బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 962వ ఎపిసోడ్ రుద్రాణి దారుణాలు మరో స్థాయికి చేరతాయి. ఆ ఫ్యామిలీ నుంచి ఆస్తిని లాక్కోవడం కాదు.. అసలు ఆ దుగ్గిరాల వంశమే లేకుండా చేయడానికి కుట్ర పన్నుతుంది. శ్రీశైలం టూర్ కు సిద్ధమవుతున్న కుటుంబం పెను ప్రమాదంలో పడబోతోంది.
మంత్రి ఇంటికి రుద్రాణి.. బండ బూతులు తిట్టిన ఫ్యామిలీ

బ్రహ్మముడి సీరియల్ శనివారం (ఫిబ్రవరి 21) ఎపిసోడ్ మంత్రి ఇంటికి రుద్రాణి వచ్చే సీన్ తో మొదలవుతుంది. తమ పాపకు దుర్గ అనే పేరు పెట్టి మంత్రి దంపతులతోపాటు దుగ్గిరాల ఫ్యామిలీ అందరూ హ్యాపీగా ఉన్న సమయంలో ఆమె అక్కడికి వస్తుంది.
తనను క్షమించమని ప్రాధేయపడుతుంది. కానీ ఇందిరా దేవితోపాటు అక్కడున్న అందరూ ఆమెను బండ బూతులు తిడతారు. అసలు నువ్వు ఆడదానివేనా, మనసుందా.. ఇంకా ఏం ముఖం పెట్టుకొని వచ్చావంటూ తిడతారు. రుద్రాణి కంటతడి పెడుతూ మరో నాటకానికి తెరతీస్తుంది.
రుద్రాణి బండారం బయటపెట్టిన అప్పు
ఇంతలో అప్పు, కల్యాణ్ అక్కడికి వస్తారు. ఇక నీ నాటకం ఆపు రుద్రాణి అంటూ అప్పు ఎంట్రీ ఇస్తుంది. అసలు దీనంతటికీ కారణం రుద్రాణియే.. పాపను మార్చింది మంత్రిగారే అయినా దాని వెనుక ఉన్నది ఈ ఈమెనే.. మంత్రిగారు నిజం చెప్పకపోవడంతో డిపార్ట్‌మెంట్ సాయంతో నేను అసలు నిజం తెలుసుకున్నాను..
పాపను చంపాలని చూసింది, మమ్మల్ని కిడ్నాప్ చేయించింది.. ఇప్పుడు యాక్సిడెంట్ లో మమ్మల్ని చంపాలని చూసింది ఈవిడే అని అప్పు చెబుతుంది. తాను మారిపోయానని చెబితే తాను నమ్మి ఆమ పేరు బయట పెట్టలేదని, ఇప్పుడు ఇంత పని చేస్తుందని ఊహించలేదని మంత్రి ధర్మేంద్ర అంటాడు.
పుట్టగతులు ఉండవంటూ తిట్టిన రాజ్
దీంతో అందరి ఆవేశం రెట్టింపవుతుంది. చివరికి రాజ్ కూడా నువ్వు ఆడదానివేనా.. నీకు పుట్టగతులు ఉండవంటూ రుద్రాణిని తిడతాడు. ఇంకా ఏం చేస్తే నీ పగ చల్లారుతుంది అంటూ నిలదీస్తాడు. అటు సీతారామయ్య కూడా ఓ ఆడపిల్లను పెంచుతున్నామని అనుకున్నాం కానీ.. పాముకు పాలు పోసి పెంచుతున్నామని అనుకోలేదని అంటాడు.
రుద్రాణిని చెప్పుతో కొట్టిన కావ్య
{{/usCountry}}దీంతో అందరి ఆవేశం రెట్టింపవుతుంది. చివరికి రాజ్ కూడా నువ్వు ఆడదానివేనా.. నీకు పుట్టగతులు ఉండవంటూ రుద్రాణిని తిడతాడు. ఇంకా ఏం చేస్తే నీ పగ చల్లారుతుంది అంటూ నిలదీస్తాడు. అటు సీతారామయ్య కూడా ఓ ఆడపిల్లను పెంచుతున్నామని అనుకున్నాం కానీ.. పాముకు పాలు పోసి పెంచుతున్నామని అనుకోలేదని అంటాడు.
