బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 940వ ఎపిసోడ్ చాలా ఉత్కంఠగా సాగింది. తన అసలు పాప కోసం కావ్య మరింత తీవ్రంగా ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఈ క్రమంలోనే గుడిలో కావ్యకు మంత్రి ధర్మేంద్ర అడ్డంగా దొరికిపోతాడు. దీంతో వెంటనే పూజను మధ్యలోనే ఆపేసి అక్కడి నుంచి పారిపోతాడు.
కావ్య మాటలకు కరిగిపోయిన డాక్టర్

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (జనవరి 27) ఎపిసోడ్ డాక్టర్ దగ్గరకు కావ్య వెళ్లే సీన్ తో మొదలవుతుంది. ఆమెను చూడగానే డాక్టర్ సీరియస్ అవుతుంది. కానీ కావ్య మాత్రం ఓ డాక్టర్ లా కాకుండా ఓ తల్లిలా ఆలోచించండి.. తన దగ్గర ఉన్న పాప తనను తాకినా ఆ మాతృత్వపు మాధుర్యం తనకు కలగడం లేదని కంటతడి పెడుతూ అంటుంది. కావ్య మాటలకు డాక్టర్ కరిగిపోతుంది. తానేం చేయాలని అడుగుతుంది. తనకు డెలివరీ అయిన రోజు ఇంకా ఎవరెవరికీ అయ్యాయో చెబితే తాను వెతుక్కుంటానని అంటుంది. డాక్టర్ సరే అంటుంది.
కావ్య ఎక్కడ అని స్వప్న, అప్పులను నిలదీసిన అపర్ణ
ఇటు ఇంట్లో పాప ఏడుస్తూనే ఉంటుంది. స్వప్న, అప్పు ఎంతగా ఓదార్చాలని చూసినా వినదు. పాప ఏడుపు విని మొదట అపర్ణ, తర్వాత ఇందిరా దేవి, రాజ్, రేఖ వస్తారు. ఇంతలా ఏడుస్తుంటే కావ్యకు ఇవ్వకుండా మీరేం చేస్తున్నారు.. కావ్య ఎక్కడ అని అపర్ణ వాళ్లను నిలదీస్తుంది. అందరూ అదే ప్రశ్న వేస్తారు.
దీంతో కావ్య ఎక్కడికి వెళ్లిందో చెబుతారు. అపర్ణ కోపగించుకుంటుంది. కావ్య ఇక మారదా.. డీఎన్ఏ టెస్ట్ చేయించినా కూడా ఎందుకు వినడం లేదు అని ప్రశ్నిస్తుంది. ఇదే అదును రేఖ వాళ్లను మరింత రెచ్చగొడుతుంది. ఏడ్చి ఏడ్చి పాపకు ఏదైనా జరిగితే ఎలా.. 15 రోజులు కూడా నిండని పాపను ఇలా వదిలేసి వెళ్తే ఎలా అని అంటుంది. దీంతో ఇంట్లో వాళ్లు టెన్షన్ పడతారు.
మంత్రి పాపకు శాంతి పూజ.. గుడికి రుద్రాణి
ఇటు గుడిలో శాంతి పూజ కోసం పాపను తీసుకొని మంత్రి ధర్మేంద్ర దంపతులు వస్తారు. పూజ మొదలవుతుంది. అప్పుడే రుద్రాణి అక్కడికి వస్తుంది. మంత్రిని పిలిచి ఏం చేస్తున్నారని అడుగుతుంది. పాపకు శాంతి పూజ చేస్తున్నామని అంటే.. ఇంత సింపుల్ గా ఎందుకు.. గ్రాండ్ గా చేయొచ్చు కదా అని అంటుంది. పరిస్థితి తెలిసీ ఎలా చేయమంటావ్ అని అడుగుతాడు. కావ్య పాప మీ దగ్గరే ఉన్నదని ఎలా తెలుస్తుంది అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. తన భయాలు తనకు ఉన్నాయని మంత్రి అంటాడు. ఇంతలో తులసి పిలిస్తే ధర్మేంద్ర వెళ్లి పూజలో కూర్చొంటాడు.
గుడిలో తన పాపను చూసిన కావ్య
{{/usCountry}}ఇటు గుడిలో శాంతి పూజ కోసం పాపను తీసుకొని మంత్రి ధర్మేంద్ర దంపతులు వస్తారు. పూజ మొదలవుతుంది. అప్పుడే రుద్రాణి అక్కడికి వస్తుంది. మంత్రిని పిలిచి ఏం చేస్తున్నారని అడుగుతుంది. పాపకు శాంతి పూజ చేస్తున్నామని అంటే.. ఇంత సింపుల్ గా ఎందుకు.. గ్రాండ్ గా చేయొచ్చు కదా అని అంటుంది. పరిస్థితి తెలిసీ ఎలా చేయమంటావ్ అని అడుగుతాడు. కావ్య పాప మీ దగ్గరే ఉన్నదని ఎలా తెలుస్తుంది అని రుద్రాణి ప్రశ్నిస్తుంది. తన భయాలు తనకు ఉన్నాయని మంత్రి అంటాడు. ఇంతలో తులసి పిలిస్తే ధర్మేంద్ర వెళ్లి పూజలో కూర్చొంటాడు.
గుడిలో తన పాపను చూసిన కావ్య
{{/usCountry}}ఇటు హాస్పిటల్ నుంచి బయటకు ఏడుస్తూ వచ్చిన కావ్య ఓ దగ్గర కూర్చొంటుంది. పక్కనే గుడి గంటలు శబ్దం వినిపించడంతో అక్కడికి వెళ్తుంది. పక్కనే ఆ శాంతి పూజ జరుగుతూ ఉంటుంది. తనకు వచ్చిన కష్టంపై కావ్య దేవుడిని వేడుకుంటుంది. ఆ పాప తన కాదని, తన పాప దగ్గరికి దారి నువ్వే చూపించాలని ఏడుస్తుంది. ఇంతలో పూజ కొనసాగుతుండగానే పాప గట్టిగా ఏడుస్తుంటుంది. తులసి ఎంత ప్రయత్నించినా ఏడుపు మానదు.
కావ్య అక్కడికి వెళ్తుంది. పాపను ఎత్తుకుంటుంది. ఆ పాప వెంటనే ఏడుపు మానేస్తుంది. కావ్యకు కూడా తన పాపనే ఎత్తుకున్న అనుభూతి కలుగుతుంది. దీంతో షాక్ తిన్న మంత్రి ధర్మేంద్ర బలవంతంగా కావ్య చేతుల్లో నుంచి పాపను లాక్కొని వెళ్లిపోతాడు. కావ్య ఏడుస్తూ ఆ కారు వెనుక కాసేపు పరుగెత్తుతుంది. దూరంగా ఉండి చూస్తున్న రుద్రాణి.. ఇక నీ పాపను నీకు దక్కనీయను అంటుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.