Brahma Mudi Serial Today Episode: స్టార్ మా సీరియల్ బ్రహ్మముడి ఈరోజు ఎపిసోడ్ లో అపర్ణ ఎంత వద్దని వారిస్తున్నా సిరి ఇంట్లోనే ఉంటుందని తేల్చి చెబుతుంది ఇందు. కానీ అదే సిరిని అడ్డు పెట్టుకొని ఆస్తిని సొంతం చేసుకునేందుకు రేఖ ప్లాన్ చేస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
సిరి గురించి తెలుసుకొని షాక్ తిన్న అపర్ణ.. ఇరికించిన రేఖ

సిరిని రాజు, ఇందు ఇంటికి తీసుకొచ్చే సీన్ తో సీరియల్ శనివారం (సెప్టెంబర్ 19) ఎపిసోడ్ మొదలైంది. నా కొడుకుని ఇంట్లో నుంచి పంపించేసి నీ మొదటి భార్యను తీసుకొస్తావా అని రాజుని రేఖ నిలదీస్తుంది.
ఆమె ఎవరు అని అపర్ణ అడిగితే.. ఆమెనే రాజు మొదటి భార్య.. రెండేళ్లుగా హాస్పిటల్లో ఉన్న సిరి అని రేఖ చెబుతుంది. దీంతో అపర్ణ షాక్ తింటుంది. ఆ అమ్మాయిని ఇంటికి తీసుకురావడమేంటని ఇందుని అపర్ణ నిలదీస్తుంది. రేఖ, భ్రమరాంబ, భూషణ్ కూడా ఆమె ఇక్కడ ఉండటానికి వీల్లేదని అంటారు.
సిరి గతం మరచిపోయిందన్న ఇందు.. ఇక్కడే ఉంటుందని తేల్చి చెప్పి..
ఇంత జరుగుతున్నా సిరి మాత్రం ఇవేమీ పట్టనట్లు డైనింగ్ టేబుల్ మీద ఆపిల్స్ కనిపించేసరికి పరుగెత్తుకొని వెళ్లి తింటూ ఉంటుంది. ఆమెను చూసి అందరూ షాకవుతారు. దీంతో సిరి గురించి నిజం చెబుతుంది ఇందు. ఆమె గతం మరచిపోయిందని, ఆరేళ్ల చిన్న పిల్లలా ప్రవర్తిస్తుందని అంటుంది. అలాంటి అమ్మాయిని ఈ ఇంట్లో ఉంచడానికి వీల్లేదని భ్రమరాంబ, రేఖ అంటుంటే ఇందు మాత్రం వినదు.
అపర్ణ, సుభాష్ వారిస్తున్నా కూడా ఇందు మెట్టు దిగదు. గట్టిగా అరవడంతో సిరి ఉలిక్కి పడుతుంది. దీంతో ఆమెను దగ్గరకు తీసుకొని ఎవరేమనుకున్నా సరే సిరి ఇక్కడే ఉంటుంది.. ఆమెకు ఏ లోటూ రాకుండా చూసుకోవాల్సిందే అని ఇందు స్పష్టం చేస్తుంది. తర్వాత ఆమెను రాజు తమ గదిలోకి తీసుకెళ్తాడు.
ఇందుని నిలదీసిన అపర్ణ.. సర్ది చెప్పిన ఇందు
{{/usCountry}}అపర్ణ, సుభాష్ వారిస్తున్నా కూడా ఇందు మెట్టు దిగదు. గట్టిగా అరవడంతో సిరి ఉలిక్కి పడుతుంది. దీంతో ఆమెను దగ్గరకు తీసుకొని ఎవరేమనుకున్నా సరే సిరి ఇక్కడే ఉంటుంది.. ఆమెకు ఏ లోటూ రాకుండా చూసుకోవాల్సిందే అని ఇందు స్పష్టం చేస్తుంది. తర్వాత ఆమెను రాజు తమ గదిలోకి తీసుకెళ్తాడు.
ఇందుని నిలదీసిన అపర్ణ.. సర్ది చెప్పిన ఇందు
{{/usCountry}}ఇందుని బయటకు తీసుకెళ్లి అపర్ణ నిలదీస్తుంది. అసలు నువ్వేం చేస్తున్నావో నీకు తెలుసా.. ఆ అమ్మాయి ఈ ఇంట్లో ఉండటమేంటి.. అలా అయితే నీ జీవితం నాశనమవుతుందని అని క్లాస్ పీకుతుంది. అలా ఏమీ జరగదు.. ఈ విషయంలో నేను బావకు అండగా ఉంటానని హామీ ఇచ్చాను.. ఉండాల్సిందే.. నిజమేంటో త్వరలోనే నీకూ తెలుస్తుంది.. అంత వరకూ కాస్త ఓపిగ్గా ఉండు అని నాన్నమ్మకు ఇందు సర్ది చెబుతుంది.
అయినా అపర్ణ మాత్రం వినదు. ఈ ఇంట్లో ఆమె ఉండటానికి వీల్లేదు అని తేల్చి చెబుతుంది. సిరి విషయంలో తాను తగ్గేది లేదని ఇందు చెప్పడంతో ఈ నాన్నమ్మ మాటకే ఎదురు చెబుతున్నావా అని అపర్ణ అంటుంది. అదేం లేదు నాన్నమ్మా.. అర్థం చేసుకో.. నువ్వు భయపడుతున్నట్లు ఏమీ జరగదు.. నిజమేంటో నీకే తెలుస్తుంది అని చెప్పి ఇందు వెళ్లిపోతుంది.
రాజు ఎమోషనల్.. ఇందుకి థ్యాంక్స్ చెప్పి..
అటు రాజుని బొమ్మలు కావాలంటూ సిరి అడుగుతుంది. వెళ్లి తీసుకొస్తానన్నా వినదు. ఇంతలో ఇందుయే బొమ్మలు తీసుకొని వచ్చి సిరికి ఇస్తుంది. అది చూసి రాజు ఎమోషనల్ అవుతాడు. రాజుని తనను అలా చూస్తుండి పోవడంతో నీ తరఫున మరో మనిషి వచ్చిందనీ నీ పేమెంట్ కట్ చేయనులే అని ఇందు అంటుంది.
ఇన్నాళ్లూ నేను ఎంత సంపాదించినా సిరి కోసమే ఖర్చు పెట్టాను.. ఎలాంటి పని చేయడానికైనా వెనుకాడలేదు.. ఇప్పుడు సిరి నాతోనే ఉంది.. ఇప్పుడు నాకు డబ్బు అవసరం లేదు.. ఆమెను ఇంత బాగా చూసుకుంటుంన్నందుకు థ్యాంక్స్.. నువ్వు నా బాధ్యతలను ఎలా పంచుకుంటున్నావో.. నేనూ నీకు అలాగే అండగా ఉంటాను అని రాజు అంటాడు. డబ్బు ఏంటి బావా.. ఈ ఆస్తే నీది.. అది త్వరలోనే నీకే తెలుస్తుంది అని ఇందు మనసులో అనుకుంటుంది.
మొగుడు అంటూ రాజుని టార్చర్ చేసిన సిరి
ఆ తర్వాత రాజుని సిరి మొగుడా అంటూ పిలుస్తుంది. అది విని రాజుని ఇందు కోపంగా చూస్తుంది. తాను తన మొగుడు అని డాక్టర్ చెప్పాడని, అందుకే అలా పిలుస్తుందని రాజు అంటాడు. ఆమె అలా పిలుస్తుంటే నీకు చాలా బాగుంది కదా అని ఇందు అంటుంది. సిరి దగ్గరికి వెళ్లి తనను మొగుడు అని పిలవొద్దని, రాజు అని పిలవాలని చెప్పినా ఆమె వినదు. మొగుడా మొగుడా అని పిలుస్తూ టార్చర్ పెడుతుంది. దీంతో ఇందు నవ్వుతుంది.
ఆస్తి సొంతమవుతుందన్న రేఖ.. సిరిని అడ్డు పెట్టుకొని..
మరోవైపు ఇంట్లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదంటూ రేఖతో భ్రమరాంబ అంటుంది. మనం వేసుకున్న ప్లాన్స్ ఒక్కటీ వర్కౌట్ కావడం లేదు.. కానీ ఆ రాజుగాడు ఏమనుకుంటే అది జరిగిపోతోంది.. చివరికి తన తొలి భార్యను కూడా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు అని అంటుంది. అటు భూషణ్ కూడా అదే అంటాడు.
ఇలా అయితే మనకు ఆస్తి దక్కేది ఎలా అని వాళ్లు కంగారు పడితే.. ఆ సిరి ద్వారానే తర్వలో ఆస్తి మన సొంతమవుతుంది అని రేఖ అంటుంది. ఆ రాజు గాడు ఉండగా ఎలా జరుగుతుందని భూషణ్ అడుగుతాడు. అపర్ణ ద్వారా అది సాధ్యమవుతుందని, ఆమె ద్వారానే వాడిని, సిరిని ఈ ఇంట్లో నుంచి వెళ్లగొట్టొచ్చని రేఖ అంటుంది. ఇక నుంచి అపర్ణను పదే పదే రెచ్చగొట్టాలని వాళ్లు ప్లాన్ చేసుకుంటారు.
రాజు పక్కన పడుకున్న సిరి
ఆ తర్వాత గదిలో ఇందు, సిరి మంచంపైన పడుకుంటే రాజు కింద పడుకుంటాడు. మధ్యలో లేచిన సిరి.. రాజు కింద పడుకోవడం చూసి వెళ్లి అతని పక్కన పడుకుంటుంది. అది చూసిన అపర్ణ ఆవేశంతో రగిలిపోతుంది. ఇందు అని కోపంగా పిలవడంతో రాజు ఉలిక్కి పడి లేచి పక్కన సిరి ఉండటం చూసి షాకవుతాడు. ఈలోపు అందరూ వచ్చి అపర్ణను మరింత రెచ్చగొడతారు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.