Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో అపర్ణకు సిరిపై రోజు రోజు కోపం పెరుగుతుంది. అలా పెరిగేలా మనం చేస్తాం. దాంతో రాజు ఇంట్లో ఉండటానికి వీళ్లేదనేలా మనం చేయాలి. ఇక అక్కడి నుంచి ఈ ఇంట్లో మొదలవుతుంది ఆరని రావణకాష్టం అని రేఖ అంటుంది.
రాజు పతనం మొదలు

సూపర్ రేఖ నువ్వు. ఇకచూడు నేను అపర్ణను ఎలా రెచ్చగొడతానో అని భ్రమరాంబ అంటుంది. రాజు నీ పతనం మొదలైంది అని రేఖ అనుకుంటుంది. మరోవైపు సిరి విషయంలో అపర్ణ ఏడుస్తూ బాధపడుతుంటుంది. ఇందు అంటుందిగా నిజనిజాలు తెలుస్తాయని, వదిలేయ్ అని సుభాష్ అంటాడు.
ఇందు సంతోషంగా ఉండాలంటే నేను ఒక పని చేయాలి. రాజుకు నిజం చెప్పేస్తాను. తను దుగ్గిరాల ఇంటి వారసుడు అని, నా కూతురు కొడుకు, ఇన్నికోట్ల ఆస్తికి వారసుడు అని, ఇందు ప్రేమిస్తుందని చెప్పేస్తాను అని అపర్ణ అంటుంది. ఇందు తనను తన మరదలు అని ఇష్టపడకూడదని, ఇందుగానే ఇష్టపడాలని కోరుకుంటుంది. అప్పుడే నిజం చెప్పాలనుకుంది. ఇందు అనుకుంది పాడు చేయకని సుభాష్ సలహా ఇస్తాడు.
తర్వాత అంతా భోజనం చేస్తుంటారు. రాజు వస్తాడు. అపర్ణకు కోపం వచ్చేలా రేఖ, భ్రమరాంబ స్టార్ట్ చేయాలనుకుంటారు. నీ మొదటి పెళ్లాం గదిలో ఉందా. అలా ఎలా వదిలేశావ్ అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది భ్రమరాంబ. రాజే గదిలోకి తీసుకెళ్లి తన చేతులతో తినిపించాలని అనుకుంటున్నాడేమో. ఎందుకు ఇబ్బంది పెడతావ్ అని రేఖ అంటుంది.
భ్రమరాంబకు డబ్బా పిన్ని పేరు
సిరిని ఇక్కడే తినేందుకు తీసుకురమ్మని, అప్పుడే గతం గుర్తుకు వచ్చే ఛాన్స్ ఉందని భ్రమరాంబ, రేఖ, భూషణ్ అంటారు. దాంతో సిరిని తీసుకురమ్మని రాజుకు చెబుతుంది ఇందు. రాజు తీసుకొస్తాడు. అపర్ణ డల్ అవుతుంది. సిరి బిత్తర చూపులు చూస్తుంది. ఎవరు మీరు అని సిరి అంటే.. వరసలు చెబుతుంది బ్రమరాంభ. భ్రమరాంబ పేరు సరిగా లేదని డబ్బాలా వాగుతావు కాబట్టి డబ్బా అని పెడుతుంది సిరి.
{{/usCountry}}సిరిని ఇక్కడే తినేందుకు తీసుకురమ్మని, అప్పుడే గతం గుర్తుకు వచ్చే ఛాన్స్ ఉందని భ్రమరాంబ, రేఖ, భూషణ్ అంటారు. దాంతో సిరిని తీసుకురమ్మని రాజుకు చెబుతుంది ఇందు. రాజు తీసుకొస్తాడు. అపర్ణ డల్ అవుతుంది. సిరి బిత్తర చూపులు చూస్తుంది. ఎవరు మీరు అని సిరి అంటే.. వరసలు చెబుతుంది బ్రమరాంభ. భ్రమరాంబ పేరు సరిగా లేదని డబ్బాలా వాగుతావు కాబట్టి డబ్బా అని పెడుతుంది సిరి.
{{/usCountry}}సిరికి అన్నం ఎలా కలపాలో చెబితాడు రాజు. రాజునే తినిపించమని మొగుడా అంటుంది. అందరు షాక్ అవుతారు. ఇప్పుడే పిలుస్తున్నావా పెళ్లి అయ్యాక నుంచి పిలుస్తున్నావా అని భ్రమరాంబ అడిగితే.. పెళ్లి అంటే ఏంటీ డబ్బా పిన్ని అని సిరి అంటుంది. దాంతో భ్రమరం కోప్పడుతుంది. రాజును తినిపించమని సిరి మారం చేస్తుంది.
దాంతో చేసేదేం లేక అందరిముందే సిరికి భోజనం తినిపిస్తాడు రాజు. ఇందును అపర్ణ చూసి బాధపడుతుంది. చూశావా అపర్ణ. ఎలా తినిపిస్తున్నాడో. ఇందుకు ఇలా తినిపించాడా ఎప్పుడైనా. ఎంతైనా మొదటి పెళ్లాం మొదటి పెళ్లామే అని భ్రమరాం అంటారు. దాంతో కోపంగా అపర్ణ వెళ్లిపోతుంది. ఏమైంది వెళ్లిపోయింది, అన్నం తినలేదు. ఆకలి వేయట్లేదా అని సిరి అంటుంది.
