Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఐశ్వర్య పెళ్లి గురించి అందరూ మాట్లాడుతారు. ఎహే ఆపండి. ఊర్లో పెళ్లికి కుక్కల హడావిడి అన్నట్లు. నాకు ఈ తతంగాలు ఏమి వద్దు. ఈ ఇంట్లోనే సింపుల్‌గా మన ఫ్యామిలీ మెంబర్స్ మధ్య పెళ్లి చేయండి అని గట్టిగా చెబుతుంది ఐశ్వర్య.
మూడు ముళ్లు పడగానే

అంతా వ్యతిరేకిస్తారు. నా ఫ్రెండ్స్ మధ్య రెస్పెక్ట్ తగ్గిపోతుంది. నా సర్కిల్‌లో ఎవరికి తెలియొద్దు. డేట్ ఫిక్స్ చేయండని ఐశ్వర్య అంటుంది. ఎంత చెప్పిన ఐశ్వర్య వినదు. సరేఅని అంతా ఓకె చెబుతారు. అగ్రిమెంట్ పేపర్స్ రెడీ చేయించండి. నా మెడలో మూడు ముళ్లు పడగానే నా చేతిలో పేపర్స్ పడాలని చెప్పి వెళ్లిపోతుంది ఐశ్వర్య.
గాంధర్వ పెళ్లి విన్నాను కానీ ఇలా గందరగోళం పెళ్లి చూడలేదని శేషు అంటాడు. మరోవైపు మదన్ అలసిపోయి ఉంటాడు. ఇంటర్వ్యూకు వెళ్లి వచ్చిన స్వాతి షూస్ తీస్తుంది. ఇంటర్వ్యూ గురించి మదన్ అడిగితే.. జాబ్ వచ్చిందని సంతోషంగా చెబుతుంది స్వాతి. తనకు కాకుండా స్వాతికి జాబ్ వచ్చినందుకు కొద్దిగా ఫీల్ అవుతాడు. తేరుకుని కంగ్రాట్స్ చెప్పి స్వాతిని హత్తుకుంటాడు మదన్.
మదన్ ఇంటర్వ్యూ గురించి అడిగితే డల్‌గా ఉంటాడు. ఇక ఇంటి సంగతి నేను చూసుకుంటాను. నీకు నచ్చిన జాబ్ వచ్చేవరకు ట్రై చేయొచ్చు అని చెబుతుంది స్వాతి. రకరకాల కారణాలతో డివోర్స్ తీసుకుంటున్న ఈ జెనరేషన్‌లో నా భారమంతా నువ్వే మోస్తునంటున్నావ్. గిల్టీగా ఉందని మదన్ బాధగా చెబుతాడు. మనిద్దరం ఒక్కటేగా బావ. నాకు నువ్వు ఇచ్చే ప్రేమ చాలు అని స్వాతి అంటుంది.
నిన్ను కొట్టకుండా చూసుకో
దాంతో స్వాతిని మరింత గట్టిగా హగ్ చేసుకుంటాడు మదన్. మరోవైపు రాజును సంతోషంతో లక్కీ కౌగిలించుకుని ముద్దుపెట్టుకుంటాడు. నాకు తల్లిని, ప్రేమించిన ఐశ్వర్యను ఇచ్చావని, నా కల నీవల్ల నెరవేరుతోందని, నాకు చాక్లెట్ లాంటి అమ్మాయిని ఇస్తున్నావ్ అని లక్కీ సంతోషిస్తాడు. తనను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. నిన్ను కొట్టకుండా చూసుకో అని రాజు హెచ్చరిస్తాడు.
{{/usCountry}}దాంతో స్వాతిని మరింత గట్టిగా హగ్ చేసుకుంటాడు మదన్. మరోవైపు రాజును సంతోషంతో లక్కీ కౌగిలించుకుని ముద్దుపెట్టుకుంటాడు. నాకు తల్లిని, ప్రేమించిన ఐశ్వర్యను ఇచ్చావని, నా కల నీవల్ల నెరవేరుతోందని, నాకు చాక్లెట్ లాంటి అమ్మాయిని ఇస్తున్నావ్ అని లక్కీ సంతోషిస్తాడు. తనను హ్యాండిల్ చేయడం చాలా కష్టం. నిన్ను కొట్టకుండా చూసుకో అని రాజు హెచ్చరిస్తాడు.
{{/usCountry}}నన్ను యాక్సెప్ట్ చేస్తుందా అని లక్కీ అంటే.. చేసి తీరుతుంది. పెళ్లికి ముందు అమ్మాయి ఆలోచనలు వేరు. పెళ్లి అయి పిల్లలు పుట్టాకా తన లోకం మారిపోతుందని ఇందు చెబుతుంది. నాకు సిగ్గేస్తుందని లక్కీ వెళ్లిపోతాడు. నానమ్మ వాళ్ల కోసం బట్టలు కొనుక్కుని వచ్చానని ఇందు చెబుతుంది. మందులు ఇంకెంత కాలం వాడాలని సుభాష్ అంటాడు.
ఆరోగ్యం కోసం తప్పదని అపర్ణ అంటుంది. అపర్ణ, సుభాష్‌కి తీసుకొచ్చిన కొత్త బట్టలు ఇస్తుంది ఇందు. పెళ్లి గొప్పదనం గురించి చెప్పిన అపర్ణ ఐశ్వర్య పెళ్లి ఇలా జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. ఏదో వ్యాపార లావాదేవీలా, దొంగతనంగా జరుగుతున్నట్లుగా ఉందంటుంది. ఐషు పెళ్లికి ఒప్పుకోవడమే గొప్ప విషయం. లేకుంటే ఇంటి పరువుతోపాటు కడుపులో బిడ్డ కూడా పోతుందని ఇందు అంటుంది.
బ్రమరాంబకు రాజు ముష్టి
రాజు ఇంటికి వెళ్లి పెళ్లికి పిలుస్తామని ఇందు అంటే.. నేను కూడా వస్తానని నందు అంటుంది. రాజుకు చాంతడాంత లిస్ట్ ఇస్తుంది భ్రమరాంబ. రేపు జరిగే పెళ్లికి మేము కట్టుకునే బట్టలు, కాస్మోటిక్స్ లిస్ట్ అని చెబుతుంది భ్రమరాంబ. బట్టలు, జ్యూవెలరీ, కాస్మోటిక్స్, చెప్పులు కావాలని భ్రమరాంబ అంటుంది. డబ్బులిస్తానని ఇందు ఇస్తే రాజు అడ్డుకుంటాడు.
సింపుల్‌గా జరిగే పెళ్లికి ఇంతెందుకు అని కొంత డబ్బు ఇస్తాడు రాజు. భ్రమరాంబ జాకెట్లు కూడా రావని అంటే నాకు షర్ట్ ప్యాంట్ వస్తాయని శేషు తీసుకుంటాడు. సచ్చినోడికి వచ్చిందే కట్నం అని శేషు అంటాడు. ఇందుతో భ్రమరాంబ చెప్పిస్తుంది. అయినా రాజు వినడు. రాజు వాళ్లు వెళ్లిపోతారు. షాపింగ్‌కి ఏదో ముష్టి ఇచ్చి వెళ్లాడని తిట్టుకుంటుంది భ్రమరాంబ.
ఐశ్వర్య, లక్కీకి పెళ్లి చేస్తున్నారని, ఇందు అక్క కాల్ చేసిందని మదన్‌తో చెబుతుంది స్వాతి. ఇంటికొచ్చి ఇన్విటేషన్ ఇవ్వరా అని మదన్ అంటాడు. వస్తామన్నారు. కానీ మనం ఉండమని నేనే వద్దన్నాను అని స్వాతి అంటుంది. అక్కడ మమ్మీ ఉంటుంది. వెళ్లడం వద్దని మదన్ అంటాడు. స్వాతి ఫీల్ అవుతుంది. ఈ విషయంలో నిర్ణయం వెనక్కి తీసుకోలేనని, స్వాతిని ఒక్కదాన్నే వెళ్లమంటాడు మదన్.
స్వాతిపై మదన్ డౌట్
ఇద్దరం వెళ్తేనే బాగుంటుందని స్వాతి అంటుంది. మదన్ బతిమిలాడుతాడు. సరేనని ఒప్పుకుంటుంది స్వాతి. ఇంతలో స్వాతి బాస్ బైక్‌పై వస్తాడు. అది చూసిన స్వాతి దువ్వుకుని, లిప్‌స్టిక్ పెట్టుకుని, సెంట్ కొట్టుకుని వెళ్తుంది. అదంతా చూసి మదన్ షాక్ అవుతాడు. వేరే వ్యక్తితో స్వాతి బైక్‌పై వెళ్లడం చూసి మదన్ అనుమానంతో ఆలోచనలో పడతాడు.
చలపతి ఇంటికి రాజు వాళ్లు వెళ్తారు. ఐశ్వర్యతో లక్కీ పెళ్లి అని చెబుతారు. ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం అదృష్టమని వెంకీ అంటాడు. వాడు ఆ ఇంట్లో నీకు తోడల్లుడిగా వచ్చి పడ్డాడన్నమాట అని చలపతి అంటాడు. ఇంట్లో రేపే పెళ్లి అని, ఐశ్వర్య కండిషన్ అని చెబుతారు రాజు, ఇందు. వెంకీ కూడా వస్తాడని చలపతి అంటే.. నేను రావడం కూడా చెబుతావా అని కొడుకు కోప్పడుతాడు.
చలపతి చేసే పనులగురించి లక్ష్మి, వెంకీ చెబుతారు. నా బతుకుని బజారుకు ఈడుస్తున్నారని తిడతాడు చలపతి. నీ గురించి చెప్పనారా అని చలపతి అంటే.. ఇందు నందు చెప్పమంటారు. రాజు కోప్పడతాడు. మీ గురించి సీక్రెట్ చెబుతానంటున్నారుగా చెప్పనివ్వండని ఇందు అంటుంది. అవతల పెళ్లి పనులు పెట్టుకుని ఏంటీ మీరు రాజు అంటాడు.
బాంబ్ పేల్చిన ఐశ్వర్య
చికెన్ తీసుకొస్తానని, తినేసి వెళ్లమని చలపతి అంటే.. ముగ్గురు మాయమైపోతారు. మరుసటి రోజు లక్కీ, ఐశ్వర్య పెళ్లి పనులు జరుగుతాయి. చలపతి వాళ్లు వస్తారు. లక్కీ, ఐశ్వర్య పెళ్లి పీటలపై కూర్చుంటారు. ఆగండి. నేను ఈ పెళ్లి చేసుకోను అని బాంబ్ పేలుస్తుంది ఐశ్వర్య. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.