...
...
Next Story

Brahmamudi September 4 Episode: బ్రహ్మముడి- బర్త్ డే నుంచి పారిపోయిన రాజు- ఇందుకు వెంకీ నిజం చెప్పిన తల్లి-రేఖ ఫిట్టింగ్

Brahmamudi Serial September 4th Episode: బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 4వ ఎపిసోడ్‌‌లో సిరి కళ్లు తెరిచిందని తెలియడంతో రాజు పరుగెత్తుకుని వెళ్లిపోతాడు. లక్ష్మిని మాటల్లో పెట్టి వెంకీ గురించి అడుగుతుంది ఇందు. తండ్రి చలపతికి ఇచ్చిన మాట కోసమే నందును వెంకీ దూరం పెడుతున్నాడని లక్ష్మి నిజం చెబుతుంది.

Published on: Sep 4, 2026, 09:59:38 IST
Advertisement

Brahma Mudi Serial Today Episode: బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో దుగ్గిరాల ఇంట్లో రాజు బర్త్ డే సెలబ్రేషన్స్ జరుగుతాయి. ఇందు, రాజు అంతా సంతోషంగా ఉంటారు. అది చూసి ఓర్వలేకపోతుంది రేఖ. వీళ్లను చూస్తే నిజంగానే భార్యాభర్తలు అనుకుంటారు. ఐషు నాకు మరదలు అవుతుందిగా రెచ్చిపోదామని లక్కీ అనుకుంటాడు.

మనం బావమరదళ్లం

బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 4వ ఎపిసోడ్
బ్రహ్మముడి సీరియల్ సెప్టెంబర్ 4వ ఎపిసోడ్

తర్వాత రాజును మాకు దూరం చేయరుగా అని అపర్ణను చలపతి అడుగుతాడు. రాజు ఈ ఇంటికి వారసుడు అయిన మీ బిడ్డే. మీరు సంతోషంగా ఉండండి అని అపర్ణ అంటుంది. ఈ మాట చాలని చలపతి అంటాడు. కోపంగా వెళ్లిన ఐశ్వర్య దగ్గరికి లక్కీ వెళ్లి జ్యూస్ ఇస్తాడు. నీకోసం ప్రేమగా తెచ్చానంటాడు. నేను ఇప్పుడు అనాథను కాదు. మన మధ్య ఏం లేదా అని లక్కీ అంటాడు.

ఇప్పుడ నేను మీ రేఖ ఆంటీ కొడుకును అని తెలిసిపోయిందిగా. నువ్వు మా అమ్మను ఏమని పిలుస్తావని లక్కీ అడిగితే.. ఆంటీ అంటుంది ఐశ్వర్య. ఆంటీ అంటే నేను నీకు బావను అవుతాను అని లక్కీ అంటాడు. నేను నిన్ను బైక్‌పై తిప్పాలనుకుంటున్నాను. ఒకే కూల్ డ్రింక్‌లో రెండు స్ట్రాలు వేసి తాగాలనుకుంటున్నాను అని తన లవ్ ఎక్స్‌ప్రెస్ చేస్తాడు లక్కీ.

లక్కీకి జ్యూస్ తాగించిన ఐశ్వర్య

సరదాగా చిన్నప్పటి ఆటలు ఆడుకుందామని ఉంది. నన్ను బావ అని పిలవ్వా అని లక్కీ అడుగుతాడు. ఐశ్వర్య చిరాకు పడుతుంది. ఐశ్వర్య చేయి పట్టుకుని బావ అని పిలవమంటాడు లక్కీ. చేయి వదిలేస్తే పిలుస్తానని చెప్పి కళ్లు మూసుకోమంటుంది ఐషు. లక్కీకి జ్యూస్ తాగిస్తుంది ఐశ్వర్య. ఆపకుండా నోట్లో కుక్కి వెళ్లిపోతుంది. నిన్ను అస్సలు వదలను ఐషు అని లక్కీ అనుకుంటాడు.

ఇంతలో వెనకాలే భ్రమరాంబ ఉంటుంది. భార్యను చూసి శేషు వణికిపోతాడు. లోపలికెళ్దామని శేషును బలవంతంగా లాక్కెళ్తుంది భ్రమరాంబ. మరోవైపు సిరి కళ్లు తెరిచి చూస్తుంది. అది నర్స్ చూస్తుంది. రాజుకు డాక్టర్ కాల్ చేసి గుడ్ న్యూస్ అని సిరి కళ్లు తెరిచిందని చెబుతాడు. దాంతో రాజు అర్జంట్‌గా వెళ్లిపోతాడు. అది పైనుంచి రేఖ చూస్తుంది.

ఈ బర్త్ డే బాయ్ రాజు ఎక్కడికి వెళ్తున్నాడు అని రేఖ డౌట్ పడుతుంది. మరోవైపు అపర్ణకు వంట గదిలో లక్ష్మి సహాయం చేస్తుంది. తాతయ్యకు ట్యాబ్లెట్స్ ఇవ్వమని అపర్ణను పంపిస్తుంది ఇందు. మీ మొహంలో ఏదో తెలియని బాధ కనిపిస్తుందని లక్ష్మిని అడుగుతుంది ఇందు. నా భయమంతా వెంకీ గురించి. జాబ్ గురించి కాదు వాడి లైఫ్ గురించి వాడి ప్రేమను దాచుకుని మనసులోనే నరకం అనుభవిస్తున్నాడని చెబుతుంది లక్ష్మి.

నందు దుగ్గిరాల వారసురాలు కావడమే

నాకు తెలుసు ఆంటీ నందును వెంకీ ప్రేమిస్తున్నాడని. కానీ, నందును వెంకీ ఎందుకు దూరం పెట్టుకుంటున్నాడో తెలియట్లేదని ఇందు అంటుంది. నందు దుగ్గిరాల వారసురాలు కావడమే అని చలపతి మాట తీసుకున్న విషయం చెబుతుంది లక్ష్మీ. వెంకీ మాట ఇచ్చిన తర్వాత నందు ఇంటి వారసురాలని తెలిసిందట. కానీ, తండ్రికి ఇచ్చిన మాటకోసం నందును దూరం చేసుకోవాలనుకుంటున్నాడు. వాడిలో వాడే కుమిలిపోతున్నాడని లక్ష్మి అంటుంది.

తండ్రికి చెప్పమన్న వెంకీ వినట్లేదు. వాడిలో వాడే సతమతం అవుతున్నాడు. వాడిని చూడలేకపోతున్నాను అని లక్ష్మీ అంటుంది. ఈ విషయం నాకు తెలిసిందిగా. నేను చూసుకుంటాను. ఎవరికి చెప్పకుండా ఏం చేయాలో నాకు బాగా తెలుసు అని ఇందు అని వెళ్లిపోతుంది. తర్వాత వెంకీని పిలిచి మీ అన్నయ్య బర్త్ డే కాబట్టి ఏదోటి చేయాలిగా అంటుంది.

ఇందుకు షాక్

నందును కూడా పిలుస్తుంది ఇందు. వెంకీ, నందును ఇద్దరిని వెళ్లి కేక్ తీసుకురమ్మంటుంది ఇందు. ఒక్కడినే వెళ్తానని వెంకీ అంటే.. కేక్ బైక్‌పై ఒక్కడివే ఎలా తెస్తావ్ అని వెంకీ, నందును కలిపే ప్రయత్నం చేస్తుంది ఇందు. తర్వాత రాజు కోసం అందరూ ఎదురుచూస్తుంటే అకస్మాత్తుగా పారిపోయాడని చెప్పి రేఖ ఫిట్టింగ్ పెడుతుంది. దాంతో ఇందు అంతా షాక్ అవుతారు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Chetupelli Sanjiv Kumar

చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks