...
...
Next Story

బ్రహ్మముడి జూన్ 11 ఎపిసోడ్: ఐశ్వర్యను కొట్టిన ఇందు, వాచిపోయిన చెంప- 10 లక్షల అప్పు తీర్చనన్న చెల్లి- శేషుకు రాజు ఐడియా

Brahmamudi Serial June 11th Episode: బ్రహ్మముడి సీరియల్ జూన్ 11వ ఎపిసోడ్‌‌లో ఇందు తెలివితేటల గురించి సుభాష్, అపర్ణలకు రాజు చెబుతాడు. తర్వాత తనను కిడ్నాప్ చేయించినందుకు అక్క ఐశ్వర్యను ఇందు లాగిపెట్టి కొడుతుంది. దాంతో ఐశ్వర్య చెంప వాచిపోతుంది. 10 లక్షల అప్పు తీర్చనని చెల్లి ఇందు అంటుంది.

Published on: Jun 11, 2026, 08:36:52 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇందు తెలివితేటల గురించి అపర్ణ, సుభాష్‌లకు రాజు చెబుతాడు. ఇందును సీఈఓ నేనే హెల్ప్ చేశానని అందరూ అనుకుంటున్నారు, ఇందును తనే సీఈఓ చేశాననే భ్రమలో రేఖ ఉంది. కానీ, ఇక్కడ ఎవరూ ఊహించని విషయం ఏంటంటే ఆ రేఖనే ఇందును సీఈఓ చేసేలా ప్లాన్ చేసిందని, అయిందని రాజు చెబుతాడు.

నన్ను ఆయుధంలా వాడుకుంది

బ్రహ్మముడి సీరియల్ జూన్ 11 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ జూన్ 11 ఎపిసోడ్

తను సీఈఓ అవ్వడానికి నన్ను ఆయుధంలా వాడుకుంది. తన తెలివితేటలతో ఈ దేశాన్ని శాసించిన శాసిస్తుంది. త్వరలోనే మీకు ఇందు గురించి తెలుస్తుందని రాజు అంటాడు. మీరు ఎలా అనుకుంటున్నారో నేను అలాగే కంపెనీని కాపాడుతాను. ఇప్పుడు మాత్రం రేఖకు అనుకూలంగా ఉంటాను అని ఇందు అంటుంది.

సీఈఓగా కూర్చున్నాకా చాలా సమస్యలు వస్తాయి. నిన్ను వెనక్కి లాగేందుకు చాలా మంది ట్రై చేస్తారు. సెకన్లలో కరెక్ట్ నిర్ణయం తీసుకోవాలని సుభాష్ అంటాడు. మేము కావ్య, రాజ్‌ల ఉండటమే కాదు వాళ్ల తెలివితేటలను పుణికిపుచ్చుకున్నామని రాజు అంటాడు.

తర్వాత ఐశ్వర్యను లాగిపెట్టి కొడుతుంది ఇందు. నన్నే కొడతావా అని ఐశ్వర్య చేయి ఎత్తితే అడ్డుకుంటుంది ఇందు. అక్కవు కాబట్టే చెంపదెబ్బతో సరిపెట్టాను. నేనంటే నీకెందుకే అంత కక్ష్య. నీ మతిలేని పనులు చూసి చూడనట్టు ఊరుకుని నీ అప్పు కూడా తీరుస్తానని చెప్పా. అయినా నీ బుద్ధి చూపించావ్. నేను సీఈఓ అవ్వకూడదని ఎవరైనా కిడ్నాప్ చేస్తారా అని ఇందు అంటుంది.

నువ్వు నా బద్ధశత్రువువి

నువ్వు నా చెల్లెలివి కాదు. నువ్వు నన్ను అక్కలా చూస్తున్నావేమో నేను చూడట్లేదు. నువ్వు నా బద్ధశత్రువువి. సీఈఓ అవ్వగానే పొగరు చూపించావ్. ఇందుకే వద్దనుకున్నా. నీ సానుభూతి నటనలు వద్దు. ఒకప్పుడు మీ అమ్మ కూడా అందరిని బుట్టలో వేసుకుందట. నువ్వు కూడా అలాగే చేస్తున్నావ్. మా అమ్మలా నేను నమ్మి మోసపోలేను. నిన్ను ఏం చేస్తానో చూడు అని ఐశ్వర్య అంటుంది.

మరోవైపు ఇందు సీఈఓ అవడం గురించి రేఖను అడుగుతాడు శేషు. నా ప్లాన్ ఫెయిల్ అయింది. రాజును అడ్డుపెట్టుకుని డబ్బులు లాగాలనుకున్నా అని శేషు అనుకుంటాడు. ఇందు మనకు ఎదురుతిరిగితే పరిస్థితి ఏంటని భ్రమరాంబ అంటుంది. ఇందు ఎదురుతిరిగితే ఏం చేయలేవని రేఖను ఇరిరేట్ చేస్తాడు శేషు. కలలో కూడా ఇందు నాకు ఎదురుతిరగదని రేఖ అంటుంది.

కంపెనీలో దొంగ బంగారం పెట్టించి

ఇప్పుడు నీ ప్లాన్ ఏంటని భూషణ్ అంటాడు. సింగపూర్ వాళ్ల దొంగ బంగారం మన కంపెనీలో పెట్టే డీల్ కుదుర్చుకుందాం. ఇందుతో ఈ డీల్‌పై సంతకం పెట్టించుకుని కోట్లు తెచ్చుకుంటాం. ఏదైనా సమస్య అయితే ఇందుకు ఇబ్బంది అవుతుంది. మనకు కాదు అని రేఖ ప్లాన్ చెబుతుంది. దాంతో అప్పులన్నీ తీరిపోతాయని భూషణఅ అంటాడు.

మరోవైపు ఇందు కొట్టిన దెబ్బకు ఐశ్వర్య చెంప ఎర్రగా వాచిపోతుంది. అద్దంలో చూసుకుంటూ ఇందు నిన్ను వదిలిపెట్టను అని అనుకుంటుంది ఐశ్వర్య. ఇంతలో స్వాతి వచ్చి ఐశ్వర్య చెంపకు ఏమైందని చూపించమంటుంది. ఐశ్వర్య ఎంతకు చూపించకపోవడంతో బలవతంగా చేతులు తీసి స్వాతి చూసి షాక్ అవుతుంది. ఏమైంది చెంప ఇంతలా వాచిపోయిందని స్వాతి అడుగుతుంది.

ఇందాక గోడ గీసుకుందని ఐశ్వర్య అంటుంది. ఇది అలా లేదే. ఎవరో చాచిపెట్టి కొట్టినట్లు ఉందని స్వాతి అంటుంది. నన్ను కొట్టే ధైర్యం ఎవరికి ఉందని ఐషు అంటే.. ఎవరికి లేదు. ఒక్క ఇందు అక్కకే ఉంది. నిన్ను కొట్టింది నేను చూశానని స్వాతి చెబుతుంది. ఆయింట్‌మెంట్ ఇచ్చి రాసుకో అని వెళ్లిపోతుంది స్వాతి. దీన్ని కూడా ఏమనలేకపోతున్నాను. ఇందును చావుదెబ్బ ఎలా కొడతానో చూడు అని ఐశ్వర్య అనుకుంటుంది.

ఇందు దగ్గర పీఏగా

మరోవైపు రాజు సీఈఓ అవ్వకపోవడంపై శేషు చాలా ఫీల్ అవుతు మాట్లాడుతాడు. ఇందు దగ్గర పీఏగా జాయిన్ అయి నాలుగు కాదు 40 రాళ్లు వెనుకేసుకో అని రాజు ఐడియా ఇస్తాడు. అమ్మాయిలతో లెక్క వేరేలా ఉంటుంది. మనం మనం అయితే వేరు అని శేషు అంటాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks