Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో శోభనం గదిలో ఇందుపైకి రొమాంటిక్‌గా వెళ్లిన రాజు ఐ లవ్యూ చెబుతాడు. ముద్దు పెట్టుకునేందుకు దగ్గరిగా వెళ్లి వెనక్కి వచ్చి నవ్వుతాడు. ఏంటీ కంగారుపడ్డావా. నీలో భయం చూడాలనే ఇలా చూశా. పోయి పోయి నీతో కమిట్ అవ్వడానికి నేనేమైనా తింగరోన్నా. ప్రాణం పోతుందన్నా నా క్యారెక్టర్ చంపుకోను. ఇంత భయం ఉన్నదానివి నన్నెందుకే ఆట పట్టిస్తుంటావ్ అని రాజు అంటాడు.
ఇందుకు ట్విస్ట్ ఇచ్చిన రాజు

నా మీద చేయి వేస్తే చేయి ఇరగొట్టేద్దాన్ని అని ఇందు అంటుంది. దాంతో రాజు కౌంటర్స్ వేస్తారు. నువ్వు గయ్యాలి కాదు అంతకుమించి అని రాజు అంటాడు. ఏది నా మీద చేయి వెయ్యి అని ఇందు అంటే.. నేను ఆడోళ్ల మీద చేయి వేయను. నా క్యారెక్టర్ బ్యాడ్ అవుద్ది అని రాజు అంటాడు. తర్వాత ఉదయం ఆఫీస్ ఉంది, త్వరగా వెళ్లాలి అని ఇందు అంటుంది. బెడ్ చూస్తూ ఆహా పూలపాన్పుపై పడుకోవాలనుకున్నాను అని మురిసిపోతాడు రాజు.
కానీ, రాజును కింద పడుకోమంటుంది ఇందు. బెడ్ మీద పడుకుంటానని బతిమిలాడుకుంటాడు రాజు. కానీ, అట్లకాడతో వాతలు పెడతానని ఇందు బెదిరిస్తుంది. దాంతో ఏం చేయలేక కింద పడుకుంటాడు రాజు. ఇక నా బతుకు మారదు అని ఫీల్ అవుతుంటాడు రాజు. మరోవైపు కంగారుగా వెంకీ ఇంటికి నందు వస్తుంది. వెంకీ కాల్ లిఫ్ట్ చేయట్లేదని కంగారుగా చెబుతుంది నందు. లిఫ్ట్ చేయట్లేదంటే ఏదో ఉందని వెంకీ గది దగ్గరికి వెళ్లి డోర్ కొడుతుంది నందు.
గదిలో వెంకీ చేయి కట్ చేసుకుని ఆత్మహత్య ప్రయత్నం చేస్తాడు. రక్తం కారిపోతుంది. నందు ఎంత తలుపు కొట్టిన వెంకీ తీయడు. డోర్ బద్దలు కొడతానని నందు అంటుంది. చలపతి, లక్ష్మీ భయపడిపోతారు. వెళ్లి కిటికీలో నుంచి వెంకీని చూస్తారు. వెంకీ సూసైడ్ చేసుకోవడం చూసి ఇదేం పనిరా అని ఏడుస్తారు తల్లిదండ్రులు. నాకు బతకాలనే ఆశ పోయిందని, జీవితం మీద విరక్తి కలిగిందని, అందుకే చనిపోతున్నాను. నన్ను క్షమించండి అని వెంకీ అంటాడు.
వెంకీని కాపాడిన నందు
మళ్లీ వెళ్లి డోర్‌ను బలంగా తంతుంది నందు. అలా చేసేసరికి డోర్ ఓపెన్ అవుతుంది. రక్తం పోకుండా వెంకీ చేయికి నందు క్లాత్ కడుతుంది. తనను కాపాడొద్దు అని వెంకీ అరుస్తుంటే లాగిపెట్టి నందు కొడుతుంది. తర్వాత డాక్టర్ వస్తాడు. చేతికి కట్టు కడతాడు. సూసైడ్ చేసుకోవడంపై తిడతాడు డాక్టర్. డీప్‌గా కట్ కాలేదు. ఇంకొంచెం ఉండుంటే నరం కట్ అయ్యేది. ఇప్పుడేం సమస్య లేదని డాక్టర్ అంటాడు.
{{/usCountry}}మళ్లీ వెళ్లి డోర్‌ను బలంగా తంతుంది నందు. అలా చేసేసరికి డోర్ ఓపెన్ అవుతుంది. రక్తం పోకుండా వెంకీ చేయికి నందు క్లాత్ కడుతుంది. తనను కాపాడొద్దు అని వెంకీ అరుస్తుంటే లాగిపెట్టి నందు కొడుతుంది. తర్వాత డాక్టర్ వస్తాడు. చేతికి కట్టు కడతాడు. సూసైడ్ చేసుకోవడంపై తిడతాడు డాక్టర్. డీప్‌గా కట్ కాలేదు. ఇంకొంచెం ఉండుంటే నరం కట్ అయ్యేది. ఇప్పుడేం సమస్య లేదని డాక్టర్ అంటాడు.
{{/usCountry}}డబ్బులు తర్వాత పంపిస్తానని చలపతి అనడంతో డాక్టర్ వెళ్లిపోతాడు. వెంకీని నందు తిడుతుంది. అప్పులోళ్ల గురించి చెప్పి ఫీల్ అవుతాడు వెంకీ. 20 ఏళ్ల కొడుకు దూరమైతే వాళ్లు బతకగలరా. పది కంపెనీల్లో జాబ్ రాకుంటే ఫెయిల్యూర్ అయిపోతావా. కొత్త కోర్సు నేర్చుకుని ముందుకు వెళ్లాలి అని ఓదార్చి మోటివేట్ చేస్తుంది నందు. చలపతి, లక్ష్మీ ఏడుస్తుంటారు.
ఇప్పుడు జాబ్ లేకుంటే ఏమైందిరా. నేను ఉన్నాగా. నీకేమైనా అయితే తట్టుకోగలమా అని చలపతి అంటాడు. ఇలాంటి వాళ్లకారా నువ్వు కడుపు కోత మిగుల్చాలని అనుకుంది. కన్నవాళ్లను బాధపెట్టడం కరెక్ట్ కాదురా అని నందు అంటుంది. తల్లిదండ్రులకు వెంకీ సారీ చెబుతాడు. ఇంకెప్పుడు ఇలా చేయకు. జాగ్రత్తగా చూసుకోండి అని నందు అంటుంది.
చెతులెత్తి మొక్కిన చలపతి
నువ్వు రాకుంటే వీడు ప్రాణాలతో ఉండేవాడు కాదు. వాడి ప్రాణాలు కాపాడిన నీకు థ్యాంక్స్ చాలా చిన్నమాట. నీకు రుణపడి ఉంటానని చేతులెత్తి నందుకు మొక్కుతాడు చలపతి. వాడు మీకెంతో నాకు అంతే. పాపం అమాయకుడు. నా జీవితం కంటే వాడి జీవితం మీద కంగారు ఎక్కువగా ఉంటుంది. అయినా పర్లేదు. జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి వెళ్లిపోతుంది నందు.
మరుసటి రోజు ఉదయం రాజు, ఇందు శోభనం అయిందా లేదా అని రేఖ కంగారుపడుతుంది. గులాబి పువ్వు రిజల్ట్‌తో శోభనం అయిందని శేషు అంటాడు. అలా ఎలా అవుతుంది. రేఖ ఇచ్చిన ట్యాబ్లెట్ కలిపి ఇచ్చానుగా అని భ్రమరాంబ అంటే.. ఎక్కడిచ్చావ్ అని నోరు జారి నిజం చెబుతాడు. దాంతో రేఖ షాక్ అవుతుంది. భ్రమరాంబ అరిచేసరికి శేషు కవర్ చేస్తాడు.
ఇంతలో రాజు మల్లెపూలు వాసన చూసుకుంటూ వస్తాడు. ఒకటే ఒళ్లు నొప్పులుగా ఉందని రాజు అంటాడు. ఇదేంటీ ఇలా వాడిపోయిన మల్లెపూవులా వచ్చాడు. నీ ట్యాబ్లెట్స్ పని చేశాయా. అడుగుతాను ఉండు అని భ్రమరాంబ రాజును ఎగాదిగా చూస్తుంది. భ్రమరాంబ, రేఖను శేషు పరిచయం చేస్తాడు. చిప్ ఏమైనా దొబ్బిందా కొత్తగా పరిచయం చేస్తున్నావని రాజు అంటాడు.
సీఈఓగా ఇందు
కొందరికి అలాగే ఉందని ఇన్‌డైరెక్ట్‌గా రేఖకు చిప్పు దొబ్బిందని శేషు అంటాడు. రాజు మాటలకు రేఖ ఇరిటేట్ అవుతుంది. తర్వాత ఇందుతో నీకు తోడుగా భర్త ఉన్నాడు, సంతోషంగానే ఉన్నావుగా అని అపర్ణ అడుగుతుంది. మరోవైపు రాజు గాడు సీఈఓ అయితే కొంపలు అంటుకుంటాయని రేఖతో భ్రమరాంబ అంటుంది. ఆ మాటలు ఐశ్వర్య వింటుంది.
ఆఫీస్‌లో జరిగే బోర్డ్ మీటింగ్‌కు ఇందును తీసుకెళ్తాను. ఇందును సీఈఓగా చేయబోతున్నాను అని రేఖ అంటుంది. ఆ మాటలు విన్న ఐశ్వర్య షాక్ అయి ఇందును బోర్డ్ మీటింగ్‌కు వెళ్లకుండా ఎలాగైనా ఆపాలని ఐశ్వర్య ప్లాన్ చేస్తుంది. ఎవరికో కాల్ చేసి ఆపేందుకు స్కెచ్ వేస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.