బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో రాహుల్ ఆఫీస్‌కు వెళ్తాడు. కానీ, అక్కడ అన్ని ఫైల్స్ రాజ్ ముందే చూసి ఉంటాడు. కేవలం రాహుల్‌ను మాత్రం సైన్ చేయమని శ్రుతి చెబుతుంది. అంటే నేను ఏ ఫైల్ చూడాల్సిన అవసరం లేదా అని రాహుల్ అంటాడు.
పనికి రాని కుర్చీ

లేదు సర్, అరగంట క్రితమే రాజ్ సర్ అన్ని ఫైల్స్ చూశారు. మీరు కేవలం సంతకం చేస్తే చాలంటుంది. దాంతో రాహుల్ సైన్ చేస్తాడు. అది చూసి శ్రుతి నవ్వుతుంది. మీది కేవలం పేపర్ వెయిట్ పోస్ట్ అని తెలియక పొంగిపోయాడనుకుంటుంది శ్రుతి. ఈ మాత్రం దానికి అంతా బిల్డప్ ఎందుకు. ఎలాంటి పవర్స్ లేని ఈ పనికిరాని కుర్చీ నాకు ఎందుకు అనుకుంటాడు రాహుల్.
తర్వాత మేనేజర్ దగ్గరికి వెళ్లి డిజైన్స్‌లో కరెక్షన్స్ చెప్పానుగా ఏమైంది అని రాహుల్ అడుగుతాడు. కావ్య మేడమ్ మొత్తం చూసి ఎలాంటి కరెక్షన్స్ అవసరం లేదు. క్లైంట్స్‌కు అలాగే నచ్చాయని చెప్పారు. మాన్యుఫాక్చరింగ్‌కు కూడా పంపించామని మేనేజర్ చెబుతాడు. దాంతో రాహుల్ వెళ్లి నా చేతికి పవర్స్ రావాలంటే స్వప్నకు తెలియాల్సిందే అని కాల్ చేస్తాడు.
భోజనం పేరు చెప్పి స్వప్న ఆఫీస్‌కు లంచ్ క్యారేజ్ తీసుకొచ్చేలా చేస్తాడు రాహుల్. మరోవైపు అపర్ణ, సుభష్ పెళ్లి చూపుల హడావిడి నడుస్తుంటుంది. సుభాష్ వాళ్లు వస్తారు. మావిచిగురు సినిమాలోని పాటతో పెళ్లి చూపుల తంతు కానిస్తారు. మరోవైపు ఆఫీస్‌లో రాహుల్‌కు స్వప్న వడ్డిస్తుంది. రాహుల్ మారడం గురించి స్వప్న ఎమోషనల్‌గా చెబుతుంది.
ఓరీ నీ బిల్డప్పు..
తన బాధ అంతా పోయిందని స్వప్న అంటుంది. ఈపాటికి శ్రుతి రావాలిగా అని రాహుల్ అనుకుంటాడు. ఇంతలో శ్రుతి వస్తుంది. మీరు లంచ్ చేశాక వస్తానని శ్రుతి అంటే.. లంచ్దేముంది వర్క్ ముఖ్యం అని రాహుల్ అంటాడు. ఓరీ నీ బిల్డప్పు అని శ్రుతి మనసులో అనుకుంటుంది. అయినా నా లంచ్ అయిపోయింది అని చేయి కడుక్కుని వస్తాడు రాహుల్.
{{/usCountry}}తన బాధ అంతా పోయిందని స్వప్న అంటుంది. ఈపాటికి శ్రుతి రావాలిగా అని రాహుల్ అనుకుంటాడు. ఇంతలో శ్రుతి వస్తుంది. మీరు లంచ్ చేశాక వస్తానని శ్రుతి అంటే.. లంచ్దేముంది వర్క్ ముఖ్యం అని రాహుల్ అంటాడు. ఓరీ నీ బిల్డప్పు అని శ్రుతి మనసులో అనుకుంటుంది. అయినా నా లంచ్ అయిపోయింది అని చేయి కడుక్కుని వస్తాడు రాహుల్.
{{/usCountry}}మీ సైన్ కావాలి అని శ్రుతి అంటుంది. ఈ ఫైల్ కూడా నేను చూడక్కర్లేదా అని రాహుల్ అంటే.. చెప్పానుగా సర్ మీరు ఏ ఫైల్ స్టడీ చేయనక్కర్లేదు. అన్ని ఫైల్స్ రాజ్ సర్ చెక్ చేశారు అని శ్రుతి చెబుతుంది. అలా అయితే ఎలా, రేపు ఏదైనా తప్పు జరిగితే రాజ్, కావ్యకు నేను ఏం సమాధానం చెప్పాలని రాహుల్ అంటాడు. అవన్నీ మేము చూసుకుంటాం కదా సర్. మీరు హ్యాపీగా టైమ్ పాస్ చేసి వెళ్లండి అని శ్రుతి అంటుంది.
టైమ్ పాస్ చేయడమేంటీ. ఇది మన కంపెనీ అని రాహుల్ అంటాడు. సర్ రాజ్ సర్ చేయమన్నారు, చెప్పమన్నారు చెబుతున్నాం అని శ్రుతి అంటుంది. ఏం మాట్లాడుతున్నావ్. బాధ్యతలు ఇచ్చి కేవలం సైన్ చేయమని ఎలా అంటారు అని శ్రుతితో స్వప్న గొడవ పడుతుంది. మేము ఉద్యోగులం. రాజ్ సర్ ఇంట్లో ఉండే ఫైల్స్ అన్ని చూస్తున్నారు అని శ్రుతి చెబుతుంది.
పవర్స్ వాళ్ల చేతిలో పెట్టుకుని
సరే సరే అని ఫైల్ తీసుకుని రాహుల్ సైన్ చేసి పెట్టి పంపించేస్తాడు. ఏంటీ రాహుల్ ఇదంతా అని స్వప్న అంటే నాకు కొత్త కదా. పవర్స్ వాళ్ల చేతిలో పెట్టుకుని కేవలం సీట్ ఇచ్చినట్లున్నారు. రాజ్, కావ్య మన మంచికోసమే చేస్తారు అని రాహుల్ అంటాడు. ఇలా అయితే ఎలా ప్రూవ్ చేసుకుంటావ్ అని స్వప్న అంటుంది.
తర్వాత మేనేజర్ వచ్చి కూడా డిజైన్స్ కరెక్షన్స్ అన్ని కావ్య మేడమ్ చేస్తారు. మీ దాకా ఏది రాదు. మీరు జస్ట్ సైన్ చేస్తే చాలు అని మేనేజర్ అని వెళ్లిపోతాడు. పవర్స్ వాళ్ల చేతిలో పెట్టుకుని పెన్ నీకు ఇస్తే ఏంటీ. ఎక్కడ తేల్చుకోవాలో అక్కడే తేల్చుకుంటా అని స్వప్న వెళ్లిపోతుంది. ఇదే ఆవేశం మెయింటేన్ చేయు. అప్పుడేగా నేను అనుకుంది జరుగుతుంది అని రాహుల్ అనుకుంటాడు.
మరోవైపు కట్నం గురించి రుద్రాణి మాట్లాడుతుంది. అంతా రుద్రాణిని తిడతారు. ఏ యావరేజ్ అపర్ణను లేచి నడవమని ఆర్డర్ వేస్తుంది రుద్రాణి. నేను లేవను, పెళ్లి కొడుకు చెల్లి, గోడ మీద బల్లి. ఛాన్స్ దొరికింది కదా అని రెచ్చిపోకు అని అపర్ణ అంటుంది. ఇంతలో స్వప్న వస్తుంది.
కావ్యతో స్వప్న గొడవ
అందనంత ఎత్తుకు చేర్చినట్లు చేర్చి అథః పాతాళానికి తొక్కారు అని కావ్యతో గొడవ పడుతుంది స్వప్న. ఏం మాట్లాడుతున్నావ్ అక్క అని కావ్య అరుస్తుంది. రుద్రాణి కూడా సపోర్ట్ చేస్తూ గొడవ పెంచుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.