...
...
Next Story

Brahmamudi March 11th Episode: బ్రహ్మముడి- పోలీస్ ఇన్ఫార్మర్‌గా నందు- డబ్బుకోసం పట్టిస్తూ- రేఖకు ఇందు 15 లక్షల కండిషన్!

Brahmamudi Serial March 11th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 11వ తేది ఎపిసోడ్‌లో సుభాష్‌కు ఆపరేషన్ చేయాలని, అందుకు 15 లక్షలు అవుతుందని డాక్టర్ చెబుతాడు. రేఖను అడిగితే ఇవ్వనంటుంది. ఇంటికి గెస్ట్ వస్తాడు. అతనికి ఇందు వంటలు నచ్చి ఒక్క పూట వండేందుకు పంపించమని అడుగుతాడు. రేఖకు ఇందు కండిషన్ పెడుతుంది.

Published on: Mar 11, 2026, 07:44:26 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో సుభాష్‌కు ఆపరేషన్ చేస్తే కచ్చితంగా కోలుకుంటారని, ఆ తర్వాత హాస్పిటల్‌లో కొన్ని రోజులు ఉండాలని, మొత్తం కలిపితే రూ. 15 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్ చెబుతాడు. ఎంత వీలైనంత త్వరగా చేస్తే అంత మంచిది, త్వరగా చేస్తే కోలుకోగలరు. లేకుంటే వెన్నుపూస పాడవుతుందని డాక్టర్ చెప్పి వెళ్లిపోతాడు.

రాబందుల్లా పీక్కుతింటున్నారు

బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 11వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 11వ ఎపిసోడ్

కోట్ల ఆస్తి ఉన్న మీకు ట్రీట్‌మెంట్ చేయించే స్థితిలో ఉన్నాను. వచ్చిన డబ్బును అలాగే రాబందుల్లా పీక్కుతింటున్నారు. మనకు ఎవరు అంత డబ్బు ఇస్తారని అపర్ణ అంటుంది. మనం ఇప్పటివరకు రేఖను అడగలేదు, రేఖను అడుగుతాను అని ఇందు అంటుంది. ఆ రాక్షసిని అడగడం వద్దమ్మా. ఆపరేషన్ చేయకుంటే ఇలాగే చచ్చిపడినట్లు ఉంటాను. ఏం కాదు అని సుభాష్ అంటాడు.

నేను మిమ్మల్ని బాగా చూసుకోకపోతే నేను ఉండి ఎందుకు. నా గుండెల్లో ఏకైక లక్ష్యం ఒక్కటే. రాజులా బతికిన తాతయ్య స్థానాన్ని తిరిగి ఇవ్వాలి, మళ్లీ సంతోషంగా జీవించాలి, దానికోసం ఎంతదూరమైన వెళ్తాను, డబ్బులు ఇవ్వమని ఇప్పుడే అడుగుతాను అని ఇందు అని రేఖ దగ్గరికి వెళ్తుంది.

మరోవైపు నందు ఎదురు కొట్టులో నగలు దొంగతనం చేసిన బ్లేడ్ బాబ్జీ టీ తాగుతుంటాడు. బ్లేడ్ బాబ్జీని గుర్తు పట్టిన నందు పోలీసులకు చెబుతుంది. తర్వాత బ్లేడ్ బాబ్జీ దగ్గరికి వెళ్లి ఏడు వారాల నగల దొంగతనం గురించి చెప్పి పదా పోలీస్ స్టేషన్‌కు పోదాం అంటుంది. దాంతో బ్లేడ్ బాబ్జీ పారిపోతాడు. నందు వెంటపడుతుంది. ఎదురుగా పోలీస్ జీప్ వస్తుంది.

ఇన్ఫార్మర్‌గా నందు

సరేగాని ముందు డిగ్రీ పూర్తిచేయమని ఎస్సై అంటాడు. అంటే నువ్వు పోలీస్ కాదా అని దొంగ అంటాడు. డీటేల్స్ చెప్పేసరికి పోలీస్ అనుకున్నావా. కాదు ఇన్ఫార్మర్‌ని అని నందు చెబుతుంది. ఏక్ నిరంజన్‌లో ప్రభాస్‌లా నందు డబ్బుకు క్రిమినల్స్‌ను పట్టిస్తుంటుందని తెలుస్తోంది. మరోవైపు ఐశ్వర్య కోసం చేయించిన నెక్లెస్ భ్రమరాంబకు చూపిస్తుంది రేఖ.

ఇంతలో ఇందు వచ్చి సుభాష్ ఆపరేషన్ గురించి అడుగుతుంది. కానీ, రేఖ పెద్దగా పట్టించుకోదు. ఇంతలో ఐశ్వర్య వచ్చి ఫ్రెండ్స్‌కు పార్టీ ఇచ్చేందుకు వెళ్తున్నాని చెబుతుంది. పార్టీకి లక్ష అడిగితే.. ట్రాన్స్‌ఫర్ చేస్తుంది రేఖ. దాంతో ఐశ్వర్య వెళ్లిపోతుంది. తాతయ్య ఆపరేషన్‌కు 15 లక్షలు కావాలి, దానికి నేను ఏం చేయమన్నా చేస్తాను అని రేఖ కాళ్ల పక్కన కూర్చుని బతిమిలాడుకుంటుంది ఇందు.

ఇంటికి గెస్ట్

ఇంటి మెయింటెన్స్ కోసం వస్తున్న డబ్బులు తిండి, ఇంటికే సరిపోవట్లేదు. అంత డబ్బు ఎలా తీసుకురావాలి. అయినా వాడు లేచి నడవాల్సిన అవసరం ఏముంది. కుదరదు. ఇంటికి గెస్ట్ శివరామ్ వస్తున్నారు. నాన్‌వెజ్‌లో అన్ని రకాల ఐటమ్స్ వండు ఆర్డర్ వేస్తుంది రేఖ. దాంతో ఇందు సైలెంట్ అవుతుంది. శివరామ్ వల్ల భవిష్యత్తులో బాగా ఎదగొచ్చని భ్రమరాంబకు చెబుతుంది రేఖ.

ఇంతలో శివరామ్ ఒక్కడే వస్తాడు. శివరామ్‌ను రేఖ పొగుడుతుంటుంది. డైనింగ్ టేబుల్‌‌పై శివరామ్ కూర్చొంటాడు. అందరిని పరిచయం చేస్తుంది రేఖ. శేషు గురించి శివరామ్ అడిగి.. మీరు భార్య చాటు భర్త అన్నమాట అంటాడు. కాదండి భార్య బాధితుడి భర్త అని శేషు అంటాడు. దాంతో శేషు కాలును భ్రమరాంబ కాలు తొక్కుతుంది. దానికి శేషు అరుస్తాడు.

ఇందు వడ్డిస్తుంది. తన గురించి చెప్పలేదని శివరామ్ అంటాడు. వంట చేస్తే వంట మనిషి, పని చేస్తే పని మనిషి అని భ్రమరాంబ అంటుంది. వంట చాలా బాగుంది. మా అమ్మ చేతి వంటలా ఉంది. నా వైఫ్‌కి కూడా మా అమ్మ చేతి వంట చాలా ఇష్టం. తను లేకపోవడం వల్ల ఆ రుచులు మిస్ అవుతున్నాం. రోజు ఒక పూట ఇందును మా ఇంట్లో వంట చేయడానికి పంపిస్తారా అని అడుగుతాడు శివరామ్.

ఇందు కండిషన్

దానికి రేఖ ఒప్పుకుంటుంది. అపర్ణ కోపంగా చూస్తుంది. ఇందును నీకు ఏం అభ్యంతరం లేదుగా అని శివరామ్ అడుగుతాడు. మీరు జీతం కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. వచ్చి చేస్తుందని భ్రమరాంబ అంటుంది. ఇందు నువ్వు చెప్పట్లేదేంటీ అని మళ్లీ శివరామ్ అడుగుతాడు. ఒప్పుకో అన్నట్లుగా రేఖ కోపంగా చూస్తుంది. నాకు ఇష్టమే సర్ అని ఇందు అంటుంది.

మీ ఇంటికి రావడం వల్ల నాకు మంచి కుక్ దొరికింది. రేపు బిజినెస్‌లో నీకు కచ్చితంగా హెల్ప్ చేస్తానంటాడు శివరామ్. తర్వాత శివరామ్ వెళ్లిపోతాడు. అపర్ణ గొడవ చేస్తుంది. చెప్పుతో కొట్టినట్లు నువ్ వంట చేయడానికి వెళ్లనని చెప్పు అని అపర్ణ అంటే నాకు వెళ్లడం ఇష్టమే అని నానమ్మకే షాక్ ఇస్తుంది కావ్య.

15 లక్షల కండిషన్

కానీ, రేఖ 15 లక్షలు ఇస్తేనే వంట చేసేందుకు వెళ్తానని రేఖకు ఇందు కండిషన్ పెట్టనున్నట్లు తెలుస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks