బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో సుభాష్ ను అడ్డం పెట్టుకొని రేఖ తన పంతం నెగ్గించుకుంటుంది. ఇక ఎప్పుడూ అపర్ణ తనకు ఎదురు చెప్పకుండా తాను వేసిన ప్లాన్ సక్సెస్ అవుతుంది. మరోవైపు రాజు మెల్లగా తన వాళ్లకు దగ్గరయ్యేలా గతం గుర్తుకు రావడం మొదలైనట్లు చివర్లో వచ్చిన సీన్ చూస్తే అర్థమవుతోంది.
యాంటీ డోట్ ఇవ్వనంటూ రేఖ పంతం

బ్రహ్మముడి సీరియల్ శనివారం (మార్చి 21) ఎపిసోడ్ సుభాష్ కు యాంటీ డోట్ ఇవ్వాలని రేఖను ఇందు వేడుకునే సీన్ తో మొదలవుతుంది. డాక్టర్ ద్వారా ఏదో ఇంజెక్షన్ ఇప్పించి అతనికి ఊపిరి ఆడకుండా చేసిన రేఖ.. ఆ యాంటీ డోట్ తన దగ్గరే ఉందని, కానీ తాను ఇవ్వనని అంటుంది. దీంతో ఇందు ఆమెను ప్రాధేయపడుతుంది. దీంతో అది ఇంట్లోనే ఉందని చెబుతుంది.
ఇందుతో ఆడుకున్న రేఖ
మొదట తన గదిలో ఉంది వెళ్లి తెచ్చుకోమని ఇందుకి చెబుతుంది. ఆమె పరుగెత్తుకుంటూ వెళ్లి అక్కడ చూసిన దొరకదు. మళ్లీ రేఖ దగ్గరకి వస్తుంది. ఈసారి భ్రమరాంబ గదికి పంపిస్తుంది. ఆ తర్వాత తన తాతయ్య గదికి వెళ్లమంటుంది. ఐశ్వర్య గదికీ పంపుతుంది. చివరికి స్వాతి గదిలో ఉందని అంటుంది. రేఖ ఆడుతున్న నాటకం అర్థమై ఇందును అడ్డుకుంటుంది అపర్ణ. అది రేఖ దగ్గరే ఉందని చెబుతుంది.
లాయర్ విషయం తెలుసుకున్న రేఖ.. అపర్ణ షాక్
ఈ విషయం బాగానే అర్థం చేసుకున్నావు.. మరి నా చేతిలో ఉన్న ఆస్తిని నీ మనవరాలి పేరిట రాసేందుకు లాయర్ ను కలిస్తే నాకు తెలియదు అనుకుంటున్నావా అని అపర్ణను రేఖ నిలదీస్తుంది. దీంతో ఆమె షాక్ తింటుంది. నువ్వు నాకు తెలియకుండా బయటకు వెళ్తావు.. మీ నాన్నమ్మ లాయర్ ను కలుస్తుంది అని అనగానే ఇందు కూడా ఆశ్చర్యపోతుంది.
ఇది నిజమేనా నాన్నమ్మ అని ఇందు ఆమెను నిలదీస్తుంది. నీకు తెలియకుండానే ఆమె అలా చేస్తుందా అని రేఖ అంటుంది. ఇక మీదట నాకు ఎదురు తిరిగే ఏ పని చేసినా సహించను అని స్పష్టం చేస్తుంది.
రేఖకు క్షమాపణ చెప్పిన అపర్ణ.. యాంటీడోట్ ఇచ్చిన రేఖ
{{/usCountry}}ఇది నిజమేనా నాన్నమ్మ అని ఇందు ఆమెను నిలదీస్తుంది. నీకు తెలియకుండానే ఆమె అలా చేస్తుందా అని రేఖ అంటుంది. ఇక మీదట నాకు ఎదురు తిరిగే ఏ పని చేసినా సహించను అని స్పష్టం చేస్తుంది.
రేఖకు క్షమాపణ చెప్పిన అపర్ణ.. యాంటీడోట్ ఇచ్చిన రేఖ
{{/usCountry}}అలాంటి పనులు ఏమీ చేయమని, ఆ యాంటీ డోట్ ఇవ్వాలని ఇందు వేడుకుంటుంది. నువ్వు అంటున్నావు కానీ మీ నాన్నమ్మ చెప్పడం లేదు కదా అని రేఖ అంటుంది. దీంతో అపర్ణ కూడా కంటతడి పెడుతూ.. రేఖ కాళ్ల దగ్గర కూర్చొని తనను క్షమించమని అడుగుతుంది.
ఇంక ఎప్పుడూ నీమీద అరవను అని, ఇలాంటి పనులు చేయను అని అంటుంది. దీంతో రేఖ దిగి వస్తుంది. భూషణ్ దగ్గర ఉన్న యాంటీడోట్ ను ఇందుకి ఇస్తుంది. దీంతో అపర్ణ, ఇందు పరుగెత్తుకుంటూ వెళ్లి సుభాష్ కు యాంటీడోట్ ఇస్తారు. అది ఇవ్వగానే అతడు కాస్త కుదటపడతాడు.
ఎందుకిలా చేశావంటూ అపర్ణను నిలదీసిన ఇందు
ఆ తర్వాత ఎందుకిలా చేశావంటూ అపర్ణను ఇందు నిలదీస్తుంది. నీకోసమే చేశానని ఆమె అంటుంది. మీరు లేకుండా ఈ ఆస్తి అవసరం లేదు.. అయినా ఆ రేఖ ఈ ఆస్తి తన పేరిట వచ్చే వరకు మనల్ని ఏమీ చేయదు అని ఇందు చెబుతుంది. ఇక నుంచి నువ్వు రేఖకు ఎదురు తిరగొద్దు.. ఏం జరిగినా నేను చూసుకుంటానని అంటుంది. అపర్ణ సరే అంటుంది. ఆ తర్వాత మరో ఉద్యోగం కోసం ఇందు ప్రయత్నాలు మొదలుపెడుతుంది.
రాజుకు గుర్తుకు వస్తున్న గతం
మరోవైపు రాజు నిద్రలో ఉండగా బస్సు పేలిపోయిన సీన్ గుర్తుకు వస్తుంది. దీంతో ఉలిక్కి పడి లేస్తాడు. అదే విషయం తల్లిదండ్రులకు చెబుతాడు. బస్సు మంటల్లో ఉందని, తాను అందులో నుంచి బయటపడినట్లుగా అనిపించిందని అంటాడు. కలే కదా అని తల్లి చెప్పినా రాజు బాధగా ఉంటాడు. ఇలా ఎందుకు జరిగింది.. రాజుకు అతని అయినవాళ్లు ఎవరైనా దగ్గరవుతున్నారా అని భర్తను ఆమె అడుగుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.