అపర్ణకు అన్నం తినిపించిన సిరి
నువ్వు వచ్చావుగా. అలిగి వెళ్లిపోయిందని భ్రమరాంబ చెబుతుంది. సిరిని అడ్డుపెట్టుకుని ఇష్టమొచ్చినట్లు అంటున్నారని. నేను భరించలేకపోతున్నా. నావల్ల కావట్లేదని అపర్ణ కోప్పడుతుంది. ఇంతలో భోజనం పట్టుకుని సిరి వస్తుంది. నా మీద అలిగావా. నాతో మాట్లాడవా అని సిరి అంటుంది. ఎందుకొచ్చావ్ అని అపర్ణ అంటుంది.
నీకోసమే. నువ్వు నా వల్లే తినలేదని డబ్బా పిన్ని చెప్పింది. మళ్లీ నీకు ఆకలేస్తుందిగా తిను.. అని సిరి అంటుంది. దాంతో అపర్ణ ఆప్యాయంగా చూస్తుంది. ఏంటీ చూస్తున్నావ్ ఓ తినిపించాలా.. అని అపర్ణకు అన్నం తినిపిస్తుంది అపర్ణ. కాసేపటికి నేను తింటాను అని అపర్ణ అంటుంది. ఎమోషనల్ అవుతుంది. సుభాష్‌ను చూసి ఎవరని అడిగితే.. మా ఆయన అని చెబుతుంది అపర్ణ.
ఎందుకు చైర్‌లోనే కూర్చుని ఉన్నారని సిరి అడిగితే.. నడవలేనమ్మా అని సుభాష్ అంటాడు. రోజు నాతోపాటు నడు కొద్దిరోజులకు చకచకా నడుస్తావని సిరి అంటుంది. సరేనని సుభాష్ అంటాడు. ఇప్పుడు నడు అని సిరి లేపుతుంటే రేపటి నుంచి నడుస్తానని సుభాష్ అంటాడు. మరి ఇప్పుడు మనం బొమ్మలతో ఆడుకుందామని అంటుంది సిరి.
సిరికి పడిపోయిన అపర్ణ
ఇప్పుడు పడుకుందామని సుభాష్ అంటాడు. సరేనని అన్న సిరి అపర్ణను తినమని ఫోర్స్ చేస్తుంది సిరి. దాంతో సిరికి అపర్ణ, సుభాష్ పడిపోతారు. సిరి వెళ్లిపోతుంది. దీని అమాయకత్వం చూసి జాలిపడాలో, లేదా ఇందు జీవితాన్ని తలకిందులు చేసేందుకు వచ్చిందని కోప్పడాలో నాకు ఏం అర్థం కావట్లేదని అపర్ణ అంటుంది. మరోవైపు ఐశ్వర్య చదువుకుంటుంది.
భ్రమరాంబ పాలు తీసుకొస్తుంది. ఐశ్వర్య షాక్ అవుతుంది. ఇలా సడెన్‌గా మారిపోతావనుకోలేదు. పార్టీలు, పబ్‌లంటూ తిరిగేదానివి. బాగా కష్టపడుతున్నావ్ అని భ్రమరాంబ అంటుంది. రేపటి నుంచి ఎగ్జామ్స్ కదా. కొన్ని రోజులు కష్టపడితే చాలు అని ఐశ్వర్య అంటుంది.
నాకో డౌట్ ఇందు ఏం చదువుకోకుండానే సీఈఓ అయింది కదా. మరి నువ్వు డిగ్రీ పాసైతేనే కంపెనీ పెట్టించాలని కండిషన్ పెట్టడం ఏంటీ. ఇది మోసం కదా అని భ్రమరాంబ ఫిట్టింగ్ పెట్టాలని చూస్తుంది. అది మోసం చేసిందే లేదో నాకు అనవసరం. నేను దానికొక ఛాలెంజ్ చేశాను. అందులో నేను గెలిచి చూపించాలి అని ఐశ్వర్య అంటుంది.
భ్రమరాంబ ప్లాన్ రివర్స్
అలా భ్రమరాంబ ప్లాన్‌ను రివర్స్ చేస్తుంది ఐశ్వర్య. ఇది హాల్ టికెట్ కాదు. ఇది నేను ఇందు మీద గెలవడానికి దొరికిన ఎంట్రీ టికెట్ అని ఐశ్వర్య అంటుంది. నువ్వు గెలిస్తే చాలమ్మా అని వెళ్లిపోతుంది బ్రమరాంబ. నేను పాస్ అయిన తర్వాత టార్చర్ అంటే ఏంటో చూపిస్తానని ఐశ్వర్య అనుకుంటుంది.
మరుసటి రోజు ఉదయం దుగ్గిరాల ఇంటికి లాయర్ వస్తాడు. ఇందు కంటే ముందు రాజు గారు సిరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారుగా. కాబట్టి చట్టప్రకారం మీ పెళ్లి చెల్లదు. రేఖ గారికే ఆస్తి తాలుకూ పవర్ ఆఫ్ అటార్ని ఇవ్వాల్సి వస్తుందని లాయర్ అంటాడు. ఇందు దా సంతకం పెట్టు అని రేఖ అంటుంది. అలా రాజు మొదటి పెళ్లి నాటకం కొంపముంచుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.