ్చి కాస్తా బయటకు వెళ్తున్నామని, గుడికి వెళ్తున్నామని అంటారు. ధాన్యలక్ష్మీ నోటితోనే గుడికి వెళ్లమని చెప్పేలా చేసుకుంటారు.
గుడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్
అంతా మినిస్టర్ ఫంక్షన్‌కు వెళ్తారు. అదంతా చూసిన రేఖ తల్లి రుద్రాణికి కాల్ చేసి ఒక గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అని చెబుతుంది. ఇంట్లోవాళ్లు ఫంక్షన్‌కు.. అప్పు, కల్యాణ్ గుడికి వెళ్తున్నామని చెప్పి రౌడీలను ఎంక్వైరీ చేసేందుకు వెళ్తున్నారని రేఖ అంటుంది.
{{/usCountry}}అంతా మినిస్టర్ ఫంక్షన్‌కు వెళ్తారు. అదంతా చూసిన రేఖ తల్లి రుద్రాణికి కాల్ చేసి ఒక గుడ్ న్యూస్, బ్యాడ్ న్యూస్ అని చెబుతుంది. ఇంట్లోవాళ్లు ఫంక్షన్‌కు.. అప్పు, కల్యాణ్ గుడికి వెళ్తున్నామని చెప్పి రౌడీలను ఎంక్వైరీ చేసేందుకు వెళ్తున్నారని రేఖ అంటుంది.
{{/usCountry}}అది కూడా గుడ్ న్యూసే. వాళ్ల చావుకు కాస్తా టైమ్ ఉందనుకున్నా. కానీ లేదు. అప్పు వాళ్లు మినిస్టర్ ఇంటికి తిరిగి రారు. నేరుగా స్మశానానికే వెళ్తారు, శాశ్వతంగా పైకి వెళ్తారు. ఈరోజు చావు ఎలా ఉంటుందో చూస్తారు అని రుద్రాణి అంటుంది. మరోవైపు రౌడీల దగ్గరికి అప్పు, కల్యాణ్ వెళ్తారు. వాళ్లు ఎంత అడిగిన చెప్పలేదన్నారుగా. అయితే, ఒక చిన్న గేమ్ ఆడుదామని అప్పు అంటుంది.
రౌడీల దగ్గరికి వెళ్లి ధనుంజయ్‌ను తిట్టి రౌడీలకు నీళ్లు ఇప్పిస్తుంది అప్పు. మిమ్మల్ని టార్చర్ పెట్టడం నా ఉద్దేశం కాదు. మిమ్మల్ని రక్షించడానికి వచ్చాం. మినిస్టర్ తనకు సంబంధం లేదని చేతులెత్తేశాడు. అటు ఇటు తిరిగి ఈ కేసులో మీరు ఇరుక్కుంటారు అని అప్పు అంటుంది. కోర్టులో సబ్‌మిట్ చేసే 14 ఏళ్ల జైలు శిక్ష వేస్తే అప్పుడు బుద్ధి వస్తుందని ధనుంజయ్ అంటాడు.
అప్పు స్కెచ్
ఎవరో తప్పు చేస్తే వీళ్లకు శిక్ష వేయడం ఏంటీ, కేవలం డబ్బు కోసం చేశారు. వీళ్లు జైలుకు వెళ్తే కాంట్రాక్ట్ ఇచ్చినవాళ్లు ఏమైనా చూసుకుంటారా. వాళ్ల పిల్లలను ఎవరు చూస్తారు అని గేమ్ ఆడుతుంది అప్పు. అమ్మ పొట్టి భలే స్కెచ్ వేశావ్ అని కల్యాణ్ అనుకుంటాడు. ఇంతలో ఒక రౌడీ తన ఫోన్ ఇప్పిస్తే కాంట్రాక్ట్ ఇచ్చిన లేడి ఎవరో చెబుతానని రుద్రాణి ఫొటో చూపిస్తాడు.
అది చూసి అప్పు, కల్యాణ్ షాక్ అవుతారు. రుద్రాణి అత్త ఇదంతా చేసిందా అని కల్యాణ్ అంటాడు. నాకు మొదటి నుంచి ఆమెపైనే అనుమానంగా ఉందని చెప్పానుగా అని అప్పు అంటుంది. రౌడీల అడ్రస్ తీసుకుని వదిలేయమని అప్పు వెళ్లిపోతుంది. మరోవైపు అతిథులను మంత్రి ఆహ్వానిస్తుంటాడు. రాజ్, కావ్య వాళ్లు వస్తారు.
పాప ఆరోగ్యం గురించి కావ్య అడుగుతుంది. పాపను ఎత్తుకుంటుంది కావ్య. తులసి అలానే చూస్తూ ఎమోషనల్ అవుతుంది. కావ్య ఏంటని అడిగితే.. ఇవి ఆనంద బాష్పాలు అని, కావ్య గొప్పదనం గురించి చెబుతుంది తులసి. మేము ముందుగా మీ ఫంక్షన్‌కి రావాలని అనుకోలేదు, కానీ, మంత్రి గారు పాప విషయంలో తనతో తానే పోరాటం చేశారని, భార్య కోసం అలా చేశారే తప్పా తప్పుడు మనిషి కాదని ఒప్పించారని అపర్ణ, సుభాష్‌లు చెబుతారు.
అప్పు, కల్యాణ్ కారుకు యాక్సిడెంట్
దాంతో రాజ్‌కు చేతులెత్తి నమస్కరించి మీ రుణం ఎప్పటికైనా తీర్చుకుంటానని మంత్రి ధర్మేంద్ర అంటాడు. పాపను ఊయలలో వేసే సమయమైందని పంతులు చెప్పడంతో బారసాల చేస్తారు. రాహుల్, రేఖ, స్వప్న కూడా వస్తారు. కావ్య చేత్తో ఊయలలో వేయమంటుంది తులసి. కావ్య వద్దంటుంది. ధర్మేంద్ర, తులసి బతిమిలాడటంతో కావ్యనే పాపను ఊయలలో వేస్తుంది.
మరోవైపు అప్పు, కల్యాణ్ కారును వ్యాన్ ఎదురుగా వచ్చి గుద్దేస్తుంది. కూచీ అంటూ అప్పు అరుస్తుంది. ఓ రౌడీ రుద్రాణికి కాల్ చేసి అప్పు, కల్యాణ్ కారుకు యాక్సిడెంట్ చేశానని, ఇద్దరు చనిపోయారు అని చెబుతాడు. అది విన్న రుద్రాణి సంతోషిస్తుంది. దుగ్గిరాల ఇంట్లో ఇద్దరి జీవితాలు ముగిసిపోయాయి, ఇక మిగిలింది రాజ్, కావ్య మీరే అని అనుకుంటుంది.
మంత్రి ఇంట్లో రుద్రాణి కనిపిస్తే ఇందిరాదేవి తిడుతుంది. ఒంటరిగా బయట బతకలేకపోతున్నాని డ్రామా ఆడుతుంది రుద్రాణి. ఇంతలో చావు నుంచి తప్పించుకుని వచ్చిన అప్పు, కల్యాణ్ ఆపు నీ నాటకాలు అంటుంది. బిడ్డలను మార్చింది, ఈరోజు మిమ్మల్ని యాక్సిడెంట్ చేసి చంపాలని చూసింది ఈ రుద్రాణినే అని అప్పు నిజం బయటపెడుతుంది.
చెప్పుతో కొట్టిన కావ్య
దాంతో కోపంగా రుద్రాణిని చెప్పుతో కొడుతుంది కావ్య. అది చూసి రాహుల్, రేఖ ఖంగుతింటారు. బాగా అయిందని అపర్ణ వాళ్లు అనుకుంటారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.