Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లక్కీకి నిజం చెప్పడంపై రాజుతో గొడవ పెట్టుకుంటుంది ఇందు. చెప్పురా ఎందుకు అలా చేశావు అని అరెయ్ అంటూ రెచ్చిపోతుంది. ఇలా మాట్లాడితే నేను కూడా దిగజారి మాట్లాడాల్సి వస్తుందని రాజు అంటే.. అప్పుడు నా చేతికి పని చెబుతానంటుంది ఇందు.
నన్ను కొడతానంటావా

అంటే నన్ను కొడతాను అంటావా. నా మొహం తప్పా నీకు దిక్కు లేదు. నీకు తిక్క ఉంది. వెర్రి ఉందని రాజు అంటాడు. ఇందు కూడా తిడుతుంది. అది అపర్ణ చూస్తుంది. అపర్ణను రాజు, ఇందు షాక్ అవుతారు. మీరు ఇలా తిట్టుకుంటే బయటివాళ్లు ఏం అనుకుంటారు. నిజంగానే భార్యాభర్తలు కాదనుకుంటారు అని అపర్ణ అంటుంది.
దాంతో ఇందును దగ్గరికి తీసుకుని అలాంటిదేం లేదని, మేము నిజంగానే భార్యాభర్తలం. ఇలా దగ్గరికి తీసుకుంటే భర్త కాకుండా ఉంటే ఇందు కొట్టేది కదా అని రాజు అంటాడు. నేను నమ్ముతున్నాను. కానీ, బయటివాళ్లు అలా అనుకోరని అపర్ణ అంటుంది. ఏం చేయను అమ్మమ్మ మాటి మాటికి మీ మనవరాలు ఇందు నా మీదకు కాలు దువ్వుతుందని, నేన ఊరుకుంటానా. పెళ్లాం చేతిలో కీలుబొమ్మను కాను అని రాజు అంటాడు.
పెళ్లయిన కొత్తలో అండర్‌స్టాండింగ్స్ సమస్యలు ఉంటాయి. కానీ, ఇలా కొట్టుకోవడం పరిష్కారం కాదు. ఇందు తను మన ఇంట్లో ఉన్నాడుగా. ఏం అనకని చెప్పి వెళ్లిపోతుంది అపర్ణ. లక్కీకి నిజం ఎందుకు చెప్పావని మళ్లీ గొడవ పెట్టుకుంటుంది ఇందు. అది అయిపోయిందిగా. ముందు ఆ క్లైంట్ గురించి ఆలోచించు. డబ్బు వస్తుందని రాజు అంటాడు.
దుగ్గిరాల ఇంటికి వెళ్లకుండా రాజును ఆపుదాం
నువ్వు ఎక్కడికి వచ్చి డబ్బు దగ్గర ఆగుతావని తెలుసుని ఛీ కొట్టి వెళ్లిపోతుంది ఇందు. మరోవైపు పార్టీలో రాజు, ఇందును చూసిన చలపతి, లక్ష్మీ దాని గురించి, నిజంగానే బిజినెస్ చేస్తున్నారా. లేదా వాడికి గతం వెతుక్కుంటూ వెళ్లాడా అని భయపడతారు. దుగ్గిరాల ఇంట్లోనే తిరుగుతున్నాడంటే ఈ నిజం తెలుస్తుంది. రేఖ ఏమైనా చేస్తుందని లక్ష్మీ అంటుంది.
{{/usCountry}}నువ్వు ఎక్కడికి వచ్చి డబ్బు దగ్గర ఆగుతావని తెలుసుని ఛీ కొట్టి వెళ్లిపోతుంది ఇందు. మరోవైపు పార్టీలో రాజు, ఇందును చూసిన చలపతి, లక్ష్మీ దాని గురించి, నిజంగానే బిజినెస్ చేస్తున్నారా. లేదా వాడికి గతం వెతుక్కుంటూ వెళ్లాడా అని భయపడతారు. దుగ్గిరాల ఇంట్లోనే తిరుగుతున్నాడంటే ఈ నిజం తెలుస్తుంది. రేఖ ఏమైనా చేస్తుందని లక్ష్మీ అంటుంది.
{{/usCountry}}వాడికి ఏదోటి చెప్పి ఆ ఇంటికి వెళ్లకుండా ఆపుదాం. ఎలాగైనా వాడిని ఇక్కడే ఉంచి కాపాడుకుందామని చలపతి అంటాడు. మరోవైపు లక్కీ కాలర్ పట్టుకుని ఇంత మోసం చేస్తావా అని నిలదీస్తాడు రాజు. ఐషుతో కలిసి నా విషయం బయటపెట్టాలని చూస్తావా అని రాజు అంటాడు. వీడు దీనిగురించి సీరియస్ అవుతున్నాడా. ఇంక అమ్మనాన్నలు రావడం గురించే ఏమో అనుకున్నా అని లక్కీ అంటాడు.
ఇంత నమ్మకద్రోహం చేశావేంట్రా. ఇంతలా వెన్నుపోటు పొడిచావేంట్రా. ఐషుకు ఎంతకు అమ్ముడు పోయావురా అని రాజు అడుగుతాడు. దాంతో ఐశ్వర్య తనతో చెప్పింది చెబుతాడు లక్కీ. వెర్రి నాయాల.. నిన్ను బకరా చేసిందని రాజు అంటాడు. లేదు మామ. నన్ను ఐశ్వర్య ప్రేమిస్తుందని లక్కీ మురిసిపోతాడు. నీ వీక్‌నెస్ మీద కొట్టి నా గుట్టు బయటపెట్టిందిరా. అది వీడియో తీసి పార్టీలో ప్లే చేసిందని రాజు చెబుతాడు.
ఐశ్వర్య పాములాంటిదిరా
అది పెద్ద ఖిలాడీరా. నీకు నా విషయాలు చెప్పకూడదు. ఐశ్వర్య పాములాంటిదిరా. నువ్వు హెల్ప్ చేయకున్నా పర్లేదు. ఇలాంటి విషయాలు మాత్రం బయటపెట్టకు అని లక్కీ కళ్లు తెరిపిస్తాడు రాజు. అమ్మో ఐషు నువ్వు మాములుదానివి కాదు అనుకుంటాడు లక్కీ. మరుసటి రోజు ఉదయం నేను సీఈఓ అయ్యాక తీసుకుంటున్న మొదటి కాంట్రాక్ట్ అని చెప్పి అపర్ణ, సుభాష్ ఆశీర్వాదం తీసుకుంటుంది.
రేఖ ఆంటీ నుంచి విముక్తి కలిపిస్తాను. కొన్ని రోజుల తర్వాత మీకు ఆపరేషన్ చేయిస్తాను. మీరు నడిస్తే చూడాలనుందని ఇందు అంటుంది. సీఈఓ పదవి ఒక ముళ్ల కిరీటం లాంటిది. చాలా సమస్యలు ఎదరవుతాయి. ధైర్యం, విశ్వాసం, నమ్మకం ఇవే ఆయుధాలు అని మోటివేట్ చేస్తాడు సుభాష్. లక్కీని ఐశ్వర్య కలుస్తుంది. తనను చీట్ చేసిన దాని గురించి ఎమోషనల్‌గా మాట్లాడుతాడు లక్కీ.
ఓ విషయం మాట్లాడటానికి వచ్చా. సిల్లీ విషయాలు తీయకు. నువ్వు మా ఇంటికి రావాలి. ఆరోజు రాత్రి రాజు నీతో చెప్పిన అబద్ధపు పెళ్లి గురించి మా ఇంట్లో చెప్పాలని ఐశ్వర్య అంటుంది. నాకు గుర్తు లేదు. వాడు చెప్పింది గుర్తు లేదు. తాగి మర్చిపోయాను అని లక్కీ అంటాడు. సరే నేను చెప్పినట్లు చెప్పు. వాళ్లది దొంగ పెళ్లి అని ఐశ్వర్య అంటుంది.
ఐశ్వర్య ప్లాన్ ఫెయిల్
అలా నేను చెప్పలేను. నా ఫ్రెండ్‌కు నేను అన్యాయం చేయలేను. ఈ హెల్ప్ తప్పా ఇంకేమైనా చేస్తాను అని లక్కీ అంటాడు. దాంతో లక్కీని టచ్ చేసి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తుంది ఐశ్వర్య. దాంతో భయపడి లక్కీ వెళ్లిపోతాడు. అలా లక్కీతో ఐశ్వర్య వేసిన మరో ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మరోవైపు క్లైంట్ హర్ష ఇందు సొంత నిర్ణయాలు తీసుకుంటుంది అనుకుంటున్నాడు. కానీ, ఆ ఇందు ఈ రేఖ నీడలో బతుకుతుందని తెలియదు. ఎవరేమనుకున్నా సరే మనకు డబ్బులు వస్తాయని రేఖ అంటుంది.
రేపు డబ్బు వచ్చాక ఇందు మారిపోతే తోక జాడిస్తే అని భ్రమరాంబ, భూషణ్ అంటారు. ఎవరైనా మారొచ్చు, ఇందు మారదని రేఖ అంటుంది. డబ్బును చెక్ రూపంలో ఇస్తారు. అది తీసుకొచ్చి ఇందు నా చేతుల్లో పెడుతుంది అని రేఖ అంటుంది. కానీ, రాజు ఉన్నాడుగా. వాడు అన్ని అడ్డుకుంటున్నాడుగా అని శేషు అంటాడు. అందరూ కంగారుగా ఉందంటారు.
తర్వాత కాంట్రాక్టర్ హర్షతో కాంట్రాక్ట్ ఓకే చేయించుకుంటుంది ఇందు. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టండని హర్ష ఇస్తాడు. ఇందు సంతకం చేస్తుంది. అది చూసిన రేఖ, భూషణ్ ఒక్కసారిగా షాక్ అవుతారు. హర్ష వెళ్లిపోతాడు. తర్వాత ఇంట్లో సంతకం ఎలా పెట్టావని ఇందును నిలదీస్తుంది రేఖ.
ఇందును కాపాడిన రాజు
దాంతో ఇందు, అపర్ణ షాక్ అవుతారు. నన్ను అడగండి నేను చెబుతాను అని రాజు అంటాడు. ఇందుకు సంతకం పెట్టడం నేర్పించానని రాజు చెబుతాడు. అలా ఇందును రేఖ నుంచి కాపాడుతాడు రాజు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.