...
...
Next Story

Brahmamudi October 20 Episode: బ్రహ్మముడి-కోటి నష్టంతో ఐశ్వర్యకే టెండర్-ఇందుపై గెలుపు- గోల్డ్ స్కామ్‌లో ఇరుక్కున్న వెంకీ

Brahmamudi Serial October 20th Episode: బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 20వ ఎపిసోడ్‌‌లో డిజైనర్ ఇంటర్వ్యూ కోసం వచ్చిన ప్రశాంత్‌తో ఇందు పులిహార కలుపుతుంది. రాజు అసూయపడేలా చేస్తుంది. ఛైర్మన్ భర్తగా లక్కీ ఆఫీస్‌లో బిల్డప్ ఇస్తాడు. కోటి రూపాయల నష్టంతో 4 కోట్లకు టెండర్ వేస్తుంది ఐశ్వర్య.వెంకీని ఇరికిస్తుంది.

Published on: Oct 20, 2026, 09:29:26 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఈ టెండర్ ఐశ్వర్యకే వస్తుందని రేఖ అంటుంది. మేము ఏం చేయాలి చేపలు పట్టుకోవాలా అని రాజు అంటాడు. నేను గెలిచాక మీరు చేసేది అదే అని ఐశ్వర్య అంటుంది. ఎవరు గెలుస్తారో ముందే చెప్పలేమని రాజు అంటాడు.

ఇందు జెలస్ అయ్యేలా

బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 20 ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ అక్టోబర్ 20 ఎపిసోడ్

రాజు, ఇందు ఇద్దరు వెళ్లిపోతారు. ఐశ్వర్యకు లక్కీ టిఫిన్స్ పెడుతూనే ఉంటాడు. చేయి కడిగించి తన షర్ట్‌కు తుడుపిస్తాడు. ఐశ్వర్య వెళ్లిపోతుంది. రేయ్ లక్కీ నిన్ను చూస్తుంటే ఒకటి గుర్తొస్తుందిరా అని శేషు అంటే.. వయసులో ఉన్నప్పుడు నిన్ను నువ్వు చూసుకున్నట్లు ఉందా అని లక్కీ కౌంటర్ ఇస్తాడు. మరోవైపు ఆఫీస్‌లో రిలాక్స్‌డ్‌గా కాఫీ తాగుతుంటారు రాజు, ఇందు.

ఇంటర్వ్యూ కోసం డిజైనర్ వస్తుందని ప్యూన్ వచ్చి చెబుతాడు. తనతో బాగా ఉండి ఇందు జెలసీ ఫీల్ అయ్యేలా చేయాలని రాజు అనుకుంటాడు. కానీ, వచ్చేది మగాడు కావడంతో రాజు షాక్ అయి పక్కకు పడతాడు. అతన్ని ఇంటర్వ్యూ చేస్తుంది ఇందు. అతను పేరు ప్రశాంత్ అని తను వర్క్ చేసిన ప్లేస్ గురించి చెబుతాడు. ఇందు చాలా గార్జియస్‌గా ఉందని, చీర కట్టుకుని చాలా పద్ధతిగా ఉన్నారని పొగుడుతాడు.

దాంతో కోపంతో రాజు అతనిపైకి వెళ్లి నా భార్యనే నా ముందు పొగుడుతావారా. గొంతులో పొడుస్తా అని పెన్నుతో బెదిరిస్తాడు రాజు. కానీ, అది కలకంటాడు రాజు. వచ్చింది డిజైన్స్ గురించి, కాంప్లిమెంట్స్ కోసం కాదని రాజు అంటాడు. రాజు జెలసీ ఫీల్ అవుతున్నట్లు ఉన్నాడని మనసులో అనుకున్న ఇందు పైకి మరింత ఓవర్‌గా మాట్లాడుతుంది.

మరదలు ఏడిపిస్తే

మరోవైపు ఈ టెండర్ కోసం అన్నీ కంపెనీలు మ్యాగ్జిమం ఎంత కోట్ చేస్తాయని ఐశ్వర్య అడిగితే మ్యాన్యుఫాక్చర్‌ని బట్టి రూ. 5 కోట్లు అవుతుంది. ఎవరి బ్రాండ్‌ని బట్టి అంత కోట్ చేస్తారు. కొత్త కంపెనీ కాబట్టి తక్కువ ప్రాఫిట్స్ వచ్చిన పర్వాలేదని రూ. 6 కోట్లకు కోట్ చేశానని, మనకు వచ్చే ఛాన్స్ 50-50 ఉండొచ్చని మేనేజర్ చెబుతాడు.

100 శాతం ఎందుకు కాదు అని పీఏ ఎంట్రీ ఇస్తాడు. స్వరాజ్ గ్రూప్ వాళ్లు కూడా మనకు దగ్గరిలో కోట్ చేసే అవకాశం ఉందని మేనేజర్ సుబ్బు అంటాడు. వంద శాతం మనకే రావాలంటే ఏం చేయాలని ఐషు అడుగుతుంది. మహా అయితే 10 నుంచి 20 లక్షలు తగ్గించొచ్చు. అంతకుమించి తగ్గిస్తే మనకు లాస్ వచ్చే అవకాశం ఉందని సుబ్బు అంటాడు.

కోటి రూపాయల నష్టానికి టెండర్

దాంతో రూ. 4 కోట్లకు కోట్ చేయమని ఐశ్వర్య అంటుంది. అలా చేస్తే కోటి రూపాయలు నష్టం వస్తుందని మేనేజర్ అంటాడు. మనం బాగుపడకపోయినా పర్వాలేదు. వేరేవాళ్లు బాగుపడకూడదని పీఏ అంటాడు. అవును అన్నట్లుగా ఐషు సైగ చేస్తుంది. సరేనని మేనేజర్ సుబ్బు వెళ్లిపోతాడు. మరోవైపు ఐశ్వర్య కోసం క్యారేజ్ ప్యాక్ చేయిస్తాడు లక్కీ.

రేఖ అడిగితే.. అదే చెబుతాడు లక్కీ. ఐషుకు సర్‌ప్రైజ్ ఇస్తానంటాడు. ఐశ్వర్యకు లక్కీ తగినవాడే. తన భవిష్యత్తుకు డోకా లేదని భ్రమరాంబ అంటుంది. లక్కీని రేఖ మెచ్చుకుంటుంది. నీవల్లే నాకు ఫ్యామిలీ దక్కింది. నేను తండ్రిని కాబోతున్నా. అందుకే ఇదంతా చేస్తున్నా అని లక్కీ అంటాడు. లక్కీకి ఇష్టమైనది అడిగి.. పీతల ఇగురు చేయమని పనిమనిషికి ఆర్డర్ వేస్తుంది రేఖ.

మరోవైపు ఇందుకు భోజనం తీసుకొచ్చి సర్‌ప్రైజ్ చేయాలని రాజు చూస్తాడు. అది ఇందు చూస్తుంది. ప్రశాంత్ దగ్గరికి వెళ్లి అతని ఫుడ్ గురించి అడుగుతుంది. అతను డైట్ ఫాలో అవుతుంటానని, వెజ్జీస్ చూపిస్తాడు. ప్రశాంత్ డైట్‌ను మెచ్చుకుంటూ తను కూడా తింటానంటంది. అదంతా చూసి రాజు షాక్ అవుతాడు. రాజు పూరీ చోళి కర్రీ అని చెప్పి తీస్తాడు.

ఛైర్మన్ భర్తగా లక్కీ బిల్డప్

నాకు చాలా టెంప్టింగ్‌గా ఉందని ప్రశాంత్ అంటాడు. సర్‌కి చెప్పి ఇప్పించమని ప్రశాంత్ అంటాడు. నాకోసం కూడా పూరీలు తెచ్చి ఉంటావుగా ఇవ్వు. నేను ప్రశాంత్ తింటామని ఇందు అంటుంది. ఇది ఆయిల్ ఫుడ్. మీరు డైట్ ఫాలో అవుతారుగా. ఈ పూరీలన్నీ నేను ఒక్కన్నే తింటాను అని రాజు ఒక్కడే ఊరిస్తూ తింటాడు. బావకు నా మీద ఇంట్రెస్ట్ ఉంది. కానీ బయటపడట్లేదని ఇందు అనుకుంటుంది.

ప్రశాంత్ నీ డైట్ బాగుంది. నీ డిజైన్స్ నచ్చితే రోజు ఇద్దరం కలిసి తినొచ్చని ఇందు అంటుంది. దాంతో రాజు మరింత కుళ్లుకుంటాడు. మరోవైపు ఐశ్వర్య ఆఫీస్‌కు లక్కీ వెళ్తాడు. ఎవరని మేనేజర్ అడిగితే.. మీ ఛైర్మన్ భర్తను అని చెప్పి బిల్డప్ ఇచ్చుకుంటాడు. లక్కీని ఐషు దగ్గరికి తీసుకెళ్తాడు మేనేజర్. లక్కీని చూసి ఐశ్వర్య షాక్ అవుతుంది.

సర్‌ప్రైజ్ చేద్దామని వస్తే షాక్ అవుతావేంటని లక్కీ అంటాడు. ఐశ్వర్య అవమానంగా ఫీల్ అవుతుంది. లక్కీ కాలర్ పట్టుకుని తిడుతుంది. సైలెంట్‌గా వెళ్లమంటుంది. దాంతో లక్కీని ఆఫీస్‌లో అందరికి మేనేజర్ పరిచయం చేసింది, తను అక్కడ బిల్డప్ ఇచ్చింది చెబుతాడు. దాంతో మరింత కోప్పడుతుంది ఐశ్వర్య. నా ప్లాన్ మొత్తం చెడగొట్టేశావంటుంది.

రాజుకు స్ట్రోక్

నీలాంటి వాన్ని చేసుకున్నందుకు అంతా చూసి నవ్వుకుంటారు అని ఉద్యోగులు ఏం మాట్లాడుకుంటున్నారో వినిపిస్తుంది. లక్కీని దొంగకోళ్లు పట్టుకునేవాడిలా ఉన్నాడని, డబ్బుకోసమే పెళ్లి చేసుకుందేమో అని వాళ్లు అనుకుంటారు. దాంతో లక్కీ సైలెంట్‌గా పారిపోతాడు. మరోవైపు ప్రశాంత్ డిజైన్స్ గురించి మాట్లాడుకుంటారు రాజు, ఇందు.

ప్రశాంత్ వచ్చి డిజైన్స్ చూపిస్తాడు. అవి పెద్దగా క్రియేటివిటీగా లేవని, సాదాగా ఉన్నాయని రాజు అంటే.. చాలా బాగున్నాయని ఇందు అంటుంది. ప్రశాంత్ మీరు అప్లై చేసిన స్ట్రోక్స్ అన్నీ చాలా బాగున్నాయి. డిజైన్స్ చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. మీరే మా అఫిషియల్ డిజైనర్ అని కంగ్రాట్స్ చెబుతుంది ఇందు. స్ట్రోక్ అని గుండెపట్టుకుంటాడు రాజు.

ప్రశాంత్‌కు ఇందు షేక్ హ్యాండ్ ఇస్తుంది. అది చూసి రాజు గుండె ముక్కలవుతుంది. మరోవైపు పీతలు ఎక్కడ దొరకేలదని, లక్కీ కోసం రేఖ మేడమ్ చెప్పారని, మరో మార్కెట్‌కి వెళ్లి రమ్మంటారా అని అపర్ణను అడుగుతుంది పనిమనిషి. ఇప్పుడు వెళ్తే 3 గంటలు పడుతుంది. భోజనం ఎప్పుడు చేస్తావ్. అందరికి టైమ్ అవుతుంది. రేపు చూసుకోవచ్చులే. గోంగూర చికెన్ చేయమని అపర్ణ అంటుంది.

బకరాగా వెంకటేశ్వర్లు

రేఖ మేడమ్ ఏమైనా అంటుందేమో అని పనిమనిషి అంటే.. నేను చెబుతాలే అని అపర్ణ అంటుంది. మరోవైపు బెస్ట్ ఫ్రాడ్ కంపెనీగా పేరు ఉన్న వ్యక్తితో ఐశ్వర్య మాట్లాడుతుంది. నేను కోటి రూపాయల నష్టానికి టెండర్ వేశాను. కానీ, నాకు లాస్ రాకూడదని ఐశ్వర్య అడుగుతుంది. సింపుల్ మేడమ్. మనం క్లైంట్‌కు సాంపిల్‌గా పంపే గోల్డ్‌లో 22 క్యారెట్ గోల్డ్ ఉంటుంది. ఫైనల్‌గా పంపే ప్రోడక్ట్‌లో 18 క్యారెట్ గోల్డ్ ఉంటుందని అతను చెబుతాడు.

దాంతో మీరు ప్రాఫిట్‌లో ఉంటారని అతను చెబుతాడు. నాకు ఇదే కావాలని. ఎవరికి తెలియకూడదని ఐశ్వర్య అంటుంది. ఎవరికి తెలియదు. అందుకోసం కొంతమంది బకరాలను పనికి తీసుకుని పని అవ్వగానే వాళ్లను తీసేస్తామని, ఎంక్వైరీలో నిజం బయటపడితే ఆరోజు తప్పు అతను చేశాడు. అందుకే జాబ్ మానేసి వెళ్లిపోయాడని అతనిమీద కంప్లైంట్ చేస్తామని అతను చెబుతాడు.

ఇంతకీ ఎవరా బకరా అని ఐశ్వర్య అడుగుతుంది. వెంకటేశ్వర్లు అని చెబుతాడు. ఈ పేరు ఎక్కడో విన్నట్లుందే అని ఐషు అంటుంది. దాంతో వెంకటేశ్వర్లను చూపిస్తాడు అతను. తర్వాత ఆ టెండర్ ఐశ్వర్యకే వచ్చిందని, కంగ్రాట్స్ చెబుతుంది ఇందు. దాంతో ఐషును ఎత్తుకుని తిప్పుతాడు లక్కీ. ఇకనుంచి పవర్స్ అన్నీ నావే, ఇందు నా కాళ్ల మీదకు వస్తుందని రేఖతో ఐశ్వర్య అంటుంది.

ఐశ్వర్యకు టెండర్

ఐశ్వర్య కోటి రూపాయల నష్టానికి టెండర్ దక్కించుకుందని ఇందుకు శ్రుతి చెబుతుంది. అదే విషయం రాజుకు చెబుతుంది ఇందు. ఐశ్వర్య సోర్సెస్ గురించి తెలుసుకోవాలని ఇందు అంటుంది. ఐశ్వర్య క్లైంట్స్‌కు చేసిన గోల్డ్ స్కామ్‌లో వెంకీని ఇరికుస్తుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks