Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్లో లక్కీ గాడి ఫస్ట్ నైట్ జరుగుతుంది. పరిస్థితి ఏంటో అని రాజు అనుకుంటూ ఉండగా పాల గ్లాసుతో ఇందు వస్తుంది. దాంతో రాజు సిగ్గుపడిపోతూ ఉంటాడు. ఫస్ట్ నైట్ అక్కడ జరుగుతుంటే పాల గ్లాస్ ఇక్కడికి తెచ్చావేంటని అడుగుతాడు.
రాజుకు పాల మీసాలు

పొద్దంతా కష్టపడ్డావ్. ఆకలేస్తుందిగా అని తీసుకొచ్చానని ఇందు అంటుంది. రాజు పాలు తాగుతాడు. మీసాలకు పాలు అంటుతాయి. పాల మీసాల రాజు గారు అని అద్దంలో రాజును చూపిస్తుంది ఇందు. ఇద్దరు నవ్వుకుంటారు. ఇప్పుడు నీతో ఆడుకుంటానని పిల్లల గురించి ఏం చేద్దామని రాజు అంటాడు. రేపు ఉదయమే పిల్లలను తెచ్చుకుందాం. అద్దె మొగుడికి అద్దె పిల్లలే ఉంటారని వెళ్లిపోతుంది ఇందు.
వెనక్కి తిరిగి రాజును చూస్తూ నీ మనసులో ప్రేమను బయటపెట్టగానే పెళ్లి, పిల్లలు బావ అని మనసులో అనుకుంటుంది ఇందు. మరోవైపు ఫోన్లో ఫుడ్ డెలివరీ లేట్ అవుతున్నందుకు కోపంగా ఉంటాడు మదన్. డోర్ బెల్ మోగగానే ఇంత లేటా అని తిడతాడు. అక్కడ స్వాతి ఉంటుంది. ఫుడ్ డెలివరి అతనిపై కోపమని మదన్ చెబుతాడు.
స్వాతి క్యారేజ్ తీసుకొస్తుంది. రేఖ ఆంటీ పంపించిందని స్వాతి చెబుతుంది. ఆ క్యారేజ్ని విసిరేస్తాడు మదన్. ఆవిడ బుద్ధి లేకుండా ఇస్తే నువ్వు సిగ్గులేకుండా తెస్తావా. ఆవిడ విషయంలో ఇలాగే బిహేవ్ చేస్తాను అని ఉగ్రరూపం చూపిస్తాడు మదన్. ఇంతలో ఫుడ్ వస్తే తీసుకొచ్చుకుంటాడు. ఇందులో అమ్మ ప్రేమ ఉండకపోవచ్చు కానీ విషముండదు. అందులో అమ్మ ప్రేమ ఉండొచ్చు కానీ నాకు అది విషంలాగే కనిపిస్తుందని వెళ్లిపోతాడు మదన్.
ఐశ్వర్యకు రుద్రాణి లక్షణాలు
మరోవైపు పెళ్లిలో ఐశ్వర్య చేసిన దాని గురించి కోపంగా ఉంటుంది అపర్ణ. రుద్రాణి లక్షణాలు వచ్చినట్టున్నాయని సుభాష్ అంటాడు. శోభనం రోజు పాలు లక్కీతో ఇప్పించామని అపర్ణ అంటుంది. దాంతో బిజినెస్ పెట్టిస్తుంది ఐశ్వర్య. కోట్లల్లో డీల్స్ ఉంటాయి. అటు ఇటు అయితే అంతా మునిగిపోతాం. గతంలో వాళ్ల నాన్న రాహుల్ చేసింది తలుచుకుంటే భయమేస్తుందని అపర్ణ అంటుంది.
{{/usCountry}}మరోవైపు పెళ్లిలో ఐశ్వర్య చేసిన దాని గురించి కోపంగా ఉంటుంది అపర్ణ. రుద్రాణి లక్షణాలు వచ్చినట్టున్నాయని సుభాష్ అంటాడు. శోభనం రోజు పాలు లక్కీతో ఇప్పించామని అపర్ణ అంటుంది. దాంతో బిజినెస్ పెట్టిస్తుంది ఐశ్వర్య. కోట్లల్లో డీల్స్ ఉంటాయి. అటు ఇటు అయితే అంతా మునిగిపోతాం. గతంలో వాళ్ల నాన్న రాహుల్ చేసింది తలుచుకుంటే భయమేస్తుందని అపర్ణ అంటుంది.
{{/usCountry}}అప్పటిలాగే ఇప్పుడు రాజు, ఇందు ఉన్నారుగా అని ధైర్యం చెబుతాడు సుభాష్. మరుసటి రోజు ఉదయం నీకేమైనా ఏడుపు వినొచ్చిందా, లక్కీ గాడి ఏడుపేగా. వీడు పెళ్లయిన బ్రహ్మచారిలానే ఉంటాడేమో అని రాజు, శేషు ఇద్దరు నవ్వుకుంటారు. ఇంతలో లక్కీ వస్తూ రాత్రి జరిగింది చెప్పొద్దు. బిల్డప్ ఇవ్వాలనుకుంటాడు. శోభనం జరిగినట్లు ఫోజు కొడతాడు లక్కీ.
నువ్వు రాత్రి అరిచిన అరుపులు పక్కింట్లోకి కూడా వినిపడ్డాయట అని రాజు గాలి తీస్తాడు. దాంతో రాజును పట్టుకుని గుక్కపట్టి ఏడుస్తాడు లక్కీ. రాజు, శేషు ధైర్యం చెబుతారు. హాల్లో అంతా ఉంటారు. ఐశ్వర్య లేవడం గురించి మాట్లాడుకుంటారు. రాత్రి విశ్వరూపం చూపించిందిగా అని రాజు అంటాడు. సుభాష్ గురించి రాజు అడిగితే.. ఆయన పాత ఫ్రెండ్స్ వచ్చి బయటకు తీసుకెళ్లారని అపర్ణ చెబుతుంది.
రేఖకు షాక్ ఇచ్చిన ఐశ్వర్య
ఈరోజు నుంచి ఐశ్వర్య బిజినెస్ వుమెన్ అవుతుందని రేఖ అంటుంది. ఇంతలో చీర కట్టుకుని ఐశ్వర్య కిందకు వస్తుంది. అంతా చూసి షాక్ అవుతారు. ఒక వారం ఆగి వెళ్లే అని అపర్ణ అంటే.. ఎందుకు కంపెనీ లాగేసుకోవడం కోసమా అని ఐశ్వర్య అంటుంది. అలా అనుకంటే కంపెనీనే పెట్టించేది కాదని రాజు అంటాడు. మామ నా భార్యతో అంత హార్షుగా మాట్లాడకురా అని పెళ్లానికి సపోర్ట్ చేస్తాడు లక్కీ.
చీరలో చాలా అందంగా ఉన్నావని రేఖ, ఛైర్మన్లా ఉందని, పట్టుదలతో అనుకుంది సాధించిందని భ్రమరాంబ అంటారు. ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయనా అని లక్కీ అడిగితే.. ఆల్రెడీ డ్రైవర్ను పెట్టుకున్నాను. ఇంకో డ్రైవర్ అవసరం లేదని భర్తను అవమానిస్తుంది ఐశ్వర్య. నీకు అన్ని విషయాలు తెలియకపోవచ్చు నేను వస్తానని రేఖ అంటుంది.
వద్దని, అవసరం లేదని రేఖకే షాక్ ఇస్తుంది ఐశ్వర్య. నేను రేఖ ఆంటీని నమ్ముకునో, నా చేతులపై రేఖలను నమ్ముకునే బిజినెస్ పెట్టట్లేదు. నేనేంటో కొంతమందికి చూపించాలి. ఆంటీ నాకు హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో ఉండకండని ఐశ్వర్య అంటుంది. టిఫిన్ తినమని చెబితే పట్టించుకోదు. పొగరుగా మాట్లాడి వెళ్లిపోతుంది ఐశ్వర్య.
వెంకీకి బాస్ అవమానం
కూరలో కరివేపాకుని తీసేసినట్లు తీసేసి వెళ్లిపోయిందని భ్రమరాంబ, శేషు అంటారు. పాపం ఐషు మీద బాగా ఆశలు పెట్టుకున్నారు. ఐస్ ముక్కలా కరిగిపోయాయి. పాపం రేఖ ఆంటీ పరిస్థితి ఏంటో అని రాజు అంటాడు. మరోవైపు వెంకీతో తన బాస్ మాట్లాడుతాడు. కుక్క పని చేయాలి, గాడిద పని చేయాలి. నీ విషయంలో అది చూస్తున్నాను. నీకు డెలివరీ ఇన్వెంటరీలో జాబ్ ఇస్తే క్వాలిటీ కంట్రోల్లో పనేంటీ సర్. ఏం పీకలాను ఇన్వాల్వ్ అవుతున్నావ్ అని వెటకారంగా అంటాడు బాస్.
క్వాలిటీలో తప్పు జరుగుతుందనిపించిందని వెంకీ అంటాడు. అదంతా నేను చూసుకుంటాను. నువ్వు అంత ఖాళీగా ఉంటే డజన్ గుడ్లు తెచ్చుకుని అంటూ వెంకీని ఘోరంగా అవమానిస్తాడు బాస్. ఇంకోసారి రిపీట్ చేస్తే జాబ్లో నుంచి తీసేస్తాను. నీకు అర్హత లేకపోయిన జాలిపడి జాబ్ ఇచ్చాను. అది మైండ్లో పెట్టుకో అని వార్నింగ్ ఇచ్చి పంపిస్తాడు బాస్.
ఐశ్వర్య జ్యూవెలర్స్ కొత్త కంపెనీకి లేడి బాస్లా ఐషు వెళ్తుంది. ఆఫీస్కు ఛైర్మన్ వస్తే ఓ బొకే లేదు, విష్ లేదని ఐశ్వర్య అంటుంది. మీకు కొత్తగా పెళ్లయిందిగా. ఇవాళ రారని, మమ్మల్ని హెల్ప్ చేయమని చెప్పిందని శ్రుతి చెబుతుంది. ఇంకా ఎవరెవరికి ఏం చెప్పింది ఇందు అని ఐషు అడుగుతుంది. ఒక్కొక్కరు తమకు చెప్పిన వర్క్ గురించి చెబుతారు.
స్వరాజ్ ఉద్యోగుల తొలగింపు
మేమంతా 20 ఏళ్లుగా స్వరాజ్ కంపెనీలో పని చేస్తున్నామని శ్రుతి అంటుంది. ఇక్కడ సీనియర్స్ ఎంతమంది ఉన్నారని ఐషు అడిగితే.. ఐదుగురు అని పక్కకు వస్తారు. శ్రుతితో కలిపి ఇందుతో టచ్ ఉన్న ఐదుగురికి పింక్ స్లిప్ ఇచ్చి పంపించేయమని ఐశ్వర్య ఆర్డర్ వేస్తుంది. అది విని అంతా షాక్ అవుతారు. ఏ కారణం లేకుండా జాబ్లో నుంచి ఎందుకు తీసేస్తున్నారు అని శ్రుతి అంటుంది.
ఇందుతో సంబంధం ఉన్నవాళ్లు అవసరంలేదు. ఇక్కడ ఐశ్వర్య పేరు మాత్రమే వినపడాలని చెప్పి వెళ్లిపోతుంది. మరోవైపు ఓ టెండర్ గురించి రాజు, ఇందు మాట్లాడుకుంటారు. నాకు బోర్ కొడుతుందని ఆఫీస్కు వెళ్లకండని అంటే.. వంటింటినే ఆఫీస్ చేశారుగా అని అపర్ణ అంటుంది. ఇంతలో శ్రుతి వస్తుంది. జాబ్లో నుంచి తీసేసిన విషయం చెబుతుంది.
స్వరాజ్ గ్రూప్ నుంచి వచ్చిన ఎంప్లాయిస్ అందరిని తీసేసిందని శ్రుతి చెబుతుంది. తర్వాత రాజు, ఇందును కలిపేందుకు అపర్ణ ప్లాన్ వేస్తుంది. రాజుపై ఓ చిట్టీ విసిరుతుంది అపర్ణ. నా మనసులో ఉన్న మాట చెప్పాలి రాత్రి 12 గంటలకు రమ్మని అందులో ఉంటుంది. ఇందుపై కూడా అదే చిట్టీ వేస్తుంది అపర్ణ. రాజు, ఇందు ఇద్దరు చూసుకుని నవ్వుకుంటారు.
వెన్నెల్లో డిన్నర్
రాత్రి వెన్నెల్లో డిన్నర్కి ప్లాన్ చేశాడేమో అని ఇందు అనుకుంటుంది. రాజు, ఇందు కారు దగ్గరికి వెళ్తారు. శేషుని చూసి రాజు, నందును చూసి ఇందు ఇద్దరు దాక్కుంటారు. అలా దాక్కుని కారు వెనుక గుద్దుకుంటారు. ఇందు అరవబోతుంటే రాజు నోరు మూస్తాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.