బ్రహ్మముడి సీరియల్ మార్చి 9 ఎపిసోడ్ లో ఐశ్వర్య చీటింగ్ చేస్తూ పట్టుబడటం, ఎగ్జామ్ రాసొచ్చి రేఖకు ఇందు దొరికిపోవడం, అటు నకిలీ ల్యాప్‌టాప్ ను రాజు అమ్మేయడం, చివరికి ఇందు ఆస్తి మొత్తం కాజేయాలని చూసే రేఖ.. సుభాష్ సర్జరీకి మాత్రం డబ్బుల్లేవంటూ ఇందుపై అరవడంలాంటివి చూడొచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
చీటింగ్ చేస్తూ పట్టుబడ్డ ఐశ్వర్య

బ్రహ్మముడి సీరియల్ సోమవారం (మార్చి 9) ఎపిసోడ్ ఎగ్జామ్ హాల్లో చీటింగ్ చేస్తూ ఐశ్వర్య పట్టుబడే సీన్ తో మొదలవుతుంది. చిట్టీ చూస్తూ రాస్తుండగా ఇన్విజిలేటర్ ఆమెను పట్టుకుంటాడు. అయినా కూడా ఐశ్వర్య నోటికి వచ్చినట్లు మాట్లాడుతుంది. మీరు ఎగ్జామ్ రాసివ్వకపోయినా వచ్చే నష్టం ఏమీ లేదు.. బయట ఎన్నో సర్టిఫికెట్లు దొరుకుతాయి అని అంటుంది. అంతేకాదు తన ఫ్రెండ్స్ దగ్గర కూడా చిట్టీలు ఉన్నాయంటూ వాళ్లనూ ఇరికించి తనతోపాటు తీసుకెళ్తుంది.
కంపెనీ రాసివ్వమన్న చక్రి.. రేఖ రివర్స్ ప్లాన్
మరోవైపు చక్రి దగ్గర రూ.10 కోట్లు అప్పు చేసిన భూషణ్ పూర్తిగా ఇరుక్కుంటాడు. డబ్బు ఇవ్వకపోతే తన కంపెనీ రాసివ్వమంటాడు. సంతకం పెట్టాలంటాడు. దీంతో రేఖ రివర్స్ గేమ్ ఆడుతుంది. సంతకం పెట్టమని భూషణ్ కు చెబుతుంది. అది విని చక్రి షాకవ్వగా.. అతని కంపెనీ నష్టాల్లో ఉందని చెబుతుంది. అలాంటి కంపెనీ తీసుకొని ఏం చేస్తావని అడుగుతుంది.
మరికొన్ని రోజుల్లో ఇందు తన ఆస్తిని మొత్తం తనకు రాసివ్వబోతోందని, ఆ తర్వాత ఎన్నో కాంట్రాక్టులు నీ సొంతమవుతాయని చక్రికి ఆశ చూపిస్తుంది. దాంతో పోలిస్తే ఈ రూ.10 కోట్లు ఎంత? భూషణ్ కంపెనీ తీసుకుంటానంటే తీసుకో అంటుంది. దీంతో చక్రి వద్దంటాడు. రేఖ మాటలను నమ్ముతాడు. ఆ ఆస్తి తన సొంతం కావాలంటే మరో రూ.2 కోట్లు కావాలంటూ ఆ డబ్బును కూడా చక్రి దగ్గరే వసూలు చేయడం విశేషం.
నకిలీ ల్యాప్‌టాప్ అమ్మేసిన రాజు
ఇటు రాజు తన తెలివితేటలను ఉపయోగించి నకిలీ ల్యాప్‌టాప్ ను జాన్సన్ అనే వ్యక్తికి అంటగట్టాలని ప్లాన్ చేస్తాడు. అతన్ని ఖరీదైన హోటల్ కు పిలుస్తాడు. అప్పటికే అతని ఫ్రెండ్ అక్కడ ఉంటాడు. కనీసం వాళ్ల దగ్గర హోటల్లో తాగిన టీకి కూడా కట్టడానికి డబ్బులు ఉండవు. అయితే జాన్సన్ రాగానే అతని చేతుల్లో ల్యాప్‌టాప్ పెడతాడు. అతడు దాని గురించి ప్రశ్నలు అడుగుతుంటే.. నువ్వు కొనేలా లేవని, మా డాడీ రెండు నెలల కిందటే అమెరికా నుంచి పంపించిన ఈ రూ.2 లక్షల ల్యాప్‌టాప్ ను రూ.50 వేలకే ఇస్తుంటే ఏవేవో అడుగుతున్నావని రాజు అంటాడు. లే
{{/usCountry}}ఇటు రాజు తన తెలివితేటలను ఉపయోగించి నకిలీ ల్యాప్‌టాప్ ను జాన్సన్ అనే వ్యక్తికి అంటగట్టాలని ప్లాన్ చేస్తాడు. అతన్ని ఖరీదైన హోటల్ కు పిలుస్తాడు. అప్పటికే అతని ఫ్రెండ్ అక్కడ ఉంటాడు. కనీసం వాళ్ల దగ్గర హోటల్లో తాగిన టీకి కూడా కట్టడానికి డబ్బులు ఉండవు. అయితే జాన్సన్ రాగానే అతని చేతుల్లో ల్యాప్‌టాప్ పెడతాడు. అతడు దాని గురించి ప్రశ్నలు అడుగుతుంటే.. నువ్వు కొనేలా లేవని, మా డాడీ రెండు నెలల కిందటే అమెరికా నుంచి పంపించిన ఈ రూ.2 లక్షల ల్యాప్‌టాప్ ను రూ.50 వేలకే ఇస్తుంటే ఏవేవో అడుగుతున్నావని రాజు అంటాడు. లే
{{/usCountry}}చి వెళ్లిపోతుంటే.. తనకు ల్యాప్‌టాప్ కావాలంటూ ఆ వ్యక్తి అప్పటికప్పుడు రూ.50 వేలు ఇచ్చేస్తాడు. చివరికి హోటల్ బిల్లు కూడా అతనితోనే కట్టించి అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాళ్లు వెళ్లిన తర్వాత చూస్తే ల్యాప్‌టాప్ ఆన్ కూడా కాదు. తాను మోసపోయానని తెలుసుకొని రాజుకు ఫోన్ చేస్తే అతడు మరింత వెటకారంగా మాట్లాడతాడు.
రేఖ దగ్గర దొరికిపోయిన ఇందు
మరోవైపు ఇందును రోడ్డుపై చూస్తుంది రేఖ. అక్కడే నిలదీద్దామనుకొని తర్వాత ఇంటికి రానీ అని అనుకుంటుంది. ఆమె ఇంటికి రాగానే ఎక్కడికెళ్లావని అడుగుతుంది. స్వాతి తన డ్రెస్సు కుట్టించుకొని రమ్మంటే టైలర్ దగ్గరికి వెళ్లానని చెబుతుంది. భ్రమరాంబ కూడా అదే నిజమని అంటుంది. అయినా రేఖ మాత్రం నమ్మదు. ఇందుపై అనుమానంతో టైలర్ కు కూడా ఫోన్ చేస్తుంది.
ఇటు సుభాష్ ను చూసిన డాక్టర్ సర్జరీ చేయాల్సిందే అని, రూ.15 లక్షలు అవసరమవుతాయని చెబుతాడు. ఆ డబ్బు ఇవ్వమని రేఖను అడుగుతుంది ఇందు. ఆమె కళ్ల ముందే ఐశ్వర్య పార్టీ కోసం రూ.లక్ష ఇచ్చే రేఖ.. సుభాష్ సర్జరీకి డబ్బుల్లేవని, అయినా ఆ ముసలోడు ఇప్పుడు లేచి నడిచి ఎవరిని ఉద్దరిస్తాడంటూ మాట్లాడుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.