బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇంటికొచ్చిన రాహుల్‌ను అంతా నానా మాటలు అంటారు. మారమని చెబుతారు. ఇంకెప్పుడు నిన్ను బాధపెట్టను . నువ్వు పడ్డ బాధను పోగొట్టలేను. నేను మారి చూపించడం తప్పా ఏం చేయలేను. ఈ క్షణమే నేను మారి చూపించాలనుకుంటున్నాను. ఇంకొక్క ఛాన్స్ ఇవ్వు అని స్వప్నను రాహుల్ అడుగుతాడు.
చేతలతో చూపించు

రాశులు పోసి చూపించేది కాదు నమ్మకం అంటే. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలంటే కలగాల్సింది నమ్మకం. అది మాటలతో కాదు చేతలతో చూపించు అని వెళ్లిపోతుంది స్వప్న. తర్వాత రాహుల్ వెళ్లి ఏడుస్తుంటాడు. వెళ్లి రుద్రాణి మాట్లాడుతుంది. నువ్వేం తప్పు చేశావని ఏడుస్తున్నావంటుంది. నేను చేసిన తప్పులు పెరిగి పెరిగి బారంగా మారాయి అందుకే ఏడుపొస్తుందని రాహుల్ అంటాడు.
నువ్వు తప్పు చేయలేదు. తప్పు చేసింది. ఇంట్లోవాళ్లు. నిన్ను ప్రూవ్ చేసుకునేందుకు ఇంట్లోవాళ్లు నీకు ఛాన్స్ ఇవ్వలేదు. అందుకే తప్పు చేశావ్. ఇదే నిజం. వాళ్ల తప్పులు వాళ్లకు కనిపించవు. నీ తప్పులు వేలెత్తి చూపించడానికి మాత్రం రెడీగా ఉంటారు. నీకు నేనున్నాను. నువ్వు తప్పు చేయలేదు. వాళ్లు వెర్రి జనంరా అవతలి వాళ్లని మారమంటారు తప్పా వాళ్లు మారరు అని రుద్రాణి అంటుంది.
ఆ మాటలను స్వప్న వింటుంది. అందుకే నువ్వు నువ్వులా, నాలా నేను ఉండాలి. ఆస్తి కోసం మళ్లీ ప్రయత్నించాలి. ఎవరి కోసం నీ రూట్ మార్చుకోవద్దు అని మంచిగా మారిన రాహుల్‌కు ఎక్కిస్తుంది రుద్రాణి. ఆపు మమ్మీ నేను దుర్మార్గున్ని అయినా బంధాలను కాపాడుకోవాలనిపిస్తుంది. మనిషిగా మారి నా భార్య కన్నీళ్లు తుడవాలనిపిస్తుంది. ఇక చాలు మమ్మీ. ఇవన్నీ వద్దు అని రాహుల్ కోపంగా అంటాడు.
ఇంకొక ఛాన్స్ ఇచ్చారు
అంటే నిజంగానే మారిపోయావా. బానిసలా ఉండాలనుకుంటున్నావా అని రుద్రాణి అంటుంది. నాటకం కాదు. నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ కావ్య, రాజ్ నన్ను కాపాడకుంటే జైలులో చిప్పకూడు తినేవాన్ని. అలా తినేకన్నా ఈ ఇంట్లో బానిసలా బతకడం మంచిది. నాకోసం అంత చేసిన వాళ్లకోసం నా ప్రాణాలైనా ఇవ్వాలనిపిస్తుంది మమ్మీ. నువ్వు ఇంకా ద్రోహం చేయాలనుకుంటున్నావ్. తప్పు చేస్తున్నావ్. నేను ఆ తప్పు చేయను అని రుద్రాణికి ఎదురుతిరుగుతాడు రాహుల్.
{{/usCountry}}అంటే నిజంగానే మారిపోయావా. బానిసలా ఉండాలనుకుంటున్నావా అని రుద్రాణి అంటుంది. నాటకం కాదు. నాకు ఇంకొక ఛాన్స్ ఇచ్చారు. ఇవాళ కావ్య, రాజ్ నన్ను కాపాడకుంటే జైలులో చిప్పకూడు తినేవాన్ని. అలా తినేకన్నా ఈ ఇంట్లో బానిసలా బతకడం మంచిది. నాకోసం అంత చేసిన వాళ్లకోసం నా ప్రాణాలైనా ఇవ్వాలనిపిస్తుంది మమ్మీ. నువ్వు ఇంకా ద్రోహం చేయాలనుకుంటున్నావ్. తప్పు చేస్తున్నావ్. నేను ఆ తప్పు చేయను అని రుద్రాణికి ఎదురుతిరుగుతాడు రాహుల్.
{{/usCountry}}బతికితే రాజ్, కావ్య, నా భార్య కోసం బతకాలి. లేకపోతే చచ్చిపోవాలి. నాకు ఎలాంటి సలహాలు ఇవ్వకు అని వెళ్లిపోతాడు రాహుల్. మరోవైపు బేబీల ఫొటోలను చూస్తూ ఫీల్ అవుతాడు రాజ్. ఇంతలో కావ్య వచ్చి ఓ పేపర్ ఇస్తుంది. కోరికల బకెట్ లిస్ట్ అంటుంది. వాటిని రాజ్ చదువుతాడు. నా భర్త నాకోసం వంట చేయాలి, చీర కట్టాలి, క్యాండిల్ లైట్ డిన్నర్‌కు తీసుకెళ్లాలి, బైక్ నడిపించడం నేర్పాలి, రౌడీలతో ఫైట్ చేయాలి అని చదువుతాడు రాజ్.
అతి కష్టంగా ఒప్పుకుంటాడు రాజ్. చికెన్ మంచూరియా కావాలని కావ్య అడిగితే.. కిచెన్‌లో తలకు హెడ్ లైట్ పెట్టుకుని చేస్తాడు రాజ్. వంట గదిలో యుద్ధమే జరుగుతుంది. ఈ రాజ్ గాడు వంట చేసినట్లు ఎవరికి తెలియకూడదు. గట్టిగా మాట్లడకు అని చీకట్లోనే వంట చేస్తాడు రాజ్. కిందకు దిగిన ప్రకాశం ఇల్లంతా చీకటి, కిచెన్‌లో ఏంటీ వింత లైట్, దెయ్యమేమో అని భయపడిపోయి పైకి వెళ్లిపోతాడు.
దెయ్యం వంట చేస్తుంది
లైట్ వేసుకోమ్మని కావ్య చెబితే అందరికి తెలిసిపోతుంది. నా పరువు ఏం కావాలి అని రాజ్ అంటాడు. హో అలాగా చెబుతా మీ సంగతి అని మనసులో అనుకున్న కావ్య ఇప్పుడే వస్తానని వెళ్తుంది. ధాన్యలక్ష్మీని తీసుకొచ్చి చూపిస్తాడు ప్రకాషం. దెయ్యముందే అని ప్రకాషం అంటే.. దెయ్యం వంట చేస్తుందని ధాన్యలక్ష్మీ అంటుంది. ఇంతలో కావ్య వచ్చి ఏమైందని అడుగుతుంది.
కిచెన్‌లో దెయ్యముందని ప్రకాశం అంటాడు. అది దెయ్యం కాదు రాజ్ భార్య కోసం వంట చేస్తున్నాడని ఇందిరాదేవి అంటుంది. అపర్ణ, ఇందిరాదేవి అంతా కలిసి కిచెన్‌లోకి వెళ్తారు. కళావతి వచ్చావా అని రాజ్ అంటే వచ్చానని కావ్య గట్టిగా చెబుతుంది. అబ్బా మెల్లిగా. పడుకున్న దెయ్యాలు లేస్తాయి. వంట చేస్తున్నట్లు తెలిస్తే గడ్డివాము మీద పడిన గొడ్డుల చికెన్ మీద పడి తింటారని రాజ్ అంటాడు.
నీకు ఒక్క ముక్క కూడా ఉంచరు. ముఖ్యంగా ముసల్ది. అంతా వయసు వచ్చిన తింటూనే ఉంటుంది అని రాజ్ అంటాడు. ఆ మాటలను అందరూ వింటారు. రాజ్ చేసిన చికెన్ మంచూరియాను అందరు తింటారు. ఇంతలో వెనక్కి తిరుగుతాడు రాజ్. అందరిని చూసి షాక్ అవుతాడు.
దెయ్యాలు అన్నప్పుడే
వీళ్లంతా ఎందుకొచ్చారు, ఎప్పుడొచ్చారు అని రాజ్ అడిగితే దెయ్యాలు అన్నప్పుడే అని రాజ్ మాటలనే తనకు చెబుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.