...
...
Next Story

బ్రహ్మముడి జనవరి 21 ఎపిసోడ్: కావ్య చెప్పేది నిజమని నమ్మిన ఇంట్లో వాళ్లు.. రుద్రాణికి షాక్.. మంత్రి కొత్త కుట్ర

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జనవరి 21) ఎపిసోడ్ లో కావ్య చెప్పే విషయాన్ని ఇంట్లో వాళ్లు కూడా నమ్ముతారు. దీంతో రుద్రాణికి షాక్ తగులుతుంది. అయితే ఆ పాప కోసం ఎంత వరకైనా వెళ్తానన్న మంత్రి ధర్మేంద్ర కొత్త కుట్రకు తెర తీసేలా కనిపిస్తాడు.

Published on: Jan 21, 2026, 07:01:28 IST
By , Hyderabad
Prefer HTon Google
Advertisement

బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 935వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సీరియల్ లో మరో కీలక మలుపు వచ్చేలా కనిపిస్తోంది. కావ్య మొండి పట్టుదలకు ఇంట్లో వాళ్లకు దిగి వస్తారు. దీంతో రుద్రాణి, మంత్రి ధర్మేంద్ర చిక్కుల్లో పడే పరిస్థితి ఏర్పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.

మంత్రి ఇంటికి రుద్రాణి

బ్రహ్మముడి జనవరి 21 ఎపిసోడ్: కావ్య చెప్పేది నిజమని నమ్మిన ఇంట్లో వాళ్లు.. రుద్రాణికి షాక్.. మంత్రి కొత్త కుట్ర
బ్రహ్మముడి జనవరి 21 ఎపిసోడ్: కావ్య చెప్పేది నిజమని నమ్మిన ఇంట్లో వాళ్లు.. రుద్రాణికి షాక్.. మంత్రి కొత్త కుట్ర

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జనవరి 21) ఎపిసోడ్ మంత్రి ధర్మేంద్ర ఇంటికి రుద్రాణి వెళ్లే సీన్ తో మొదలవుతుంది. పాప ఇంటికి రావడంతో ఖుషీగా ఉన్న మంత్రి ఏం కావాలో చెప్పండని రుద్రాణిని అడుగుతాడు. అయితే ముప్పు ఇంకా తొలగిపోలేదని, కావ్య పట్టుదల గురించి చెబుతుంది.

దుగ్గిరాల కుటుంబానికి ఉన్న పరపతి గురించీ హెచ్చరిస్తుంది. అయితే అలాంటి పరిస్థితే వస్తే తన డబ్బు, పవర్ ఉపయోగిస్తానని మంత్రి అంటాడు. పాపను వదిలేయాల్సిన పరిస్థితి వస్తే.. మంత్రి కొత్త కుట్ర చేయడానికి వెనుకాడబోడని అతని మాటలను బట్టి స్పష్టమవుతోంది.

పాప ఏడుపు విని పరుగెత్తుకుంటూ వచ్చిన కావ్య

ఇటు దుగ్గిరాల ఇంట్లో పాప ఏడుస్తూనే ఉంటుంది. ఆమెను మాన్పించడానికి అపర్ణ, ఇందిరా దేవి, ధాన్యం అందరూ ప్రయత్నిస్తూనే ఉంటారు. కానీ ఆ పాప మాత్రం మానదు. తల్లి పాలు, స్పర్శ కావాలని ఇందిర అంటుంది. అన్నీ తెలిసీ ఏం చేయలేకపోతున్నామని అపర్ణ అంటుంది. పాప ఏడుస్తూనే ఉండేసరికి కావ్య గదిలో నుంచి వచ్చి తీసుకెళ్తుంది. ఆమె పాలు పట్టగానే పాప ఏడుపు మానుతుంది. దీంతో ఇంట్లో వాళ్లందరూ సంతోషిస్తారు. ఆ పాపను కావ్య అంగీకరించినట్లే అని అనుకుంటారు.

రేఖలో ఆందోళన.. సర్ది చెప్పిన రాహుల్

ఆమె కచ్చితంగా పాప కోసం రచ్చ చేస్తుందని, అది ఇంట్లో అలజడి సృష్టిస్తుందని చెబుతాడు. అది కాస్తా ముదిరి ఇంట్లో ప్రశాంతత లేకుండా పోతుందని, చివరికి రాజ్ నీకు దక్కుతాడని రేఖకు హామీ ఇస్తాడు.

మళ్లీ షాకిచ్చిన కావ్య

ఇక నుంచి పాపకు తానే పాలు పడతానని, అయితే దానికోసం తాను ఏం తినాలో చెప్పాలని అపర్ణను అడుగుతుంది కావ్య. దీంతో వాళ్లు మరింత సంతోషిస్తారు. ఏం తినాలి, ఏం తినకూడదో ఇందిరా దేవి ఆమెకు చెబుతుంది. అదంతా విన్న రాజ్.. కావ్య దగ్గరికి వచ్చి పాపను అంగీకరిస్తావని అనుకోలేదని, ఇక నుంచి అన్నీ నీ దగ్గరికే వస్తాయని అంటాడు. కానీ కావ్య మాత్రం బయటకు వెళ్లకపోతే తన పాప ఎక్కడుందో ఎలా తెలుసుకుంటానని అనడంతో వాళ్లందరూ షాక్ తింటారు. ఈ పాపను వాళ్ల తల్లిదండ్రులకు ఇచ్చి తన పాపను తెచ్చుకుంటానని తేల్చి చెప్పి వెళ్లిపోతుంది.

కావ్య చెప్పేది నిజమని నమ్మిన ఇంట్లో వాళ్లు

ఆ మరుసటి రోజు పాపను ఎత్తుకొని బయట కూర్చున్న కావ్య.. అసలు నువ్వు ఎవరు? మీ అమ్మానాన్న ఎక్కడున్నారు? ఇక్కడికి ఎలా వచ్చావు అని మాట్లాడుతూ ఉంటుంది. అది విన్న ఇందిరా దేవి.. కావ్య మాటల్లోనూ నిజం ఉండొచ్చని, ఆమె అంత అమాయకంగా మాట్లాడేది కాదని అంటుంది. అపర్ణ కూడా అదే నిజం కావచ్చని నమ్ముతుంది.

దీంతో రాజ్.. కావ్య దగ్గరికి వెళ్లి దీనికి డీఎన్ఏ టెస్ట్ మాత్రమే పరిష్కారమని అంటాడు. తన మాట మీద నమ్మకం లేదా.. అయినా సరే పాప కోసం ఏం చేయడానికైనా రెడీ అని కావ్య అంటుంది. అటు విషయం తెలిసి మంత్రి దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్తుంది రుద్రాణి. డీఎన్ఏ రిజల్ట్ వస్తే ఆ పాప వాళ్ల పాప కాదని తెలిసిపోతుందని చెబుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.

 
ABOUT THE AUTHOR
Hari Prasad S

హరి ప్రసాద్ శీలమంతుల ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మీడియా రంగంలో 20 ఏళ్లకు పైగా సుదీర్ఘ అనుభవం కలిగిన ఆయన, డిజిటల్ మీడియాలో గత 10 ఏళ్లుగా విశేష సేవలందిస్తున్నారు. ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలు, సినిమా వార్తలను అందించడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన తన అద్భుతమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. హరి ప్రసాద్ తన కెరీర్‌లో ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియా వంటి మూడు ప్రధాన విభాగాల్లోనూ పనిచేశారు. హిందుస్థాన్ టైమ్స్‌లో చేరకముందు, ఆయన తెలుగు రాష్ట్రాల్లోని ప్రముఖ దినపత్రికలు, టీవీ ఛానెళ్లయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వంటి సంస్థలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. నవంబర్ 1, 2021న హిందుస్థాన్ టైమ్స్ తెలుగు టీమ్‌లో చేరిన ఆయన.. ప్రస్తుతం స్పోర్ట్స్ (ముఖ్యంగా క్రికెట్ అనాలసిస్), ఎంటర్‌టైన్మెంట్ సెక్షన్ల బాధ్యతలను చూసుకుంటున్నారు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ (కంప్యూటర్ సైన్స్) పట్టా పొందారు. సాంకేతిక పరిజ్ఞానంతో పాటు జర్నలిజంపై ఉన్న మక్కువతో జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేసి, వృత్తిపరమైన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నారు. క్రీడా రంగంలో వస్తున్న మార్పులను, సినిమా ఇండస్ట్రీ అప్‌డేట్స్‌ను లోతుగా విశ్లేషించి పాఠకులకు అర్థమయ్యే రీతిలో అందించడం హరి ప్రసాద్ శైలి.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks