Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నీకు నేనంటే ద్వేషం ఉండొచ్చు, చిరాకు ఉండొచ్చు. కానీ మనం చేసిన తప్పుకు పసిబిడ్డ ప్రాణాలు తీయొద్దు. కావాలంటే నీ కాళ్లు పట్టుకుంటాను అంటూ ఐశ్వర్య కాళ్లు పట్టుకుంటాడు లక్కీ. నాకు మన బిడ్డ కావాలని అంటాడు లక్కీ.
ఐశ్వర్య కాళ్లు పట్టుకున్న లక్కీ

ఏంటీ మన బిడ్డ. చాలా ఎమోషనల్ అవుతున్నావేంటీ. నువ్వు ఎంత ఏడ్చిన నా నిర్ణయం మారదు. ఆరోజు ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది. అది ఆరోజే మర్చిపోయాను అని ఐశ్వర్య అంటుంది. ఈరోజు నువ్వు తెలిసి తప్పు చేస్తున్నావ్. మన బిడ్డను పుట్టకముందే చంపడం అనేది పాపమని లక్కీ అంటాడు. నాపై అధికారం ఉందని అనుకుంటున్నావా. నా భర్తల ఫీల్ అవుతున్నావా. అనవసరంగా ఎక్కవ చేయకు అని ఐషు కోప్పడుతుంది.
లక్కీ ఎంత చెప్పిన వినదు. లక్కీ గాడి వల్ల నీ కొడుకు నా కూతురు ఇద్దరు దూరమైపోయారు. నీ కొడుకు మాములోడు కాదు. ఇంతపెద్ద ట్విస్ట్ ఇచ్చాడేంటని రేఖతో అంటుంది భ్రమరాంబ. కొన్నిసార్లు అనుకున్నపనులు జరిగినా జరగపోయినా మనకే లాభం జరుగుతుంది. ఇది కూడా అలాంటిదే. ఇప్పుడు లక్కీని ఐశ్వర్య పెళ్లి చేసుకుంటే వాడు నా కొడుకే కాబట్టి ఆస్తి మనకే వస్తుంది. పెళ్లి జరగకుంటే ఎలాగు ఐశ్వర్య మనం చెప్పినట్లే వింటుంది కాబట్టి కంపెనీ పెట్టించి అలా సాధిస్తామని రేఖ అంటుంది.
లక్కీ వచ్చి రేఖకు సారీ చెబుతాడు. నీకు బ్యాడ్ నేమ్ తెచ్చానంటాడు. నీ పరిస్థితి అర్థం చేసుకోగలను అని రేఖ అంటుంది. ఐశ్వర్య బిడ్డను తీయుంచుకోవాలనుకుంటున్న విషయం రేఖకు చెబుతాడు లక్కీ. నాకు అది ఇష్టం లేదు. నాకు నా బిడ్డ కావాలి. నువ్వే ఐశ్వర్యను ఒప్పించాలని ప్రాధేయపడతాడు లక్కీ.
తన కడుపులో ఉంది నా వారసుడు
తన కడుపులో ఉంది నా వారసుడు కానీ నేను ఏం చేయలేను. కానీ, దీనికి ఒక్క మార్గం ఉంది. ఇప్పుడు ఇంట్లో రాజు, ఇందు మాటే నెగ్గుతుంది. వాళ్లిద్దరు ప్రయత్నిస్తే నువ్వు అనుకుంది జరుగుతుంది అని రేఖ అంటుంది. దాంతో లక్కీ సరేనని వెళ్లిపోతాడు. రాజు, ఇందులను భలే ఇరికించావ్. వాళ్లపై ఐశ్వర్యకు ఇంకా కోపం వస్తుంది. అడగకుంటే లక్కీ దూరమవుతాడు అని భ్రమరాంబ అంటుంది.
{{/usCountry}}తన కడుపులో ఉంది నా వారసుడు కానీ నేను ఏం చేయలేను. కానీ, దీనికి ఒక్క మార్గం ఉంది. ఇప్పుడు ఇంట్లో రాజు, ఇందు మాటే నెగ్గుతుంది. వాళ్లిద్దరు ప్రయత్నిస్తే నువ్వు అనుకుంది జరుగుతుంది అని రేఖ అంటుంది. దాంతో లక్కీ సరేనని వెళ్లిపోతాడు. రాజు, ఇందులను భలే ఇరికించావ్. వాళ్లపై ఐశ్వర్యకు ఇంకా కోపం వస్తుంది. అడగకుంటే లక్కీ దూరమవుతాడు అని భ్రమరాంబ అంటుంది.
{{/usCountry}}రాజు దగ్గరికి వెళ్లి క్షమించమని అడుగుతాడు లక్కీ. అది యాక్సిడెంటల్‌గా జరిగిందని అంటాడు. నీ మొహం చూస్తేనే చిరాకుగా ఉందని తిడతాడు రాజు. నేను మరో తప్పుకు కూడా కారణం అవుతున్నారా. మీరిద్దరు నాకు సహాయం చేయాలి. ఐషు బిడ్డను తీయించుకుంటానంటుంది. ఎంత చెప్పిన వినట్లేదు. నా బిడ్డ నాకు కావాలిరా. ఎలాగైనా తను ఆపరేషనే చేసుకోకుండా ఆపాలిరా అని లక్కీ ప్రాధేయపడతాడు.
నాకు కన్నతల్లిని ఇచ్చావురా. ఇప్పుడు నా బిడ్డను కాపాడురా. నీ రుణం జీవితంలో మర్చిపోను అని రాజును, ఇందును బతిమిలాడుతాడు. నీ బిడ్డకు ఎలాంటి ప్రమాదం రానివ్వను అని ఇందు మాటిస్తుంది. దాంతో థ్యాంక్స్ చెప్పి లక్కీ వెళ్లిపోతాడు. ఐశ్వర్యకు ఏం చెబితే వింటుందో నాకు తెలుసు అని రాజుతో అంటుంది ఇందు.
బిడ్డను తీయించుకుంటానని
మరుసటి రోజు ఉదయం తాము అనుకుంది చేయడం కోసం ఐశ్వర్య కోసం వెతుకుతారు ఇందు, రాజు. ఎక్కడ కనిపించదు. ఇందు కాల్ చేస్తుంది. ఐశ్వర్య లిఫ్ట్ చేయదు. ఐశ్వర్య హాస్పిటల్‌కు వెళ్లి ఉండొచ్చు అని రేఖ చెబుతుంది. బిడ్డను తీయించుకుంటానని చెప్పింది. నిన్న రాత్రి డాక్టర్‌తో మాట్లాడినట్లు లక్కీ చెప్పాడని రేఖ చెబుతుంది.
ఇందు, రాజు, అపర్ణ అంతా షాక్ అవుతారు. ఇప్పుడు ఐశ్వర్య ఏ హాస్పిటల్‌కు వెళ్లి ఉంటుంది అని రాజు అంటాడు. మరోవైపు డాక్టర్‌తో ఐశ్వర్య ప్రెగ్నెన్సీ తీసేయడం గురించి మాట్లాడుతుంది. పెద్దవాళ్ల నిర్ణయం తీసుకున్నావా అని డాక్టర్ అడుగుతుంది. నాకు ఎవరు లేరు. లక్కీ పర్మిషన్ కూడా అవసరం లేదు. ఇది నేను ఫీవర్ వచ్చినట్లుగానే ఫీల్ అవుతున్నాను అని ఐశ్వర్య అంటుంది.
ఇది మాతృత్వం అమ్మా అని డాక్టర్ అంటుంది. సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టకండి. అసలు ప్రెగ్నెన్సీ అనే విషయాన్నే తట్టుకోలేకపోతున్నా అని ఐశ్వర్య అంటుంది. మరోవైపు ఐశ్వర్య ఏ హాస్పిటల్‌కి వెళ్లిందో వీళ్లు కనిపెట్టలేరు. ఐశ్వర్యను తిడతారు. అదే ఫ్లోలో మనం ఐషును పూర్తిగా రెచ్చగొడతాం. వాళ్లు దిగొచ్చి ఆస్తి రాసేలా చేయిస్తాను. కావాలంటే ఐషు ప్రాణాలు తీసుకునేలా చేయిస్తాను అని రేఖ అంటుంది.
ఐశ్వర్యకు ఇందు కండిషన్
ఆ రాజు ఊరుకుంటాడా. ఇలా జరగనివ్వడు అని భ్రమరాంబ అంటుంది. ఈ విషయంలో వాడు తగ్గాల్సిందే. ఐషుపై ఇందుకు ప్రేమ ఉంది. అది దాని బలహీనత. అదే మన ఆయుధం అని రేఖ అంటుంది. ఇందు, రాజు కాల్స్ చేస్తుంటారు. ఇంతలో లక్కీ కాల్ చేసి హాస్పిటల్ గురించి, ఐశ్వర్యతోనే ఉన్నానని చెబుతాడు. దాంతో హాస్పిటల్‌కు రాజు, ఇందు వెళ్తారు.
ఐశ్వర్యకు ఆపరేషన్ జరగకుండా చేసి ఇంటికి తీసుకొస్తారు రాజు ఇందు. నీకు కంపెనీ కావాలనుకుంటే ఆపరేషన్ చేయించుకోకూడదని, లక్కీని పెళ్లి చేసుకోవాలని ఐశ్వర్యకు ఇందు కండిషన్ పెడుతుంది. లేదంటే ఆస్తిలో చిల్లిగవ్వ కూడా దక్కనివ్వను అంటుంది ఇందు. దాంతో రేఖ, ఐశ్వర్య షాక్ అవుతారు. రేఖ వేసిన ప్లాన్ రివర్స్ అవుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.