...
...
Next Story

Brahmamudi September 15 Episode: బ్రహ్మముడి- సిరికి జోకర్‌లా వెంకీ- బ్రోతల్ కేసులో మదన్ స్వాతి అరెస్ట్- ఐషుతో రేఖ ప్లాన్

Brahmamudi Serial September 15th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 15వ ఎపిసోడ్‌‌లో సిరి గతం మర్చిపోయిందని ఇందుకు రాజు చెబుతాడు. సిరి అల్లరి చేయడంతో చలపతి తిడతాడు. దాంతో సిరి ఏడుస్తుంటుంది. వెంకీ జోకర్ గెటప్ వేసుకుని సిరిని ఆడిస్తాడు. బ్రోతల్ కేసులో మదన్, స్వాతిని పోలీసులు అరెస్ట్ చేస్తారు.

Published on: Sep 15, 2026, 08:26:35 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఇందు చేయి ఎప్పటికీ వదిలిపెట్టను అని రాజు అంటాడు. నోర్మూయ్ అలా అనడానికి సిగ్గులేదని రేఖ అంటుంది. పిన్నీ నా లిమిట్స్‌లో నేనుండి మాట్లాడుతున్నా కాబట్టి ఈరోజు ఇలా నాతో మాట్లాడుతున్నావ్. లేకపోతే పరిస్థితి మరోలా ఉండేదని రాజు అంటాడు.

నీ తప్పులకు శిక్ష

బ్రహ్మముడి- సిరికి జోకర్‌లా వెంకీ- బ్రోతల్ కేసులో మదన్ స్వాతి అరెస్ట్- ఐషుతో రేఖ ప్లాన్
బ్రహ్మముడి- సిరికి జోకర్‌లా వెంకీ- బ్రోతల్ కేసులో మదన్ స్వాతి అరెస్ట్- ఐషుతో రేఖ ప్లాన్

అంటే ఏంటీ కొడతావా అని రాజుపైకి వెళ్తాడు భూషణ్. డౌటా అని రాజు వార్నింగ్ ఇస్తాడు. భ్రమరాంబ చెంపలు పట్టుకుంటుంది. పిన్నీ సిరి విషయం నీకు అనవసరం. నీ కొడుకు విషయంలో నా తప్పులేదు. అది నువ్వు చేసిన తప్పులకు శిక్ష. నిజంగా నీకు కొడుకు పోయాడన్న బాధ ఉంటే ఎలా తెచ్చుకోవాలో ఆలోచించు. అంతేకానీ మా మధ్య గొడవలు పెట్టాలని చూస్తే మాత్రం అని సీరియస్‌గా రాజు అంటే.. ఏం చెబుతావో తెలుసు అల్లుడు అని శేషు అంటాడు.

తర్వాత రాజును సిరి గురించి అడుగుతుంది ఇందు. సిరి కోమాలోనుంచి బయటకు వచ్చింది. సిరిని మా ఇంట్లో పెట్టాను అని రాజు చెబుతాడు. అంకుల్ వాళ్లకు కోపంగా ఉందిగా అక్కడ ఎందుకు పెట్టావ్ అని ఇందు అంటుంది. సిరికి గతం గుర్తులేదు. ఆరేళ్ల చిన్నపాపల బిహేవ్ చేస్తుంది. నా సమస్యలు తీరుతాయనుకున్నా. కానీ ఇలా జరుగుతుందని అనుకోలేదని సిరి కండిషన్ గురించి, జరిగిందంతా చెబుతాడు రాజు.

సిరిని ఇక్కడికి తీసుకొస్తే బాగుండేదని ఇందు అంటే.. ఇప్పటికే రేఖ వాళ్లు నానా మాటలు అంటున్నారు. తీసుకొస్తే ఇంకా ఏమైనా ఉందా. నువ్వు నాకోసం చాలా చేశావ్. నిన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను ఊరుకోను. ఇక నావల్ల నువ్వు ఎవరితో మాటలు పడాల్సిన అవసరం లేదు. సిరి నాన్నవాళ్లతో ఉంటుంది ఏం కాదు అని రాజు అంటాడు.

సిరికి జోకర్‌లా వెంకీ

నువ్వు ఇంట్లో ఉండేందుకు కారణం నేను అని చలపతి అంటే.. కాదు ఇది నా ఇల్లు. నీ గురించి నా మొగుడికి చెబుతాను అని సిరి అంటుంది. ఇంతలో లక్ష్మి వచ్చి చలపతికి నచ్చజెబుతుంది. ఈ వెర్రిదాన్ని తీసుకొచ్చి నెత్తినపెట్టుకోండని చలపతి అంటాడు. నీకే వెర్రి అని సిరి అంటే.. ఏయ్ కోపంగా అరుస్తాడు చలపతి. దాంతో సిరి ఏడుస్తుంది.

నా మొగుడు కావాలి. నేను ఇక్కడ ఉండను.. వెంకీ ఫోన్ చేయు అని సిరి ఏడుస్తూ గోల చేస్తుంది. సిరికి ఇష్టమైన న్యూడిల్స్ ఇచ్చి తిననంటుంది. అలాగే ఏడుస్తుంటుంది. ఇంతలో వెంకీ జోకర్‌లా గెటప్ వేసుకుని బాల్స్ పట్టుకుని వస్తాడు. సిరిని ఆడిపిస్తూ న్యూడిల్స్ తినిపించేందుకు ట్రై చేస్తాడు. వెంకీ అలసిపోయి ఆగిపోతే సిరినే వచ్చి తింటుంది.

ఐశ్వర్యకు ఫిటింగ్ పెట్టిన రేఖ

మరోవైపు రాజును ఏదోటి చేయాలని, ఇందు ఇష్టానుసారంగా చేస్తుందని రేఖతో అంటుంది భ్రమరాంబ. ఎలాగైనా సరే ఆ ఇందును, రాజును దెబ్బకొట్టాలని రేఖ అంటుంది. ఇంతలో ఐశ్వర్య వచ్చి తనకు ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయని, దానికి రూ. 5 వేలు కట్టాలని అడుగుతుంది. ఇందు వల్లే ఐశ్వర్యకు అడుక్కునే పరిస్థితి వచ్చిందని భ్రమరాంబ అంటుంది.

ఇందు, ఐశ్వర్య అక్కా చెళ్లెల్లు అని రేఖ అంటే.. అది నా బద్ధ శత్రవు. దాంతోనే ఎలాగైనా కంపెనీ పెట్టిస్తానని ఐశ్వర్య అంటుంది. శభాష్ ఐషు.. అని ఐశ్వర్యకు 5 వేలు పంపిస్తుంది రేఖ. ఇప్పుడు ఆ ఇందు మనసేంటే అందరికి తెలియాలంటే నువ్వు వెళ్లి ఇందును డబ్బులు అడుగు. ఇందుకు నువ్వు డిగ్రీ పాస్ కావడం ఇష్టం లేదు. ఇష్టముంటే డబ్బు ఇస్తుంది అని రేఖ ఫిటింగ్ పెడుతుంది.

ఇందు గురించి అందరిముందు ప్రూవ్ చేస్తేనే కదా తెలుస్తుంది. తెలివిగా ఆలోచించు ఇందును దెబ్బకొట్టు అని రేఖ అంటుంది. 5 వేలు కాదు రూ. 50 వేలు అడుగు అని భ్రమరాంబ అంటుంది. సరేనని ఐశ్వర్య వెళ్తుంది. ఎప్పటికైనా నువ్వే నా బ్రహ్మాస్త్రానివి. నీతోనే ఈ సామ్రాజ్యాన్ని కూలగొడతాను అని రేఖ మనసులో అనుకుంటుంది.

ఇందుకు తెలిసిన ఐశ్వర్య కిడ్నాప్ ప్లాన్

ఇందు దగ్గరికి వెళ్లి ఎగ్జామ్ హాట్ టికెట్‌కి రూ. 50 వేలు అడుగుతుంది ఐశ్వర్య. ఏ పబ్‌కి వెళ్తున్నావ్ అని రాజు వెటకారంగా అంటాడు రాజు. నా క్యెరెక్టర్ గురించి నువ్వు మాట్లాడుతున్నావా. నువ్వెంతా నీ బతుకెంతా.. ఈ ఆస్తి మాది. మీరు పెళ్లి చేసుకోకుండానే భార్యాభర్తల్లా అందరిని మోసం చేస్తున్నారుగా. డబ్బుల కోసం నేను చెబితే ఇందును కిడ్నాప్ చేశావ్ నువ్వు అని తన నోటితోనే నిజం చెప్పి షాక్ ఇస్తుంది ఐశ్వర్య.

ఇందు షాక్ అవుతుంది. అలాంటిది నువ్వు తనను ప్రేమించావంటే నేనెలా నమ్ముతాను. నేనే కిడ్నాప్ చేయించాను. కానీ, ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు అని ఐశ్వర్య అంటుంది. దాంతో రాజు నిజం చెబుతాడు. నువ్వు ఒక లోఫర్ అంటూ రాజును తిడితే ఐశ్వర్యపై కోప్పడుతుంది ఇందు. డబ్బులు కావాలంటే ఇస్తా కానీ రాజును అంటే ఊరుకోనంటుంది. నోరు అదుపులో పెట్టుకోని మాట్లాడు అని అంటుంది ఇందు.

తీసుకో 50 వేలు అని ఇందు ఇస్తుంది. ఎందుకీ నాటకాలు. రేఖ ఆంటీ ముందుగానే చెప్పింది నీకు నేను డిగ్రీ పాస్ కావడం ఇష్టంలేదని. డబ్బులు అడిగితే ఇతనితో అవమానించావ్. నా ఇగో హర్ట్ అయితే డబ్బులు తీసుకోనని తెలుసు. ఇదంతా నీ ప్లాన్ అని నాకు అర్థమైంది. నేను ఎగ్జామ్ రాయకూడదని అనుకుంటున్నావ్ కదా అని ఐశ్వర్య అంటుంది.

బ్రోతల్ కేసులో మదన్ స్వాతి అరెస్ట్

అదేం లేదు డబ్బు తీసుకో అని ఇందు అంటుంది. అవసరం లేదు. నేను ఎలాగైనా హాల్ టికెట్ తెచ్చుకుంటాను. డిగ్రీ పాస్ అయి చూపిస్తానని కోపంగా వెళ్లిపోతుంది ఐశ్వర్య. రాజును కోపంగా చూస్తుంది ఇందు. మరోవైపు లాడ్జ్ నుంచి మదన్, స్వాతిలను పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటారు. అది న్యూస్‌లో వస్తుంది.

బ్రోతల్ కేసులో మదన్, స్వాతిని అరెస్ట్ చేసినట్లు న్యూస్ చూస్తారు రేఖ వాళ్లు. దాంతో రాజును నిందిస్తూ రేఖ, భ్రమరాంబ తిడతారు. మదన్, స్వాతిని కాపాడేందుకు రాజు, ఇందు వెళ్తానంటే రేఖ అడ్డుకుంటుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks