Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజు రిలాక్స్ అవుతుంటే ఇందు కాఫీతో వస్తుంది. గోడపై ఉన్న బల్లిని తనను బావను ఒక్కటి చేసేందుకు ఏదైనా చేయొచ్చుగా అని ఇందు అంటుంది. బల్లి సౌండ్ చేస్తుంది. ఏంటా సౌండ్. నీ సౌండ్ నాకు అర్థం కావట్లేదు అని ఇందు అంటుంది.
ఇందు రాజు రొమాన్స్

ఇంతలో రాజు ఏయ్ అక్కడ ఏం చేస్తున్నావ్, ఎవరితో మాట్లాడుతున్నావ్ అని అడుగుతాడు. ఇందు వచ్చి నీతోనే బావ అంటూ గారాలు పోతుంది ఇందు. బావ అని పిలవడం డైజెస్ట్ కావట్లేదని రాజు కంగారుపడతాడు. నువ్వు నిజంగా నా మరదలు అయితే అలా పిలిస్తే ఆనందంగా ఫీల్ అవుతాను. కానీ మనది తాత్కాలిక బంధం. అందుకే అసహ్యంగా ఉంది. పైగా వెటకారంగా ఉన్నట్లుందని రాజు అంటాడు.
ఇంతలో రాజుపై బల్లి పడుతుంది. దాంతో భయపడి ఇందుపైకి ఎక్కుతాడు రాజు. రాజును తన్మయంతో చూస్తుంది ఇందు. తర్వాత రాజు తేరుకుని ఉలిక్కిపడి కిందకు దిగుతాడు. నా మీద ఇంత ప్రేమ చూపిస్తున్నావ్ ఏంటీ బావ అని ఇందు అంటే.. అదంతా తూచ్ అని, బల్లి మీద భయంతో అలా చేశానని రాజు తటాపటాయిస్తాడు. మళ్లీ ఇందు బల్లి బల్లి అనడంతో రాజు తెగ వణికిపోతాడు.
ఇందు నవ్వుతూ వెళ్లిపోతుంది. తర్వాత ఐశ్వర్య బయటకు వెళ్తుంటే.. ఇందు పిలిచి ఈ టైమ్‌లో ఎక్కడికి అని అడుగుతుంది. ఆ డ్రెస్ ఏంటీ, అందరు వక్రబుద్ధితో చూస్తారు. ఎక్కడికి వెళ్తున్నావో చెప్పి తీరాలి అని ఇందు అంటుంది. నీకు చెప్పాల్సిన అవసరం లేదని ఐషు అంటే.. తన పర్మిషన్ తీసుకుని వెళ్లాలని రాజు అంటాడు.
రేఖ చేతుల్లో ఏం లేదు
తనేం నా బాస్ కాదు. నాకు నచ్చినట్లుగా చేస్తాను అని సెటైర్లు వేస్తుంది ఐశ్వర్య. నువ్వు చేసే పనులు పద్ధతిగా లేనప్పుడు నేను అడుగుతాను. నిన్న రాత్రి తాగి రాలేదా ఇంటికి అని ఇందు నిజం బయటపెడుతుంది. ఇక్కడ ఎంతమంది తాగట్లేదు అని ఐశ్వర్య అంటుంది. తాగితే పర్లేదు. ఎవరో డ్రాప్ చేశారు అని ఇందు అంటుంది. అందరిపై ఐశ్వర్య అరుస్తుంది.
{{/usCountry}}తనేం నా బాస్ కాదు. నాకు నచ్చినట్లుగా చేస్తాను అని సెటైర్లు వేస్తుంది ఐశ్వర్య. నువ్వు చేసే పనులు పద్ధతిగా లేనప్పుడు నేను అడుగుతాను. నిన్న రాత్రి తాగి రాలేదా ఇంటికి అని ఇందు నిజం బయటపెడుతుంది. ఇక్కడ ఎంతమంది తాగట్లేదు అని ఐశ్వర్య అంటుంది. తాగితే పర్లేదు. ఎవరో డ్రాప్ చేశారు అని ఇందు అంటుంది. అందరిపై ఐశ్వర్య అరుస్తుంది.
{{/usCountry}}తాగి తిరుగుతూ అలా డ్రాప్ చేస్తే నలుగురు ఏమనుకుంటారు. ఈ ఇంటికి పరువు ఉంది. ఇష్టమొచ్చినట్లు చేస్తానంటే ఊరుకోను అని ఇందు అంటుంది. తను అలా అంటుంటే సైలెంట్‌గా ఉంటారేంటీ. ఇదేంటీ వార్నింగ్ ఇస్తుంది. పెత్తనం అంతా ఇందుకు ఇచ్చారా అని రేఖను అడుగుతుంది ఐశ్వర్య. తను మాత్రం ఏం చెబుతుంది. తన చేతుల్లో ఏం లేదుగా అని రాజు అంటాడు.
నువ్వెవరు చెప్పడానికి అని రాజును తక్కువ చేస్తే అపర్ణ కోప్పడుతుంది. అపర్ణ మీదకు కోపంగా వెళ్తుంది ఐశ్వర్య. నేను ఏం చేయగలనో మీ రేఖ ఆంటీకి బాగా తెలుసు అని రాజు అంటాడు. అంతేగా పిన్ని అని రాజు అంటాడు. అసలు నువ్వు అని ఐశ్వర్య అంటే.. ఐషు.. ఇక చాలు అని వారిస్తుంది రేఖ. అర్థమైందిగా. ఇక నుంచి రేఖ పిన్నితోపాటు అంతా ఇందు చెప్పినట్లు వినాలి. తనను చూసుకుంటున్న నేను చెప్పినట్లు వినాలి అని రాజు అంటాడు.
ఐశ్వర్య కారు కీస్ లాక్కున్న ఇందు
అసలు వినకపోతే ఏం చేస్తారు అని ఐశ్వర్య అంటే.. కారు కీస్ లాక్కుంటుంది ఇందు. ఇకనుంచి నీకు కారు వాడే అర్హత లేదు. ఎందుకు వాడుతున్నావ్ ఏంటీ అనేది మొత్తం చెప్పాలి. ఒక్క రూపాయి బయటకు తీసుకెళ్లిన సమాధానం చెప్పాలి. ఎక్కడికి వెళ్లడానికి వీళ్లేదు. ఇంట్లోనే ఉండు అని ఆర్డర్స్ వేసి వెళ్లిపోతుంది ఇందు. ఇందు చెప్పినట్లు చేయమని రాజు వెళ్లిపోతాడు.
రేఖ ఆంటీ ఇది మీరేనా. ఎందుకు సైలెంట్‌గా ఉన్నారు. ఇందుకు భయపడుతున్నారా. ఎందుకు భయపడుతున్నారు. మీరు ఇలాగే ఉంటే మీ చేతుల్లోనుంచి కూడా కారు కీస్ తీసుకుని ఇందు ఆర్డర్స్ వేస్తుందని, అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని అంటుందని ఐశ్వర్య వెళ్లిపోతుంది. రాజు, ఇందులకు ఎందుకు భయం చెప్పలేకపోతున్నావ్ ఎందుకు అని భ్రమరాంబ అడుగుతుంది.
అల్లుడు నిన్ను ఏమైనా అని శేషు డౌట్ పడితే.. ఏం చేస్తున్నానో నాకు తెలుసు. ఎవరిని ఎప్పుడు ఏం చేయాలో నాకు బాగా తెలుసు. చేస్తాను అని రేఖ వెళ్లిపోతుంది. చెల్లెమ్మ కళ్లలో నాకు భయం కనిపిస్తుంది. ఏదో జరుగుతుంది భ్రమరం అని శేషు డౌట్ పడతాడు. బయటకెళ్లిన ఐశ్వర్యకు క్యాబ్స్ బుక్ కావు. అప్పుడే లక్కీ బైక్‌పై వస్తాడు.
ఐశ్వర్యను పార్టీకి తీసుకెళ్లిన లక్కీ
లిఫ్ట్ కావాలంటే ఇవ్వడానికి రెడీగా ఉన్నాను అని లక్కీ అంటాడు. ఐశ్వర్య కోపంగా వెళ్తుంది. అటుగా వెళ్తున్నా. నాకు చీకటి అంటే భయం, అసలే అమవాస్య కదా అని లక్కీ అంటాడు. నాకు నైట్ టైమ్ బయటకు వెళ్లాలంటే భయం వస్తావా అని లక్కీ అంటాడు. ఇదే మంచి అవకాశం. నువ్వు ఓవర్ చేయనంటే నిన్ను కూడా పార్టీకి తీసుకెళ్తాను అని ఐశ్వర్య అంటుంది.
దాంతో లక్కీ సంతోషిస్తాడు. ఐశ్వర్యను పార్టీకి తీసుకెళ్తాడు లక్కీ. మంచిగా మాటలు కలిపి నా ట్రాక్‌లోకి తెచ్చుకోవాలని లక్కీ అనుకుంటాడు. నువ్వు ఇంట్లో అవమానాలు పడటం నాకు నచ్చలేదు. నేనున్నాగా. నీకు ఏం కావాలన్నా అడుగు నేను కళ్లముందు పెడతాను అని లక్కీ అంటాడు. ఆ ఇంట్లో నీకే దిక్కులేదని ఐశ్వర్య అంటుంది.
ఆ ఇంట్లో నాకు ఎంత విలువ ఉందో నీకు అంతే విలువ ఉంది. నీకు కోపం రావచ్చు కానీ ఇదే నిజం కదా అని లక్కీ అంటాడు. అవును నిజమే అని ఐశ్వర్య అంటుంది. నువ్వు ఒప్పుకుంటే మనం కలిసిపోవచ్చుగా అని లక్కీ అంటే.. ఏంటీ అని కోపంగా అంటుంది. అదే ఫ్రెండ్సుగా ఉండొచ్చుగా అని మాట మార్చేస్తాడు లక్కీ.
ఇంటికి తాగొచ్చిన ఐశ్వర్య
మరోవైపు అపర్ణ, రాజు తింటారు. అపర్ణకు కర్రీ వేస్తాడు రాజు. తనకోసం తినమంటాడు. తర్వాత ఇంటికి తాగి వస్తుంది ఐశ్వర్య. ఇంట్లో ఏం జరిగిన తెలుసుకోలేని అమాయకపు చక్రవర్తివి అని రేఖను అంటుంది ఐశ్వర్య. వీళ్ల పెళ్లి కాలేదంటే ఎవరు నమ్మట్లే అని ఐషు అంటే.. మ్యారేజ్ సర్టిఫికేట్ చూపించాంగా అని రాజు అంటాడు.
ఎహే.. చూపించావులే. అసలు మీ ప్లాన్ ఏంటో ఎవరికి అర్థం కావట్లే.. నీ ప్లాన్ ఏంట్రా అని రాజు కాలర్ పట్టుకుంటుంది ఐశ్వర్య. మత్తు ఎక్కువై పడిపోతుంది. ఐశ్వర్య చెప్పేది నిజమా అని భ్రమరాంబ డౌట్ పడుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.