Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో తను ఉండగా ఆస్తి నీకు దక్కనివ్వను, నావాళ్ల జోలికి వస్తే ఊరుకోను, ఇందు నా భార్య అని రాజు అంటే.. మరి సిరి. తను నీ మొదటి భార్యగా. సిరి మాట ఎత్తగానే నోరు రావట్లేదా అని రేఖ అంటుంది.
రాజుతో రేఖ ఛాలెంజ్

ఈరోజు నువ్వు గెలిచి ఉండొచ్చు. నెక్ట్స్ నేను ఏం చేస్తానో నీకు తెలియదు అని రేఖ అంటుంది. ప్రతిసారి నేనే గెలుస్తాను అని రాజు అంటాడు. ఈరోజు నేను ప్రూవ్ చేయలేకపోయాననేకదా అని ఇక నాకు సిరి గురించి ఎలాంటి సాక్ష్యాలు దొరకవనేగా నీ నమ్మకం అని రేఖ అంటుంది. నువ్వు భూలోకం మొత్తం జల్లెడ వేసిన నీకు సిరి గురించి ఒక్క ఆధారం కూడా దొరకదని రాజు అంటాడు.
సరే నీ ఛాలెంజ్‌ని యాక్సెప్ట్ చేస్తాను. సిరి నీ మొదటి భార్య అని అధికారికంగా నిరూపించి నిన్ను ఇంట్లోంచి గెంటించేస్తాను. ఈసారి గెలుపు నాదే అని రేఖ ఛాలెంజ్ చేసి వెళ్తుంది. రేఖ తనపేరుపై ఆస్తి రాయించుకోవడం గురించి ఇందుతో అపర్ణ మాట్లాడుతుంది. రాజు ఉండగా రేఖ ఆంటీ ఏం చేయదని ఇందు అంటుంది. సిరి గురించి నిజం చెప్పమని అపర్ణ అంటుంది.
రాజు తప్పు చేశాడుగా. నువ్వు అది కప్పిపుచ్చుతున్నావ్‌గా అని అపర్ణ నిలదీస్తుంది. రాజు ఏ తప్పు చేయలేదని ఇందు అంటుంది. అలా అయితే నిజం ఎందుకు చెప్పలేదని అపర్ణ కోప్పడుతుంది. రాజు వచ్చి నాకోసం నిజం చెప్పట్లేదని రాజు అంటాడు. దాంతో రాజునే సిరి గురించి నిజాలు అడుగుతుంది. సిరికి నీకు సంబంధం ఏంటీ, సిరి కన్నవాళ్లు ఎవరు అని అన్ని ప్రశ్నలు అడుగుతుంది అపర్ణ.
మంచివాన్ని అనే నమ్మకం లేకుంటే
నేను మంచివాన్ని అని నమ్ముతున్నారా అని రాజు అంటే.. అవును అని అపర్ణ అంటుంది. అలా అయితే నన్ను ఏమి అడక్కండి. నిజాలన్ని త్వరలోనే తెలుస్తాయి. నేను మంచివాన్ని అనే నమ్మకం పోయిందని చెప్పండి. అప్పుడు చెబుతాను. నేను ఏ తప్పు చేయలేదు. మీ మనవరాలికి నేను ఎలాంటి అన్యాయం చేయను. చేయలేదు. దేనిగురించి పెద్దగా ఆలోచించకండి అని రాజు చెబుతాడు.
{{/usCountry}}నేను మంచివాన్ని అని నమ్ముతున్నారా అని రాజు అంటే.. అవును అని అపర్ణ అంటుంది. అలా అయితే నన్ను ఏమి అడక్కండి. నిజాలన్ని త్వరలోనే తెలుస్తాయి. నేను మంచివాన్ని అనే నమ్మకం పోయిందని చెప్పండి. అప్పుడు చెబుతాను. నేను ఏ తప్పు చేయలేదు. మీ మనవరాలికి నేను ఎలాంటి అన్యాయం చేయను. చేయలేదు. దేనిగురించి పెద్దగా ఆలోచించకండి అని రాజు చెబుతాడు.
{{/usCountry}}మరోవైపు రేఖ గ్యాంగ్ డిస్కషన్ మొదలుపెడతుంది. రాజుది ఎప్పుడు మనదే పైచేయి అవుతుందని భ్రమరాంబ అంటుంది. రేఖ చిరాకు పడుతుంది. నన్ను అడిగితే నేను అదిరిపోయే ఐడియా ఇస్తానని శేషు అంటాడు. నా సిక్త్స్ సెన్స్‌ను మీరు ఉపయోగించుకోవట్లేదు. డొక్కు ఐడియాలతో ముందుకెళ్తున్నారు బోర్లా పడుతున్నారని శేషు అంటాడు.
