...
...
Next Story

Brahmamudi October 13 Episode: బ్రహ్మముడి- లక్కీకి మదన్ ఆభరణాలు ఇచ్చిన రేఖ- లంగా ఓణిలో నందు, వెంకీ ఫిదా- ఐశ్వర్య డిమాండ్

Brahmamudi Serial October 13th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 13వ ఎపిసోడ్‌‌లో లక్కీ, ఐశ్వర్య పెళ్లికి అంతా వస్తారు. స్వాతి వస్తే భార్య సంపాదనపై మదన్ బతుకున్నాడని అవమానంగా మాట్లాడుతుంది భ్రమరాంబ. లక్కీకి మదన్ ఆభరణాలు ఇచ్చి గాలం వేస్తుంది రేఖ. దుగ్గిరాల శాశ్వత బంధువులం కాబోతున్నామని అంటుంది.

Published on: Oct 13, 2026, 09:50:30 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో లక్కీ, ఐశ్వర్య పెళ్లి ఏర్పాట్లు జరుగుతుంటాయి. చలపతి వాళ్లు వస్తారు. చలపతి కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకుంటాడు లక్కీ. నాకు కన్యాదానం చేయాల్సింది మీరేగా అని లక్కీ అంటాడు. కన్యాదానం చేయాల్సింది పెళ్లికూతురికిరా అని రాజు అంటాడు.

భ్రమరాంబకు శత్రువులా శేషు

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 13 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 13 ఎపిసోడ్

చలపతి తిడతాడు. ఇంతలో రేఖ, భ్రమరాంబ వచ్చి చీప్ గెస్టులు వచ్చినట్లున్నారని అంటారు. చీప్ వ్యక్తులకు చీఫ్ వ్యక్తులు కూడా చీప్‌గానే కనపడతారని రాజు అంటాడు. పచ్చకామెర్లవాడికి అలాగే కనిపిస్తుందని శేషు అంటాడు. భ్రమరం నోరు తెరిచేసరికి శేషు మూస్తాడు. ఇంతలో అపర్ణ వచ్చి క్షేమసమాచారాలు అడుగుతుంది.

ప్లాన్ చేసి చేస్తుందిగా అని భ్రమరాంబ అంటే.. ఎసిడిటీ సమస్య మొదలైనట్టుందని శేషు అంటాడు. అన్నయ్య వదినకు నువ్వే శత్రువులా తయారవుతున్నావని రేఖ అంటుంది. రామ రామ. నేను భ్రమరాంబ కొంగుచాటు భర్తనంటాడు శేషు. ఇంతలో లంగా ఓణిలో నందు వస్తుంది. వెంకీ చూడాలని నందును పిలుస్తుంది ఇందు. నందు అందానికి వెంకీ ఫిదా అవుతాడు.

ఇంతలో స్వాతి వస్తుంది. ఇందును హగ్ చేసుకుంటుంది. తల్లిని పలకరిస్తుంది. తండ్రి శేషును హగ్ చేసుకుంటుంది స్వాతి. మదన్ బావ బాగా చూసుకుంటున్నాడని చెబుతుంది. రాజు అడిగితే.. మదన్ రాలేదని చెబుతుంది స్వాతి. నా మీద కోపంతోనే రాలేదని రేఖ బాధపడుతుంది. నేను జాబ్ చేస్తున్నాను. బావ తన క్వాలిఫికేషన్‌కి తగ్గ జాబ్ కోసం చూస్తున్నాడని స్వాతి చెబుతుంది.

భార్య సంపాదనపై బతుకుతున్నాడా

అంటే భార్య సంపాదనపై బతుకుతున్నాడా. ఉత్తినే ఇంట్లో కూర్చుని తింటే ఏమంటారు అని భ్రమరాంబ అంటుంది. బావను అంటే ఇప్పుడే వెళ్లిపోతానని స్వాతి అంటుంది. స్వాతి అలా అంటే అన్నోళ్లే వెళ్తారని ఇందు అంటుంది. ఇందు, రాజుపై నిందలు వేస్తుంది భ్రమరాంబ. గొడవను రేఖ ఆపుతుంది. లక్కీని రెడీ అవ్వమంటుంది.

భ్రమరాంబ వచ్చి పుల్లలు వేస్తుంది. ఇందు పంచ్ ఇచ్చి వెళ్లిపోతుంది. వెంకీని కొబ్బరికాయ తెమ్మంటాడు పంతులు. అది తెచ్చేందుకు వెళ్తుంటే ఎదురుగా నందు వస్తుంది. ఇద్దరు గుద్దుకుంటారు. నందును వెంకీ పట్టుకుంటాడు. నందు ప్లేట్‌లోని గులాబీ రెక్కలు గాల్లో ఎగిరి ఇద్దరిపై పడతాయి. ఇద్దరు రొమాంటిక్‌గా చూసుకుంటారు.

పిల్ల దొరికింది కానీ క్లారిటీ లేదు

పంతులు అరవడంతో తేరుకుంటారు. హాఫ్ శారీలో చాలా బాగున్నావ్ అని వెంకీ పొగుడుతాడు. నీ పెళ్లి ఎప్పుడు అని నందు అడిగితే.. పిల్ల దొరికింది. కానీ క్లారిటీ రావట్లేదని వెంకీ అంటాడు. మరోవైపు ఐశ్వర్య అన్న మాటలకు బాధపడుతూ ఇందు వస్తుంది. అపర్ణ చూస్తుంది. ఇందు కవర్ చేస్తే ఎంతసేపు బాధను లోపల దాచుకుంటావని అపర్ణ నిలదీస్తుంది.

మనం చూపించే ప్రేమ అవమానంలా కనిపిస్తుంది, ద్వేషిస్తుంది. ఎందుకే పామును తాడని భ్రమపడతావ్ అని అపర్ణ అంటుంది. మనవాళ్లేగా ఒక్కసారైనా అర్థం చేసుకోరా అనుకుంటాను. కానీ నాది పిచ్చి ప్రేమ అని మరోసారి అర్థమైంది. ఎందుకు అపార్థం చేసుకుంటున్నారు. నాలో ఉన్న లోపమేంటీ అని ఇందు ఏడుస్తూ అంటుంది.

నీ ప్రేమే లోపం, నీ మంచితనమే శాపం. చెడ్డవాళ్ల దగ్గర ప్రేమగా, నీతిగా ఉండాలనుకోవడం నేరం అని అపర్ణ అంటుంది. దాని అహంకారం పొగరు ఎలా పెరిగిపోయిందో చూశావుగా. దానికి బిజినెస్ పెట్టిస్తావా. అనవసరంగా దానికి డబ్బులిచ్చి నష్టపోకు అని అపర్ణ అడుగుతుంది. అక్కకు మాటిచ్చాను. తప్పలేను అని ఇందు వెళ్లిపోతుంది.

లక్కీకి రేఖ దిష్టి చుక్క, ఆభరణాలు

మరోవైపు లక్కీ రెడీ అవుతాడు. భూషణ్, రేఖ వస్తారు. నా కొడుకు మహారాజులా అందంగా ఉన్నాడు. నా దిష్టే తగిలేలా ఉంది అని లక్కీకి దిష్టి చుక్క పెడుతుంది రేఖ. మళ్లీ పుట్టుక గురించి ఎమోషనల్ డ్రామా చేస్తుంది. మదన్ కోసం చేయించిన నగలను లక్కీకి ఇస్తుంది రేఖ. వద్దని లక్కీ అంటాడు. మీరు చూపించే ప్రేమే నాకు పెద్ద ఆభరణం అని లక్కీ అంటాడు.

తల్లిదండ్రులుగా మేము చేయాల్సింది చేయాలిగా అని భూషణ్ అంటాడు. బలవంతంగా లక్కీ మెడలో బంగారు చైన్, చేతికి ఉంగరం, బ్రాస్‌లెట్, వాచ్ పెడుతుంది రేఖ. ఇప్పుడు నిండుగా ఉన్నావంటుంది. రేఖ, భూషణ్ వెళ్లిపోతారు. సిచ్యువేషన్ ఏదైనా నీ యాక్టింగ్‌తో మెప్పిస్తావని రేఖను భూషణ్ పొగుడుతాడు. కానీ, లక్కీకి తెలియదు ఇది వాడికి వేసిన గాలం అని భూషణ్ అంటాడు.

లేదు, నిజంగానే లక్కీని తల్లిగా చూశాను. వాడిపై నేను చూపించింది నిజమైన ప్రేమే అని రేఖ వాదిస్తుంది. అయినా భూషణ్ నమ్మడు. నవ్వుతూ చూస్తాడు. దాంతో రేఖ కూడా నవ్వుతుంది. ఇద్దరు నవ్వుతారు. అయ్యో భూషణ్. ఐ లవ్యూ భూషణ్ అని చెంపలు గిల్లుతుంది రేఖ. నువ్వొక్కడివే నన్ను కరెక్ట్‌గా అర్థం చేసుకున్నావ్. స్మార్ట్ బాయ్. నీ గెస్ కరెక్టే. తల్లి ప్రేమకు దేవుడు కూడా దాసుడవుతాడు. అదే అస్త్రం లక్కీపై వాడనంటుంది రేఖ.

లక్కీ రూపంలో లక్ వచ్చింది

ఇందు పెళ్లయ్యాక మన పవర్ చేజారింది. నేను ఎప్పుడో వదిలేసుకున్న బంధం నాకు కరెక్ట్ టైమ్‌కు లక్కీగా లక్కీ రూపంలో వచ్చింది. మాకు ఈ ఇంటికి సంబంధం లేదని ఇప్పటికీ చాలా మంది అంటారు. కానీ, ఇప్పుడు ఐశ్వర్యను నా కొడుకు పెళ్లి చేసుకోవడంతో ఈ కుటుంబానికి మేము చెందుతాం. సంబంధం లేదని ఎవరు అనలేరని రేఖ అంటుంది.

మనం ఇప్పుడు దుగ్గిరాల ఇంటికి శాశ్వత బంధులం అవుతామని రేఖ అంటుంది. లక్కీ కూడా మన గ్రిప్పులోకి వస్తే దుగ్గిరాల నిలయాన్ని కంట్రోల్ చేయొచ్చని భూషణ్ అంటాడు. లక్కీ, ఐశ్వర్య వచ్చి పెళ్లిపీటలపై కూర్చుంటారు. ఈసారి మదన్, స్వాతి కలిసి వచ్చేలా చేస్తామని రాజు, ఇందు అంటారు. తర్వాత నందు కన్నీళ్లు పెట్టుకుంటుంది.

మా ముగ్గురికి పెళ్లి అయ్యాక విడిపోతామనుకున్నాం. కానీ, ఐశ్వర్య ఇక్కడే ఉంటుందని నందు చెబుతుంది. నువ్వు కూడా ఇల్లరికం అల్లుడుని తెచ్చుకోవే అని అపర్ణ అంటుంది. పంతులు జీలకర్ర బెల్లం పెట్టించాలంటాడు. ఆపండని ఐశ్వర్య ట్విస్ట్ ఇస్తుంది. ఏమైందని ఇందు అడుగుతుంది. పెళ్లిలో నాకు బిజినెస్ పెట్టుకోడానికి అగ్రిమెంట్ రాసి ఇస్తానంది. ఇప్పుడే కావాలని ఐశ్వర్య డిమాండ్ చేస్తుంది.

పాల గ్లాసుతో ఇందు

దాంతో ఇందు బిజినెస్ అగ్రిమెంట్ ఇస్తుంది. ఐశ్వర్య, లక్కీల పెళ్లి అవుతుంది. తర్వాత రాజు, ఇందులను మీ పిల్లల సంగతి ఏంటని అడుగుతాడు. అలా అడగండని అపర్ణ అంటుంది. కట్ చేస్తే రాజు దగ్గరికి పాల గ్లాసుతో ఇందు వస్తుంది. అది చూసి రొమాంటిక్‌గా మురిసిపోతాడు రాజు. అది గమనించిన ఇందు ఆటపట్టిస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks