...
...
Next Story

Brahmamudi March 26th Episode: బ్రహ్మముడి- ఇందుపై నగల దొంగతనం-భర్తకు నిజం చెప్పిన భ్రమరాంబ-10 లక్షల నెక్లెస్‌కు 2 లక్షలు

Brahmamudi Serial March 26th Episode: బ్రహ్మముడి సీరియల్ మార్చి 26వ తేది ఎపిసోడ్‌లో ఐశ్వర్య నెక్లెస్ రాజ్, లక్కీలకు దొరుకుతుంది. దాన్ని అమ్మేసిన డబ్బుతో ఎంజాయ్ చేయడమే కాకుండా ఐశ్వర్యకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటారు రాజ్, లక్కీ. ఇంట్లో రెండు నెక్లెస్‌ల దొంగతనం జరిగిందని రేఖ చెబితే అంతా ఇందుపై నింద వేస్తారు.

Published on: Mar 26, 2026, 07:45:03 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో కారులో ఐశ్వర్య నెక్లెస్ లక్కీకి దొరుకుతుంది. అది తీసి రాజ్‌కు చూపిస్తాడు లక్కీ. అది ఐశ్వర్య నెక్లెస్ అయింటుందని, తీసుకెళ్లి తనకిస్తే తనపై మంచి ఇంప్రెషన్ వస్తుందని లక్కీ చెబుతాడు.

గిఫ్ట్ ఇస్తే ఐశ్వర్య పడిపోతుంది

బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 26వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్‌ మార్చి 26వ ఎపిసోడ్

కానీ, అలా చేస్తే మంచి ఇంప్రెషన్ రావచ్చు, రాకపోవచ్చు. దానికి బదులు నెక్లెస్ అమ్మేసి ఆ డబ్బులతో మనం ఎంజాయ్ చేయడమే కాకుండా ఒక చిన్న గిఫ్ట్ ఐశ్వర్యకు ఇస్తే కచ్చితంగా ఇంప్రెస్ అవుతుంది, మంచితనంకంటే గిఫ్ట్‌లకు అమ్మాయిలు పడతారు అని రాజ్ అంటాడు. దానికి లక్కీ ఒప్పుకుంటాడు.

మరోవైపు లాకర్‌కి తాళం అలాగే ఉండటం చూసి షాక్ అయిన రేఖ ఓపెన్ చేసి చూస్తుంది. రెండు నగలు మిస్ అయ్యేసరికి కిందకు వచ్చి భూషణ్‌తో చెబుతుంది. ఇది ఇంట్లోవాళ్ల పనే అని భూషణ్ అంటాడు. భ్రమరాంబ కంగారుపడుతుంది. అప్పుడే వచ్చిన ఐశ్వర్య కూడా టెన్షన్ పడుతుంది. ఇలాంటి చేతివాటం మీ అక్కకు ఉందని తెలుసగా బామ్మర్ది అని శేషు అంటాడు.

ఆ నెక్లెస్ తీసింది తనమీదకు రాకుండా చూసుకోవాలి అనుకున్న ఐశ్వర్య ఆ ఒక్క నెక్లెస్ పోవడం ఏంటీ అని అడుగుతుంది. ఒక్కటని ఎవరు చెప్పారు, రెండు నెక్లెసులు పోయాయని రేఖ అంటుంది. తను వెళ్లగానే ఇంకోటి మరొకరు తీసుకున్నట్లున్నారని ఐశ్వర్య అనుకుంటుంది. వాటిని దొంగలించింది ఎవరు, నా వస్తువులు తాకే ధైర్యం ఇంట్లో ఎవరికి ఉందో తెలియాలని రేఖ అంటుంది.

ముసలోడి ఆపరేషన్ కోసం

అదో పెద్ద లాజిక్గా బయటకు వెళ్లినట్లే వెళ్లి తిరిగి వచ్చి చేసి ఉంటుందని రేఖ అంటుంది. అది ఇంటికి రాని అప్పుడు చెబుతానని రేఖ అంటుంది. ఓ జ్యూవెలరి షాప్‌కు వెళ్లి నెక్లెస్ చూపిస్తాడు. వీళ్లను భయపెట్టి తక్కువ లాగుదాం అనుకున్న సేటు ఇలాంటివి కొనను, దొంగబంగారం కొనను అని సేటు అంటాడు. మీ షాపులో అన్ని దొంగ బంగారమే అని మాకు తెలుసు అని రాజ్ అంటాడు.

దాంతో సేటు సరేనని రెండు లక్షలు ఇస్తానంటాడు. దీనికి మినిమమ్ 10 లక్షలు ఉంటుందని రాజ్ అంటాడు. అది నాకు తెలుసు. మీ దగ్గర బిల్ లేదు. అది క్రియేట్ చేయాలి. దానికి చాలా ఖర్చు అవుతుంది సరే మీ రేట్ చెప్పమని సేటు అంటే.. రాజ్ 5 లక్షలు చెబుతాడు. అంత రాదు. 2 లక్షల కంటే ఒక్క రూపాయి రాదు అని సేటు అంటాడు.

తాకట్టు పెట్టాలని వచ్చాం

నా టైమ్ వేస్ట్ చేయకు. వీఐపీ కస్టమర్స్ వస్తారని సేటు అంటే.. వీళ్లేనా అని ఇందు, నందు వస్తారు. రాజ్, ఇందు జరిగిన గొడవపై వాదించుకుంటారు. నందు పోలీస్ లాంటిదని తెలిసి రాజ్, లక్కీ భయపడతారు. మీరు ఇక్కడికి వచ్చారంటే దొంగ బంగారం అమ్మేందుకేగా అని రాజ్‌ను అంటుంది ఇందు.

కాదు. మనుషులన్నాక కష్టాలు రావా. మా బంగారం తాకట్టు పెట్టాలనుకున్నాం. కానీ ఇలాంటి వాళ్ల దగ్గర పెడితే మా పరువు పోతుందని రాజ్, లక్కీ జారుకుంటారు. దొంగ బంగారం కొనడం నేరమని తెలియదా సేటు అని నందు అడిగితే.. కానీ, అమ్మవారి నగలు మాత్రం కొనను అని సేటు అంటాడు. అది నేను చెప్పలేదే అని నందు అంటుంది.

ఇంతలో ఇందుకు స్వాతి కాల్ చేసి ఇంట్లో జరిగిన దొంగతనం, ఇందును అనుమానించడం గురించి చెబుతుంది. ఇంటికొచ్చేటప్పుడు ఏదో ఒకటి ఆలోచించుకుని రా అని స్వాతి కాల్ కట్ చేస్తుంది. మరోవైపు కొట్టేసిన నెక్లెస్ బీరువాలో భ్రమరాంబ పెడుతుంటుంది. వెనుక నుంచి శేషు చేయి వేయడంతో భయపడిపోతుంది భ్రమరాంబ.

నిజం చెప్పిన భ్రమరాంబ

చేయాల్సింది చేశాను అని నెక్లెస్ చూపిస్తుంది భ్రమరాంబ. మొదటి నెక్లెస్‌ను ఐశ్వర్య కొట్టేసిందని భర్తకు నిజం చెబుతుంది భ్రమరాంబ. అందరూ దొంగలే అని శేషు అంటాడు. కొంగులో నెక్లెస్ మూట కడుతుంది భ్రమరాంబ. అలా చేస్తే దొరికిపోతావని శేషు అనడంతో బెడ్ కింద పెడుతుంది భ్రమరాంబ. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe