Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో కావ్య, అప్పు, స్వప్న ఎంత అన్యూన్యంగా ఉండేవారో గుర్తు చేసుకున్న అపర్ణ వారి పిల్లలు మాత్రం ఇలా ఉన్నారని సుభాష్‌తో చెబుతుంది. ఆ రేఖ రుద్రాణి కంటే ఘోరంగా తయారైంది. ఐశ్వర్యను తనలాగే పెంచుతుంది. ఇందుకు కొత్త శత్రువులా ఐశ్వర్య మారుతుంది. మనం లేనప్పుడు ఇందు ఒక్కతే అవుతుందని ఆవేదనగా చెబుతుంది అపర్ణ.
రేఖపై కోర్టులో కేసు

మనం లేనప్పుడు మనతో పని లేకుండా ఇందుకు వాళ్లను ఎదిరించే శక్తి వస్తే. ఈ ఆస్తి కంపెనీ, ఫ్యాక్టరీలు ఇందు పేరు మీద ఉన్నాయి. అవన్ని కొన్ని రోజుల్లో అవి తనకు ఎలాగు సొంతం అవుతాయి. అలా జరగాలంటే ఇన్నాళ్లు ఆస్తులకు పవర్ ఆఫ్ అటార్నీగా ఉన్న రేఖను తప్పించాలి. ఆస్తి వచ్చే రోజు రేఖ ఎలాంటి పిచ్చి పనులు చేయకుండా ఉండాలంటే ఈ పవర్ ఆఫ్ అటార్నీ ఇందుపై ఉండాలని అపర్ణ అంటుంది.
అది తెలిసి ఇందుకు రేఖ ప్రమాదం తలపెడితే అని సుభాష్ అంటాడు. ఆ ప్రమాదం ఇప్పుడు కూడా ఉంది. కానీ, ఒక్కసారి ధైర్యం చేసి కోర్టులో కేసు వేస్తే తప్పకుండా ఆస్తి మొత్తం ఇందు చేతుల్లోకి వచ్చేసింది. అప్పుడు రేఖ చచ్చిన పాముతో సమానం అని అపర్ణ ప్లాన్ వేస్తుంది. ఈరోజే వెళ్లి లాయర్‌ను కలుస్తానంటుంది. అపర్ణ వెళ్లిపోతుంది.
మరోవైపు సర్టిఫికేట్స్ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటుంది ఇందు. స్వాతి వచ్చి ఎక్కడికి అని అడిగితే ఇంటర్వ్యూకి అని చెబుతుంది ఇందు. శివరామ్ ఇంటికి వెళ్లి అక్కడి నుంచి ఇంటర్వ్యూకి వెళ్తానంటుంది ఇందు. హాల్లో భ్రమరాంబ ఉంటుంది. తనకు చెప్పి ఇందు వెళ్తుంటే భ్రమరాంబ ఆపి బ్యాగ్‌లో ఏముందని అడిగుతుంది. వంట పనికి ఆ బ్యాగుతో సంబంధం ఏంటీ, ఒకసారి చూపించు అని బ్యాగ్ లాక్కుని ఓపెన్ చేస్తుంది భ్రమరాంబ.
మీ ఫ్యామిలీ బిజినేసేగా
అప్పుడే శేషు వచ్చి పాత బుద్ధులు చూపిస్తున్నావన్నమాట. వంట పనికి వెళ్లి చెంబులు, గిన్నెలు బ్యాగులో పెట్టుకుని వచ్చేదానివిగా అని శేషు అంటాడు. దాంతో కోపంగా బ్యాగ్ విసిరేస్తుంది. అందులోనుంచి సర్టిఫికేట్స్ కింద పడతాయి. శేషును భ్రమరాంబ తిడుతుంది. భ్రమరాంబ నీ ఫ్యామిలీనే అంతగా అని శేషు అంటాడు. దాంతో శేషు వెంట పడుతుంది భ్రమరాంబ.
{{/usCountry}}అప్పుడే శేషు వచ్చి పాత బుద్ధులు చూపిస్తున్నావన్నమాట. వంట పనికి వెళ్లి చెంబులు, గిన్నెలు బ్యాగులో పెట్టుకుని వచ్చేదానివిగా అని శేషు అంటాడు. దాంతో కోపంగా బ్యాగ్ విసిరేస్తుంది. అందులోనుంచి సర్టిఫికేట్స్ కింద పడతాయి. శేషును భ్రమరాంబ తిడుతుంది. భ్రమరాంబ నీ ఫ్యామిలీనే అంతగా అని శేషు అంటాడు. దాంతో శేషు వెంట పడుతుంది భ్రమరాంబ.
{{/usCountry}}ఇందు సర్టిఫికేట్స్ సర్దుతుంటే ఎవరివి ఆ సర్టిఫికెట్స్ అని రేఖ గొంతు వినిపిస్తుంది. దాంతో భయపడుతూ అది అని వెనక్కి చూస్తే అలా మాట్లాడింది స్వాతి. రేఖ వాయిస్‌ను ఇమిటేట్ చేస్తుంది స్వాతి. అది చూసి ఇందు తేరుకుంటుంది. స్వాతి నవ్వుతుంది. స్వాతిని సరదాగా కోప్పడి ఇంట్లోంచి అడుగు బయటపెడుతుంది. మొదటిసారి కొత్త లోకంలోకి అడుగు పెడుతున్నా, నువ్వే దారి చూపించాలని కృష్ణయ్యను వేడుకుంటుంది ఇందు.
శివరామ్ ఇంటికి ఇందు వెళ్లి థ్యాంక్స్ చెబుతుంది. ఇక్కడ నువ్వు వంట చేయాల్సింది ఏం లేదు. నువ్వు అడిగావనే నేను రమ్మన్నాను. నీ వాళ్ల దగ్గర నీకు ఏదో ఇబ్బంది ఉందని అర్థమైంది. కానీ నేను అది అడగను. కానీ, బయటకు ఎందుకు రావాలనుకున్నావ్ అని శివరామ్ అంటాడు. జాబ్ చేసేందుకు అని ఇందు చెబుతుంది. దాంతో ఇందును మెచ్చుకుని తన సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెబుతాడు శివరామ్.
రాజ్, ఇందు గొడవ
ఇందు లొకేషన్ చూసుకుంటూ రోడ్డుమీద వెళ్తుంది. మరోవైపు బైక్ విడిపించుకున్న రాజ్ వచ్చి డ్యాష్ ఇస్తాడు. దాంతో ఇందు ఫోన్ పగిలిపోతుంది. రాజ్, ఇందు గొడవ పెట్టుకుంటారు. ప్రతిసారి నాకు ఇలా నష్టం కలిగిస్తున్నావేంటీ, నా ఫోన్ నాకు రిపేర్ చేయించు లేకపోతే పోలీస్ కంప్లైంట్ ఇస్తా, నన్ను వేధిస్తున్నావని కేసు వేస్తాను అని ఇందు అంటుంది.
రాజ్ కోప్పడుతాడు. ఎధవ అని తిడుతుంది ఇందు. ఇప్పుడు గొడవ పడితే పబ్లిక్ అంతా వాళ్లకే సపోర్ట్ చేస్తారు. మన చెన్నై డీల్ పోతుందిరా అని ఫ్రెండ్ అనడంతో ఇందుకు సారీ చెబుతాడు రాజ్. స్క్రీన్ గార్డ్ పోయింటుంది, ఐదు వందలు ఇస్తానని రాజ్ అంటాడు. ఫోన్ ఆన్ కావట్లేదు, నా ఇంటర్వ్యూ అడ్రస్ ఇందులోనే ఉందని ఇందు అంటుంది.
రాజ్‌కు ఫ్రెండ్ సర్దిచెబుతాడు. పక్కన మొబైల్ షాప్ ఉంది, రిపేర్ చేయించి ఎంత ఖర్చు అయిన పెట్టుకుంటామని రాజ్ ఫ్రెండ్ అంటాడు. దాంతో ఇందు ఒప్పుకుంటుంది. షాప్‌కు వెళ్లి ఫోన్ త్వరగా చూడమని చెబుతారు. అది చూసిన షాప్ అతను స్క్రీన్ గార్డ్ పోయింది, స్పీకర్స్ పోయాయి, బ్యాటరీ ఫెయిల్ అయింది. మొత్తం రూ. 7 వేలు అవుతుందంటాడు.
ఇందుకు రాజ్ కొత్త ఫోన్
అరేయ్ ఏడు వేలకు కొత్త ఫోనే వస్తుందిగారా అని రాజ్ అంటాడు. నాకు కొత్తది వద్దు ఇదే కావాలని ఇందు అంటుంది. ఇప్పుడు పాత ఫోన్ రిపేర్లన్నీ నాతో చేయించాలనుకుంటున్నావా అని రాజ్ అరుస్తాడు. ఏడు వేలు కట్టి 7 రోజులకు రండి అని షాప్ అతను అంటాడు. నాకు ఇప్పుడే కావాలి. కంపెనీ ఇంటర్వ్యూ అడ్రస్ అందులోనే ఉంది. నాకు ఇంకో ఫోన్ ఎందుకు అని ఇందు అంటుంది.
మీ సిమ్ కొత్త ఫోన్‌లో వేయగానే ఆ మెసేజ్‌లు వస్తాయని షాప్ అతను అంటాడు. దాంతో రాజ్ కొత్త ఫోన్ ఇవ్వమంటాడు. షాప్ అతను కొత్త ఫోన్‌లో ఇందు సిమ్ వేస్తాడు. మెసేజ్ వచ్చిందని చెబుతాడు. దాంతో ఇందు సంతోషిస్తుంది. కానీ, రాజ్‌తో కృతజ్ఞతతో ఉండదు. కొత్త ఫోన్ కొనిచ్చిన కృతజ్ఞత లేదని రాజ్ కోపంగా అనుకుంటాడు.
సుభాష్‌కు డేంజర్
నా ఇంటర్వ్యూ మిస్ అవ్వాలి నీ సంగతి చెబుతా అని వెళ్లిపోతుంది ఇందు. అలా ఇందుకు రాజ్ కొత్త ఫోన్ కొనిస్తాడు. మరోవైపు సుభాష్‌కు బ్రీతింగ్ సమస్య వస్తుంది. అలా వచ్చేలా ఇంజక్షన్ చేసి ఉంటావని రేఖను అంటుంది అపర్ణ. దానికి యాంటీడోస్ వేయాలి, లేకుండా డాక్టర్స్ కూడా కాపాడలేరని రేఖ అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.