ఐడియా ఏంటో చెప్పమని భ్రమరాంబ అడుగుతుంది. రాజు తన పెళ్లి విషయంలో నిజం చెప్పడు. కానీ, సిరి చెబుతుంది కదా. పెళ్లి గురించి చెప్పకపోవచ్చు. తన తల్లిదండ్రులు ఎవరో గుర్తుండే ఉంటుందిగా. దాంతో వాళ్లను కలిస్తే అయిపోతుంది. మనకు కావాల్సింది దొరుకుతుంది. కానీ, ఇలా అరుస్తుంటే సిరి మనకు ఏది చెప్పదు. అడగాల్సినవిధంగా అడిగితే చెబుతుంది. అది కూడా నేనే చెబుతాలే అని శేషు అంటాడు.
శేషు ఐడియా
సిరిని బుజ్జగించుకుని మనవైపు తిప్పుకుంటే సిరి చెబుతుందని శేషు అంటాడు. నువ్వే ఆ పని చేయొచ్చుగా అని భ్రమరం అంటుంది. నేను ఇక్కడ రథ సారథిని మాత్రమే యుద్ధం చేయాల్సింది మీ ముగ్గురు. నేను సలహాలు సూచనలు మాత్రమే ఇస్తాను. మీరే తన నుంచి నిజాలు రాబట్టుకోవాలని శేషు అంటాడు. దాన్ని మాయ చేసి నావైపు లాక్కుంటానో చూడు అని భ్రమరాంబ అంటుంది.
సిరి గురించి తెలుసుకునేందుకు రేఖ ప్రయత్నాలు చేస్తుంటుంది. దానికంటే ముందే సిరి గురించి మనం తెలుసుకోవాలని రాజుతో ఇందు అంటుంది. నువ్వు యాక్సిడెంట్ చేసిన సిరి వాళ్ల బైక్ నెంబర్ తెలిస్తే డీటేల్స్ తెలుసుకోవచ్చుగా అని ఇందు అంటుంది. రాజు నెంబర్ ఇస్తాడు. తన ఇన్‌ఫ్ల్యూయెన్స్ ఉపయోగించి కనుక్కుంటుంది ఇందు.
ఇందు ఫోన్‌కు సిరి ఇంటి అడ్రస్ మెసేజ్ వస్తుంది. బైక్ శ్రీనివాస్ పేరు మీద ఉంది. సరి తండ్రి అనుకుంటా. ఈ అడ్రస్‌కి వెళ్తే ఏమైనా తెలుస్తుందని ఇందు, రాజు వెళ్తారు. మరోవైపు సిరి దగ్గరికి శేషు, భ్రమరాంబ వెళ్లి బుజ్జగిస్తారు. సిరితో భ్రమరాంబ ఆడతానంటుంది. పులుసు ఆట ఆడదామని భ్రమరాంబ అంటుంది. పులుసు ఆట ఎలా ఆడాలో చెబుతుంది.
రాజుకు తాగించి నిజాలు కక్కించిన భ్రమరాంబ, శేషు
నా చేతిని నువ్వు కొట్టలేకపోతే ఓడిపోయినట్లు, తాకితే గెలిచినట్లు అని భ్రమరాంబ అంటుంది. నేను గెలిస్తే అడిగినదానికి సమాధానం చెప్పాలని భ్రమరాంబ అంటే.. మరి నేను గెలిస్తే నేను ఏం చేసిన నువ్వేం అనకూడదని సిరి అంటుంది. ముందు భ్రమరం ఒప్పుకోదు. శేషు చెప్పడంతో ఒప్పుకుంటుంది. భ్రమరం గెలుస్తుంది. శేషు నీ పేరు ఏంటని అడిగితే.. సిరి అని చెబుతుంది సిరి.
తర్వాత రాజుకు బాగా తాగించి నిజాలు రాబట్టాలని ప్లాన్ చేస్తారు భ్రమరాంబ, శేషు. అలాగే రాజుకు తాగిస్తారు. సిరికి నీకు పరిచయం ఎప్పుడైంది, పెళ్లి ఎప్పుడైంది, అమ్మనాన్న ఎవరు అని భ్రమరాంబ అడుగుతుంది. దాంతో రాజు నిజాలన్నీ ఏడుస్తూ చెబుతాడు. అదంతా ఇందు చూస్తుంది. భ్రమరం షాక్ అవుతుంది. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.