...
...
Next Story

బ్రహ్మముడి మే 18 ఎపిసోడ్: ఇందు ఆస్తి, కంపెనీ భర్తగా నాదే కదా- రేఖకు షాక్ ఇచ్చిన రాజు- బయటపడిన ఐశ్వర్య 10 లక్షల నిజం!

Brahmamudi Serial May 18th Episode: బ్రహ్మముడి సీరియల్ మే 18వ ఎపిసోడ్‌‌లో రాజు చేసిన తప్పులకు కటింగ్ చేసి ఆఖరికి వెయ్యి రూపాయలు మాత్రమే ఇస్తుంది ఇందు. భోజనం చేసే చోట ఇందును రాజు పెళ్లి చేసుకోడానికి గల కారణం అడుగుతుంది రేఖ. ఆస్తికోసమే ఇందును పెళ్లి చేసుకున్నాని రాజు చెప్పడంతో రేఖ షాక్ అవుతుంది.

Published on: May 18, 2026, 08:53:31 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాజుకు ఇచ్చే 20 వేల్లలో కటింగ్స్ అన్ని చెప్పి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే ఉంటాయి. రాజు చేసిన తప్పులన్ని ఇందు చెబుతుంది. తన నడుము చూసినందుకు కూడా రాజుకు ఫైన్ వేస్తుంది. కిచెన్‌లో ఇందు నడుము చూసేందుకు రాజు వేసిన వేశాలను గుర్తు చేస్తుంది.

కటింగ్స్ లేకుండా

బ్రహ్మముడి సీరియల్ మే 18 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ మే 18 ఎపిసోడ్

అలా కండిషన్స్ బ్రేక్ చేసినందుకు 19 వేలు కట్ చేశాను, అందుకే వెయ్యి రూపాయలు ఇచ్చాను అని ఇందు చెబుతుంది. రేపైన కటింగ్ లేకుండా ఇవ్వమని రాజు అంటాడు. రేపటి నుంచి డైలీ కాకుండా వీక్లీ కొద్ది ఇస్తా. డబ్బులు అడ్జస్ట్ అవ్వట్లేదని ఇందు చెబుతుంది. ఇలా అయితే వెళ్లిపోతానని రాజు అంటే.. వెళ్లమని ఇందు అంటుంది. జీవితంలో నీకు మళ్లీ కనిపించను అని చెప్పిన రాజు వెళ్లకుండా ఆగిపోతాడు.

బయటకు వెళ్తే డబ్బు దొరకదు అనుకున్న రాజు వెనక్కి వస్తాడు. సరే వీక్లీ పేమెంట్ అయిన సరిగ్గా ఇవ్వమని రాజు అంటాడు. రాజు అన్నం తినని అంటే.. ఇందు బతిమిలాడుతుంది. రాజు వినడు. దాంతో రాజు చేయి పట్టుకుని బలవంతంగా డిన్నర్‌కు తీసుకెళ్తుంది ఇందు. అంతా డైనింగ్ టేబుల్‌పై కూర్చొంటారు. మదన్ గదిలోనే తింటా అన్నాడని, రూమ్‌లోకే అన్నం తీసుకెళ్తుంది స్వాతి.

ఇందును పెళ్లి చేసుకుంది ఆస్తి కోసమేగా

ఇంతలో రాజు, ఇందు వస్తారు. రాజుకు ఇందు భోజనం వడ్డిస్తుంది. ఇందును ఫోన్ తీసుకురమ్మని పంపిస్తుంది రేఖ. రాజు నాకు ఒక డౌట్. అసలు ఇందును ఎందుకు పెళ్లి చేసుకున్నావ్. కేవలం ఇందునే ఎందుకు చేసుకున్నావ్ అని రేఖ, భూషణ్ అడుగుతారు. ఇందు చాలా అందంగా ఉంటుందని, ప్రాణంగా ప్రేమించానని, రోజు రోజు తనపై ప్రేమ పెరుగుతుందని రాజు అంటాడు. ఈ కిడ్నాప్‌లు కాకుండా ఏమైనా జాబ్ చేస్తావా అని భ్రమరాంబ అడుగుతుంది.

దాంతో రేఖ వాళ్లు అంతా షాక్ అవుతారు. అలా రేఖ అడిగిన ప్రశ్నలకు రాజు ఊహించని సమాధానం ఇస్తారు. ఆ ఆన్సర్‌కి షాక్ అవుతారు. రాజు షాక్ ఇచ్చి వెళ్లిపోతాడు. బిజినెస్ చేసుకోవాలనుకుంటున్నవాడు మనం చెప్పినట్లు ఎందుకు వెంటాడని భ్రమరాంబ అంటుంది. లేదు వెంటాడు. వాడు డబ్బు కోసమే ఇందును పెళ్లి చేసుకున్నాడని అర్థమైంది. చూస్తుంటే వాడికి డబ్బులు బాగా అవసరం ఉన్నట్లుంది. ఆ అవసరమే ఇందుతో సంతకం పెట్టించేలా చేస్తుంది. త్వరలోనే వాడిచేత సంతకం పెట్టించి ఆస్తి మన సొంతం చేసుకోవాలని రేఖ అంటుంది.

అంతలో ఇందు ఫోన్ తీసుకొచ్చి ఇస్తుంది. నాకు అయితే ఆ రాజుగాడు ఆస్తిని వదులుకోడనిపిస్తుంది. రేఖ, భ్రమరాంబ, భూషణ్‌ను బానిసలుగా చేసుకుని ఒక ఆట ఆడుకుంటాడనిపిస్తుందని శేషు మనుసులో అనుకుంటాడు. మరోవైపు ఇంటి బయట ఐశ్వర్యను రాకేష్ డబ్బులు అడుగుతూ గొడవ పడతాడు. అది ఇందు చూస్తుంది. వెళ్లి పలకరిస్తుంది. ఇందును చూసి ఐశ్వర్య తెగ భయపడిపోతుంది.

ఇందుకు నిజం చెప్పిన రాకేష్

ఐషు ఎవరితను అని ఇందు అడుగుతుంది. నీకెందుకు. నువ్వు ఇక్కడి నుంచి వెళ్లు అని ఐశ్వర్య అంటుంది. ఇలా ఎంతకాలం ఎవరికి తెలియనివ్వకుండా చేస్తావ్. నేను ఐశ్వర్య ఫ్రెండ్‌ని. అవసరం ఉందంటే 10 లక్షలు ఇచ్చాను అని ఇందుకు రాకేష్ నిజం చెప్పేస్తాడు. ఏంటీ పది లక్షలు తీసుకున్నావా అని ఇందు అంటే అవును ఐశ్వర్య అంటుంది.

డబ్బులిస్తా అని తిప్పించుకుంటుంది. మొన్న వచ్చినప్పుడు రేఖ ఆంటీని అడుగుదామనుకున్నా. కానీ, ఇప్పుడు అయితే డబ్బు ఇచ్చే వరకు ఇక్కడే ఉంటానని రాకేష్ బెదిరిస్తాడు. అలా ఐశ్వర్య 10 లక్షల నిజం బయటపడుతుంది. ఐషు 10 లక్షలు తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని ఇందు అంటే.. అది నీకు చెప్పాల్సిన అవసరం లేదు. నువ్వేమైనా ఆరుస్తావా, తీరుస్తావా అని ఐశ్వర్య అంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe