బ్రహ్మముడి సీరియల్ ఈరోజు మార్చి 6 ఎపిసోడ్ లో ఇందుతోపాటు పెద్దయిన తర్వాత రాహుల్ కూతురు ఐశ్వర్య, భ్రమరాంబ కూతురు స్వాతిలను కూడా పరిచయం చేశారు. అయితే ఇందుకి స్వాతి సపోర్ట్ గా ఉండటం చూడొచ్చు. ఐశ్వర్య మాత్రం తన తండ్రిలాగే అవతలి వాళ్లను మోసం చేసే బుద్దులే వస్తాయి.
రాజుకు క్లాస్ పీకిన తండ్రి

బ్రహ్మముడి సీరియల్ శుక్రవారం (మార్చి 6) ఎపిసోడ్ రాజుకి అతని తండ్రి క్లాస్ పీకే సీన్ తో మొదలవుతుంది. షార్ట్ కట్ లో కష్టపడకుండా డబ్బులు సంపాదించే ఆలోచనతో ఉంటాడు రాజు. మరోవైపు అతని తమ్ముడు మాత్రం సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తుంటాడు. తమ్ముడిని చూపించి రాజును తండ్రి తిడతాడు.
నీకంటే వయసులో చిన్నవాడైనా ఉద్యోగం చేస్తూ తనకు తోడుగా ఉంటున్నాడని అంటాడు. కానీ రాజు మాత్రం మీలాంటి మిడిల్ క్లాస్ జీవితం తనకొద్దని, ఏదో రోజు బిజినెస్ చేసి బాగా డబ్బు సంపాదిస్తానని చెబుతాడు. రాజుకు తోడుగా అతని ఫ్రెండ్ కూడా అలాగే బలాదూర్ తిరుగుతుండటంతో ఇద్దరినీ కలిపి రాజు తండ్రి తిడతాడు.
భూషణ్‌కు రేఖ క్లాస్.. ఇందులో ఎగ్జామ్ టెన్షన్
మరోవైపు ఇంట్లో ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్ రెడీ చేస్తూ ఇందు టెన్షన్ పడుతూ ఉంటుంది. రేఖ ఆంటీ ఇంకా ఆఫీసుకు వెళ్లడం లేదు.. తనకు ఎగ్జామ్ టైమ్ అవుతుందని అనుకుంటుంది. అప్పుడే రేఖ టిఫిన్ చేయడానికి వస్తుంది. ఆమె వెంటే భూషణ్ కూడా వస్తాడు. ఇంకా ఇంట్లోనే ఉన్నావేంటని అతనికి రేఖ క్లాస్ పీకుతుంది.
ఆ అప్పు ఇచ్చిన చక్రి దగ్గరికి వెళ్లి మేనేజ్ చేయమని చెప్పాను కదా.. నువ్వు చేసిన అప్పులే ఇవన్నీ.. ఆ క్లబ్ కి వెళ్లి పేకాట ఆడి మొత్తం పోగొట్టుకుంటున్నానవని తిడుతుంది. తన ఎగ్జామ్ టైమ్ అవుతుండటంతో రాహుల్ కూతురు ఐశ్వర్యకు ఎగ్జామ్ ఉన్న విషయం గుర్తు చేస్తే రేఖ తొందర పెడుతుంది కదా అనుకొని ఇందు ఆమెకు చెబుతుంది.
రేఖ దగ్గర కవర్ చేసిన ఐశ్వర్య
{{/usCountry}}ఆ అప్పు ఇచ్చిన చక్రి దగ్గరికి వెళ్లి మేనేజ్ చేయమని చెప్పాను కదా.. నువ్వు చేసిన అప్పులే ఇవన్నీ.. ఆ క్లబ్ కి వెళ్లి పేకాట ఆడి మొత్తం పోగొట్టుకుంటున్నానవని తిడుతుంది. తన ఎగ్జామ్ టైమ్ అవుతుండటంతో రాహుల్ కూతురు ఐశ్వర్యకు ఎగ్జామ్ ఉన్న విషయం గుర్తు చేస్తే రేఖ తొందర పెడుతుంది కదా అనుకొని ఇందు ఆమెకు చెబుతుంది.
రేఖ దగ్గర కవర్ చేసిన ఐశ్వర్య
{{/usCountry}}అయితే ఐశ్వర్య ఇంకా నిద్ర లేవలేదని ఇందు అంటుంది. దీంతో రేఖ పరుగెత్తుకొని వెళ్తుంది. అప్పుడే నిద్ర లేచిన ఐశ్వర్య పెద్దగా మ్యూజిక్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. రేఖ రావడం గమనించి వెంటనే బుక్స్ తీసుకొని చదువుతుంది. కానీ ఆరోజు ఉన్న ఎగ్జామ్ ఒకటైతే ఆమె మరో సబ్జెక్ట్ చదువుతూ దొరికిపోతుంది. రాత్రి పార్టీ నుంచి 3 గంటలకు వచ్చానని రేఖకు చెబుతుంది. మరి ఎగ్జామ్ ఎలా రాస్తావని అడిగితే.. ఏదో ఒకటి చేస్తానని అంటుంది. దీనికి అన్నీ తన అన్నయ్య రాహుల్ బుద్ధులే వచ్చాయని రేఖ అంటుంది.
షార్ట్ కట్‌లో రాజు డబ్బు సంపాదన
ఇటు షార్ట్ కట్ లో డబ్బు సంపాదించి గొప్పవాడిని కావాలని అనుకునే రాజు ఓ పాత ల్యాప్‌టాప్ ను రిపేర్ చేయించి రూ.50 వేలకు అమ్ముతున్నట్లు జెడ్‌ఎల్ఎక్స్ లో పెడతాడు. అందుకు తగినట్లే కస్టమర్లతోనూ ఫోన్లలో మాట్లాడుతూ బోల్తా కొట్టిస్తుంటాడు. ఓ కస్టమర్ కాల్ చేస్తే ఓ ఖరీదైన హోటల్ పేరు చెప్పి అక్కడికి రావాలని, అక్కడే ల్యాప్ టాప్ ఇస్తానని అంటాడు. అది విని అతని ఫ్రెండ్ కంగారు పడితే.. ఇలా చేస్తేనే వాళ్లు మనల్ని నమ్ముతారని రాజు చెబుతాడు. రాజు దగ్గర ఉన్న ఈజీగా డబ్బు సంపాదించే తెలివితేటలు చూసి అతని ఫ్రెండ్ షాక్ తింటాడు.
కృష్ణుడికి ఇందు కంప్లైంట్.. స్వాతి అదిరిపోయే ప్లాన్
ఇంట్లో కృష్ణయ్య దగ్గరికి వచ్చి ఇందు బాధపడుతుంటుంది. అసలు నీకు మానవత్వం ఉందా.. ఎంత పని ఉన్నా ముందుగా నీకే పూజ చేస్తాను.. కానీ ఇవాళ ఎగ్జామ్ ఉంటే నాకు ఏమాత్రం సాయం చేయడం లేదని కంప్లైంట్ చేస్తుంది. అప్పుడే నీకు అభయం ఇస్తున్నానంటూ కృష్ణుడు మాట్లాడినట్లుగా భ్రమరాంబ కూతురు స్వాతి మాట్లాడుతుంది.
దీంతో ఇందు ఆమె చెవి పట్టుకొని నన్నే ఆట పట్టిస్తావా అని అంటుంది. నిన్ను ఎగ్జామ్ కు పంపే బాధ్యత తనదని స్వాతి చెబుతుంది. మీ అమ్మ అక్కడే ఉందిగా అంటూ అపర్ణ వస్తుంది. ఆమెనే పంపించేలా తాను ప్లాన్ చేస్తానని, తన బట్టలు నీకు ఇచ్చి బయటకు పంపిస్తానని అంటుంది. ఇద్దరూ హాల్లోకి వెళ్లి నాటకం మొదలుపెడతారు.
రాజు, ఇందు గొడవ
ఎగ్జామ్ కని కారులో బయలుదేరుతుంది ఇందు. అప్పుడే రాజు తన బైకుపై వస్తుంటాడు. రాంగ్ రూట్ లో వచ్చి ఇందు కారును ఢీకొడతాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరుగుతుంది. తన కాలు విరిగిందని రాజు నాటకం ఆడుతుంటే.. తప్పంతా నీదే పోలీస్ స్టేషన్ కు వెళ్దామని ఇందు అంటుంది. దీంతో రాజు కంగారు పడతాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.