రుద్రాణిని చెప్పుతో కొట్టిన కావ్య
{{/usCountry}}ఇదంతా వింటూ కావ్య ఆవేశంతో రగిలిపోతుంది. చివరికి అందరి ముందు చెప్పుతో రుద్రాణిని కొడుతుంది. దీంతో ఆమెకు తగిన శాస్తి జరిగిందని అందరూ అనుకుంటారు. తన కన్న బిడ్డను చంపాలని చూసినా ఏమీ చేయకుండా వదిలేశామని, ఇప్పుడు వాళ్లను చంపాలని చూస్తావా.. నీకు నా మీద పగ ఉంటే మమ్మల్ని సాధించు.. ఎందుకు వాళ్ల జోలికి వస్తావని అంటుంది.
ఇక నువ్వు ఇక్కడే కాదు ఈ ఊళ్లోనే ఉండకూడదని అందరూ చెబుతారు. ఒకవేళ కనిపిస్తే అక్కడే చంపేస్తామని సుభాష్ వార్నింగ్ ఇస్తాడు. చివరికి రాహుల్ కూడా నాటకం మొదలుపెడతాడు. తల్లిని ఇంటి బయటకు లాక్కెళ్తాడు.
ఫ్యామిలీ మొత్తాన్ని చంపేద్దామన్న రాహుల్, రేఖ
మంత్రి ఇంట్లో జరిగిన అవమానాన్ని, కావ్య చెప్పుతో కొట్టిన సందర్బాన్ని గుర్తు చేసుకొని అవమాన భారంతో రుద్రాణి రగిలిపోతుంది. చివరికి తనను తాను చంపుకోవడానికి కత్తి తీసుకుంటుంది. అప్పుడే రాహుల్, రేఖ ఎంట్రీ ఇస్తారు. బాగుంది మామ్.. మమ్మల్ని ఏదో చేస్తావనుకుంటే ఇప్పుడు నీ దారి నువ్వు చూసుకుంటున్నావా అని నిలదీస్తారు.
మరి ఏం చేయమంటారు.. ఇంతటి అవమానం జరిగిన తర్వాత ఇంకా ఏం చేయాలని రుద్రాణి అంటుంది. ఈ అవమానానికి ఫ్యామిలీ మొత్తాన్ని చంపాలన్న కోపం వస్తోంది అని అనగానే మరి చంపేద్దాం అని రాహుల్, రేఖ కూడా అంటారు. నువ్వు ఆ ప్లాన్ వేస్తుండు.. మేము ఇంట్లో చేయాల్సిన ఓ చివరి డ్రామా ఒకటుంది అని రేఖ అంటుంది.
దుగ్గిరాల ఫ్యామిలీ శ్రీశైలం టూర్
ఇటు ఇంట్లో రుద్రాణి చేసిన పని తలుచుకొని అందరూ బాధపడుతుంటారు. దానిని వదిలేసి తప్పు చేశామని అనుకుంటారు. కానీ రుద్రాణి ఇవన్నీ చేసినట్లుగా సాక్ష్యాధారాలు లేవు.. అవన్నీ మనసుకు సంబంధించినవే.. కోర్టును నమ్మించే ఆధారాలు కావాలి.. ఎప్పటికప్పుడు ఆ సాక్ష్యాలు లేకుండా ఆమె జాగ్రత్త పడింది అని అప్పు చెబుతుంది. ఇదే సమయంలో తాము ఇంట్లో నుంచి వెళ్లిపోతున్నామని రాహుల్, రేఖ కొత్త డ్రామా మొదలుపెడతారు. ఇంత జరిగిన తర్వాత ఇంట్లో ఉండే అర్హత లేదని అంటారు.
అటు దుగ్గిరాల ఫ్యామిలీ శ్రీశైలానికి వెళ్దామని ప్లాన్ చేస్తుంది. ఈ సమయంలో ఎందుకు అని కావ్య అంటున్నా రాజ్ మాత్రం వెళ్దామంటాడు. ఇదే విషయాన్ని రుద్రాణికి చెబుతుంది రేఖ. అందరినీ ఒకేసారి కైలాసానికి పంపడానికి ఇంతకు మించిన అవకాశం ఏముంటుంది అని రుద్రాణి అంటుంది. ఆ టూర్లోనే వాళ్లను చంపేద్దామని ప్లాన్ చేస్తుంది. అంతటితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.