బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 923వ ఎపిసోడ్ లో రుద్రాణి బాగోతం పూర్తిగా బయటపడుతుంది. దీంతో ఆమెను ఇంట్లో నుంచి గెంటేస్తుంది ఇందిరా దేవి. అయితే తన పిల్లలను మాత్రం ఆ ఇంట్లోనే ఉంచి.. దుగ్గిరాల కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేయడానికి రుద్రాణి పెద్ద ప్లానే వేస్తుంది.
కావ్యను పొగిడిన ఇందిరా దేవి

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (జనవరి 6) ఎపిసోడ్ కావ్య, కనకం ఎమోషనల్ అయ్యే సీన్ తో మొదలవుతుంది. తన కాపురం నిలబెట్టుకోవడానికి తనకు ఓర్పు, నేర్పు కలిసి వచ్చాయని కావ్య అనడంతో కనకం ఎమోషనల్ అవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ఇందిరా దేవి తల్లీకూతుళ్లను ఆటపట్టిస్తుంది. తర్వాత కావ్యను పొగుడుతుంది. కావ్య ఉన్న చోట సంతోషమే తప్ప దు:ఖం ఉండదని అంటుంది. ఇదంతా అక్కడే ఉండి గమనించిన రేఖ, రుద్రాణి.. ఆ సమయంలో కషాయంలో పసరు మందు కలపొద్దని వెళ్లిపోతారు.
కావ్య, అప్పు శ్రీమంతం వేడుకలు చేసిన రాజ్, కల్యాణ్
ఇటు కావ్య, అప్పు శ్రీమంతం వేడుకలు మొదలవుతాయి. వాటిని రాజ్, కల్యాణే ప్రారంభించాలని పంతులు గారు చెబుతారు. భర్తలే ఎందుకు మొదలుపెట్టాలో కూడా చెబుతాడు. రాజ్, కల్యాణ్ తర్వాత ఇందిరాదేవి, అపర్ణ, ధాన్యలక్ష్మి, సుభాష్, ప్రకాశం వాళ్లను ఆశీర్వదిస్తారు. గాజులు తొడిగిస్తారు.
రుద్రాణిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కనకం..
అందరూ బిజీగా ఉండగా ఇదే సరైన టైమ్ అనుకొని కావ్య గదిలోకి వెళ్లి కషాయంలో పసరు మందు కలపాలని రుద్రాణి అనుకుంటుంది. రూమ్ లోకి వెళ్లి కషాయంలో పసరు మందు కలపబోతుంది. అప్పుడే కనకం అక్కడికి వచ్చి ఆమెను అడ్డుకుంటుంది. దీంతో రుద్రాణి షాక్ తింటుంది. ఏం చేస్తున్నావని నిలదీస్తుంది. కావ్యకు కషాయం ఇద్దామని వచ్చానంటుంది. కానీ పసరు మందు ఎందుకు కలుపుతున్నావని అడగడంతో కంగారు పడుతుంది.
తన కూతురి ఏం చేద్దామనుకుంటున్నావని నిలదీయడంతో రుద్రాణి దబాయిస్తుంది. తాను ఈ ఇంటి మనిషిని అని, కింద పండగ జరుగుతుంటే దానిని చెడగొట్టాలని చూస్తున్నావా అని కనకంపై మండిపడుతుంది. ఆ పసరు మందు తీసుకొని వెళ్లిపోతుంది.
రుద్రాణి కుట్ర బయటపెట్టిన కనకం
{{/usCountry}}తన కూతురి ఏం చేద్దామనుకుంటున్నావని నిలదీయడంతో రుద్రాణి దబాయిస్తుంది. తాను ఈ ఇంటి మనిషిని అని, కింద పండగ జరుగుతుంటే దానిని చెడగొట్టాలని చూస్తున్నావా అని కనకంపై మండిపడుతుంది. ఆ పసరు మందు తీసుకొని వెళ్లిపోతుంది.
రుద్రాణి కుట్ర బయటపెట్టిన కనకం
{{/usCountry}}ఇటు వరుసగా అందరూ వేడుకలో పాల్గొంటున్నా కనకం కనిపించకపోవడంతో అందరూ కంగారు పడతారు. తర్వాత రుద్రాణి వెళ్లి కావ్యకు బొట్టు పెట్టబోతుండగా.. కనకం వస్తుంది. నువ్వు నా కూతురికి బొట్టు పెట్టొద్దంటూ రుద్రాణిని అడ్డుకుంటుంది. తన వెంట తీసుకొచ్చిన పసరు మందు వీరయ్యని చూపిస్తూ.. కావ్య కడుపులో బిడ్డను చంపడానికి రుద్రాణి పన్నిన కుట్రను వివరిస్తుంది. కావ్య తాగే కషాయంలో పసరు ముందు కలపబోతుండగా తాను చూశానని అందరికీ చెబుతుంది.
దీంతో ఇంట్లో వాళ్లందరూ షాక్ తింటారు. తన కుట్ర బయటపడటంతో రుద్రాణి దిక్కుతోచని స్థితిలో పడిపోతుంది. అది చూసి ఇందిరా దేవి.. ఆమె మెడ పట్టుకొని బయటకు గెంటేస్తుంది. అయినా కూడా రుద్రాణి మారదు. బయటకు వెళ్లిన తర్వాత కూడా తన పిల్లలు రాహుల్, రేఖలను ఆ ఇంట్లోనే ఉండాలని, ఆ కుటుంబాన్ని మొత్తం నాశనం చేసి, ఆ ఆస్తిని మొత్తం దక్కించుకోవాలని చెబుతుంది. మరోవైపు కావ్య తన కడుపులో బిడ్డ కోసం ఆందోళన చెందుతూ.. బిడ్డ పుట్టే వరకు తనతోనే ఉండాలని రాజ్ తో ఒట్టు వేయించుకుంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.