Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్‌లో రెస్టారెంట్‌లో రోజాను కలిసేందుకు వెంకీ నందుతోపాటు వెళ్తాడు. వెళ్లి పలకరిస్తాడు. తీసుకొచ్చిన రోజ్ ఫ్లవర్‌ను రోజాకు ఇస్తాడు వెంకీ. నందు కవిత చెబితే అదే వెంకీ చెబుతాడు. వెంకీ చెప్పింది విన్న రోజా చాలా ఇంప్రెస్ అవుతుంది. ఆఫీస్‌లో ఎందుకు ఇలా ఉండవని అడుగుతుంది. ఇంతలో నందుకు ఓ రౌడీ కనిపించడంతో వాడి గురించి మాట్లాడుతుంది.
పౌడర్ బాగా అమ్ముతున్నావా

అవే మాటలు రోజాతో వెంకీ మాట్లాడుతాడు. దాంతో రోజా కోప్పడుతుంది. ఆ రౌడీ దగ్గరికి వెళ్లి ఏరా పౌడర్ బాగా అమ్ముతున్నావా, మత్తు పదార్థాలు అమ్మేవాడికి నా గురించి చెప్పాల అని నందు అంటుంది. దాంతో రౌడీ పారిపోతాడు. పట్టుకోడానికి నందు వెళ్తుంది. తన గురించి ఇంకా మాట్లాడమని వెంకీని రోజా అడుగుతుంది. ఇక వెంకీ ఏం మాట్లాడలేకపోతాడు. దాంతో కోపంగా రోజా వెళ్లిపోతుంది.
మరోవైపు ఇందుకు బైక్‌పై వచ్చిన రాజు డ్యాష్ ఇస్తాడు. దాంతో ఇందు కూరగాయలు కిందపడతాయి. నన్ను గుద్దడానికే రోడ్ మీదకు వచ్చారా అంటూ ఇందు గొడవ పడుతుంది. లక్కీ ఆపి రోడ్డు మీద పడ్డ కూరగాయలు ఏరి ఇస్తాడు. కిందపడిన కూరగాయలు తీసుకోవాలా. వాటితో వంట వండను అని ఇందు అంటుంది. దాంతో కొత్త కూరగాయలు కొనిస్తానని లక్కీ చెబుతాడు. రాజు కొనిస్తేనే ఇగో సాటిస్‌ఫై అవుతుందని ఇందు అంటుంది.
కూరగాయలకు 500
దాంతో రాజు, లక్కీ ఇద్దరు ఇందుకు కూరయగాలు కొంటారు. కూరగాయలకు రూ. 500 అయ్యాయని కూరగాయలతను చెబుతాడు. దాంతో రాజు, లక్కీ షాక్ అవుతారు. దీంతో గొడవ పడే ఓపిక లేదని డబ్బు ఇస్తాడు రాజు. ఇంతలో తను తెల్ల ఉల్లిపాయలు అడిగానని, అవి లేవని ఇందు అంటుంది. దాంతో చేసేది లేక లక్కీ వెళ్లి తెల్ల ఉల్లిపాయలు కొని తీసుకొస్తాడు. అవి తీసుకుని ఇందు వెళ్లిపోతుంది.
డ్రగ్స్ అమ్మే వాడి వెంట నందు పడుతుంది. నేను దొరికిన పర్వాలేదు, ఈ బ్యాగ్ దొరికితే సమస్య అవుతుందని అనుకుంటాడు. రాజ్, లక్కీ రావడం చూసి చెస్ట్ పెయిన్ అని నాటకం ఆడుతాడు. తాను హాస్పిటల్‌కు వెళ్తానని, బస్టాండ్‌లో ఉన్న తన నాన్నకు ఈ బ్యాగ్‌లో మందులు ఇవ్వాలని, అవి చేరకుంటే చాలా మంది ప్రాణాలు పోతాయని, బ్యాగ్ ఇస్తే రూ. 10 వేలు ఇస్తానని డ్రగ్ డీలర్ అంటాడు. దాంతో డబ్బుకు కక్కుర్తిపడి రాజ్, లక్కీ ఒప్పుకుంటారు.
డ్రగ్స్ కేసులో రాజు, లక్కీ
{{/usCountry}}డ్రగ్స్ అమ్మే వాడి వెంట నందు పడుతుంది. నేను దొరికిన పర్వాలేదు, ఈ బ్యాగ్ దొరికితే సమస్య అవుతుందని అనుకుంటాడు. రాజ్, లక్కీ రావడం చూసి చెస్ట్ పెయిన్ అని నాటకం ఆడుతాడు. తాను హాస్పిటల్‌కు వెళ్తానని, బస్టాండ్‌లో ఉన్న తన నాన్నకు ఈ బ్యాగ్‌లో మందులు ఇవ్వాలని, అవి చేరకుంటే చాలా మంది ప్రాణాలు పోతాయని, బ్యాగ్ ఇస్తే రూ. 10 వేలు ఇస్తానని డ్రగ్ డీలర్ అంటాడు. దాంతో డబ్బుకు కక్కుర్తిపడి రాజ్, లక్కీ ఒప్పుకుంటారు.
డ్రగ్స్ కేసులో రాజు, లక్కీ
{{/usCountry}}రాజు ఫోన్ నెంబర్ తీసుకుంటాడు మత్తు పదార్థాలు అమ్మే వ్యక్తి. రాజ్ పేరు చెప్పి డ్రగ్స్ పంపిస్తున్నాని కాల్ చేసి చెబుతాడు. ఇంతలో నందు, పోలీసులు వచ్చి అతన్ని పట్టుకుంటారు. బ్యాగ్ లేకపోవడంతో ఇద్దరికి బ్యాగ్ ఇచ్చాడని, వాళ్లు అటు వెళ్తున్నారని నందు చూపిస్తుంది. దాంతో రాజ్, లక్కీ వెంట పోలీసులు పడతారు.
తమ వెంట పోలీసులు పడటంతో రాజ్, లక్కీ భయపడిపోతారు. ఇదేదో సమస్య తెచ్చే బ్యాగ్‌లా ఉందనుకుంటారు. రాజ్, లక్కీ డ్రగ్స్ కేసులో ఇరుక్కుంటారు. మరోవైపు ఆస్తి కోసం ఇందుతో సంతకం పెట్టించుకునేందుకు ప్రేమ ఉన్నట్లు నాటకం ఆడుతుంది రేఖ.
బావ హెల్ప్ అడిగిన ఇందు
రేఖతో యుద్ధం చేసేందుకు సిద్ధంగా ఉండాలని అనుకున్న ఇందు సహాయం తోసం రాజుకు కాల్ చేస్తుంది. అంటే తనకు తెలియకుండానే తన బావ హెల్ప్ అడుగుతుంది ఇందు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.