బ్రహ్మముడి సీరియల్ ఈరోజు అంటే 887వ ఎపిసోడ్ లో ఆర్ పేరు మీద కంపెనీ ఏంటి? ఎందుకు అనే విషయాలను ఇంట్లో వాళ్లందరికీ చెబుతారు రాజ్, కావ్య. దీంతో స్వప్న కాస్త వెనక్కి తగ్గుతుంది. కానీ రాహుల్, రుద్రాణి బుద్ధి మారకపోగా.. మరో కుట్రకు తెరతీస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో చూడండి.
రాజ్ ఫోన్ ద్వారా నిజం తెలుసుకున్న రాహుల్

బ్రహ్మముడి సీరియల్ మంగళవారం (నవంబర్ 25) ఎపిసోడ్ రాజ్ ఫోన్ ను స్వప్న తీసుకొని రాహుల్ దగ్గరికి రావడంతో మొదలవుతుంది. అందులో ఆర్ పేరుతో కొత్త కంపెనీ మొదలుపెట్టబోతున్నారని, స్వరాజ్ కంపెనీ నుంచి కేజీల కొద్దీ బంగారం, డబ్బు తెలియకుండానే ట్రాన్స్‌ఫర్ చేశారని స్వప్నతో చెబుతాడు రాహుల్.
దీంతో ఇప్పుడే నిలదీద్దాం పదా అని స్వప్న అంటుంది. కానీ వద్దని రాహుల్ వారిస్తాడు. అయినా వినకుండా స్వప్న వెళ్తుంది. తనకూ అదే కావాలని రాహుల్ అనుకుంటాడు.
ఆర్ ఫ్యాక్టరీ ఏంటంటూ రాజ్‌ను నిలదీసిన స్వప్న..
కింద అందరూ అపర్ణ, సుభాష్ పెళ్లి రోజు వేడుకల్లో డ్యాన్స్ చేస్తూ సంతోషంగా ఉంటారు. స్వప్న వచ్చి పిలిచినా ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె ఫ్లవర్ వాజ్ ను విసిరేస్తుంది. అది చూసి దీనికి దెయ్యం పట్టినట్లుందని ఇందిరాదేవి అంటుంది. రాజ్ ను స్వప్న నిలదీస్తుంది. ఆర్ పేరుతో ఫ్యాక్టరీ ఎందుకు పెడుతున్నారు?
ఆర్ అంటే రాజే కదా? స్వరాజ్ కంపెనీ నుంచి ఎందుకు డబ్బు, కేజీల కొద్దీ బంగారం ఎందుకు తరలించారు? మా ఆయనపై దొంగతనం నింద వేయడానికా అని రాజ్ ను నిలదీస్తుంది. ఆమెకు రుద్రాణి కూడా సపోర్ట్ చేస్తూ మరింత రెచ్చగొడుతుంది. సుభాష్, అపర్ణ రాజ్ కు మద్దతిస్తూ మాట్లాడినా వాళ్లు వినరు. రాజ్ మౌనంగా ఎందుకు ఉన్నాడంటూ అడుగుతారు.
నిజం అంగీకరించిన రాజ్.. ఆర్ అంటే రాహుల్ అంటూ..
దీంతో మొత్తానికి రాజ్ నోరు తెరుస్తాడు. ఆర్ పేరుతో కంపెనీ నిజం.. కానీ ఆర్ అంటే రాజ్ కాదు రాహుల్ అంటాడు. అయినా స్వప్న, రుద్రాణి నమ్మరు. కానీ తాను ఇలా ఎందుకు కొత్త కంపెనీ మొదలుపెట్టానో రాజ్ చెబుతాడు. స్వరాజ్ కంపెనీలో రాహుల్ కు బాధ్యత ఇచ్చినా తన సొంత కంపెనీలా ఫీలవడని, తనకంటూ సొంతంగా కంపెనీ మొదలుపెడితే బాధ్యత వస్తుందని అలా చేశానని అంటాడు. ఇప్పుడు కావాలని మాట మారుస్తున్నావా అంటూ రుద్రాణి అడుగుతుంది.
గట్టిగా సమాధానం ఇచ్చిన కావ్య.. అక్కకి క్లాస్
{{/usCountry}}దీంతో మొత్తానికి రాజ్ నోరు తెరుస్తాడు. ఆర్ పేరుతో కంపెనీ నిజం.. కానీ ఆర్ అంటే రాజ్ కాదు రాహుల్ అంటాడు. అయినా స్వప్న, రుద్రాణి నమ్మరు. కానీ తాను ఇలా ఎందుకు కొత్త కంపెనీ మొదలుపెట్టానో రాజ్ చెబుతాడు. స్వరాజ్ కంపెనీలో రాహుల్ కు బాధ్యత ఇచ్చినా తన సొంత కంపెనీలా ఫీలవడని, తనకంటూ సొంతంగా కంపెనీ మొదలుపెడితే బాధ్యత వస్తుందని అలా చేశానని అంటాడు. ఇప్పుడు కావాలని మాట మారుస్తున్నావా అంటూ రుద్రాణి అడుగుతుంది.
గట్టిగా సమాధానం ఇచ్చిన కావ్య.. అక్కకి క్లాస్
{{/usCountry}}దీంతో కావ్య రంగంలోకి దిగుతుంది. రుద్రాణితోపాటు అక్కకి కూడా క్లాస్ పీకుతుంది. మీ ఆయన అసమర్థుడు కాడు అని నిరూపించడానికి ఇలా చేశామని అంటుంది. రాహుల్ పేరు మీద కంపెనీ అంటే అందరూ వద్దంటారనే చెప్పకుండా చేశామని చెబుతుంది. అయినా ఈ పని చేస్తే తమకు ఏం వస్తుంది? నెత్తి మీద కిరీటాలు వస్తాయా అని గట్టిగానే అడుగుతుంది. ఇప్పటి వరకూ మీకు అన్యాయం జరిగిపోతున్నట్లు ఏడ్చావు కదా ఇప్పుడేమంటావని అడుగుతుంది.
క్షమాపణ అడిగిన స్వప్న, రాహుల్
దీంతో స్వప్న, రాహుల్ వాళ్లను క్షమాపణ అడుగుతారు. మీ మంచితనం గురించి తెలిసి కూడా తాను అనుమానించి మీ మీద నింద వేశానని, తనను క్షమించమని స్వప్న అంటుంది. అటు రాహుల్ కూడా ఇదంతా తన వల్లే జరిగిందని, బంగారం, డబ్బు వేరే కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేయడంతో నింద తన మీద ఎక్కడ పడుతుందో అన్న భయంతో తానే స్వప్నకు ఈ విషయం చెప్పానని రాహుల్ అంటాడు.
అందరి ముందూ మరోసారి నాటాకాన్ని రక్తి కట్టిస్తాడు. అయితే కొత్త కంపెనీ పెట్టినందుకు రాజ్, కావ్యలను తాతయ్య సీతారమయ్య నిలదీస్తాడు. ఇది కుటుంబం విచ్ఛిన్నం కావడానికి దారి తీస్తుందని హెచ్చరిస్తాడు. అటు రుద్రాణితో రాహుల్ కూడా అదే ప్లాన్ వేస్తాడు. మెల్లగా కుటుంబాన్ని వీధిలోకి లాగుతానని అంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది.