Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో నందుకు దుబాయ్ వచ్చినట్లుగా చెప్పిన మనిషి కంప్లైంట్ ఇస్తాడు. రాజు అనే వ్యక్తే సిరిని మోసం చేసి పెళ్లి చేసుకున్నాడని చెబుతాడు. మీరు చెప్పేది నిజమేనా అని నందు అంటే.. రాజు ఫొటో చూపించి ఇతనే అని చెప్పి నిజమంటాడు.
దుబాయ్ ఆదిత్యతో రేఖ ప్లాన్

దాంతో నందు షాక్ అవుతుంది. బయటకు వచ్చిన దుబాయ్ వ్యక్తి రేఖకు కాల్ చేసి మీరు చెప్పినట్లుగానే చేశానని, పోలీసులు యాక్షన్ తీసుకుంటామన్నారని చెబుతాడు. రేఖ సరేనుంటుంది. రాజు నీ చాప్టర్ క్లోజ్ అని అనుకుంటుంది. తర్వాత ఇంట్లో రాజు జీవితంలోకి రాహువు ప్రవేశించాడని, అంత మనం అనుకున్నట్లే జరుగుతుందని భూషణ్‌తో చెబుతుంది రేఖ.
ఇంతలో సుభాష్ వీల్ చైర్‌లో కూర్చుని ఆడుకుంటుంది సిరి. ఆడుకుంటూ భూషణ్ కాలుకు తగులుతుంది. భూషణ్ తిడతాడు. కొడతానంటాడు. నా మొగుడుకు చెబుతానని పిలుస్తుంది. ఈ బ్రెయిన్ లూస్‌తో ఎందుకని భూషణ్ అంటే.. నీకే బ్రెయిన్ లూజ్ అని సిరి అంటుంది. రేఖ కూడా వెళ్లమంటే వెళ్లదు సిరి. నాకే ఎదురు చెబుతావా బుర్రతక్కువ దానా అని రేఖ అంటుంది.
నువ్వే బుర్రతక్కువ దానివి అని సిరి అంటుంది. మాటకు ఎదురు చెబుతావా అని కోపంగా సిరిని తోస్తాడు భూషణ్. అదంతా అపర్ణ చూస్తుంది. సిరి వెళ్లి కిందపడి తలకు దెబ్బతగులుతుంది. బయటే ఉన్న రాజు, ఇందు కంగారుగా వచ్చి సిరిని చూస్తారు. ఎవరు తోశారని రాజు అడిగితే.. తనే పడిందని రేఖ అబద్ధం చెబుతుంది. భూషణ్ తోయడం నేను చూశానని అపర్ణ అంటుంది.
సిరి కాలర్ పట్టుకున్న రాజు
పక్కకెళ్లి ఆడుకోమ్మని నెమ్మదిగా తోశానని భూషణ్ అంటాడు. నెమ్మదిగా తోస్తే అంతదూరం నుంచి వచ్చిపడిపోతుందా అని రాజు కోపంతో అరుస్తాడు. భూషణ్ కాలర్ పట్టుకుని గొడవ పెట్టుకుంటాడు. రాజు ఆపుతావా. సిరిని హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని ఇందు అంటుంది. దాంతో కారు తీసుకొస్తాడు. సిరిని హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. సిరికి ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్స్.
{{/usCountry}}పక్కకెళ్లి ఆడుకోమ్మని నెమ్మదిగా తోశానని భూషణ్ అంటాడు. నెమ్మదిగా తోస్తే అంతదూరం నుంచి వచ్చిపడిపోతుందా అని రాజు కోపంతో అరుస్తాడు. భూషణ్ కాలర్ పట్టుకుని గొడవ పెట్టుకుంటాడు. రాజు ఆపుతావా. సిరిని హాస్పిటల్‌కు తీసుకెళ్లాలని ఇందు అంటుంది. దాంతో కారు తీసుకొస్తాడు. సిరిని హాస్పిటల్‌కు తీసుకెళ్తారు. సిరికి ట్రీట్మెంట్ చేస్తారు డాక్టర్స్.
{{/usCountry}}మహా అయితే ఇంకొన్నిరోజులు కోమాలోకి వెళ్తుందని రేఖ అంటుంది. ఇందు ఆప్షనల్‌గా ఉందిగా అని భూషణ్ అంటాడు. దాంతో అందరిని తిడుతుంది అపర్ణ. రాబందుల్లా పీక్కుతినకండని అపర్ణ అంటుంది. చిన్న పిల్ల అని చూడకుండా తోసేసింది కాకుండా సిగ్గులేకుండా అంటున్నారా అని అపర్ణ అంటుంది. నేనేం కావాలని తోయలేదు. పక్కకెళ్లి ఆడుకోమన్నా అని భూషణ్ అంటాడు.
హాస్పిటల్‌లో గొడవ పడతారు. చాలా ఇరిటేట్ చేస్తే అలా చేశామని రేఖ అంటుంది. రాజు కోప్పడతాడు. ఇరిటేట్ చేస్తే ఎవరైనా అలాగే చేస్తారని ఐశ్వర్య అంటుంది. తనది చిన్నపిల్లల మనస్వత్తం. సర్దుకుపోవాలని అపర్ణ అంటుంది. లోపల సిరికి సీరియస్ అయితే మీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు పెడతాను అని రాజు అంటాడు. నన్ను లాక్కండని ఐశ్వర్య, భ్రమరాంబ అంటారు.
రాజును అరెస్ట్ చేసిన నందు
ఇంతలో నందు ఎస్సైగా వస్తుంది. అంతా షాక్ అవుతారు. రాజు కంగ్రాట్స్ చెబుతాడు. ఇందు సంతోషిస్తుంది. సారీ అక్క.. నేను వచ్చింది బావను మిస్టర్ రాజును అరెస్ట్ చేయడానికి అని నందు చెబుతుంది. అంతా షాక్ అవుతారు. భ్రమరాంబ, రేఖ, భూషణ్ సంతోషిస్తారు. ఇదేం ట్విస్ట్ అని ఐశ్వర్య అనుకుంటుంది. సిరిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్న ఆదిత్య పోలీస్ స్టేషన్‌కి వచ్చాడని కంప్లైంట్ గురించి చెబుతుంది నందు.
నేను ఎవరిని మోసం చేయలేదని రాజు అంటాడు. చట్టాన్ని మోసం చేయాలని చూడకు అని ఆదిత్య వచ్చి అంటాడు. నువ్వు చెప్పిందంతా కట్టుకథ నిజమా అని అపర్ణ అంటుంది. ఆదిత్య డ్రామా చేస్తాడు. నా సిరి ఎక్కడంటూ ఓవరాక్షన్ చేస్తాడు. నటన వికటించడకుండా ఉంటే చాలని రేఖతో భూషణ్ అంటాడు. నందు నీకు రాంగ్ ఇన్‌ఫర్మేషన్ వచ్చిందని రాజు అంటాడు.
నందు వినదు. రాజును అరెస్ట్ చేస్తుంది నందు. రాజును నందు తీసుకెళ్తుంది. ఇంతలో సిరి వచ్చి ఆగండి అంటుంది. సిరిని చూసి అంతా షాక్ అవుతారు. ఇది ఇలా ట్విస్ట్ ఇచ్చేందేంటని రేఖ అనుకుంటుంది. రాజును ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని సిరి అడుగుతుంది. రాజు నాకు గతం అంతా గుర్తుకు వచ్చింది అని చెబుతుంది. రాజును ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని మళ్లీ అడుగుతుంది సిరి.
సిరికి గుర్తొచ్చిన గతం
మీకు యాక్సిడెంట్ చేసింది. మీ నాన్న చనిపోడానికి కారణం ఆయనే. ఇన్నాళ్లు నువ్వు కోమాలో ఉండటానికి, గతం మర్చిపోడానికి అన్నింటికి కారణం అతనే అని భ్రమరాంబ అంటుంది. ఎవరు చెప్పారని సిరి అంటే.. పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేశారని భ్రమరాంబ అంటుంది. అదంతా అబద్ధం. యాక్సిడెంట్ వరకు రాజు ఎవరో కూడా నాకు తెలియదు. మా నాన్న చనిపోయాడని కూడా ఇప్పుడే తెలిసిందని జరిగింది చెబుతుంది సిరి.
ఆరోజు యాక్సిడెంట్ చేసింది రాజునే అని రేఖ అంటుంది. లేదు. ఆరోజు లెఫ్ట్‌కి వెళ్లకుండా రైట్‌కి రాంగ్ రూట్‌లో వెళ్లింది మేమే. సడెన్‌గా రాజు కారు వచ్చింది. నిజానికి మా నాన్న చావుకు రాజు కారణం కాదు. రాజుదు ఏ తప్పులేదు అని సిరి అంటుంది. మరి భర్త అని సైన్ చేసినస సంగతేంటని భ్రమరాంబ అంటుంది. తప్పనిపరిస్థితుల్లో రాజు అలా చేశాడని నర్స్ చెప్పిందని సిరి అంటుంది.
మరి నిన్ను మోసం చేశాడని ఆదిత్య కంప్లైంట్ ఇచ్చాడని నందు అంటుంది. ఆదిత్యనా. ఇంతకీ అతనెవరో కూడా తెలియదని సిరి అంటుంది. దాంతో ఆదిత్య పారిపోతాడు. ఆదిత్యను కానిస్టేబుల్స్ పట్టుకుంటారు. ఏయ్ ఎవరు నువ్వు అని ఆదిత్యను సిరి అడుగుతుంది. అమ్మో ఇది అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకు వచ్చేలా ఉందని ఆదిత్యను కొడుతుంది రేఖ.
పారిపోయిన ఆదిత్య
నిజం చెప్పకుంటే చంపేస్తానని కొడుతుంది. పారిపోయేలా చేస్తుంది రేఖ. దాంతో ఆదిత్య పారిపోతాడు. కానిస్టేబుల్స్‌ని పంపిస్తుంది నందు. ఇది నా మొదటి కేసు దీంట్లో ఇన్వాల్వ్ అయిన ఎవరిని వదిలిపెట్టను అని నందు అంటుంది. రాజుకు సారీ చెప్పి వెళ్లిపోతుంది. ప్లాన్ అట్టర్‌ఫ్లాప్ అయినందుకు ఫీల్ అవుతుంది రేఖ.
మరోవైపు రాజుకు సిరి థ్యాంక్స్ చెబుతుంది. ఇందును పెళ్లి గురించి అడుగుతాడు రాజు. నన్ను పెళ్లి చేసుకునేది నువ్వే ఎందుకు కాకూడదు బావ అని ఇందు మనసులో అనుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.