బ్రహ్మముడి మే 23 ఎపిసోడ్: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో రాజును స్వరాజ్ గ్రూపు సీఈవోను చేయడానికి ఇందు సిద్ధమవుతుంది. ఇటు రాజును సిద్ధం చేసి అదే విషయాన్ని రేఖకు చెప్పి తన డ్రామాను ఇందు రక్తి కట్టిస్తుంది. అదే సమయంలో ఓ బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తుంది.
కింగ్ సైజ్ బెడ్ చూసి మురిసిపోయిన రాజు.. షాకిచ్చిన ఇందు

బ్రహ్మముడి సీరియల్ శనివారం (మే 23) ఎపిసోడ్ కింగ్ సైజ్ బెడ్ చూసి రాజు మురిసిపోయే సీన్ తో మొదలవుతుంది. పరుపుపై అటూ ఇటూ దొర్లుతూ రాజు తెగ ఆనందపడతాడు. డబ్బుతో ఎంత సుఖం ఉంటుందో చూశావా అని ఇందుతో అంటాడు. ఇందును కూడా తన పక్కనే పడుకోమంటాడు.
కానీ ఆమె మాత్రం షాకిస్తుంది. నువ్వు పడుకోవాల్సింది ఈ బెడ్ పై కాదు.. ఆ బెంచీపై అని చెబుతుంది. ఇదన్యాయం ఈ రూమ్, బెడ్ తాను చేసిన పోరాటం వల్ల వచ్చిందని రాజు అంటాడు. అసలు నీకు ఈ అద్దె మొగుడు పోస్టు ఇచ్చిందే నేను అంటూ ఇందు అతన్ని బెడ్ పై నుంచి తరిమేస్తుంది.
ఐశ్వర్యకు చుక్కలు చూపించిన స్వాతి
మరోవైపు స్వాతి రూమ్ లో సోఫాపై పడుకున్న ఐశ్వర్యకు నిద్ర పట్టదు. చేసేది లేక స్వాతి పడుకున్న బెడ్ పైకి వస్తుంది. కానీ స్వాతి ఆమెకు చుక్కలు చూపిస్తుంది. కాళ్లు, చేతులు వేస్తుంది. అర్ధరాత్రి దాటినా ఐశ్వర్యకు నిద్ర పట్టదు. ఉదయం లేచి చూసే సరికి స్వాతి కాలు ఆమె ముఖంపై ఉంటుంది. అది చూసి ఆమె షాక్ తింటుంది. ఇదంతా ఇందు వల్లే జరిగిందని, దానిపై ప్రతీకారం తీర్చుకుంటానని మరోసారి ఐషూ అనుకుంటుంది.
కంపెనీ సీఈవో పోస్టుకు రాజు పోటీ
ఇటు ఉదయాన్నే ఇందు ముఖంలో ముఖం పెట్టి రాజు చూస్తుండగా ఆమె నిద్ర లేస్తుంది. అతన్ని చూసి భయపడుతుంది. జీతాల విషయం ఏం ఆలోచించావని ఇందును రాజు అడుగుతాడు. రాత్రంతా దాని గురించే ఆలోచించానని, ఇప్పుడు కంపెనీ సీఈవో పోస్టుకు తాను పోటీ పడితే రేఖకు అనుమానం వస్తుందని, అందుకే నువ్వే పోటీ చేయాలని రాజుతో అంటుంది. ఆ మాట విని రాజు తెగ మురిసిపోతాడు. తన దశ తిరిగిపోతోందని అనుకుంటాడు. సీఈవో అయితే చెక్కులపై సంతకాలు చేయొచ్చా అని అడుగుతాడు. కానీ తన ఎవరు ఓటు వేస్తారని సందేహిస్తాడు.
బోర్డు మెంబర్ను బుట్టలో వేసుకోవాలనుకున్న రాజు
{{/usCountry}}ఇటు ఉదయాన్నే ఇందు ముఖంలో ముఖం పెట్టి రాజు చూస్తుండగా ఆమె నిద్ర లేస్తుంది. అతన్ని చూసి భయపడుతుంది. జీతాల విషయం ఏం ఆలోచించావని ఇందును రాజు అడుగుతాడు. రాత్రంతా దాని గురించే ఆలోచించానని, ఇప్పుడు కంపెనీ సీఈవో పోస్టుకు తాను పోటీ పడితే రేఖకు అనుమానం వస్తుందని, అందుకే నువ్వే పోటీ చేయాలని రాజుతో అంటుంది. ఆ మాట విని రాజు తెగ మురిసిపోతాడు. తన దశ తిరిగిపోతోందని అనుకుంటాడు. సీఈవో అయితే చెక్కులపై సంతకాలు చేయొచ్చా అని అడుగుతాడు. కానీ తన ఎవరు ఓటు వేస్తారని సందేహిస్తాడు.
బోర్డు మెంబర్ను బుట్టలో వేసుకోవాలనుకున్న రాజు
{{/usCountry}}అందుకే బోర్డు మెంబర్స్ ను నీ వైపుకు తిప్పుకో అని ఇందు అతనికి చెబుతుంది. ముందుగా అభిలేష్ అనే మెంబర్ కు ఫోన్ చేయమని అంటుంది. రాజు చేస్తాడు. అవతలి వ్యక్తికి తానెవరో చెబుతాడు. రేఖ విషయంలో మీరు అసంతృప్తిగా ఉన్నారు కదా అని అంటే.. అలాంటిదేమీ లేదని అభిలేష్ అంటాడు.
మీరు ఉన్నారు.. అందుకే ఆమెకు పోటీగా నేను పోటీ చేస్తున్నాను.. నా తెలివితేటలు, కష్టపడే గుణంతో కంపెనీని ఎక్కడికో తీసుకెళ్తాను అని చెబుతాడు. దీంతో నువ్వు అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా.. నేను రేఖ మేడమ్ మనిషిని అని అతడు అనడంతో రాజు షాక్ తింటాడు. వెంటనే ఫోన్ కట్ చేస్తాడు.
తన దగ్గర మరో ప్లాన్ ఉందని, నువ్వు సీఈవోగా పోటీ చేస్తున్న విషయం రేఖ ఆంటీకి చెబుతానని ఇందు అంటుంది. నువ్వే పోటీ చేయమని, మళ్లీ నువ్వే ఆమెకు చెబితే ఎలా అని రాజు అంటే.. చూస్తూ ఉండు అని చెప్పి వెళ్లిపోతుంది.
రేఖకు రాజు గురించి చెప్పిన ఇందు
రేఖ దగ్గరికి వెళ్లిన ఇందు అమాయకమైన ముఖం పెట్టి రాజు కుట్ర చేస్తున్నాడని చెబుతుంది. తన నాటకంతో రక్తి కట్టిస్తుంది. ఆ విషయాన్ని రేఖ లైట్ తీసుకుంటుంది. వాడు అనుకున్నంత ఈజీ కాదని అంటుంది. దీంతో వాడిని తక్కువ అంచనా వేయొద్దు.. నన్ను కిడ్నాప్ చేశాడు.. తర్వాత పెళ్లి చేసుకున్నాడు.. ఆఫీసుకు కూడా వెళ్లాడు.. ఇప్పుడు సీఈవో కాడని గ్యారెంటీ ఏంటి అని ఇందు అంటుంది. దీంతో రేఖ కూడా ఆలోచనలో పడుతుంది.
అయితే రాజును అడ్డుకోవడానికి తన దగ్గర బ్రహ్మాస్త్రం ఉందని భూషణ్ తో రేఖ అంటుంది. అటు ఇందు కూడా ఆ బ్రహ్మాస్త్రం తానే అని రాజుతో చెబుతుంది. కంపెనీలో సీనియర్ బోర్డు మెంబర్ పరంధామయ్యను కలవాలని అంటుంది. ఇందు వేసిన ప్లాన్ తో రాజు కంపెనీ సీఈవో కావడం ఖాయంగా కనిపిస్తుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.