Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కన్నవాళ్ల ప్రేమ కావాలా, ఖరీదైన ఇల్లు కావాలా అని రాజును తండ్రి చలపతి అడుగుతాడు. తల్లి కూడా రమ్మంటుంది. నాన్నను జాగ్రత్తగా తీసుకెళ్లు అని తల్లికి చెబుతాడు రాజు. దానికి అంతా షాక్ అవుతారు.
కన్నకొడుకు అంటే నీలా ఉండాలిరా

నువ్వు ఎవరిని కాదంటున్నావో అర్థమవుతందా అని తల్లి అంటుంది. కన్నకొడుకు అంటే నీలా ఉండాలిరా. నీలాంటి వాడిని కన్నందుకు ఆ తల్లిదండ్రులు ప్రతిరోజు ఏడుస్తూ ఉండాలి. వీడు ఈ కోట్ల ఆస్తి చూడగానే మన కొడుకు అని మర్చిపోయాడు. వీడు పూర్తిగా మారిపోయాడు. మనల్ని బికారీలుగా చూస్తున్నాడు. వీడి మనసు స్వార్థంతో నిండిపోయిందని చలపతి కన్నీళ్లు పెట్టుకుంటాడు.
ఇన్నేళ్ల మా ప్రేమకు, నిరీక్షణకు నువ్విచ్చే ప్రతిఫలం ఇదారా అని చలపతి అంటాడు. నువ్వు లేకుండా ఉండలేమురా అని తల్లి అంటుంది. మనం వాడి కాళ్లు పట్టుకున్న రాడు. వాడికి కావాల్సింది కన్నవాళ్లు కాదు ఈ కోట్ల ఆస్తి. ఈరోజు నువ్వు తీసుకున్న నిర్ణయం ఏదో ఒకరోజు నీకు తప్పు అని తెలుస్తుంది. అది తెలిసిన రోజు నీకు ఈ తండ్రి ఉండడురా అని చలపతి అంటాడు.
నేను చచ్చిన తర్వాత నాకు తలకొరివి పెట్టడానికి కూడా నువ్వు రాకూడదు అని చలపతి అంటాడు. తర్వాత ఇందుతో ఒకప్పుడు నిన్ను చూసి మా ఇంటి కోడలు అయితే చాలా బాగుండు అనిపించిందమ్మా. కానీ, ఇప్పుడు నువ్వు కోడలివి అయి మా కొడుకును కాకుండా చేశావు. అసలు వాడికి తల్లిదండ్రులు లేకుండా చేశావ్. సంతోషం అమ్మా అని దండం పెట్టి ఇందును నిందిస్తాడు చలపతి.
ఎలాగైనా తీసుకొస్తాను
రాజు తల్లిదండ్రులు ఏడుస్తూ వెళ్లిపోతారు. రాజుతో ఎందుకు అంత కఠినంగా మాట్లాడారని లక్ష్మీ అంటుంది. అలా మాట్లాడితే అయినే వాడు ఇంటికొస్తాడేమో అని అలా అన్నాను అని చలపతి అంటాడు. రాజు ప్రాణాల గురించి మాట్లాడుకుంటారు. వాడు ఆ ఇంటి మనిషి అని తెలిస్తే వాడు అస్సలు రాడు. వాడు చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. వాడిని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదని చలపతి అంటాడు.
{{/usCountry}}రాజు తల్లిదండ్రులు ఏడుస్తూ వెళ్లిపోతారు. రాజుతో ఎందుకు అంత కఠినంగా మాట్లాడారని లక్ష్మీ అంటుంది. అలా మాట్లాడితే అయినే వాడు ఇంటికొస్తాడేమో అని అలా అన్నాను అని చలపతి అంటాడు. రాజు ప్రాణాల గురించి మాట్లాడుకుంటారు. వాడు ఆ ఇంటి మనిషి అని తెలిస్తే వాడు అస్సలు రాడు. వాడు చాలా పెద్ద సమస్యలో ఇరుక్కున్నాడు. వాడిని ఎలా కాపాడాలో అర్థం కావట్లేదని చలపతి అంటాడు.
{{/usCountry}}రాజు విషయంలో మనం తప్పు చేస్తున్నామేమో. వాడు యాక్సిడెంట్ తర్వాత మన బిడ్డగానే పెరిగాడు. వాడిని ఏ అండలేని ఆ కుటుంబానికి అండగా నిలబడేలా దేవుడు చేస్తున్నాడేమో. ఇదంతా దేవుడు ఆడిస్తున్న ఆటలా ఉందని, ఇప్పుడు మన చేయి దాటిపోయింది. వాడిని అడ్డుకుని తప్పు చేస్తున్నావేమో అని లక్ష్మీ అంటుంది.
