...
...
Next Story

బ్రహ్మముడి డిసెంబర్ 10 ఎపిసోడ్: నడుము చూపించి రాహుల్‌తో స్వప్న రొమాన్స్.. మరిన్ని చిక్కుల్లో రాజ్.. అప్పుకు అంజలి క్లూ

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (డిసెంబర్ 10) ఎపిసోడ్ లో రాహుల్ తో స్వప్న రొమాన్స్ ఓవైపు.. అంజలి కేసులో అప్పుకు కీలకమైన క్లూ దొరకడం మరోవైపు.. కిడ్నాపర్ల చెర నుంచి రాజ్, కావ్య తప్పించుకునే ప్రయత్నం చేయడం ఇంకోవైపు చూడొచ్చు.

Published on: Dec 10, 2025, 07:46:09 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 900వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఒకే ఎపిసోడ్ లో కథలో మూడు కీలకమైన మలుపులు చోటు చేసుకోవడం విశేషం. ఇటు రాహుల్ కు పూర్తిగా దగ్గరయ్యే ప్రయత్నం చేస్తుంది స్వప్న. అటు అంజలి మిస్సింగ్ కేసును పరిష్కరించే క్లూను అప్పు సంపాదిస్తుంది. ఇటు కేరళలో రాజ్, కావ్య కిడ్నాపైనా తప్పించుకోవడానికి ప్రయత్నించి మరింత చిక్కుల్లో పడతారు.

పాప కేసు కోసం బాధపడిన అప్పు.. సర్దిచెప్పిన కల్యాణ్

బ్రహ్మముడి డిసెంబర్ 10 ఎపిసోడ్: నడుము చూపించి రాహుల్‌తో స్వప్న రొమాన్స్.. మరిన్ని చిక్కుల్లో రాజ్.. అప్పుకు అంజలి క్లూ
బ్రహ్మముడి డిసెంబర్ 10 ఎపిసోడ్: నడుము చూపించి రాహుల్‌తో స్వప్న రొమాన్స్.. మరిన్ని చిక్కుల్లో రాజ్.. అప్పుకు అంజలి క్లూ

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (డిసెంబర్ 10) ఎపిసోడ్ అంజలి మిస్సింగ్ కేసు గురించి అప్పు బాధపడే సీన్ తో మొదలవుతుంది. సీఐ ఆ కేసును మూసేయమని చెప్పడంతో ఆమె చికాకు పడుతుంది. ఫైల్స్ ను నేలకేసి కొడుతుంది. అప్పుడే గదిలోకి వచ్చిన కల్యాణ్ ఆమెకు సర్దిచెబుతాడు.

ఇక కేసు వదిలేస్తానని చెప్పిన అప్పులో ధైర్యం నింపుతూ.. లక్ష్యాన్ని సాధించాలంటే ఏం చేయాలో చెబుతాడు. అప్పుడే అప్పుకు సుందరి అనే మహిళ ఫోన్ చేసి.. రేణుక ఆత్మహత్యాయత్నం చేసిందని చెబుతుంది.

రేణుక ఆత్మహత్యాయత్నం.. పరుగెత్తుకొచ్చిన అప్పు..

దీంతో అప్పు పరుగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్తుంది. మణికట్టు కోసుకొని ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిందని సుందరి అనే మహిళ చెబుతుంది. ఆమె రేణుక దగ్గరికి వెళ్లి ఓదారుస్తుంది. ఏడాది అయిన తన కూతురు అంజలి జాడ తెలుసుకోలేకపోయారని, ఇక బతికి ఏం చేయాలని ఆమె అంటుంది. తన కూతురు బతికే ఉందని చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని, ఆమెను తీసుకురావాలని ఏడుస్తుంది. దీంతో అప్పు ఆమెకు ధైర్యం చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తుంది.

అంజలిని చూశానని చెప్పిన పాప

ఇటు కేరళలో పెన్ డ్రైవ్ కోసం రాజ్, కావ్య గదిలోకి వస్తారు చోటు, మోటు. అంతకుముందే వాళ్ల ప్లాన్ తెలుసుకున్న రాజ్, కావ్య.. రాగానే భయపెట్టాలని నిర్ణయించుకుంటారు. పడుకున్నట్లుగా నటించి.. ఇద్దరూ రాగానే దొంగలు వచ్చారంటూ చీకట్లో ఇద్దరిని రాజ్ చితకబాదుతాడు. దీంతో ఆ ఇద్దరూ రూమ్ నుంచి పారిపోతారు. బయటకు వచ్చిన తర్వాత ఇక వాళ్లను కిడ్నాప్ చేసి, బాస్ ముందు పెడదామని డిసైడవుతారు.

రాహుల్, స్వప్న రొమాన్స్

ఇటు ఇంట్లో రాహుల్ రాత్రి అయినా కూడా పని చేస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుంటాడు. స్వప్న చూడాలని ఆమె కోసం ఎదురు చూస్తుంటాడు. కానీ స్వప్న మాత్రం అందంగా ముస్తాబై గదిలోకి వస్తుంది. తన నడుము చూపిస్తూ గది డోరు మూస్తుంది. రాహుల్ ను రెచ్చగొడుతుంది. ఇదేంటి ఇలా చేస్తుందని రాహుల్ అనుకుంటాడు. తర్వాత ఇద్దరూ రొమాన్స్ లో మునిగి తేలుతారు.

అటు కిడ్నాపర్లు కట్టిపడేయగా.. ఆ కట్లను విప్పుకుంటాడు రాజ్. ఇద్దరు రౌడీలను చితకబాదుతాడు. తర్వాత కావ్యను తీసుకొని బయటకు వెళ్తుండగా.. వాళ్ల బాస్ ఇద్దరికీ రివాల్వర చూపించి కాల్చేస్తాను.. ఆ పెన్ డ్రైవ్ ఎక్కడ అని బెదిరిస్తాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks