బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో రాజ్, కావ్య ఇంటికి వస్తారు. కావ్య ప్రెగ్నెన్సీ సమస్య గురించి తమకెందుకు చెప్పలేదని, చెప్పకుండా నిజం దాచడానికి ఏముందని, ఎందుకు మోసం చేశారని అపర్ణ, సుభాష్, రుద్రాణి అంటారు. దాంతో రాజ్ అందరికి నిజం చెబుతాడు.
సంతోషంగా ఉండలేరని

తాను చనిపోయి బిడ్డకే ఊపిరి పోయాలని కళావతి అనుకుంది. ఆ బాధను తనలోనే దాచుకుంది. బిడ్డ పుట్టగానే కళావతి చనిపోతే మీరంతా సంతోషంగా ఉండలేరని మీకు చెప్పలేదు. తాను ఉన్నన్ని రోజులు మీతో సంతోషంగా గడపాలనుకుంది కళావతి. అంతేకానీ మీరు చూపించే సానుభూతి, జాలి మధ్య తాను బతకాలనుకోలేదు. అందుకే నిజం చెప్పలేదు అని రాజ్ అంటాడు.
ఈ దేశంలోని డాక్టర్స్ కాకుంటే వేరే దేశాల్లోని డాక్టర్స్‌ను కలిసేవాళ్లం. ఎలాగైనా కావ్యను బతికించుకునేవాళ్లం అని సుభాష్ అంటాడు. ఇప్పుడు అదంతా అక్కర్లేదు డాడ్. గుడికి వెళ్లినప్పుడు మా గురించి పంతులు అనుకోకుండా విన్నారు. కేరళలోని వరసిద్ధి ఆచార్యుల వారి ఆయుర్వేద వైద్యం గురించి చెప్పారు. కావ్య లాంటి సమస్యను కూడా తీర్చారని చెప్పారని చెబుతాడు రాజ్.
అందుకే మీకు అసలు విషయం చెప్పకుండా కేరళ టూర్ అని చెప్పి వెళ్లాం. వారం రోజులపాటు ఆయన కళావతికి చికిత్స చేశారు. ఆయన చేసిన చికిత్స ఫలించిందని చెప్పారు. కావ్యకు ఎలాంటి సమస్య లేదన్నారు. ఇంకో నెలరోజుల పాటు ఆయన ఇచ్చిన కషాయం తాగుతూ లేపనంతో మర్దన చేయిస్తే కావ్య సమస్య పూర్తిగా నయం అవుతుందని చెప్పారు అని రాజ్ చెబుతాడు.
ఇంటికి వారసుడు
దాంతో అపర్ణ, సుభాష్, ఇందిరాదేవి, స్వప్న అంతా సంతోషిస్తారు. కావ్య చనిపోకుండానే బిడ్డకు ఇంటికి వారసుడిని ఇస్తుందని మురిసిపోతారు. తర్వాత రాహుల్, రుద్రాణి పక్కకు వెళ్లి ఇదన్నమాట విషయం. అందుకే కేరళకు వెళ్లారని రుద్రాణి అంటుంది. ఎలా వెళ్తే ఏంటీ మామ్ మనం అనుకుంది అనుకున్నట్లుగా జరగడానికి ఇది బాగా ఉపయోగపడింది. ఇక రేపు నేను ఇచ్చే ట్విస్ట్‌తో రాజ్, కావ్యకు మైండ్ బ్లాక్ అవుతుందని రాహుల్ అంటాడు.
{{/usCountry}}దాంతో అపర్ణ, సుభాష్, ఇందిరాదేవి, స్వప్న అంతా సంతోషిస్తారు. కావ్య చనిపోకుండానే బిడ్డకు ఇంటికి వారసుడిని ఇస్తుందని మురిసిపోతారు. తర్వాత రాహుల్, రుద్రాణి పక్కకు వెళ్లి ఇదన్నమాట విషయం. అందుకే కేరళకు వెళ్లారని రుద్రాణి అంటుంది. ఎలా వెళ్తే ఏంటీ మామ్ మనం అనుకుంది అనుకున్నట్లుగా జరగడానికి ఇది బాగా ఉపయోగపడింది. ఇక రేపు నేను ఇచ్చే ట్విస్ట్‌తో రాజ్, కావ్యకు మైండ్ బ్లాక్ అవుతుందని రాహుల్ అంటాడు.
{{/usCountry}}మరుసటి రోజు రాహుల్ హాల్లో అందరి దగ్గరికి వచ్చి తనకు బిజినెస్‌లో అవార్డ్ వచ్చిందని, అందరం ఇవాళ నైట్ జరిగే ఫంక్షన్‌కు అటెండ్ కావాలని చెబుతాడు. దాంతో అంతా సంతోషిస్తారు. నిన్ను చూస్తే గర్వంగా ఉందని రాజ్ అంటాడు. ఫంక్షన్‌కు రాజ్, కావ్య వెళ్లేందుకు ఒప్పుకుంటారు.
రాత్రిపూట అవార్డ్ ఫంక్షన్ జరుగుతుంది. కంపెనీ స్టార్ట్ చేసిన కేవలం నెలలోనే ఎంతో అభివృద్ధి సాధించి అందరికి ఆదర్శంగా నిలిచాడు అంటూ స్టేజీపై ఓ వ్యక్తి రాహుల్ గురించి గొప్పగా చెబుతాడు. ఈ సక్సెస్‌కు రాహుల్‌కు బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డ్ ఇస్తున్నట్లు ప్రకటిస్తాడు. తర్వాత రాహుల్ కంపెనీ నుంచి వచ్చిన నగల డిజైన్స్‌ను స్క్రీన్‌పై చూద్దామని చెబుతాడు.
బయటపడిన రాహుల్ బాగోతం
దాంతో ఆ డిజైన్స్ చూపిస్తారు. ఆ నగల డిజైన్స్ చూసి రాజ్, కావ్య ఒక్కసారిగా కంగుతింటారు. ఇవి తాము వేసిన డిజైన్స్ అనుకుంటారు. మ్యాన్యుఫాక్చర్‌కు పంపిన డిజైన్స్ రాహుల్ డిజైన్స్ ఒకేలా ఉండటం ఏంటీ అని షాక్ అవుతారు. రాహులే ఏదో మాయ చేసి ఉంటాడ అని రాజ్ డౌట్ పడతాడు.
కావ్య వేసిన డిజైన్స్ రాహుల్ కంపెనీ నుంచి వచ్చినట్లు అందరికి తెలియడంతో ఆ డిజైన్స్‌ను స్వరాజ్ కంపెనీ చూపించేదు. అప్పటికే అవుట్ డేటెడ్ డిజైన్స్‌తో నష్టాల్లో ఉన్న స్వరాజ్ కంపెనీకి ఈ డిజైన్స్ తయారీ, దానివల్ల ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో కోలుకోలేని దెబ్బ పడుతుంది.
ఇప్పుడు కొత్త డిజైన్స్ క్రియేట్ చేసి, రెడీ చేసి మార్కెట్‌లోకి పంపాలంటే చాలా ఖర్చు, శ్రమ, టైమ్ పడుతుంది. అప్పటికే రూ. 180 కోట్లు నష్టం వచ్చిందని నాన్న చెప్పాడు. ఇప్పుడు ఈ ఖర్చుతో మరింత పీకల్లోతు నష్టాల్లోకి స్వరాజ్ కంపెనీ వెళ్తుందని రాజ్ అనుకుంటాడు. అక్కడితో బ్రహ్మముడి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ముగుస్తుంది.