Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో వెంకీ సైకిల్ మీద అందరికి ఫుడ్ డెలివరీ ఇస్తాడు. ఓ కస్టమర్ వెంకీ బాస్‌కి కాల్ చేసి ఇంకా ఫుడ్ డెలివరీ కాలేదని చెబుతాడు. దాంతో వెంకీకి బాస్ కాల్ చేసి త్వరగా ఇవ్వమని తిడతాడు. వెంకీ సరేనంటాడు.
సైకిల్ మీద డెలివరీ ఏంటీ

వీడు బైక్ మీద వెళ్లాడు కదా. మరెందుకు లేట్ అవుతుంది అని బాస్ అనుకుంటాడు. ఓ కస్టమర్ బాస్‌కు కాల్ చేసి మీవాడు ఏంటీ సైకిల్ మీద డెలివరీ చేస్తున్నాడు. ఇలా అయితే మీ బిజినెస్ పోతుందిగా. బైక్ ఉన్నవాళ్లను పెట్టుకోవచ్చుగా అని చెబుతాడు. దాంతో వెంకీకి బాస్ కాల్ చేసి నువ్వు సైకిల్ మీద డెలివరీ చేస్తున్నావని తెలిసిపోయిందని తిట్టి ఐదు నిమిషాల్లో రమ్మంటాడు.
మరోవైపు సుభాష్, ఇందుల ప్లాన్ ప్రకారం దుగ్గిరాల ఇంటికి శకుంతల వస్తుంది. రాగానే మా ఇంట్లో పరాయివాళ్ల పెత్తనం కాదుగా అని రేఖపై సెటైర్లు వేస్తుంది. అపర్ణను ఎవరు అని అడిగిన రాజు భోజనం చేయమని చెప్పండంటాడు. శకుంతల కూడా వచ్చి భోజనానికి కూర్చుంటుంది.ఇదేదో సత్రం అయినట్లు అందరికి భోజనం పెడుతున్నారని రేఖ అంటుంది.
నేనేం పట్టించుకోను నువ్వు పెట్టు అని శకుంతల అంటుంది. ఈ అబ్బాయి ఎవరే. అచ్చం రాజ్‌లా ఉన్నాడని శకుంతల అడుగుతుంది. నా మనవడు అని అపర్ణ అంటే.. అంటే నీ కూతురు కొడుకా అని శకుంతల అంటుంది. కాదు ఈ ఇంటి అల్లుడు, ఇందుకు మొగుడు అని శేషు చెబుతాడు. ఇందు పెళ్లి గురించి చెబితే లవ్ మ్యారేజ్ చేసుకున్నారని, పెద్దలకు తెలియదంటే అదేగా అని శేషు చెబుతాడు.
రేఖను శాడిస్ట్ అన్న శకుంతల
శకుంతలతో మాట్లాడమని, డ్రామా స్టార్ట్ చేయమని ఇందు అంటుంది. ఇందు నువ్వు కూడా భోజనం చేయు. నువ్వు ఇప్పుడు స్వరాజ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీకి సీఈఓ కదా అని రాజు అంటాడు. ఏంటీ ఇందు సీఈఓ అయిందా అని శకుంతల ఆశ్చర్యపోతుంది. రేఖ ఉండగా ఇందు సీఈఓ అవ్వడమేంటీ. రేఖ నిజంగా నీ పదవి పోయిందా. దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడు. అందుకే ఇలా జరిగిందని శకుంతల అంటుంది.
{{/usCountry}}శకుంతలతో మాట్లాడమని, డ్రామా స్టార్ట్ చేయమని ఇందు అంటుంది. ఇందు నువ్వు కూడా భోజనం చేయు. నువ్వు ఇప్పుడు స్వరాజ్ గ్రూఫ్ ఆఫ్ కంపెనీకి సీఈఓ కదా అని రాజు అంటాడు. ఏంటీ ఇందు సీఈఓ అయిందా అని శకుంతల ఆశ్చర్యపోతుంది. రేఖ ఉండగా ఇందు సీఈఓ అవ్వడమేంటీ. రేఖ నిజంగా నీ పదవి పోయిందా. దేవుడు అనేవాడు నిజంగా ఉన్నాడు. అందుకే ఇలా జరిగిందని శకుంతల అంటుంది.
{{/usCountry}}ఇందును బయటకు పంపకుండా బానిసలా చూశావుగా అని శకుంతల అంటే.. మా ఆంటీని ఏం అనకండని. బానిసలా చూడలేదని, నా సెక్యూరిటీ కోసం అలా చూసుకుందని ఇందు రేఖకు సపోర్ట్ చేస్తుంది. తర్వాత ఇందును రేఖ సీఈఓ చేయడం గురించి మాట్లాడుకుంటారు. రేఖ నీకు ఇలాంటి మంచి బుద్ధులు ఎలా వచ్చాయి. నువ్వు అసలే శాడిస్ట్‌వి కదా అని శకుంతల అంటుంది.
మా రేఖ ఆంటీ చాలా మంచిది. తనను తప్పుబడితే బాగుండదు. నా ముందే రేఖ ఆంటీని అలా అంటే ఊరుకోను. మీరు వెంటనే వెళ్లిపోండి అని ఇందు అంటుంది. దాంతో శకుంతల వెళ్లిపోతుంది. ఇందుపై అపర్ణ కోప్పడుతుంది. బయట కూడా చాలా మంది శకుంతలాగే మాట్లాడుకుంటారు. అందరి నోళ్లు మూయిస్తావా అని సుభాష్ అంటాడు.
రేఖను ఏమార్చిన ఇందు
మూయిస్తాను. ఆంటీ ఇప్పుడు నేను సీఈఓ అయిన సందర్భంగా మన క్లైంట్స్ అందరిని పిలిచి పార్టీ ఇద్దామా. ఇది మన పెట్టుబడి. రేఖ ఆంటీ మీద ఉన్న తప్పుడు అభిప్రాయాలు పోతాయి. ఇప్పుడు పార్టీలో రేఖ ఆంటీనే నన్ను సీఈఓ చేసిందని చెబితే.. అప్పుడు రేఖ ఆంటీ మంచితనం తెలుస్తుంది అని ఇందు అంటుంది. అవును ఇందు చెప్పింది కరెక్ట్. పార్టీ ఇద్దామని రేఖ అంటుంది.
సూపర్ ఇందు. అక్షరం ముక్క రాకపోయిన నీ ఐడియా అదిరిపోయిందని ఇందును మెచ్చుకుంటుంది రేఖ. భూషణ్ చెప్పిన వినకుండా ఇదే ఫైనల్ అని రేఖ అంటుంది. అలా రేఖను ఏమార్చి పార్టీకి ఒప్పిస్తుంది ఇందు. మరోవైపు సైకిల్ మీద డెలివరీ చేసినందుకు, ఇలా మోసం చేస్తావా అని బాస్ తిడతాడు. బైక్ పాడైంది చెబుతాడు వెంకీ.
నీలా అబద్ధం చెప్పేవాళ్లకు నా దగ్గర పని ఉండదు. నీ జాబ్ లేదు అని బాస్ అంటాడు. ఒక్క అవకాశం ఇవ్వమని వెంకీ ప్రాధేయపడతాడు. సైకిల్ మీద వెళ్లిన లేట్ చేయలేదు. బైక్‌పై వెళ్తే ఇన్ టైమ్‌లో ఇస్తాను అని రిక్వెస్ట్ చేస్తాడు వెంకీ. సరే ఒక్క ఛాన్స్ ఇస్తాను. ఒక్క మిస్టేక్ చేసిన, డెలివరీ లేట్ అయిన మాట్లాడటాలు ఉండవు. జాబ్‌లో నుంచి తీసేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు బాస్.
పులిహోర కూడా కలుపు
నందు ఫ్రెండ్‌వి కాబట్టి ఊరుకుంటున్నా అని బాస్ చెబుతాడు. మరోవైపు రాజు విష్ణుమూర్తిలా పడుకుంటాడు. పార్టీ గురించి రాజు, ఇందు మాట్లాడుకుంటారు. నేను రేఖ ఆంటీ పక్కనే ఉంటాను కాబట్టి క్లైంట్స్‌తో రాజును మాట్లాడమని, కావాల్సివస్తే పులిహోర కలిపి, వాళ్లలో ఈ కంపెనీకి ఫేవర్‌గా ఉన్నవాళ్లు ఎవరో కనుక్కోవాలని ఇందు చెబుతుంది.
అలాగే, రేఖ ఆంటీ మనుషులు ఎవరా అని సెపరేట్ చేయాలి. అలా ఎవరో తెలుసుకునేలా చేయడమే నీ టాలెంట్ అని ఇందు అంటుంది. అదంతా చేస్తాను కానీ ఇలా చేసేటప్పుడు రేఖకు డౌట్ రాదా అని రాజు అంటాడు. ఓవరాక్షన్ చేస్తే డౌట్ వస్తుందని ఇందు అంటుంది. నాది నాచురల్ యాక్టింగ్. దాన్నేమైనా అంటే అని రాజు అంటుంటే.. అంటానురా. ఏం చేస్తావురా అని రా కొడుతుంది ఇందు.
ఇందుదే యాక్టింగ్ కాదని రాజు అంటాడు. ఇద్దరు గొడవ పడతారు. తర్వాత ఇంటికి లక్కీ వస్తాడు. రాజుతో పెళ్లి గురించి మాట్లాడుతాడు. అసలు ఇది పెళ్లే కాదు. అద్దె మొగుడిలా నటిస్తున్నాను అని లక్కీకి రాజు నిజం చెబుతాడు.
రుద్రాణిలా ఐశ్వర్య
ఆ మాటలు ఐశ్వర్య వింటుంది. ఈసారి పార్టీలో అందరిముందు ఈ నిజాన్ని బయటపెడతాను అని అచ్చం నానమ్మ రుద్రాణిలా ప్లాన్ చేస్తుంది ఐశ్వర్య. అంటే, పార్టీలో రాజ్, ఇందుల సీక్రెట్‌ను ఐశ్వర్య బయటపెట్టనుందని తెలుస్తోంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.