మనం అడ్డు పడటం కరెక్టే. వాడు లేకుంటే మనం బతకగలమా. వాడు లేకుంటే మహా అయితే ఆ రేఖ ఆ ఆస్తి సొంతం చేసుకుంటుంది. వాడైతే ప్రాణాలతో ఉంటాడుగా. నేను వాడిని ఎలాగైనా ఆ ఇంటినుంచి తీసుకొస్తాను అని చలపతి అంటాడు. మరోవైపు అసలు మనం అనుకున్నది ఏది జరగదా, రేఖ నీ మాటలు గాలి మాటలు అయ్యాయని భ్రమరాంబ అంటుంది.
రాజు వెళ్లిపోడానికి బీజం పడింది
మనం ఏం చేసిన వాళ్లకే ఫేవర్‌గా మారుతుంది. మనం ఇన్నేళ్లుగా ఎన్నో అరాచకాలు చేశాం. కానీ, రాజు గాడి వచ్చి అంతా మార్చేశాడని, మనకు ఆస్తి దక్కేలా లేదని భూషణ్ అంటాడు. వాడు వెళ్లిపోడానికి ఒక బీజం పడింది. మనం అనుకున్నట్లు జరగలేదు. కానీ రాజును ఇక్కడి నుంచి బయటకు పంపించడానికి మార్గం దొరికిందని రేఖ అంటుంది.
ఇప్పుడు ఇందు చాలా ఎమోషనల్ అవుతుంది. తన వల్లే రాజుకు ఈ పరిస్థితి వచ్చిందనుకుంటుంది. రాజునే ఇందు పంపించేస్తుంది అని రేఖ అంటుంది. ఇందు మాయలో ఉండకు ఆంటీ. అది అంత తెలివితక్కువది కాదని ఐశ్వర్య అంటుంది. సరే అలా జరగకుంటే నేను రాజును పంపిస్తానుగా. రాజు గాడి విషయం అవకాశం దొరికింది. అది వాడుకుని వాడిని పంపించేస్తాను అని రేఖ అంటుంది.
మరోవైపు రాజుతో ఇది కరెక్ట్ కాదని, తండ్రి అంత బాధపడిన కూడా నువ్వు ఉండటంలో అర్థం లేదని ఇందు అంటుంది. ఎందుకు లేదు. నువ్వు ఇక్కడే ఉండమని ప్రామిస్ చేయించుకున్నావుగా, అది బ్రేక్ చేయమంటావా అని రాజు అంటాడు. నిజమే. కానీ, నా వల్ల మీ ఇంట్లోవాళ్లు బాధపడే పరిస్థితి వస్తుందంటే నేనెందుకు అలా చేస్తాను. ప్రామిస్ చేయించుకున్న నేనే చెబుతున్నా. నువ్వు వెళ్లిపో రాజు. మీ అమ్మనాన్న దగ్గరికి వెళ్లు అని ఇందు అంటుంది.
గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది
నేను వెళ్తే నువ్వు అనుకుంది ఎలా చేస్తావని రాజు అంటాడు. అది నా సమస్య. నాకు ఏదో గిల్టీ ఫీలింగ్ కలుగుతుంది. నీ వాళ్లను నీకు దూరం చేసినదాన్ని కాలేను అని ఇందు అంటుంది. నీది అవసరం, నాది స్వార్థం. మనకు కారణాలు ఉన్నాయి. మా నాన్నను నేను కన్విన్స్ చేస్తాను. లైట్ తీసుకో. ఇదంతా మాములే అని రాజు అంటాడు.
మీ వాళ్లు లోపల ఏది ఉందో అదే మాట్లాడుతారు. వాళ్లు కన్నీళ్లు పెడుతున్నారంటే బలమైన కారణం ఉంటుంది. ఈ ఇంట్లో వచ్చే కష్టం నాది. దాన్ని ఆరుస్తానో తీరుస్తానో నా ఇష్టం అని ఇందు అంటుంది. వాళ్ల బాధలకంటే ఇక్కడున్న బాధ్యతలే ముఖ్యమని రాజు అంటాడు.
ఇంట్లోంచి వెళ్లిపోయిన రాజు
దాంతో చాలా డబ్బు తీసుకొచ్చి రాజుకు ఇస్తుంది ఇందు. ఇదిగో నీ పేమెంట్. ఇదంతా చేస్తుంది డబ్బు కోసమే కదా అని ఇందు ఫైనల్ సెటిల్‌మెంట్ చేస్తుంది. మనిద్దరి మధ్య ఉన్న బంధం డబ్బేనా అని రాజు అంటాడు. తర్వాత లగేజ్ సర్దుకుని రాజు ఇంట్లోంచి వెళ్లిపోతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.