బ్రహ్మముడి ప్రోమో: పోలీసుల కళ్లుగప్పిన రాజ్, కావ్య- కుయిలి ఇంట్లో దొరికిన అసలు సాక్ష్యం- రుద్రాణిని ఏమార్చిన రంజిత్
బ్రహ్మముడి లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రంజిత్‌తో డీల్ మాట్లాడుకునేందుకు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది రుద్రాణి. కుయిలి ఇంటికి వెళ్లిన రాజ్, కావ్య అక్కడ పోలీసులు ఉండటం చూసి షాక్ అవుతారు. పోలీసుల కళ్లుగప్పి కుయిలి ఇంట్లోకి దొంగచాటుగా చొరబడతారు. అక్కడ కావ్య పెట్టిన సీక్రెట్ కెమెరాను తీసుకుని బయటకు వస్తారు.
బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో తన కొడుకును తానే కాపాకుంటానని కుయిలి భర్త రంజిత్ దగ్గరికి వెళ్లిపోతుంది రుద్రాణి. రాజ్, కావ్య ఎంత చెప్పిన వినదు. రాహుల్ కోసం అత్త ఏమైనా చేస్తుంది. ఇలాంటప్పుడు అత్తతో నువ్వు పక్కన ఉండి, ఎలాంటి తప్పు జరగకుండా చూడమని స్వప్నకు చెబుతాడు రాజ్.

నిరూపించే సాక్ష్యం ఏముంది
దాంతో స్వప్న కూడా రుద్రాణితోపాటు పోలీస్ స్టేషన్‌కు వెళ్తుంది. ఇప్పుడు రాహుల్‌ను నిర్దోషి అని నిరూపించే సాక్ష్యం ఏముందిరా అని సుభాష్, అపర్ణ వాళ్లు అడుగుతారు. కుయిలి ఇంటికి వెళ్లినరోజే అక్కడ సీక్రెట్ కెమెరా ఒకటి కళావతి పెట్టిందని రాజ్ చెబుతాడు.
మేము వెళ్లి ఎలాంటి నిజాలు రాబట్టలేకపోతే వాళ్లు ఆడే నాటకం రికార్డ్ అవుతుందని ముందుగానే సీక్రెట్ కెమెరా పెట్టినట్లు కావ్య చెబుతుంది. దాంతో కావ్యను ఇంటిల్లిపాది మెచ్చుకుంటారు. ఆ సీక్రెట్ కెమెరాను రికవరీ చేసేందుకు కుయిలి ఇంటికి వెళ్తారు రాజ్, కావ్య. కారులో కుయిలి ఇంటికి వెళ్తారు రాజ్, కావ్య.
అయితే, అక్కడ కుయిలి ఇంటి చుట్టు పోలీసులు బందోబస్తుగా ఉంటారు. కుయిలి ఇంటి చుట్టూ పోలీసులు ఉండటం చూసి రాజ్, కావ్య చూసి షాక్ అవుతారు. ఇదేంటండి కెమెరా తీసుకొద్దామనుకుంటే ఇంతమంది పోలీసులు ఉన్నారు అని కావ్య కంగారుపడుతుంది.
సాక్ష్యాలు తారుమారు కాకుండా
ఒక మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నప్పుడు అది జరిగిన చోట ఆధారాలు తొలగిపోకుండా, ఎలాంటి సాక్ష్యాలు తారుమారు కాకుండా ఉండేందుకు పోలీసులను ఇలా పెడతారు అని రాజ్ అంటాడు. మరి ఇప్పుడు ఎలాగండి ఆ కెమెరాను తీసుకురావడం అని కావ్య అంటుంది. దానికి అడ్డదారి ఉందిగా అని కుయిలి ఇంటి వెనుక నుంచి పోలీసుల కళ్లు గప్పి ఎంటర్ అవుతారు.
కిటికీ నుంచి కుయిలి ఇంట్లోకి దొంగచాటుగా చొరబడతారు రాజ్, కావ్య. ఇంట్లో పెట్టిన సీక్రెట్ కెమెరాను తీసుకుని మళ్లీ పోలీసులకు ఎలాంటి అనుమానం రాకుండా బయటకు వస్తారు. కారులో కూర్చుని ఆ సీక్రెట్ కెమెరాలో రికార్డ్ అయింది చూస్తారు రాజ్ కావ్య. అందులో రాహుల్, కుయిలి గొడవ పడటం, స్వప్నను మాట అనడంతో కుయిలిని రాహుల్ కొట్టడం, దాంతో కుయిలి కిందపడిపోవడం చూస్తారు.
అలాగే, రాహుల్ కొట్టిన తర్వాత కూడా కుయిలి కదలడం చూసి షాక్ అవుతారు. తర్వాత పూర్తి వీడియో చూసి రాజ్, కావ్య నిర్ఘాంతపోతారు. అంటే, రాహుల్ కొడితే కుయిలి చావలేదు. ఆ రంజిత్ గాడు పైపైన వీడియో తీసి దాన్నే సాక్ష్యం అంటున్నాడు. కానీ, మనకు దొరికిందే అసలైన సాక్ష్యం, రాహుల్‌ను నిర్దోషిగా బయటకు తీసుకొచ్చే సాక్ష్యం అని రాజ్ అంటాడు.
దానికే చచ్చిపోతుందని
మరోవైపు పోలీస్ స్టేషన్‌కు రుద్రాణి వెళ్తుంది. రాహుల్‌ను చూసి బాధపడుతుంది. అసలు ఏం జరిగిందిరా. కుయిలి గురించి నిన్న ఒక్కమాట చెప్పలేదు అని రాహుల్‌ను అంటుంది రుద్రాణి. చెప్పడానికి ఏం జరగలేదు మామ్. నాకు కుయిలికి గొడవ జరిగింది. నేను కోపంతో తోశాను అంతే. కానీ, దానికే అది చచ్చిపోతుందని నాకేం తెలుసు అని రాహుల్ అంటాడు.
నువ్వు తోస్తేనే చనిపోయినట్లు కుయిలి భర్త రంజిత్ గాడి దగ్గర సాక్ష్యం ఉంది. వాడు నాకు ఫోన్ చేసి 2 కోట్లు ఇస్తే ఆ వీడియోను కోర్టులో సబ్‌మిట్ చేయను అని చెబుతున్నాడు అని అంటుంది రుద్రాణి. దానికి రాహుల్ షాక్ అవుతాడు. ఏదోటి చేయి మమ్మీ అని రాహుల్ అంటాడు. ఎలాగరా నిన్ను బయటకు తీసుకొచ్చేది అని రుద్రాణి అంటుంటే నేను అంటూ రంజిత్ ఎంట్రీ ఇస్తాడు.
నువ్వు ఎవడ్రా అని రుద్రాణి అంటే.. వాడే కుయిలి భర్త రంజిత్ అని రాహుల్ చెబుతాడు. మరి మనం డీల్ మాట్లాడుకుందామా అని రుద్రాణిని బయటకు రమ్మంటాడు రంజిత్. కుయిలిని రాహుల్ కొట్టడం, దాంతో కుయిలి కిందపడిపోవడం చూపించి ఇది చాలుగా నీ కొడుకు జైలుకెళ్లడానికి అని రంజిత్ ఆ వీడియోతో రుద్రాణిని ఏమారుస్తాడు.
డీల్ ఒప్పుకున్న రుద్రాణి
దీన్ని కోర్టులో సబ్‌మిట్ చేయకు. నేను ఏం చేసైనా సరే నీకు రెండు కోట్లు తీసుకొచ్చి ఇస్తాను అని రుద్రాణి అంటుంది. మరి త్వరగా తీసుకురండి. కోర్టుకు ఇంకా ఎంతో టైమ్ లేదు అని రంజిత్ అంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో ముగుస్తుంది.













