బ్రహ్మముడి సీరియల్ 941వ ఎపిసోడ్ మంచి ట్విస్టులతో సాగింది. మంత్రి ధర్మేంద్ర దగ్గర ఉన్న పాపే తన పాప అని సాక్ష్యాలతో సహా కావ్య గుర్తిస్తుంది. మంత్రి ఇంటికి వెళ్లి మరీ ఫైల్ ను అతని మొహాన కొడుతుంది. తన పాపను తాను దక్కించుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెడుతుంది. ఇటు రాజ్‌ను బుట్టలో వేసుకోవడానికి రేఖ ప్రయత్నిస్తుంది.
బిడ్డ దగ్గరికి కావ్య.. ధర్మేంద్రలో ఆందోళన

బ్రహ్మముడి సీరియల్ బుధవారం (జనవరి 28) ఎపిసోడ్ లో గుడిలో తులసి దగ్గర ఉన్న బిడ్డ ఏడుస్తూనే ఉండటంతో కావ్య వెళ్లి జోల పాటు పాడుతుంది. ఆ పాట వినగానే పాప ఏడుపు మానుతుంది. అది చూసి ధర్మేంద్రలో టెన్షన్ మొదలవుతుంది. వెంటనే పక్కనే ఉన్న రుద్రాణి దగ్గరికి వెళ్లి.. కావ్య రాదన్నావ్.. ఎలా వచ్చిందని నిలదీస్తాడు. ఏదో అనుకోకుండా వచ్చినట్లుంది.. దానికి అంతలా రియాక్టవ్వాల్సిన అవసరం లేదని అంటుంది.
తన బిడ్డను మార్చేసినట్లు తులసికి చెప్పిన కావ్య
ఇటు కావ్య చేసిన పనికి తులసి ఆమెను మెచ్చుకుంటుంది. మీరు పాట పాడగానే బిడ్డ ఏడుపు మానిందని అంటుంది. అదే సమయంలో కావ్య తన కష్టం ఆమెకు చెప్పుకుంటుంది. తనకు బిడ్డ పుట్టింది కానీ.. తన దగ్గర ఉన్న బిడ్డ తనది కాదని, ఎవరో మార్చేశారని అంటుంది. దీంతో తన భర్త మంత్రి అని, అతనికి ఈ విషయం చెబితే కచ్చితంగా సాయం చేస్తాడని తులసి అంటుంది. భర్తను పిలిచి విషయం చెబుతుంది.
పాపను గుర్తు పట్టిన కావ్య.. అడ్డుపడిన రుద్రాణి
దీంతో ధర్మేంద్ర మరింత ఆందోళన చెందుతాడు. తన పీఏని కలవమని అంటాడు. తులసిని, బిడ్డను అక్కడి నుంచి త్వరగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా కావ్య అడ్డుపడి తులసి చీరకు పసుపు, కుంకుమ అంటిందని చెబుతుంది. అప్పుడు ఆ పాపను కావ్యకు ఇస్తుంది.
{{/usCountry}}దీంతో ధర్మేంద్ర మరింత ఆందోళన చెందుతాడు. తన పీఏని కలవమని అంటాడు. తులసిని, బిడ్డను అక్కడి నుంచి త్వరగా తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తుండగా కావ్య అడ్డుపడి తులసి చీరకు పసుపు, కుంకుమ అంటిందని చెబుతుంది. అప్పుడు ఆ పాపను కావ్యకు ఇస్తుంది.
{{/usCountry}}పాపను తీసుకోగానే కావ్యలోని అమ్మతనపు మాధుర్యం బయటకు వస్తుంది. పుట్టినప్పుడు తన పాపను ఎత్తుకున్న భావన కలుగుతుంది. దీంతో ధర్మేంద్ర బలవంతంగా కావ్య చేతుల్లోని పాపను లాక్కొని వెళ్తుండగా పాప చేతిపై ఉన్న పుట్టుమచ్చ కూడా చూస్తుంది. దీంతో మంత్రి వెంట పడటానికి ప్రయత్నించగా.. రుద్రాణి కావాలని అడ్డుపడుతుంది.
రాజ్‌ను రెచ్చగొట్టిన రేఖ.. రుద్రాణి ఫోన్
ఇటు ఇంట్లో రాజ్ ను బుట్టలో వేసుకొనే పనిలో రేఖ ఉంటుంది. అతనికి దగ్గరికి వెళ్లిన రేఖ.. కావ్య గురించి నెగటివ్ గా చెబుతుంది. రోజుల పాపను ఇలా వదిలేసి ఎక్కడికి వెళ్లింది? పాపను చూస్తే జాలేస్తోంది.. కావ్య చేసిన పని అస్సలు నచ్చడం లేదంటూ రాజ్ ను రెచ్చగొడుతుంది.
పొద్దున్నుంచీ నువ్వు ఏమీ తినలేదు.. జ్యూస్ అయినా తాగమని ఇస్తుంది. రేఖ మాటలకు రాజ్ కు కావ్యపై ఉన్న కోపం మరింత పెరుగుతుంది. అప్పుడే రేఖకు రుద్రాణి ఫోన్ చేసి గుడి దగ్గర ఆమె ఓ కారు వెనుక పడిందని, ఇదే విషయం ఇంట్లో చెప్పి ఆమెకు పిచ్చిపట్టినట్లుగా సీన్ క్రియేట్ చేయమని అంటుంది. రేఖ ఆ విషయం విని మరింత సంతోషిస్తుంది.
హాస్పిటల్లో అసలు నిజం తెలుసుకున్న కావ్య
ఇటు కావ్యకు డాక్టర్ ఫోన్ చేసి ఆరోజు డెలివరీ అయిన వాళ్ల లిస్టు రెడీగా ఉందని చెబుతుంది. దీంతో అక్కడికి పరుగెత్తుకుంటూ వెళ్తుంది. అక్కడ తులసి పేరు ఉండటం, ఆమె మంత్రి భార్య అని తెలుసుకోవడంతో కావ్య అనుమానం నిజమవుతుంది. ఇదే విషయం డాక్టర్ కు చెప్పి తన కూతురు మంత్రి దగ్గర ఉందని అంటుంది. ఆ రోజు తులసికి డెలివరీ చేసింది డాక్టర్ చక్రవర్తి అని, అయితే ఆ రోజు నుంచి అతడు హాస్పిటల్ కు రావడం లేదని డాక్టర్ చెప్పడంతో కావ్యకు మొత్తం సీన్ అర్థమవుతుంది.
ఆ డాక్టర్ అసిస్టెంట్, హెడ్ నర్స్ ను కలిస్తే అన్ని విషయాలు తెలుస్తాయని డాక్టర్ చెప్పడంతో కావ్య ఆ పనిలో ఉంటుంది. తర్వాత ఆధారాలతో సహా మంత్రి ధర్మేంద్ర ఇంటికి వెళ్లి ఆ ఫైల్ అతని ముఖాన కొడుతుంది. అవును నీ బిడ్డను నేనే మార్చాను కానీ ఇవ్వను అని అంటాడు. దీంతో కావ్య అతనికి వార్నింగ్ ఇస్తుంది. 15 రోజుల్లోగా తన పాపను తనకు ఇచ్చేలా చేస్తానని తేల్చి చెబుతుంది. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.